వైద్య విద్య ప్రవేశ పరీక్షలు | Medical education entrance examinations | Sakshi
Sakshi News home page

వైద్య విద్య ప్రవేశ పరీక్షలు

Published Sun, Apr 6 2014 11:27 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

వైద్య విద్య ప్రవేశ పరీక్షలు - Sakshi

వైద్య విద్య ప్రవేశ పరీక్షలు

ఏఐపీఎంటీ
దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సీబీఎస్‌ఈ నిర్వహించే పరీక్ష.. ఆలిండియా ప్రీ-మెడికల్/ప్రీ డెంటల్ టెస్ట్. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వైద్య, దంత కళాశాలల్లో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ సెంట్రల్ పూల్‌లో చేరనందువల్ల ఈ రాష్ట్రాల విద్యార్థులు అర్హులు కాదు. అయితే ఈ ఏడాది నుంచి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కళాశాల - పుణె, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏఐపీఎంటీ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నందువల్ల మన రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయొచ్చు. ప్రవేశం ఈ రెండింటికి మాత్రమే పరిమితం.
 
అర్హతలు:
50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత,  

వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. 25 ఏళ్లు మించరాదు.

పరీక్ష విధానం: మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం 180 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ)ల నుంచి అడుగుతారు.

పరీక్ష తేదీ: మే 4, 2014, వెబ్‌సైట్: www.aipmt.nic.in  
 
సీఎంసీ-వెల్లూర్
దేశంలోనే మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(సీఎంసీ)-వెల్లూర్. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది.
 
అర్హత: 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత.
 
వయోపరిమితి:
డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
 
ఎంపిక: మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి సబ్జెక్టు నుంచి 60 ప్రశ్నలుంటాయి.  దీంతోపాటు జనరల్ ఎబిలిటీ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇందులో సాధించిన ర్యాంకు ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.

పరీక్ష తేదీ: మే 23, 2014

వెబ్‌సైట్: www.cmch-vellore.edu
 
శ్రీరామచంద్ర యూనివర్సిటీ
చెన్నైలో ఉన్న శ్రీరామచంద్ర యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది.

కోర్సులు: ఎంబీబీఎస్, బీడీఎస్

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా, దరఖాస్తులకు చివరి తేదీ: మే 15, 2014
 
ప్రవేశపరీక్ష: జూన్ 1, 2014

వెబ్‌సైట్: www.sriramachandra.edu.in
 
 సీవోఎంఈడీకే
 సీవోఎంఈడీకే నిర్వహించే ప్రవేశ పరీక్ష  ద్వారా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.

 పరీక్ష విధానం: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌లపై 240 ప్రశ్నలు అడుగుతారు.
 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2014

పరీక్ష తేదీ: మే 11, 2014
 
వెబ్‌సైట్: www.comedk.org
 
జిప్‌మర్ - పుదుచ్చేరి
మన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల్లో ఒకటి.. జిప్‌మర్ ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్. పుదుచ్చేరిలో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తోంది. వివరాలు..
 
అర్హత: 50 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ, ఇంగ్లిష్) ఉత్తీర్ణత.
 
వయోపరిమితి:
17 ఏళ్లు నిండి ఉండాలి.
 
పరీక్ష విధానం: రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహించే పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు. నెగెటివ్ మార్కులు లేవు. ఆన్‌లైన్

దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2014
 
పరీక్ష తేదీ: జూన్ 8, 2014, వెబ్‌సైట్: http://jipmer.edu.in
 
డీవై పాటిల్ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
పుణెలో ఉన్న డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. వివరాలు..
 
అర్హత: 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

దరఖాస్తు విధానం: దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2014
 
పరీక్ష తేదీ: మే 24, 2014,

వెబ్‌సైట్: www.dypatil.ac.in
 
ఎంజీఐఎంఎస్- వార్ధా

మహారాష్ట్రలో వార్ధాలో ఉన్న మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎంజీఐఎంఎస్) ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ప్రతి ఏటా పరీక్షను నిర్వహిస్తోంది.
 
అర్హత: మొదటి ప్రయత్నంలోనే 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
 
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లు మించరాదు.
 
ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా..
 
పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014, వెబ్‌సైట్: www.mgims.ac.in
 
ఆల్ ఇండియా ప్రీ వెటర్నరీ టెస్ట్
వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ - ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
 
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
 
పరీక్ష విధానం: ఏఐపీవీటీని ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్ 60 ప్రశ్నలు, కెమి్రస్ట్రీ 60 ప్రశ్నలు, బయూలజీ (బోటనీ అండ్ జువాలజీ) 80 ప్రశ్నలు. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
 
పరీక్ష తేదీ: మే 10, 2014.
 
వివరాలకు: www.vci.nic.in
 
మణిపాల్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్
కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతి ఏటా జాతీయస్థాయిలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తోంది.

అర్హత: 55 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ.
 
పరీక్ష విధానం:
రెండున్నర గంటల వ్యవధిలో ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఫిజిక్స్ నుంచి 50 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలు, బయాలజీ నుంచి 70 ప్రశ్నలు, ఇంగ్లిష్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు.
 
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 14 - మే 15 వరకు
 
వెబ్‌సైట్: www.manipal.edu
 
అమృత విశ్వవిద్యాపీఠం
కోయంబత్తూరు, కోచిల్లో క్యాంపస్‌లున్న అమృత విశ్వవిద్యాపీఠం  ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది.
 
అర్హత:
ఒకే ప్రయత్నంలో 60 శాతం మార్కులతో 10+2 బైపీసీ, ఇంగ్లిష్ ఉత్తీర్ణత.
 
వయోపరిమితి:
డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 23 ఏళ్లు మించరాదు.
 
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా
 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014
 
ప్రవేశ పరీక్ష తేదీ: మే 18, 2014
 
వెబ్‌సైట్: www.amrita.edu
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement