Siddaramaiah Cabinet
-
మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెనక్కి తీసుకోనున్న కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక: కర్ణాటకాలో కొత్తగా కొలువుదీరిన సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. జులైలో ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'కేబినెట్లో మతమార్పిడి బిల్లుపై చర్చ జరిగింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. జులై 3న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టనున్నాము'అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. మోసపూరిత మార్గాల ద్వారా మత మార్పిడీకి పాల్పడకుండా 'మతమార్పిడి నిరోధక చట్టాన్ని' బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్లో తీసుకువచ్చింది. దీని ద్వారా ప్రలోభానికి గురిచేసి మత మార్పిడీకి పాల్పడకుండా అడ్డుకట్ట వేసింది అప్పటి ప్రభుత్వం. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చట్టాలను ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
కర్ణాటక కేబినెట్లో మార్పులు
14 మంది ఔట్..13 మంది ఇన్ సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్లో భారీ మార్పులు జరిగాయి. 14 మంది మంత్రులు పదవులను కోల్పోగా, కొత్తగా 13 మంది పదవులు దక్కించుకున్నారు. మంత్రుల సంఖ్య 33కు చేరింది. పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడ్డ వారు అసంతృప్తిని వెళ్లగక్కారు. పలువురు నాయకుల అనుచరగణం రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడగా, పదవులు దక్కని ఆశావహులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లోగవర్నర్ వజుభాయ్రుడా భావ్వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయిం చారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి తదితరు లకు కేబినెట్ హోదా దక్కగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ ఖండ్రేలు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రి పదవులను కోల్పోయిన వారిలో అంబరీశ్, చంద్రజైన్ తదితరులు న్నారు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్య కేబినెట్లో భారీ మార్పులు చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. పార్టీలో అసంతృప్తి లేదని చెప్పారు.