
సాక్షి, తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఇంట్లో ఉండే మహిళల పేరు మీద పట్టాలను ఇస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన గృహనిర్మాణ శాఖను నామీద నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ నియోజవకర్గంలో 300 ఎకరాల్లో 3000 మందికి పైగా ఇళ్లు కట్టించాను. నేను చేసిన హౌసింగ్ అభివృద్ధి చూసి వైఎస్ జగన్ నిన్ను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. అందుకే నాకు గృహనిర్మాణ శాఖ ఇచ్చారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నవరత్నాలలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా పాటిస్తామ’ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment