సాక్షి, ముంబై : దేశంలోనే అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ర్టలో కరోనా వైరస్ సెగ ఓ మంత్రిని తాకింది. సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ తాను స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గం ముంబ్రా- కల్వ లో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ఆరా తీయడానికి గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ ఓ పోలీసు అధికారితో సమావేశమయ్యారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
దీంతో మంత్రి జితేంద్ర.. స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పోలీసు అధికారితో జరిపిన సమీక్షా సమావేశాన్ని కవర్ చేసిన మీడియా బృందాన్ని కూడా సెల్ప్ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా సూచించిరు. ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 82 కరోనా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2064 కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment