
ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సోమవారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఓ పోలీస్ అధికారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన కారణంగా జితేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కోసం జరిపిన తొలి పరీక్షలో ఫలితం నెగెటివ్ వచ్చిందని, కానీ ముందు జాగ్రత్త చర్యగా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు జితేంద్ర ప్రకటించారు. ‘‘నాతోపాటు ప్రయాణించే పోలీస్ అధికారి ఒకరు కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నాను’అని జితేంద్ర పేర్కొన్నారు. తదుపరి పరీక్షల్లో నెగెటివ్ వస్తే మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment