నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సీనియర్ నాయకుడు శరద్ పవార్ జాతీయాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే పార్టీలో అనూహ్యా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన రాజీనామా తదనంతరం పలువురు నేతల రాజీనామా పర్వం పెరిగింది. ఈ మేరకు ఆ మరుసటి రోజే ఎన్సీపీ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవద్ తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన తోపాటు పలువురు ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేశారు.
ఈ క్రమంలో ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవద్ మాట్లాడుతూ..తాను జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశానని తన రాజీనామాని ఎన్సీపీ నేత అధినేత శరద్ పవార్‌కి పంపినట్లు కూడా తెలిపారు. ఎన్సీప్ పార్టీ చీఫ్ శరద్ పవార్ రాజీనామా ప్రకటన తదనందరం థానేలోని అన్ని ఆఫీస్ బేరర్లు కూడా రాజీనామా చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా శరద్ పవార్ తన ఆత్మకథ లోక్ మేజ్ సంగతి రెండవ ఎడిషన్ ప్రారంభోత్సవంలో తాను ఎన్సీపీ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎన్నికల్లో పోటీచేయనని అన్నారు. అంతేగాదు తన రాజ్యసభ పదవీకాలం మూడేళ్లు ఉందని, ఈ మూడేళ్లో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సమస్యలపై దృష్టిసారిస్తానని చెప్పుకొచ్చారు పవార్.
(చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో)
Comments
Please login to add a commentAdd a comment