
రైల్వే గేటు వద్ద యువకుడి హల్‌చల్
నిజామాబాద్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని యువకుడు హల్‌చల్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం రైల్వేగేటు పడటంతో గుర్తు తెలియని యువకుడు రైలు పట్టాలపై రాళ్లు పెట్టి రైల్వేట్రాక్‌పై కూర్చున్నాడు.
ఆ సమయంలో నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఇంజన్ లోకో ఫైలెట్ పట్టాలపై ఉన్న వ్యక్తిని గమనించి గేట్‌మన్‌రాజుకు సమాచారం అందించి పట్టాలకు కొద్ది దూరంలోనే ఇంజన్‌ను నిలిపివేశాడు. గేట్‌మన్ రాజు వెంటనే యువకుడి వద్దకు వెళ్లగా సదరు యువకుడు గేట్‌మన్‌తో గొడవకు దిగి రాళ్లతో దాడి చేశాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో ట్రాక్‌మన్‌తో పాటు స్థానికులు ఆ యువకుడికి చెప్పడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో కొంత ట్రాఫిక్ ఏర్పడగా కొంత సేపటికి క్లియరైంది.
ఇవి చదవండి: ఆకాష్ మాస్టర్ మైండ్.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్ (వీడియో)
Comments
Please login to add a commentAdd a comment