
కర్ణాటక: కర్ణాటకాలో కొత్తగా కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. జులైలో ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
'కేబినెట్‌లో మతమార్పిడి బిల్లుపై చర్చ జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. జులై 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టనున్నాము'అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.
మోసపూరిత మార్గాల ద్వారా మత మార్పిడీకి పాల్పడకుండా 'మతమార్పిడి నిరోధక చట్టాన్ని' బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్‌లో తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రలోభానికి గురిచేసి మత మార్పిడీకి పాల్పడకుండా అడ్డుకట్ట వేసింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టాలను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది.
ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..
Comments
Please login to add a commentAdd a comment