Jitendra Awhad
-
శ్రీరాముడిపై NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు
-
శరద్ పవార్ రాజీనామా: మరో ఎన్సీపీ నేత షాకింగ్ నిర్ణయం!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సీనియర్ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే పార్టీలో అనూహ్యా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన రాజీనామా తదనంతరం పలువురు నేతల రాజీనామా పర్వం పెరిగింది. ఈ మేరకు ఆ మరుసటి రోజే ఎన్సీపీ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన తోపాటు పలువురు ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవద్ మాట్లాడుతూ..తాను జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని తన రాజీనామాని ఎన్సీపీ నేత అధినేత శరద్ పవార్‌కి పంపినట్లు కూడా తెలిపారు. ఎన్సీప్ పార్టీ చీఫ్ శరద్ పవార్ రాజీనామా ప్రకటన తదనందరం థానేలోని అన్ని ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా శరద్ పవార్ తన ఆత్మకథ లోక్ మేజ్ సంగతి రెండవ ఎడిషన్ ప్రారంభోత్సవంలో తాను ఎన్సీపీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీచేయనని అన్నారు. అంతేగాదు తన రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు ఉందని, ఈ మూడేళ్లో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు పవార్. (చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో) -
'హర్ హర్ మహాదేవ్' ప్రదర్శన నిలిపివేత.. ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరాఠీ చిత్రం ‘హర్ హర్ మహదేవ్’ సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించినందుకు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీపీ నేత అవద్, తన అనుచరులతో కలిసి థానే నగరంలోని ఓ మల్టిప్లెక్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. ‘హర్ హర్ మహాదేవ్’ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపిస్తూ స్క్రీనింగ్‌ను అడ్డుకున్నారు. అంతేగాక సినిమా చూస్తున్న ప్రేక్షకులపై దాడి చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. హర్ హర్ మహాదేవ్ చూసినందుకు సినిమా ప్రేక్షకులను కొట్టడాన్ని సహించేది లేదని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తాను సినిమా చూడలేదని, ఈ వివాదం గురించి తెలియదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు అనుమతి ఉంది కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని ఫడ్నవీస్ హెచ్చరించారు. చదవండి: Gyanvapi Mosque Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం -
మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్ తన కూతురి వివాహాన్ని సాదాసీదాగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన తన కూతురు నతాషా అవ్హాడ్‌కు రిజిస్టర్ వివాహం జరిపించారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా జరిగిన ఈ పెళ్లికి కేవలం ఆయన కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. మంత్రి హోదాలో ఉండి కూడా తన ఏకైక కూతురి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించిన మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. చదవండి: (కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి) -
కార్లు నడపాలా, కాల్చేయా?: మంత్రి
ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవాద్ ముంబైలో పెరుగుతున్న ఇంధన ధరలపై సరదాగా స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ను కార్లో ఇంధనం నింపాక బిల్లును తనిఖీ చేయడం లేదా అని శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను రోజు రోజుకు పెంచుతుండటంతో బిగ్‌బీ గతంలో చేసిన ట్వీట్‌పై ఈ సందర్భంగా మంత్రి స్పందించారు. 2012లో పెట్రోల్ ధరలు మిన్నంటడంతో బిగ్‌బీ సరదాగా చేసిన ఓ ట్వీట్‌ను మంత్రి అవాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘పెట్రోల్ ధర లీటర్‌పై 7.5 రూపాయలు పెరగడంతో అసహనంతో ఉన్న ఓ ముంబైవాసి పెట్రోల్ పంప్‌కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది అతడిని ఎంత పెట్రోల్ కొట్టాలి సార్ అని అడగ్గా.. ఆ ముంబై వాసి 2-4 రూపాయల పెట్రోల్‌ను కారుపై కొట్టండి దాన్ని తగలబెట్టేస్తా’ అంటూ అగ్రహం వ్యక్తం చేసినట్లు బిగ్‌బీ సరదాగా ట్వీట్ చేశాడు. (‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్‌బీ ట్వీట్) ప్రస్తుత పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో మంత్రి అవాద్ ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ‘‘మీ కారులో ఇంధనం నింపాక బిల్లు చూడటం లేదా? ఇప్పుడు మీరు మాట్లాడే సమయం వచ్చింది. పక్షపాతం వహించకుండా మాట్లాడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు పెరిగిన ఇంధన ధరల చూస్తే కార్లు నడపాలా, లేదా కాల్చేయాలో అర్థం కావడం లేదు’’ అంటూ ఆయన రాసుకొచ్చారు. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 2011 మే 16న పెట్రోల్ ధరలు పెంచడానికి ముందు చేసిన ట్వీట్‌ను కూడా మంత్రి గురువారం షేర్ చేశారు. ‘‘ఈ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. పెట్రోల్ పంప్ ముందు క్యూ కడుతూ ప్రజలు ముంబై రోడ్లపైకి వచ్చారు’’ అంటూ చేసిన ట్వీట్‌కు మంత్రి ‘‘ఏంటీ మీరు ట్విటర్లో యాక్టివ్‌గా లేరా?, న్యూస్ పేపర్ ఫాలో అవడం లేదా, లేక కార్లను వాడటం మానేశారా?’’ అంటూ సరదాగా చమత్కరించారు. కాగా ముంబైలో ఇవాళ లీటరు పెట్రోల్ 86.91 రూపాయలు, లీటరు డీజిల్ 78.51 రూపాయలు ఉంది. (మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే) R u not active on @Twitter ... Have u stopped using cars.. Dnt u read news paper....@akshaykumar .... There has been a steep #PetrolDieselPriceHike just for Ur information https://t.co/f5Dr1UPFhs — Dr.Jitendra Awhad (@Awhadspeaks) June 25, 2020 -
‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది’
ముంబై: నిర్లక్ష్యపూరిత ధోరణి వల్లే తాను కరోనా వైరస్ బారిన పడ్డట్లు వెల్లడించారు మహారాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర అవద్. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఆయన థానే జిల్లాకు పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారి నుంచి మంత్రికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దాంతో ఈ నెల ప్రారంభంలో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందారు. రెండు రోజులు వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. కరోనా నుంచి కోలుకుని ఇటివలే డిశ్చార్జ్ అయ్యారు జితేంద్ర అవద్. ఈ క్రమంలో తాజాగా డెవలపర్స్ లాబీ బీడీఏ నిర్వహించిన ఓ ఆన్లైన్ సెమినార్లో పాల్గొన్నారు జితేంద్ర అవద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాధి సోకింది. నేను ప్రజల సలహాలు పాటించలేదు. అందుకే కరోనా వలలో చిక్కాను. కానీ నా సంకల్ప బలంతో త్వరగానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ఇతర ఐఏఎస్ అధికారులతో పోల్చుకుంటే నేను చాలా అదృష్టవంతుడుని. ప్లాస్మా థెరపీ, ఇంపోర్టెడ్ మందుల అవసరం లేకుండానే వ్యాధి నుంచి కోలుకున్నాను. ప్రస్తుతం నా హిమోగ్లోబిన్ లెవల్ బాగానే పెరిగింది. ఇందుకోసం కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నాను’ అన్నారు జితేంద్ర. (మహారాష్ట్రలో మంత్రిని కూడా వదల్లేదు..) -
పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరువేలు దాటడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతోంది. మంత్రికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రితో పాటు కుటుంబ సభ్యులంతా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా వాందరికి కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న మంత్రి జితేంద్ర అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ వారం తరువాత ఆ పోలీసు అధికారికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా పోలీసు నుంచి జితేంద్రకు వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరికొంత మందిని వైద్య పరీక్షలుకు తలించారు. మంత్రికి సమీపంగా మెలిగిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. (సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా తప్పదా?) అయితే జితేంద్రతో పాటు ఆయన సమీప బంధువులకు కూడా వైరస్సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా వైరస్ సోకిన పోలీసు అధికారి కదలికలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారిని గుర్తించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని, మత ప్రార్థనలకు వెళ్లిన వారి ప్రాంతాల్లో ఆయన ఎక్కువగా పర్యటించారని పోలీస్ట్ స్టేషన్ సిబ్బంది చెబుతోంది. -
స్వీయ నిర్బంధంలోకి మహారాష్ట్ర మంత్రి
ముంబై: మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సోమవారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఓ పోలీస్ అధికారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన కారణంగా జితేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కోసం జరిపిన తొలి పరీక్షలో ఫలితం నెగెటివ్ వచ్చిందని, కానీ ముందు జాగ్రత్త చర్యగా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు జితేంద్ర ప్రకటించారు. ‘‘నాతోపాటు ప్రయాణించే పోలీస్ అధికారి ఒకరు కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నాను’అని జితేంద్ర పేర్కొన్నారు. తదుపరి పరీక్షల్లో నెగెటివ్ వస్తే మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతానని తెలిపారు. -
మహారాష్ట్రలో మంత్రిని కూడా వదల్లేదు..
సాక్షి, ముంబై : దేశంలోనే అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ర్టలో కరోనా వైరస్ సెగ ఓ మంత్రిని తాకింది. సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ తాను స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గం ముంబ్రా- కల్వ లో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ఆరా తీయడానికి గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ ఓ పోలీసు అధికారితో సమావేశమయ్యారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. దీంతో మంత్రి జితేంద్ర.. స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పోలీసు అధికారితో జరిపిన సమీక్షా సమావేశాన్ని కవర్ చేసిన మీడియా బృందాన్ని కూడా సెల్ప్ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించిరు. ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 82 కరోనా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2064 కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. -
అమ్మాయిని కిడ్నాప్ చేస్తా : బీజేపీ ఎమ్మెల్యే
ముంబై : ప్రేమ రెండు మనసులకు సంబంధించినది. ఒక అబ్బాయి తాను ఇష్టపడే అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేశాక, ఆ ప్రేమను ఆమె తిరస్కరించవచ్చు, అంగీకరించవచ్చు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి అబ్బాయికి ఉంటుంది. కానీ గటోకోపర్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఒక అమ్మాయిని ప్రేమించి తన ప్రేమను వ్యక్తం చేశాకా... అబ్బాయిని తిరస్కరిస్తే... అలాంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసైనా సరే ఆ అబ్బాయికిచ్చే వివాహం జరిపిస్తానంటూ రామ్ కదం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా.. అబ్బాయిల కోసం ఆమెను కిడ్నాప్ చేస్తా అనడం వివాదాస్పదంగా మారింది. కదం ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా చేశారు. అంతే కాకుండా వారికి సాయం చేసేందుకు, ఏ సమయంలోనైనా సరే తనకు ఒక్క ఫోన్ కాల్ కొట్టడంటూ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తామని తెలిపారు. "మీకు సాయం కావాల్సి వస్తే, నాకు ఫోన్ చేయండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను కానీ అమ్మాయి నా ప్రేమను తిరస్కరిస్తోంది అని చెప్పి సహాయం అడగండి. నేను తప్పకుండా సహాయం చేస్తాను. అదే సమయంలో మీ తల్లిదండ్రులను కూడా పిలిపించాలి. అమ్మాయి వారికి నచ్చితే నేనే కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తా. ఇక నా ఫోన్ నెంబర్ తీసుకోండి" అంటూ దహీ హండీ(ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కదం అన్నారు. రామ్ కదం చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఎన్సీపీ జితేంద్ర అవధ్ ట్విటర్లో షేర్ చేశారు. ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. కదం చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభ్యులు ఇలా ఆలోచిస్తే, మహారాష్ట్రలో మహిళల రక్షణ ఎక్కడుంటుందని జితేంద్ర ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడం, నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రామ్ కదం ఆత్మరక్షణలో పడిపోయారు. ముందుగా పిల్లలు తల్లిదండ్రులకు తెలపాలని మాత్రమే తాను చెప్పినట్లు రామ్ కదం అంటున్నారు. రాజకీయ కుట్రతో కొందరు తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామ్ కదం ఏటా గట్కోపర్‌లో దహీ హండీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవుతుంటారు. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. बेताल वक्तव्य करणारा भाजपा नेत्यांमध्ये आणखी ऐकाची भर.. रक्षाबंधन , दहिकाला उत्सव या पवित्र सणा दिवशी आमदाराने तोडले आपल्या अकलेचे तारे ! कशा राहतील यांचा राज्यात महिला सुरक्षित? pic.twitter.com/Z5JAx5ewrN — Dr.Jitendra Awhad (@Awhadspeaks) September 4, 2018 -
దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే
-
దగ్గరుండి కొట్టించిన ఎమ్మెల్యే
థానె: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిపై యువతితో దాడి చేయించారు. థానెలోని ఆయనకార్యాలయంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. జితేంద్ర దగ్గరుండి యువకుడిని యువతితో కొట్టించినట్టు వీడియోలోని దృశ్యాల్లో స్పష్టంగా కనబడింది. తనను ప్రేమించమని యువకుడు వేధిస్తున్నాడని జితేంద్రకు యువతి ఫిర్యాదు చేసింది. అతడికి గుణపాఠం చెప్పాలని తన కార్యాలయానికి పిలిపించుకుని యువతితో కొట్టించారు. అయితే తాను చేసిందాట్లో తప్పేంలేదని జితేంద్ర సమర్థించుకున్నారు. ‘నేను తప్పుచేసినట్టు మీడియా భావిస్తే నన్ను ఉరి తీయండ’ని ఆవేశంగా అన్నారు. ఫిర్యాదు చేసిన యువతి తన ఇంటికి సమీపంలోని మురికివాడలో నివసిస్తోందని చెప్పారు. యువకుడి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. యువకుడిపై వేధింపుల కేసు నమోదు చేశారు. జితేంద్ర వ్యతిరేకంగా ఎటువంటి కేసు పెట్టలేదు. -
ఎన్సీపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేత
సాక్షి, ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ సస్పెన్షన్‌ను సోమవారం ఉపసంహరించారు. నాగపూర్‌లో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో గత శుక్రవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతుండగా కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆటం కం సృష్టించారు. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. కొద్ది సేపటి కి సభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ ఇరుపార్టీల నాయకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ గందరగోళం మధ్య అవ్హాడ్ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న స్పీకర్ హరిబావు భాగడే ఆయన్ని శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ నాయకులు ఆ రోజు (శుక్రవారం) శాసనసభ కార్యకలాపాలను బహిష్కరించి బయటకు వెళ్లారు. -
ఒరిగేదేమీ లేదు: బీజేపీ
ముంబై: గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణతో కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదని బీజేపీ విమర్శించింది. మంత్రులను మార్చినంతమాత్రాన ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ముంబై విభాగం అధ్యక్షుడు ఆశిష్ శేలార్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసిందో ప్రజలకు తెలుసని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగా వైద్యవిద్యాశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన జితేంద్ర అవ్హాడ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి బీజేపీ, శివసేనలు ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు శేలార్ సమాధానమిస్తూ... ప్రతిపక్షాల తరఫున తాను హాజరయ్యానని చెప్పారు. తమ పార్టీ నేతలు పర్యటనల్లో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, అయితే అంతా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు, ఎన్సీపీకి నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం వరించింది. మిగతా నలభై స్థానాల్లో ఆ పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. మళ్లీ అదే తరహా ఫలితాలు పునరావృతమవుతాయని ప్రతిపక్ష బీజేపీ, శివసేనలు చెబుతున్నాయి. -
ఒక్కరితో సరి!
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలలే ఉన్నా ఎన్నికల్లో విజయం కోసం మంత్రివ ర్గ విస్తరణ చేపడుతున్నట్లు హంగామా చేసిన కాంగ్రెస్, ఎన్సీపీల ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఊరించి.. ఉసూరుమనిపించింది. మార్పులు, చేర్పులతో కలిసి కనీసం నలుగురైదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని భావించినా కేవలం ఒక్కరితో మాత్రమే సరి అనిపించారు. వైద్యవిద్యాశాఖ మంత్రిగా అవ్హాడ్.. వైద్యవిద్యాశాఖ మంత్రిగా కల్వా-ముంబ్రా యువ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్నారాయణన్, అవ్హాడ్తో ప్రమాణ స్వీకారం చేయించి పదవీ బాధ్యతలు అప్పగించారు. నందుర్బార్ జిల్లాకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు విజయ్‌కుమార్ గావిత్ బీజేపీ బాట పట్టడంతో ఆయనను పార్టీలోంచి వెలివేయాల్సి వచ్చింది. దీంతో గావిత్ వద్ద ఉన్న వైద్యవిద్యాశాఖమంత్రి పదవి ఖాళీ కావడంతో దానిని అవ్హాడ్‌కు కట్టబెట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఫౌజియాఖాన్పై వేటు లేనట్లే... ఆరోగ్య, సాంస్కృతికశాఖ మంత్రి ఫౌజియాఖాన్ (ఎమ్మెల్సీ) పదవీ కాలం కూడా ముగిసింది. దీంతోపాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థికి ఫౌజియాఖాన్ సహకరించలేదన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆమెకు మరోసారి మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు సన్నగిల్లినట్టేనని అంతా భావించారు. ఈ పదవిని విజయ్‌కుమార్ గావిత్ సొంత సోదరుడు శరద్ గావిత్‌కు అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఎలాంటి మార్పులు చేయకూడదని, మంత్రి పదవిలో ఆమెనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగానే కాంగ్రెస్ కోటా.. కాంగ్రెస్ కోటాలోని మూడు పదవులు కూడా భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఈ మూడు స్థానాలను ఎవరితోనూ భర్తీ చేయలేదు. దీంతో కాంగ్రెస్ వాటాలోని మూడు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని త్వరలో భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలు కొందరు తెలిపారు. ఈ పదవులను ఆశిస్తున్న నాయకుల్లో మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, వసంత్ పుర్వే తదితరులు ఉన్నారు. నాలుగైదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే మంత్రివర్గ విస్తరణ చేపట్టినా కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా వారిలో నిరుత్సాహాన్ని నింపినట్లే అయిందని విశ్లేషకులు చెబుతున్నారు.