కర్ణాటక కేబినెట్‌లో మార్పులు
14 మంది ఔట్..13 మంది ఇన్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్‌లో భారీ మార్పులు జరిగాయి. 14 మంది మంత్రులు పదవులను కోల్పోగా, కొత్తగా 13 మంది పదవులు దక్కించుకున్నారు. మంత్రుల సంఖ్య 33కు చేరింది. పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడ్డ వారు అసంతృప్తిని వెళ్లగక్కారు. పలువురు నాయకుల అనుచరగణం రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడగా, పదవులు దక్కని ఆశావహులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
ఆదివారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లోగవర్నర్ వజుభాయ్‌రుడా భావ్‌వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయిం చారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి తదితరు లకు కేబినెట్ హోదా దక్కగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ ఖండ్రేలు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రి పదవులను కోల్పోయిన వారిలో అంబరీశ్, చంద్రజైన్ తదితరులు న్నారు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్య కేబినెట్‌లో భారీ మార్పులు చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. పార్టీలో అసంతృప్తి లేదని చెప్పారు.