housing minister
-
‘టీడీపీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్’
కొత్తపేట: ‘తెలుగుదేశం పార్టీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ ఫేక్.. అలాంటి బాబుకు ఫేక్ ప్రచారం చేయడం అలవాటే’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అయినప్పటికీ, అది ఒరిజినల్ అంటూ.. అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చిందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుండటంపై తీవ్రంగా మండిపడ్డారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన టీడీపీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియోను పట్టుకుని.. ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించుకుని గవర్నర్ దగ్గరకు వెళ్లటం దారుణం అని చెప్పారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. అది ఒరిజినల్ కాదని అమెరికాలోని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ వారే స్వయంగా ఈ మెయిల్ ద్వారా తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాం’ అని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఏ విధంగా టీడీపీకి ఫేక్ అధ్యక్షుడయ్యారో అందరికీ తెలుసని చెప్పారు. ఇదీ చదవండి: ఫేక్ రిపోర్ట్.. ఫేక్ పార్టీ.. ఫేక్ లీడర్ -
గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '31 లక్షల మందికి ఇళ్లు కట్టే శాఖకి సీఎం జగన్ నన్ను మంత్రిగా చేశారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. విశాఖపట్నంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్‌పై తొలి సంతకం చేశాం. లక్ష మంది విశాఖ పేదలకు ఇళ్లు కట్టిస్తాం. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్‌లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో జగనన్నకి పేదలు కష్టాలు చెప్పారు. ఆ కష్టాలను చూసి ఈ రోజు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పేదలకు సేచురషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారు. సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనన్న' అని మంత్రి జోగి రమేష్ అన్నారు. చదవండి: (లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు) -
జగనన్న కాలనీలను పరిశీలించిన మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు
-
స్వీయ నిర్బంధంలోకి మహారాష్ట్ర మంత్రి
ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సోమవారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఓ పోలీస్ అధికారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన కారణంగా జితేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కోసం జరిపిన తొలి పరీక్షలో ఫలితం నెగెటివ్ వచ్చిందని, కానీ ముందు జాగ్రత్త చర్యగా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు జితేంద్ర ప్రకటించారు. ‘‘నాతోపాటు ప్రయాణించే పోలీస్ అధికారి ఒకరు కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నాను’అని జితేంద్ర పేర్కొన్నారు. తదుపరి పరీక్షల్లో నెగెటివ్ వస్తే మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతానని తెలిపారు. -
అందుకే నాకు ఈ శాఖ ఇచ్చారేమో..
సాక్షి, తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఇంట్లో ఉండే మహిళల పేరు మీద పట్టాలను ఇస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన గృహనిర్మాణ శాఖను నామీద నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ నియోజవకర్గంలో 300 ఎకరాల్లో 3000 మందికి పైగా ఇళ్లు కట్టించాను. నేను చేసిన హౌసింగ్ అభివృద్ధి చూసి వైఎస్ జగన్ నిన్ను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. అందుకే నాకు గృహనిర్మాణ శాఖ ఇచ్చారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నవరత్నాలలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా పాటిస్తామ’ని వెల్లడించారు. -
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇంద్రకరణ్
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీఐడీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ దేవాదాయ, గృహ, న్యాయశాఖ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. న్యాయశాఖలో కేసులు త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు ఘనం నిర్వహిస్తామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్ రెడ్డికి ఉన్నతాధికారులు,టీఆర్ఎస్ నాయకులు, అభిమానాలు అభినందనలు తెలిపారు.