కర్ణాటక: మంగళూరు యువకుడు రియాద్ దేశంలో వంచకుల చేతిలో మోసపోయి జైలుపాలయ్యాడు. మంగళూరు జిల్లా కడబ తాలూకా ఐతూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రియాద్‌లో అల్ఫానర్ సెరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఏడాది సెల్‌ఫోన్‌తోపాటు సిమ్ కొనుగోలుకు వెళ్లగా రెండు సార్లు తంబ్ తీసుకున్నారు.
వారం తరువాత అరబిక్ భాషలో ఒక మేసేజ్ రాగా దాన్ని క్లిక్ చేశాడు. 2 రోజుల తరువాత ఒక కాల్ వచ్చింది. సిమ్ వివరాలు అడిగి ఓటీపీ నంబర్ తీసుకున్నారు. అనంతరం దుండగులు అతని పేరుతో ఖాతా ఓపెన్ చేసి ఓ మహిళ ఖాతానుంచి రూ.22వేలు అక్రమంగా బదిలీ చేశారు. ఇదంతా చంద్రశేఖర్‌కు తెలియదు. వారం తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు.
తనను ఎందుకు అరెస్ట్ చేశారని బాధితుడు ఆరా తీయగా నగదు పోగొట్టుకున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి శోభకరంద్లాజె వద్ద మొరపెట్టుకోగా ఆమె విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితంలేకుండాపోయింది. దీంతో ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ బాగుంటే చంద్రశేఖర్‌కు గత జనవరిలో వివాహం జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment