మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీఐడీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ దేవాదాయ, గృహ, న్యాయశాఖ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడారు.
న్యాయశాఖలో కేసులు త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు ఘనం నిర్వహిస్తామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్ రెడ్డికి ఉన్నతాధికారులు,టీఆర్ఎస్ నాయకులు, అభిమానాలు అభినందనలు తెలిపారు.