No Headline
నిజామాబాద్ సిటీ: ఓ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించే అవయవ దానం ఎంతో గొప్పదని భావిస్తున్న రోజులివి. మరణం తర్వాత కూడా జీవించొచ్చు. శ్వాస ఆగినప్పటికీ మన శరీరభాగాలు ఇతరులకు ఉపయోగించొచ్చు. మనకు పనికిరాని అవయవాలను అవసరమున్నవారికి దానం చేసి వారికి పునర్జన్మను ప్రసాదించొచ్చు. ఊపిరి ఆగిన తరువాత గంటల్లో నాశనమయ్యే శరీరం.. అది చక్రవర్తిది అయి నా కడుపేదదైనా మట్టిలో కలవాల్సిందే. అటువంటి శరీరాన్ని ఎదుటి వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎంతో మంది అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అవయవదానం సామాజిక బాధ్యతగా గుర్తించాల్సిన ఈ సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. శాసీ్త్రయ దృక్పథంతో ఆలోచిస్తే ప్రాణంలేని శరీరంతో కూడా కొందరి ప్రాణాలను కాపాడడం లేదా సమాజానికి వైద్య సేవలు అందించే భావి వైద్యుల జ్ఞాన సముపార్జనకోసం ఉపయోగపడేలా చేయడమే విజ్ఞత.
జిల్లాలో అవయవ, శరీరదానాలు
అవయవ, శరీరదానంపై జిల్లాలో అవగాహన అంతంత మాత్రమే. 2013లో తొలిసారి బోధన్‌కు చెందిన మంజులవాణి తల్లి కుసుమవతి శరీరదానం చేశారు. శరీరదానంపై తెలంగాణ బాడీ అండ్ ఆర్గా న్ డొనేషన్ అసొసియేషన్ సంస్థను ప్రభుత్వ టీచర్ కాట్రగడ్డ భారతి నిర్వహిస్తున్నారు. బాడీ డోనర్ మరణించిన వెంటనే సంబంధిత మెడికల్ కళాశాలకు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అవయవ, శరీర దానంపై ఆగస్టులో వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవయదానం, శరీరదానం ప్రాముఖ్యతను వివరిస్తూ కాట్రగడ్డ భారతి ‘వెన్నెల పుష్పాలు’ పుస్తకం రాశారు.
కుటుంబ సభ్యులు అంగీకరించాలి..
అవయవ, శరీర దానం చేసే వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి. దీర్ఘకాల వ్యాధులు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులున్నవారు అనర్హులు. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే తన మర ణం తర్వాత కళ్లు, కిడ్నీలు, గుండె వాటితోపాటు శరీరాన్నికూడా దానం చేస్తున్నట్లు అంగీకరిస్తూ ‘జీవదాన్’ పత్రంలో సంతకం చేయాలి. డోనర్‌తోపాటు వారి కుటుంబసభ్యులందరి ఆమోదం అవసరం. డోనర్ భాగస్వామితోపాటు సంతానం ఆమో దం తెలుపుతూ సంతకాలు చేయాలి. అప్పుడే సద రు వ్యక్తి శరీర, అవయవదానానికి అర్హులవుతారు.
వైద్య విద్యార్థుల కోసం..
ప్రాణంపోయిన శరీరాన్ని వైద్యులు తీసుకున్న తర్వాత పలు ప్రక్రియలు నిర్వహిస్తారు. శరీరంలోని రక్తాన్ని తీసివేసి రక్తనాళాల్లో కెమికల్స్ ఎక్కిస్తారు. పనికివచ్చే శరీర భాగాలను వేరుచేస్తారు. తర్వాత డెడ్‌బాడీకి ఎంబాల్‌బింగ్ ప్రక్రియ చేసి స్పెషల్ ట్యాంకర్లలో డెడ్‌బాడీలను నిల్వ చేస్తారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో అనాటమీ (శరీరనిర్మాణ శాస్త్రం) తరగతుల్లో విద్యార్థులకు బోధిస్తారు. మనిషి శరీరంలోని వివిధ భాగాలు ఎ లా పనిచేస్తాయి. వాటి నిర్మాణం, అంతర్గత నిర్మా ణం వంటి వాటిని విద్యార్థులకు చూపిస్తారు. దాంతో వైద్య విద్యార్థులు శరీరంలోని అవయవాలు, వాటి పనితీరు, శరీర నిర్మాణం స్వయంగా చూసి నేర్చుకుంటారు. ఒకసారి బాడీని మెడికల్ కళాశాలకు డొనేట్ చేసిన తర్వాత ఎవరికీ ఎలాంటి హక్కు ఉండదు. మళ్లీ ఆ శరీరాన్ని చూసే అవకాశమూ ఉండదు. చివరికి కుటుంబీకులకు కూడా.
సమాజ మార్పు కోసం, సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. శరీరదానాల్లో కూడా ముందు వరుసలో నిలిచారు. ఇప్పటి వరకు 40 మంది శరీరదానం చేయ గా, ఇందులో కమ్యూనిస్టులే ఎక్కువ మంది ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన పలువురు తమ శరీరాలను దానం చేశారు. ఆకుల పాపయ్య తల్లి ఆకుల మల్లవ్వ, అల్లుడు గడ్డం దయానంద్, నీలం సాయిబాబా తల్లి నీలం లక్ష్మి, అక్క నీలం శాంత, కర్నాటి భా స్కరస్వామి తల్లిదండ్రులు కర్నాటి అనసూయ, కర్నాటి యాదగిరి, నర్రా పూర్ణచందర్‌రావు, నర్రా రత్నకుమారి తదితరులు తమ శరీరాలను దానం చేశారు.
No Headline
No Headline
Comments
Please login to add a commentAdd a comment