Karnataka Cabinet
-
కర్ణాటక కేబినెట్ భేటీ.. 5 గ్యారంటీ హామీల అమలుకు గ్రీన్ సిగ్నల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 5 గ్యారంటీ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగిన కర్ణాటక కేబినెట్ భేటీలో వీటికి ఆమోదం లభించింది. అధికారులు అందించిన ప్రజెంటేషన్ల ఆధారంగా మంత్రి మండలితో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 5 గ్యారంటీ స్కీమ్‌ను అమలు చేయనునట్లు ప్రకటించారు కుల, మత వివక్ష లేకుండా ఐదు హామీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమావేశం అనంతరం సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజలకిచ్చిన ఇతర హామీలను కూడా కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. వీటి అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదికి 50 వేల కోట్ల భారం పడనుంది. ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಗೂ ಮುನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ @siddaramaiah ಅವರು ವಿಧಾನಸೌಧದ ತಮ್ಮ ಕಚೇರಿಯಲ್ಲಿ ಹಿರಿಯ ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ಸಭೆ ನಡೆಸಿ, ಗ್ಯಾರೆಂಟಿ ಯೋಜನೆಗಳ ಜಾರಿ ಕುರಿತಾಗಿ ಚರ್ಚಿಸಿದರು. pic.twitter.com/NyO1jgLhl4 — CM of Karnataka (@CMofKarnataka) June 2, 2023 కాగా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అయిదు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 5 వాగ్దానాలను ఒకేసారి నెరవేర్చుతామని చేసింది. అనుకున్నట్టేగానే 224 స్థానాలున్న అసెంబ్లీలో 135 చోట్ల కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది. ఏ పార్టీతో పొత్తులేకుండా సింగిల్‌గానే మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం నేటి కేబినెట్ భేటీలో ఆ 5 గ్యారంటీ వాగ్దానాలకు ఆమోదముద్ర వేసింది. చదవండి: బ్రిజ్ భూషణ్‌పై సంచలన నిందారోపణలు కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు ఇవే.. 1. గృహ జ్యోతి(ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్), 2. గృహ లక్ష్మి(ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు నెలకు రూ.2000) 3. అన్న భాగ్య( బిపిఎల్ న కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల ఉచిత బియ్యం, 4. యువ నిధి (నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ. 3,000, నిరుద్యోగ డిప్లొమా చేసిన వారికి రూ. 1,500 చొప్పున ఇవ్వనున్నారు. 18-25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రెండేళ్లపాటు అందించనున్నారు. 5. శక్తి (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం). -
కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?
బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే గవర్నర్ తావర్‌చంద్ గెహ్లత్ శనివారం రాజ్భన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్‌కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్ జారికిహోళికి పబ్లిక్ వర్క్స్, బైరతి సురేష్‌కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్& స్పోర్ట్స్, వెంకటేష్‌కు పశుపోషణ, తిమ్మపూర్ ఎక్సైజ్, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలోవైరల్గా మారింది. చదవండి: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్‌లాడ్, కేఎన్ రాజణ్ణ, కే వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్బీ .తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్కర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ .సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్‌ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ ఉన్నారు. మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన్ మంత్రి ఉన్నారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? Live ನೂತನ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭ https://t.co/y1KDAW2Byl — Karnataka Congress (@INCKarnataka) May 27, 2023 -
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. 8 మంది మంత్రులు వీళ్లే
Updates: ►కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత ప్రమాణ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొఫైల్ ►ఓబీసీ నేత, 40 ఏళ్ల రాజకీయ జీవితం ►తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే, ►2013 నుంచి 18 వరకు సీఎం, ►13సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్. ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిక ►కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొఫైల్ ► వక్కళిగ నేత, తల్లిదండ్రులు కెంపేగౌడ, గౌరమ్మ ►చదవు: మైసూరు యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ ►27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు ►సాతనౌర్ నుంచి మూడుసార్లు ఎమ్మల్యెఏ ►2008లో కనకపుర నుంచి గెలుపు ►2008, 2013, 2018లో హ్యాట్రిక్ విక్టరీ ►2014 నుంచి 18 వరకు విద్యుత్‌శాఖ మంత్రి ►2017 రాజ్యసభ ఎన్నికల్లోనూ కీలక పాత్ర ►దేశంలోనే ధనిక రాజకీయనేత ►కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్షూటర్ ►కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 8 మంది నేతలు వీళ్లే కేజీ జార్జ్ ప్రొఫైల్ ►సర్వగ్న నగర్ నియోజకవర్గం, క్రిస్టియన్ నేత, 5 సార్లు ఎమ్మెల్యే ►1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక ►హోం, పరిశ్రమలశాఖ మంత్రిగా సేవలు కేహెచ్ మునియప్ప ప్రొఫైల్ ► తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు, దేవనహళ్లి అసెంబ్లీ ► చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజస్ ► రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ శాఖల నిర్వహణ ► ఏడుసార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నిక ► కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం జీ పరమేశ్వర ప్రొఫైల్ ►జననం 1951 ఆగస్టు 6, కొరటగెరె నియోజకవర్గం ►దళిత నేత, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే ►హోంశాఖ, సమాచారం, పౌర సంబంధాలు ►ఉన్నత విద్యాశాఖ మంత్రిగా విధులు 2010-18 వరకు కేపీసీసీ అధ్యక్షుడు ►వీరప్పమొయిలీ, ఎస్ఎం కృష్ణ, సిద్ధరామయ్య, కుమారస్వామి కేబినెట్లో మంత్రిగా విధులు మాజీ డిప్యూటీ సీఎం, ఎంబీ పాటిల్ ప్రొఫైల్ ►లింగాయత్ నేత, బబలేశ్వర్ నియోజకవర్గం. ►అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ ► కర్ణాటక మాజీ హోం, జలవనరుల మంత్రి. సతీశ్ జర్కిహోళి ప్రొఫైల్ ►ఎస్టీ నేత(వాల్మికీ నాయక) ► గోకక్ నియోజకవర్గం. ►నాలుగుసార్లు ఎమ్మెల్యే, ►రెండుసార్లు ఎమ్మెల్సీ, ►కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రియాంక్ ఖర్గే ప్రొఫైల్ ►దళిత నేత, ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ►చిత్తాపూర్ నియోజకవర్గం. ►మూడుసార్లు ఎమ్మెల్యే. ►ఐటీ, సాంఘీక సంక్షేమశాఖ మాజీ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ►చామరజ్పేట్ నియోజకవర్గం ►మైనార్టీ నేత, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ►జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిక ► మాజీ హజ్, వక్ఫ్ శాఖ మంత్రి రామలింగారెడ్డి ►ఓబీసీ నేత ►బీటీఎమ్ లేఔట్ నియోజవకర్గం ►8సార్లు ఎమ్మెల్యే, ►మూడు సార్లు మంత్రిగా సేవలు. ►కర్ణాటక మాజీ హోంమంత్రి #WATCH | Karnataka swearing-in ceremony | Karnataka CM-designate Siddaramaiah and Deputy CM-designate DK Shivakumar display a show of unity with Congress leader Rahul Gandhi in Bengaluru. pic.twitter.com/KxdvpWims1 — ANI (@ANI) May 20, 2023 Karnataka swearing-in ceremony | Karnataka Deputy CM-designate DK Shivakumar welcomes Tamil Nadu CM MK Stalin and other DMK leaders at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/TS3uVNcydI — ANI (@ANI) May 20, 2023 ►బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీష్ కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కమల్‌హాసన్, శవరాజ్ కుమార్ హాజరయ్యారు. Actor and Makkal Needhi Maiam chief Kamal Haasan attends the swearing-in ceremony of the newly-elected Karnataka Government at Sree Kanteerava Stadium in Bengaluru. pic.twitter.com/mrTmOo7vU4 — ANI (@ANI) May 20, 2023 ►అన్ని సామాజిక వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లు కేబినెట్ కూర్పు, పోర్టుఫోలియోలపై పార్టీ పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. డీకే శివకుమార్ ప్రత్యేకంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాలను కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. #WATCH | Karnataka Deputy CM-designate DK Shivakumar arrives at Sree Kanteerava Stadium in Bengaluru where the swearing-in ceremony of the newly-elected Karnataka Government will begin shortly. pic.twitter.com/sQHEch9Rd8 — ANI (@ANI) May 20, 2023 శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్‌తోపాటు మంత్రులుగా కొందరు ప్రమాణం చేస్తారంటూ అధిష్టానం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సూర్జేవాలాలతో సిద్ధరామయ్య ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం వీరి చర్చల్లో శివకుమార్ పాలుపంచుకున్నారు. నలుగురూ కలిసి జన్‌పథ్– 10లో ఉంటున్న రాహుల్ గాంధీని వెళ్లి కలిశారు. కేబినెట్లోకి 20 మంది? గంటన్నరకుపైగా వారి మధ్య చర్చలు నడిచాయి. ఆపై రాహుల్ గాంధీ, సూర్జేవాలా, వేణుగోపాల్‌లు పార్టీ చీఫ్ ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కేబినెట్లోకి ఎందరిని తీసుకోవాలనే విషయమై తుది నిర్ణయానికి వచ్చారు. కేబినెట్లోకి తీసుకునే 20 మంది పేర్లను ఖారారు చేసినట్లు అనంతరం పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్థానం దక్కేలా కేబినెట్ కూర్పు ఉంటుందన్నాయి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆయనతోపాటు జీ పరమేశ్వర, మునయప్ప,జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలి, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్‌ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల సీఎంల రాక ప్రమాణ స్వీకారోత్సవానికి కంఠీరవ స్టేడియాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. లక్ష మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారని అంచనా. విస్తృతంగా బందోబస్తు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తనకు బదులుగా పార్టీ ప్రతినిధిని పంపుతారని సమాచారం. కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లను శుక్రవారం ఉదయం డీకే శివకుమార్ స్వయంగా పరిశీలించారు. ప్రజా ప్రతినిధులైన జేడీఎస్, బీజేపీ నేతలను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శివకుమార్ చెప్పారు. శనివారమే జరిగే కేబినెట్ మొదటి భేటీలో కాంగ్రెస్ ప్రధాన హామీ అయిన 5 గ్యారంటీల అమలుపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. చదవండి: ఢిల్లీకి నేతల క్యూ.. రాష్ట్ర నేతలతో వేర్వేరుగా అమిత్‌షా, సునీల్ బన్సల్ భేటీ -
కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కేదెవరికో?
కోలారు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రిగిరి ఎవరికి దక్కుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జిల్లా నుంచి ఈసారి నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో బంగారుపేట ఎమ్మెల్యే ఎస్ ఎన్ నారాయణస్వామి వరుసగా మూడోసారి గెలిచి హాట్రిక్ విజయం సాధించారు. తనకు ఎస్సీ కోటా కింద మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. కేజీఎఫ్ నుంచి వరుసగా రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచిన రూపా శశిధర్ కూడా తనకు ఎస్సీ మహిళా కోటా కింద మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు. కోలారు నుంచి కొత్తూరు మంజునాథ్ కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక మాలూరు నుంచి కైవె నంజేగౌడ కూడా వరుసగా రెండోసారి విజయం సాధించారు. వీరంతా తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. శ్రీనివాసపురం నుంచి పోటీ చేసి ఓడిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె ఆర్ రమేష్‌కుమార్‌కు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలో స్థానం కల్పించి ఎమ్మెల్సీని చేయాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. వీరే కాకుండా ఈ సారి కేంద్ర రాజకీయాలను కాదని అసెంబ్లీకి పోటీ చేసి దేవనహళ్లి నుంచి గెలిచిన కెహెచ్ మునియప్పకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని జిల్లా నుంచి డిమాండ్ వినిపిస్తోంది. జిల్లాలో, రాష్ట్రంలో సీనియర్ నాయకుడుగా, పలుమార్లు కేంద్ర మంత్రివర్గంలో పని చేసిన అనుభవం కలిగిన కెహెచ్ మునియప్పకు దళిత కోటా కింద మంత్రి పదవి వరిస్తుందని ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లా నుంచి పార్టీ అధినాయకత్వం ఎవరికి మంత్రిగిరిని కట్టబెడుతుందో వేచి చూడాల్సిందే. కొత్తూరు మంజునాథ్, రూపా శశిధర్, ఎస్ ఎన్ నారాయణస్వామి, కె వై నంజేగౌడ , కె ఆర్ రమేష్‌కుమార్, కెహెచ్ మునియప్ప -
రెబల్స్‌తో కేబినెట్ విస్తరణ.. 10 మందికి చోటు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయింది. కొత్తగా మరో పది మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు లభించింది. ఈ మేరకు నూతన మంత్రులతో రాజ్‌భవన్ వేదికగా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. తాజాగా 10 మంది చేరికతో కర్ణాటక కేబినెట్ మంత్రుల సంఖ్య 28కి చేరింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఎస్టీ సోమశేఖర్, రమేశ్ ఎల్. జర్కిహోలీ, ఆనంద్ సింగ్, కే. సుధాకర్, బీఏ బసవరాజ, ఏ. శివరామ్ హెబ్బర్, బీసీ పాటిల్, కే. గోపాలయ్య, నారాయణ గౌడ, శ్రీమంత్ బీ పాటిల్ ఉన్నారు. వీరందరూ కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 11 మంది కాంగ్రెస్-జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. అందులో పది మందికి మంత్రిపదవులు లభించాయి. ఉప ఎన్నికలో గెలిచిన మరో ఎమ్మెల్యే మహేశ్ కుమతల్లికి మంత్రివర్గ విస్తరణలో చోటు లభించలేదు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ అంతకంటే పెద్ద బాధ్యతను అప్పగిస్తామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. గత కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష, సీఎంగా యడ్యూరప్ప బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్-జేడీఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో వీరిపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి వీరు గెలుపొందారు. -
12న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ
సాక్షి, బెంగళూరు: మంత్రివర్గ విస్తరణ ద్వారానే సంకీర్ణ సర్కారులోని అసమ్మతి వేడిని చల్లబరిచేందుకు కాంగ్రెస్, జేడీఎస్ పెద్దలు సిద్ధమయ్యారు. ఈ నెల 12న మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం కుమారస్వామి తీర్మానించారు. విస్తరణపై శనివారం గవర్నర్ వజుభాయివాలాను సీఎం కలిసి వివరాలు అందజేశారు. 12న ఉదయం 11.30 గంటలకు విస్తరణ ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో పదవుల కోసం సంకీర్ణ పక్షంలో చాలామంది ఆశావహ ఎమ్మెల్యేలు లాబీయింగ్‌లు షురూ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని తమకు తెలిసిన పరిచయాలతో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. శంకర్, నాగేశ్‌లకు పదవులు కేబినెట్లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్, రెండు జేడీఎస్ కోటాలోనివి. రెండు మంత్రి పదవులు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు దాదాపుగా ఖరారయ్యాయి. రాణిబెన్నూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్, ముళబాగిలు స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్‌లకు మంత్రి పదవులు దక్కనున్నాయి. మిగిలిన స్థానాన్ని అలాగే ఉంచుతారని సమాచారం. ఆ ఒక్క స్థానాన్ని ఎవరికో ఒకరికి ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి మరింత చెలరేగే ప్రమాదం ఉందని సంకీర్ణ సారథులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మంత్రివర్గాన్ని ఏకంగా ప్రక్షాళన చేయాలని కొందరు సంకీర్ణనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒక్కటీ కాంగ్రెస్‌లో ఎవరికి? ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఒత్తిడి ఎక్కువయితే ఆ పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అప్పుడు ఎవరికి చోటు కల్పించాలనే విషయమై ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి కేసీ వేణుగోపాల్‌తో సీఎం చర్చించి ఖరారు చేయనున్నారు. కాంగ్రెస్‌లో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆకాంక్షిస్తున్నారు. బీసీ పాటిల్, రామలింగారెడ్డి, రోషన్ బేగ్, రమేశ్ జార్కిహొళితో సహా సుమారు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఎంతోకాలంగా కన్నేసి ఉన్నారు. వీరిలో ఎవరికి అనేది సస్పెన్స్‌గా ఉంది. లోక్‌సభ ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణకు రెండు సార్లు ముహూర్తాలు పెట్టి తర్వాత విరమించుకున్నారు. బుధవారం మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో జరగనుంది. -
మంత్రివర్గం : కాంగ్రెస్ 14, జేడీఎస్ 7
బెంగుళూరు : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయనుంది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 14 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 7 మంత్రి పదవులు దక్కనున్నాయి. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేష్‌ను, కేజీపే పార్టీ అభ్యర్థిని కూడా కేబినెట్లోకి తీసుకోనున్నారు. బీఎస్పీ కూడా కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అగ్రనాయకులు, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి ఆయన ఆమోదంతో మంత్రి పదవులు ఖరారు చేశారు. రాహుల్ ఆమోదం పొందిన జాబితా అందిన తర్వాతనే సీఎం కుమారస్వామి మంత్రివర్గ ఏర్పాటుకు పూనుకున్నట్టు సమాచారం. కాగా కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కు కీలక మంత్రి పదవీ దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ ఆమోదం తెలిపిన అభ్యర్థుల జాబితాలో డీకే పేరుతో పాటు కేజే జార్జ్, ప్రియంకా ఖార్గే పేర్లు కూడా ఉన్నట్టు ఏఎన్ఐ తెలిపింది. కాగా రానున్న 2019 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ అన్ని వర్గాలకు సమప్రాధాన్యతను ఇచ్చినట్టు సమాచారం. తర్వాతి కాలంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా కీలక మంత్రి పదవులను రెండు పార్టీలు సమానంగా పంచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై ఇంకా మంతనాలు
-
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
-
కాంగ్రెస్‌కు 22.. జేడీఎస్‌కు 12
బెంగళూరు: మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య అంగీకారం కుదిరింది. కర్ణాటక కేబినెట్లో మొత్తం 34 మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, సీఎంతో కలిపి జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వరను వరించింది. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్ జేడీఎస్‌కు దక్కనున్నాయి. అయితే బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చన్న సంకేతాల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలపరీక్ష ముగించుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో కాంగ్రెస్, జేడీఎస్ ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. నేను, పరమేశ్వర బుధవారం ప్రమాణస్వీకారం చేస్తాం. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం కూటమిలోని మంత్రుల పేర్లను వెల్లడిస్తాం. అంతా సజావుగానే ఉంది. ఎలాంటి విభేదాలు లేవు’ అని పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పుపై మంగళవారం సాయంత్రం కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తమకే ఎక్కువ పదవులు దక్కాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఆ పార్టీకి 22 మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీఎస్ అంగీకరించింది. జేడీఎస్‌కు సీఎంతో కలిసి 12 మంత్రి పదవులే దక్కనున్నాయి. బలనిరూపణ అనంతరం శాఖల కేటాయింపు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ పేరు దాదాపు ఖరారైంది. ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బెంగళూరులోని అసెంబ్లీ భవనం విధానసౌధ ముందు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ప్రచారం జరిగినా.. జేడీఎస్ అంగీకరించకపోవడంతో చివరకు ఒకరికే అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి సిల్కు చొక్కా, పట్టు పంచెతో హాజరవుతారు. తొలుత విధానసభ ప్రాంగణంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో వీఐపీలు కూర్చోడానికి వీలుగా మూడు వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడం, బల నిరూపణకు ముందే 19వ తేదీన రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో 37 సీట్లున్న జేడీఎస్, 78 సీట్లున్న కాంగ్రెస్ కలసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఒకే వేదికపై విపక్ష నేతలు, సీఎంలు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేందుకు, రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఈ కార్యక్రమం వేదికగా మారనుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, ఏపీ, ఒడిశా సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, విజయన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎంఎన్ఎం నేత కమల్ హాసన్ తదితరులు హాజరవుతున్నారు. వీరితో పాటు పవన్ కల్యాణ్, అంబరీష్ కూడా హాజరవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మొదట ప్రకటించినా.. తూత్తుకూడిలో అల్లర్ల నేపథ్యంలో తాను రావడం లేదని ట్వీట్ చేశారు. యూపీలో గోరక్‌పూర్, పూల్పూరు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన సమాజ్‌వాదీ, బీఎస్పీ అధినేతలు అఖిలేశ్, మాయావతిలు ఒకే వేదికపై కనిపించనున్నారు. శివకుమార్‌ని నేను వ్యతిరేకించలేదు: దేవెగౌడ డీకే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంగా తాను వ్యతిరేకించానంటూ వచ్చిన వార్తల్ని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ తోసిపుచ్చారు. వాళ్ల పార్టీ నుంచి ఎవరు డిప్యూటీ సీఎం లేదా మంత్రి అవ్వాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీనే నిర్ణయించుకుంటుందని చెప్పారు. మరోవైపు, శివకుమార్ స్పందిస్తూ.. పదవి విషయంలో హైకమాండ్ ఆదేశాల్ని పాటిస్తానని స్పష్టంచేశారు. సంకీర్ణం సవాలే: కుమార స్వామి ఐదేళ్లపాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం తనకు పెద్ద సవాలని కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం శృంగేరీ పీఠాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇదో పెద్ద సవాలు. ముఖ్యమంత్రిగా నా బాధ్యతల్ని సులువుగా నిర్వర్తించగలనని నేను భావించడం లేదు. ఈ ప్రభుత్వం సజావుగా సాగుతుందా? లేదా? అని కర్ణాటక ప్రజలకు కూడా అనుమానం ఉంది. అయితే దేవుని దయ వల్ల అంతా సక్రమంగా జరుగుతుందని నాకు నమ్మకముంది’ అని చెప్పారు. ధర్మస్థలలోని మంజునాథ స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. కింగ్‌మేకర్ కాదు.. కింగే! సాక్షి, బెంగళూరు: కుమారన్న అలియాస్ హెచ్‌డీకే అలియాస్ కుమారస్వామి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, మొన్నటి దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా కింగ్‌మేకర్ అంటూ అందరి దృష్టిలో పడిన జేడీఎస్ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కేవలం 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీ వెతుక్కుంటూ వచ్చింది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు మూడో సంతానంగా 1959 డిసెంబర్ 16న హాసన్ జిల్లా హరదనహళ్లిలో కుమారస్వామి జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హాసన్ జిల్లాలోనే సాగింది. అనంతరం బెంగళూరులోని నేషనల్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 1986 మార్చి 13న అనితతో వివాహమైంది. ఏడాదిలో కొడుకు నిఖిల్‌గౌడ జన్మించారు. అనంతరం 2006లో సినీ నటి రాధికతో కుమారస్వామికి రెండో వివాహమైంది. వారికి షమిక అనే కుమార్తె ఉంది. కుమారకు రేవణ్ణ, బాలకృష్ణగౌడ అనే ఇద్దరు అన్నలు ఉన్నారు. అయితే, చిన్నవాడైన కుమారపై దేవెగౌడకు గురి ఎక్కువ. కారణం.. కుమారస్వామి పట్టుదల, రాజకీయ వ్యూహాలు. కుమారస్వామి ‘చెన్నాంబిక’ బ్యానర్‌పై పలు కన్నడ హిట్ సినిమాలు నిర్మించారు. రామనగర జిల్లా కనకపుర స్థానం నుంచి 1996లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో తన తండ్రి హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కుమారస్వామి కనకపుర నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నుంచి, 2004లో రామనగర నుంచి గెలుపొంచారు. 2006లో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
కర్ణాటక కేబినెట్లో మార్పులు
14 మంది ఔట్..13 మంది ఇన్ సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్లో భారీ మార్పులు జరిగాయి. 14 మంది మంత్రులు పదవులను కోల్పోగా, కొత్తగా 13 మంది పదవులు దక్కించుకున్నారు. మంత్రుల సంఖ్య 33కు చేరింది. పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడ్డ వారు అసంతృప్తిని వెళ్లగక్కారు. పలువురు నాయకుల అనుచరగణం రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడగా, పదవులు దక్కని ఆశావహులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులోని రాజ్‌భవన్‌లోగవర్నర్ వజుభాయ్రుడా భావ్వాలా కొత్త మంత్రులతో ప్రమాణం చేయిం చారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రమేష్‌కుమార్, బసవరాజరాయరెడ్డి తదితరు లకు కేబినెట్ హోదా దక్కగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే, రుద్రప్పలమాణి, ప్రమోద్ మద్వరాజ్, ఈశ్వర్ ఖండ్రేలు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రి పదవులను కోల్పోయిన వారిలో అంబరీశ్, చంద్రజైన్ తదితరులు న్నారు. రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధరామయ్య కేబినెట్లో భారీ మార్పులు చేపట్టారు. 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. పార్టీలో అసంతృప్తి లేదని చెప్పారు.