ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులదే విజయం
సుభాష్‌నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులదే విజయమని కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్, బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ధన్‌పా ల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్‌తో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బూత్, మండల, జిల్లా స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కులగణనకు బీజేపీ అనుకూలంగా ఉందని, బీసీ సామాజిక వర్గాన్ని చీల్చే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, ఆ తర్వాత ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతామని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ తో ఒంటరిగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
మండలిలో ప్రశ్నించే వారేరీ..
మండలిలో ప్రశ్నించే వారు కరువయ్యారని, బీజేపీ ఎ మ్మెల్సీ ఒక్కరే సమస్యలను లేవనెత్తుతున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పు డు కాంగ్రెస్ ఎమ్మెల్సీలందరూ ఆ పార్టీలోకి వెళ్లారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే పరిస్థితి నెలకొందన్నారు. గతంలో మండలికి మంత్రులు వ చ్చి మాట్లాడాలంటే భయపడే వారని, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు చెమటలు పట్టించేవారని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను ని ర్దేశించే ఎన్నికలు కానున్నాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ప్రధానకార్యదర్శి న్యాలం రాజు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా, రాష్ట్ర పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు
మేధావులు, ఉద్యోగులు,
ఉపాధ్యాయులు ఆలోచించి ఓటేయాలి
కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి
ఒరగబెట్టిందేమీ లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వ 14 నెలల పాలనలో తెలంగాణ సమాజానికి ఒరగబెట్టిందేమీ లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు కోసం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏఒక్క గ్యారెంటీ, హామీలు అమలు చేయని కాంగ్రెస్ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ చర్చకు సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment