
సాక్షి, తాడేపల్లి: గృహనిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '31 లక్షల మందికి ఇళ్లు కట్టే శాఖకి సీఎం జగన్ నన్ను మంత్రిగా చేశారు. పేదవాడి సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేస్తున్నారు. విశాఖపట్నంలో అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం ఫైల్‌పై తొలి సంతకం చేశాం.
లక్ష మంది విశాఖ పేదలకు ఇళ్లు కట్టిస్తాం. గతంలో ఇంటి నిర్మాణానికి 90 సిమెంట్ బ్యాగ్‌లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు 140 సిమెంట్ బస్తాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పాదయాత్రలో ప్రతి గ్రామంలో జగనన్నకి పేదలు కష్టాలు చెప్పారు. ఆ కష్టాలను చూసి ఈ రోజు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పేదలకు సేచురషన్ పద్దతిలో ఇళ్లు కట్టిస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం జగన్ అధిక గుర్తింపు ఇచ్చారు. సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనన్న' అని మంత్రి జోగి రమేష్ అన్నారు.
చదవండి: (లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు)
Comments
Please login to add a commentAdd a comment