youngstar
-
రైల్వే గేటు వద్ద.. యువకుడి హల్చల్!
నిజామాబాద్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని యువకుడు హల్చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం రైల్వేగేటు పడటంతో గుర్తు తెలియని యువకుడు రైలు పట్టాలపై రాళ్లు పెట్టి రైల్వేట్రాక్‌పై కూర్చున్నాడు.ఆ సమయంలో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఇంజన్ లోకో ఫైలెట్ పట్టాలపై ఉన్న వ్యక్తిని గమనించి గేట్మన్రాజుకు సమాచారం అందించి పట్టాలకు కొద్ది దూరంలోనే ఇంజన్‌ను నిలిపివేశాడు. గేట్‌మన్ రాజు వెంటనే యువకుడి వద్దకు వెళ్లగా సదరు యువకుడు గేట్‌మన్‌తో గొడవకు దిగి రాళ్లతో దాడి చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో ట్రాక్మన్తో పాటు స్థానికులు ఆ యువకుడికి చెప్పడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో కొంత ట్రాఫిక్ ఏర్పడగా కొంత సేపటికి క్లియరైంది.ఇవి చదవండి: ఆకాష్ మాస్టర్ మైండ్.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్ (వీడియో) -
కారును ఓవర్టేక్ చేస్తుండగా.. విద్యార్థి విషాదం!
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ శివారులోని సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. వీర్నపల్లి మండలం భావ్‌సింగ్‌తండాకు చెందిన భూక్య సతీశ్(19), భూక్య సాయిరాం బైక్‌పై మాచారెడ్డి నుంచి రాచర్లగొల్లపల్లికి వస్తున్నారు. రాచర్లబొప్పాపూర్ శివారులో ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్‌తోపాటు కిందికి దూసుకెళ్లారు. ఈ ప్రమాదంలో సతీశ్ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరొకరు సాయిరాం తీవ్రంగా గాయపడగా.. స్థానికులు, బ్లూకోర్టు కానిస్టేబుల్ సతీశ్ కలిసి ఆస్పత్రికి తరలించారు. సతీశ్ మరణంతో భావ్‌సింగ్‌తండాలో విషాదం అలుముకుంది. మృతునికి తల్లితండ్రులు మంజుల–రాజు, సోదరి జ్యోతి ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రమాకాంత్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: పెళ్లింట విషాదం! -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
వెంకూర్లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్..!!
ఆదిలాబాద్: మండలంలోని పాత వెంకూర్ శివారులోని వాగు సమీపంలో మంగళవారం యువకుడినూ, ఎద్దుపై దాడి చేసింది. స్థానికుల వివరాల మేరకు... వెంకూర్ గ్రామానికి చెందిన రేకుల బద్రి, అతడి బావమర్ది శివతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని పశువులను మేపుతున్నాడు. ఒకసారిగా తోడేలు బద్రిపై దాడిచేసింది. దీంతో అతడు చేతులతో పక్కకు పడేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో బద్రి, శివ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బద్రిని స్థానిక వైద్యశాలకు తరలించగా.. అవసరమైన మందులు లేకపోవడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్వో రేష్మ, ఎఫ్‌బీవో స్రవంతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోడేలు పాదముద్రలుగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
'రియాద్'లో మంగళూరు యువకుడికి మోసం.. ప్రధాని మోదీకి లేఖ ప్రయత్నం
కర్ణాటక: మంగళూరు యువకుడు రియాద్ దేశంలో వంచకుల చేతిలో మోసపోయి జైలుపాలయ్యాడు. మంగళూరు జిల్లా కడబ తాలూకా ఐతూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రియాద్‌లో అల్ఫానర్ సెరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఏడాది సెల్‌ఫోన్‌తోపాటు సిమ్ కొనుగోలుకు వెళ్లగా రెండు సార్లు తంబ్ తీసుకున్నారు. వారం తరువాత అరబిక్ భాషలో ఒక మేసేజ్ రాగా దాన్ని క్లిక్ చేశాడు. 2 రోజుల తరువాత ఒక కాల్ వచ్చింది. సిమ్ వివరాలు అడిగి ఓటీపీ నంబర్ తీసుకున్నారు. అనంతరం దుండగులు అతని పేరుతో ఖాతా ఓపెన్ చేసి ఓ మహిళ ఖాతానుంచి రూ.22వేలు అక్రమంగా బదిలీ చేశారు. ఇదంతా చంద్రశేఖర్‌కు తెలియదు. వారం తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని బాధితుడు ఆరా తీయగా నగదు పోగొట్టుకున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి శోభకరంద్లాజె వద్ద మొరపెట్టుకోగా ఆమె విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితంలేకుండాపోయింది. దీంతో ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ బాగుంటే చంద్రశేఖర్‌కు గత జనవరిలో వివాహం జరగాల్సి ఉంది. -
కాలువలో పడి యువకుడి మృతి
నకరికల్లు : ప్రమాదవశాత్తూ కాలువలో జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని శ్రీరాంపురం సమీపంలో గల బెల్లంకొండ బ్రాంచ్ కెనాల్లో ఆదివారం చోటుచేసుకుంది. నకరికల్లుకు చెందిన వీర వెంకటేష్ (19) తన మిత్రులతో కలసి బెల్లంకొండ బ్రాంచ్ కెనాల్ లోపలికి వెళ్ళాడు. గట్టుపై నిలబడి మిత్రులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి కాలువలో పడిపోయాడు. సమాచారం అందుకున్న బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరారు. ఎన్ఎస్పీ అధికారులను సంప్రదించి కాలువలో నీటిని నిలుపుదల చేశారు. అప్పటికే యువకుడు మృతిచెందినట్లు గుర్తించాడు. మృత దేహాన్ని వెలికితీశారు. -
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
అచ్చంపేట: స్నానం చేసేందుకు నదిలో దిగిన యువకుడు గల్లంతైన సంఘటన మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. బెల్లంకొండ మండలం బెల్లకొండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సైదావలి(23) తన ఆటోలో కొంత మంది ప్రయాణికులను ఎక్కించుకుని ప్రాజెక్టు సందర్శనకు బాడుగకు వెళ్లాడు. సందర్శకులు ప్రాజెక్టును చూస్తుండగా తాను స్నానం చేసేందుకు నదిలో దిగి కాలుజారి నది లోతుల్లోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతని ఆచూకీ కోసం నదిలో ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. సైదావలికి తల్లి నైరున్, భార్య, చిన్న పాప ఉన్నట్లు సమాచారం.