Sri ranganatha raju
-
ఎగ్జిట్ పోల్స్ పై ఆచంట ఎమ్మెల్యే రియాక్షన్
-
ఆచంట నియోజకవర్గంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం
-
తిరుమలకు రంగనాథుడు అలా వచ్చాడు!
1328వ సంవత్సరంలో శ్రీరంగంపై ముస్లింల దండయాత్ర జరిగింది. ఆ సమయంలో శ్రీరంగంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవమూర్తులను ఉదయమే కావేరి నదికి తీసుకువెళ్ళి నది మధ్యలో తిరుమంజనాది సేవలను భక్తుల సమక్షంలో నిర్వహించేవారు. సాయంత్రం వరకు స్వామి వారికి సేవలు నిర్వహించి అటు తరువాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకునేవారు. ఇలా శ్రీరంగనాథుడి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మహమ్మద్ బిన్ తుగ్లక్ అశ్విక సేనలు అకస్మాత్తుగా కన్ననూరు వైపు నుంచి కావేరి ఒడ్డుకు చేరుకున్నాయి. దీనితో సైన్యం వీరిదగ్గరకు చేరుకునేలోపు స్వామివారి విగ్రహాలను రక్షించాలని భావించిన భక్తులు బలిష్ఠుడైన లోకాచారి అనే యువకుడి సారథ్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి చిన్నపల్లకిలో స్వామివారిని వేంచేపు చేసి రహదారి గుండా పుదుక్కొటై్ట్టకి పంపారు. దారిలో తిరుమలకు వెళ్తే సురక్షితమని భావించి అటు వైపుగా బయలుదేరాలనుకున్నాడు లోకాచారి. అయితే నేరుగా తిరుపతికి వెళ్తే ముస్లింల బారిన పడతామన్న భయంతో తెరుకనంబి, మైసూరు మీదుగా చుట్టూ తిరిగి ముఖ్య రహదారులలో కాకుండా అడ్డదారులలో ప్రయాణం చేస్తూ తిరుపతికి చేరుకున్నాడు. ఆ సమయంలో తిరుపతి సింగమనాయకుడు పాలనలో వుండేది. అలా తిరుమల చేరుకున్న శ్రీరంగనాథుడు శ్రీవారి ఆలయంలో ఆగ్నేయంగా వున్న మండపంలో విడిది చేసి శ్రీవారి అతిథిగా సేవలందుకున్నారు. శ్రీనివాసునికి వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహిస్తూ వుంటే శ్రీరంగనాథునికి పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించేవారు. దీనితో శ్రీవైష్ణవులే కాక దక్షిణాది భక్తులందరూ శ్రీనివాసుని శ్రీరంగనాథుని దర్శనానికి పెద్దసంఖ్యలో తిరుమలకు తరలి రావడం మొదలుపెట్టారు. అదేరోజులలో హిందూరాజులు, సామంతులు చేతులు కలిపి మథుర సుల్తానులపై దండెత్తి వారిని ఓడించారు. అదే సమయంలో హరిహర బుక్కరాయల నాయకత్వంలో విజయనగర సామ్రాజ్యానికి పునాదులు మొదలయ్యాయి. 1370 సంవత్సరానికి తిరుమల–తిరుపతి ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యం బలంగా ఏర్పడింది. దక్షిణ దేశమంతా కూడా వీరి పరిపాలనలో సుభిక్షం, సురక్షితమైంది. దీనితో హిందువులలో ధైర్యం, శాంతిభద్రతలపై నమ్మకం ఏర్పడ్డాయి. 1371లో అంటే 43 సంవత్సరాల తరువాత తిరుమల నుంచి శ్రీరంగానికి శ్రీరంగనాథన్ తిరుగు ప్రయాణం వైభవంగా జరిగింది. అంత గొడవల్లో కూడా ముస్లింల విధ్వంసానికి గురికాని దేవాలయం ఏదైనా వుంది అంటే అది తిరుమల ఆలయం మాత్రమే. ముస్లింలు కొండవైపు కూడా రాలేదు. దీనికి కారణం స్వామివారి మహిమే అన్న భావన భక్తులందరిలో కలిగింది. తమిళ ప్రాంతం నుంచి భక్తులు తిరుమలకు రావడం అప్పటి నుంచే మొదలైంది. ఆధ్యాత్మిక భావాలకు తిరుమల ఒక ఆసరాగా నిలిచిపోయింది. -
పేదల గుండెల్లో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘స్వాతంత్య్రానంతరం ఇందిరమ్మ, ఎన్టీఆర్, డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్సార్ హయాంలో 23 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఇళ్ల పట్టాల కోసం సెంటు భూమి సేకరించలేదు. పార్టీలకతీతంగా ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు నిర్మించాలన్న తపనతో సీఎం జగన్ 30.76 లక్షల మంది ఆడపడుచులకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ద్వారా రూ.4 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టిస్తున్నారు. పేదల గుండెల్లో నిలిచిపోతారు’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన సమాధానమిస్తూ మాట్లాడారు. తొలి దశలో రూ.28 వేల కోట్లతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే 11.65 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ కాగా, 3 లక్షల ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గృహ నిర్మాణంలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. 40 పార్టీలు కలిసొచ్చినా భయం లేదు నాలుగు పార్టీలు కాదు.. 40 పార్టీలు కలిసొచ్చి పోటీ చేసినా.. 20 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉంటారు. 80 శాతం మంది ప్రజలు, దేవుడి ఆశీర్వాదం మా నాయకుడికే ఉంది. ఆయన్ను ఎదుర్కొనే సత్తా ఏ ఒక్కరికీ లేదు. తెలంగాణాలో 5.72 లక్షల ఇళ్లు, తమిళనాడులో 5 లక్షల ఇళ్లు, కేరళలో 5.19 లక్షల ఇళ్లు, కర్ణాటకలో లక్ష ఇళ్లు నిర్మిస్తే ఏపీలో ఏకంగా 30.76 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. మా చిన్నప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే నేటికీ చెప్పుకుంటున్నాం. ఇకపై మరో వెయ్యేళ్లు వైఎస్ జగన్ గురించి చెబుతారు. నేడు జగనన్న ఇంటిని చూపించి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. – బియ్యపు మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే -
శ్రీరామవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగనాథ రాజు
-
సంక్షేమ ప్రభుత్వానికే ప్రజలు ఓటు వేశారు
-
తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రి: శ్రీరంగనాథరాజు
విజయవాడ: తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారునికి 40 శాతం తక్కువ ధరకే సామాగ్రిని అందిస్తున్నట్లు, ఇళ్ల లే ఔట్ల దగ్గరకే మెటీరియల్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.వేల కోట్లు ఆదా చేయడంతో పాటు అదనంగా ఇంటి నిర్మాణానికి పేదలకు పావలా వడ్డీకి రుణం ఇప్పిస్తున్నామన్నారు. చదవండి: ఓరి భగవంతుడా .. కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపే.. లబ్ధిదారులకు ఆప్షన్ లు బలవంతంగా మారుస్తున్నారన్నది తప్పుడు ప్రచారమని, వారికి ఎలా కావాలంటే అలా ఇళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 25 నుంచి మూడో కేటగిరి ఇళ్ల నిర్మాణం చేపడతున్నట్లు తెలిపారు. -
ప్రతి జగనన్న కాలనీకి నోడల్ అధికారి నియామకం
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు ఉండాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం ఆయన విశాఖ జిల్లాలో జగనన్న కాలనీల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంజూరు ఉత్తర్వులతోపాటు నిధులను, మెటీరియల్‌ను కూడా ఇస్తున్నట్లు వివరించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రతి కాలనీకి మండల స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి సుమారు రూ.30 వేల విలువైన ఇసుకను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
సామూహిక ఇళ్ల శంకుస్థాపనలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంపై మంత్రి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 1, 3, 4వ తేదీల్లో జరిగే సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఈనెల 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల గృహాలకు శంకుస్థాపన పూర్తికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ నాటికి మొదటి దశలో 15.6 లక్షల గృహాలకు శంకుస్థాపనలు పూర్తి చేసి, 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, చీఫ్ ఇంజనీర్ పి.శ్రీరాములు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి లే అవుట్‌ను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం
ఒంగోలు అర్బన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు నిర్మించే ఇళ్ల తాలూకు లే అవుట్లను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలతో కలిసి మంత్రి రంగనాథరాజు మీడియాతో మాట్లాడారు. ప్రతి లే అవుట్లో తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతుల్ని అండర్ గ్రౌండ్ విధానంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద లే అవుట్లు ఉన్న చోట్ల బస్టాండ్‌తో పాటు అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 2, 3, 4, 5 తేదీల్లో భారీగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించి నిర్మాణాలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం: మంత్రి సురేష్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖ్యమని చెప్పారు. అందువల్లే ముందునుంచీ రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపిందని, పరీక్షల రద్దును కేవలం రెండో ఆప్షన్‌గానే చూశామని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ స్పష్టం చేశామన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసే నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటన్నారు. -
‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని మంత్రి శ్రీరంగనాథ రాజు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సాఆర్ జగనన్న కాలనీలను .. మోడల్ కాలనీలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా, ఏపీలో రూ.33 వేల కోట్లతో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఈపథకంలో అర్హులై ఉండి కూడా.. ఇంటిపట్టా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీలోని ప్రతి గ్రామంలో పార్టీల కతీతంగా, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి: ‘‘స్పందన"పై కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
‘ఏపీలో మరో 17వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయి’
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో మరో 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని మంత్రి శ్రీ రంగనాథ రాజు తెలిపారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి రంగనాథరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్ధికవృద్ధి పెరుగుతుందని, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు అవుతాయని భరోసానిచ్చారు. చదవండి: ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు -
రేపు వైఎస్సార్ జగనన్న ఇళ్ల ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: రేపు(గురువారం)వైఎస్సార్–జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. 28 లక్షల 30 వేల మందికి పక్కాఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడతగా 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. రూ.51 వేల కోట్లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: మాజీ సీఎం సిద్ద రామయ్యకు అస్వస్థత -
‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’
సాక్షి, అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదని, ఆయన్ని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, సీఎంను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ప్రజలు సహించరని అన్నారు. ఎంపీ రఘురామ అరెస్ట్ అనంతరం మంత్రి బాలినేని స్పందించారు. రఘురామలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోందంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గానికి వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీ ఎక్కడో ఉండి తన ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించడం సరైంది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: శ్రీరంగనాథరాజు ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు గత 13 నెలలుగా నరసాపురం పార్లమెంట్ ప్రజలను వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో మకాం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. నరసాపురం పరిధిలో నమోదైన కేసులపై కూడా పోలీసులు విచారణ చేయాలి. రఘురామకృష్ణరాజుపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. చదవండి : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయ శాఖలతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు అవార్డుల ప్రదానంపై గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. సమీక్షలోని ముఖ్యంశాలు.. ⇔ సంక్షేమ కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేసి, సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వాలంటీర్లకు సత్కారం చేయాలని తెలిపారు. ⇔ ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికిపైగా సేవలు అందించిన.. 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర 4వేల మంది వాలంటీర్లకు సేవా రత్న అందించాలన్నారు. ⇔ ప్రతి మండలానికి ఐదుగురు, ప్రతి మున్సిపాలిటీకి ఐదుగురు, ప్రతి కార్పొరేషన్ నుంచి 10 మంది ఎంపిక చేయాలన్నారు. ⇔ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సేవా వజ్రాలుగా ఎంపిక చేసి, 875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం చేయాలని తెలిపారు. ⇔ సేవామిత్రలకు రూ.10వేల నగదు, సేవా రత్నాలకు రూ. 20వేలు, సేవా వజ్రాలకు రూ.30వేల నగదు ప్రోత్సాహకం అందించాలని తెలిపారు. ⇔ తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న వారికి.. నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ⇔ స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని.. తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్ ⇔ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా .. నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం జగన్ ⇔ కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ⇔ ఇళ్లనిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని తెలిపారు. ⇔ ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టంగా తెలిపారు. ⇔ తయారు చేసిన డిజైన్లను సీఎం పరిశీలించి సూచనలు చేశారు. ⇔ జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వసతుల కల్పనపై కూడా సీఎం జగన్ చర్చించారు. ⇔ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. -
నిమ్మగడ్డ తీరుపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు ‘‘కరోనా సెకండ్ వేవ్ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్ వెనక కుట్ర కోణం ఉంది’’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇక నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ‘‘ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడమేంటి. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యం’’ అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా’’ అని మండిపడ్డారు.(చదవండి: సుప్రీం కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్) నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభ్యర్థనను ఎస్ఈసీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కాదని నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. -
చంద్రబాబు చరిత్ర హీనుడు..
సాక్షి, పశ్చిమగోదావరి: పేదల ఇళ్ల పట్టాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. ఆచంట నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతలో భాగంగా రెండవ రోజు పెనుగొండ, దొంగగూడెం, మునమర్రు రోడ్ , వడలి గ్రామాల్లో 1,194 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. (చదవండి: ‘సినిమాల్లో వకిల్ సాబ్.. బయట పకీర్ సాబ్’) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టాలివ్వడమే కాకుండా.. ఇళ్లు నిర్మించుకునేందుకు లక్షా ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తుందని తెలిపారు. శ్రీకాళహస్తిలో 15 వేల మందికి ఒకే చోట ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. పేదలకు ఇళ్ల పట్టాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లు అనుభవం ఉందంటూ హైకోర్టులో వేలాది కేసులు వేసి, 25న పేదలకు పట్టాలు ఇస్తుంటే 24 తేదీన కూడా కోర్టులో స్టే వేయించిన ఘనత చంద్రబాబుకే దక్కతుందని ఆయన ధ్వజమెత్తారు. 14 ఏళ్లలో ఒక్క సెంటు భూమి కూడా సేకరించి అవ్వలేని చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శలు గుప్పించారు (చదవండి: ‘అది చిడతల నాయుడికే చెల్లింది’) అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి సకల సౌకర్యాలతో 7 వేల కోట్లతో ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీటి ట్యాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆచంట నియోజకవర్గంలో 54 వేల కుటుంబాలు ఉంటే, 18 వేల ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 68 వేల ఎకరాల్లో భూమిని 12 వేల కోట్ల రూపాయల భూముల లే అవుట్లు నిర్మించి ఇచ్చామన్నారు. 175 నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. -
లంక గ్రామాలను పరిశీలించిన మంత్రి మేకతోటి సుచరిత
-
లంక గ్రామాల్లో మంత్రుల పర్యటన
సాక్షి, గుంటూరు: బంగాళఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు పొంగిపోర్లతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు, వరదలకు పంటపొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందం అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. వరదలకు నీట మునిగిన పంటపొలాలను, లంక గ్రామాలను పరిశీలించారు. గ్రామ ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రుతో పాటు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉన్నారు. అదే విధంగా మంత్రులు, అధికారులు చిర్రావూరు, బొమ్మ వాణి పాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, వెల్లటూరు పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి రూ. కోటి విరాళం
సాక్షి, గుంటూరు: మహమ్మారి కోవిడ్-19 సమయంలో గుంటూరు జీజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఆయన గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీజీహెచ్ తొమ్మిది జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. ఆస్పత్రిలో పేషెంట్లతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దాని కోసం వ్యక్తిగతంగా జీజీహెచ్‌కు రూ.కోటి విరాళం అందజేస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కోవిడ్ రోగులకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని, నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా రోగులకు తగినంత వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని వివరించారు. -
రాజకీయ కుట్రతోనే దాడులు: వెల్లంపల్లి
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై రాజకీయ కుట్ర సాగుతుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు సోమవారం ఆయన విశాఖ శారద పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యమంత్రి చేపట్టే సంక్షేమ పథకాలకు ఆశీస్సులు కావాలని స్వామిని కోరామని తెలిపారు. కుట్రలతోనే ఆలయాలపై దాడులు జరిగాయని.. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. రాజకీయ కుట్రతో ప్రజలను అయోమయం చేసే ఘటనలు జరిగాయన్నారు. ఈ కుట్రలను ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. అన్యాక్రాంతమైన ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. (చదవండి: ఇక నుంచి పోలీస్ సేవలు సులభతరం..) ‘‘కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చివేశారు. ఆలయాలను పున:నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేశారని’’ ఆయన తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి వెల్లంపల్లి దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తామన్నారు. చంద్రబాబుకు హిందువులపై ప్రేమ లేదని.. ఆయన ట్వీట్లు పట్టించుకోవద్దని ప్రజలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం) -
అంతర్వేది ఘటన: త్వరలోనే వారిని పట్టుకుంటాం
సాక్షి, విశాఖపట్నం : అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం.. కొన్ని దుష్ట శక్తుల పనని, ఆ ఘటనపై పోలీసు విచారణ జరుగుతోందని మంత్రి శ్రీ రంగనాథ్ రాజు తెలిపారు. త్వరలోనే రథం దగ్ధం చేసిన కుట్రదారులను పట్టుకుంటామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులకు కులాలు, మతాలు ఉండవన్నారు. నారా చంద్రబాబు నాయుడు హయాంలో గుళ్లను కూల దోస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చదవండి : దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ -
నియోజకవర్గం వైపు కన్నెత్తి చూశారా..?
-
పార్టీలు మారడం ఆయన నైజం
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతలు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాలన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో మోదీకి చెప్పాలన్నారు. తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టంతోనే గెలిచామని మంత్రి పేర్కొన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు : మంత్రి శ్రీరంగనాథరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్లో చోటు కల్పించారని ప్రశంసించారు. ఎంపీ రఘురామకృషంరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదు వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘురామకృష్ణంరాజు ఎంపీగా గెలిచారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. రఘురామ కృష్ణంరాజు ఏ మాత్రం పద్దతిగా మాట్లాడడం లేదని విమర్శించారు. నరసాపురంలో ఆయనకు బ్యానర్ కట్టే క్యాడర్ కూడా లేదని ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణంరాజు గతం మర్చిపోయారు: ఎమ్మెల్యే గ్రంధి ఎంపీ రఘురామకృషంరాజు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. గతంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, జిల్లా నేతలంతా సీఎం జగన్‌ను కలిసి విన్నవిస్తే.. రఘురామకృష్ణంరాజును మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆయన ఎంపీగా గెలిచారన్నారు. టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారిన వ్యక్తి .. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. -
రూ.80 కోట్లతో అయోధ్యలంకకు వంతెన
సాక్షి, పెనుగొండ: గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అయోధ్యలంక, పుచ్చల్లంక మధ్య గోదావరిపై రూ.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని, లంక గ్రామాల పరిరక్షణే ధ్యేయంగా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సీహెచ్ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం ఉభయ గోదావరి జిల్లా ల్లోని పల్లిపాలెం, రావిలంక, అయోధ్యలంక తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించా రు. వంతెన నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రవాణా సదుపాయం మరింత మెరుగవుతుందని మంత్రి అన్నారు. వశిష్ట, వైనతేయ గోదా వరి పాయలు కలిసే ప్రాంతంలో కోత ఎక్కువగా ఉందని, శాశ్వత పరిష్కారం కోసం పరిశీలన జరిపి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల కమిటీ నివేదిక సమర్పిస్తారని చెప్పారు. వచ్చే నవంబర్ చివరిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎస్ఈ ప్రకాశ్‌రావు, ఈఈ మోహనరావు, డీఈఈ జి.శ్రీనివాసు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఈఈలు సీహెచ్ఎన్వీ సుబ్రహ్మణ్యం, పవన్‌కుమార్, సుబ్బారావుతో పా టు పార్టీ నాయకులు సుంకర సీతారాం, కొప్పాడి సత్యనారాయణ, గొల్లపల్లి బాలకృష్ణ, అడ్డాల గంగరాజు పాల్గొన్నారు. -
‘విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయి’
సాక్షి, పశ్చిమగోదావరి : విశాఖలో స్టెరైన్ గ్యాస్ లీకేజ్ ఘటనపై మంత్రులు రంగనాథ రాజు, తానేటి వనిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై మంత్రులు మాట్లాడుతూ.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటనపై అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి, బాధితులను ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని, స్టెరైన్ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం వెంటనే విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో కలిసి విశాఖపట్నం వెళ్లారని, ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ బాధితులకు అండగా ఉండాలని కోరారు. లాక్డౌన్ సమయంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీకి 45 డ్యూటీ పాసులు ఇచ్చామని, 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో నిలువ ఉంచాల్సిన స్టెరైన్ గ్యాస్ నిర్వహణ లోపం వల్ల లీక్ అయినట్లుగా భావిస్తున్నామన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని, బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ) -
‘ప్రజలెవ్వరూ అధైర్య పడొద్దు’
సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో.. పెనుగొండలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగానాధరాజు అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన మంగళవారం జిల్లాలోని పెనుమంట్ర మండలంలోని ఎస్ ఇల్లింద్రపర్రు, ఆలమూరు, నెలమూరు, ఓడూరు, పొలమూరు గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వైద్య సదుపాయాలను ఆయన పరివేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రజలంతా స్వీయ గృహ నిర్భంధంలోనే ఉండాలని తెలిపారు. అదేవిధంగా అనవసరంగా బయట తిరగవద్దని మంత్రి సూచించారు. (రెడ్ జోన్‌గా ప్రకాశం ) పంటలు చేతికి వస్తున్న తరుణంలో రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను శ్రీరంగానాధరాజు ఆదేశించారు. ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, జగనన్న రూ.1000 ఆర్థిక సాయం గురించి వాలంటీర్లను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రజలెవ్వరు అధైర్య పడవద్దని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. (పేద కుటుంబానికి ఉచిత రేషన్) -
‘లాక్డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’
సాక్షి, గుంటూరు: కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు.మంగళవారం ఆయన కలెక్టర్.. రూరల్,అర్బన్ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లాక్డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించవద్దని మంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోకుండా బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేయడంలో వెనకాడవద్దని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 14 చోట్ల క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌ను ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఆయా ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీరంగనాథరాజు సూచించారు. (ఈశాన్య భారతానికి పాకిన కరోనా) -
‘కరోనా నివారణకు రూ.కోటి విరాళం ఇస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణ చర్యలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున కోటి రూపాయలను విరాళంగా అందజేస్తామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరిలో కరోనా వైరస్ నివారణ చర్యలపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానితో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకే ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని పేర్కొన్నారు. (ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు) ప్రజలందరూ సహకరించి కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు మనకు రాకూడదనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. (కరోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం) -
టీడీపీ నేతలు జైలుకెళ్లడం ఖాయం
-
ఆ మాజీ మంత్రులు తప్పించుకోలేరు..!
సాక్షి, పోడూరు: ఈఎస్ఐ స్కాం లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలు.. అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కుమారుడి చేత కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.(ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!) ఈఎస్ఐ స్కాం లో చంద్రబాబుకు కూడా వాటా ఉందని మంత్రి శ్రీరంగనాథ రాజు ఆరోపించారు. కార్మికుల్లో అధిక శాతం బీసీలే ఉంటారని అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులను చేస్తే.. వైఎస్ జగన్ పేద బీసీలను మంత్రులను చేశారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్ జగన్ తన కేబినెట్లో అవకాశం కల్పించారని మంత్రి శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు. (ఈఎస్ఐ స్కామ్ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు) -
డొంక మాత్రమే కదిలింది.. ఇంకా చాలా ఉంది..!
సాక్షి, పశ్చిమగోదావరి: ఐటీ సోదాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి అక్రమాలపై ఐటీ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేయడంతో రాత్రికి రాత్రే వారు హైదరాబాద్‌కు వెళ్లిపోయారన్నారు. రోజుకు పదిసార్లు ఎల్లో మీడియాలో మాట్లాడే చంద్రబాబు, లోకేష్ నేడు మొహం చాటేశారని.. తప్పు చేశారు కాబట్టే వారు మీడియా ముందుకు రాకుండా తమ నాయకులతో మాట్లాడిస్తున్నారని విమర్శించారు.('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా') చంద్రబాబు ఐదు కంపెనీలను ఏర్పాటు చేసి సబ్ కాంట్రాక్ట్స్ ద్వారా నిధులు మళ్లించి అవినీతికి పాల్పడ్డారన్నారు. మాజీ పీఎస్ శ్రీనివాస్ వద్ద రెండు లక్షల నగదు మాత్రమే ఐటీ శాఖకు లభ్యమైందంటూ ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఐటీ శాఖ పూర్తిస్థాయి దర్యాప్తులో అన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు. చట్టాలకు ఎవరూ అతీతులు కారని.. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు స్వప్రయోజనాలు కోసం వాడుకున్నారని మంత్రి శ్రీరంగనాథ రాజు ధ్వజమెత్తారు. అక్రమాలు..టీడీపీ అవినీతికి నిదర్శనం.. ఐటీ దాడుల్లో వేలకోట్ల అక్రమాలు వెలుగు చూడటం.. టీడీపీ పాలనలో జరిగిన అవినీతికి నిదర్శనమని మంత్రి తానేటి వనిత అన్నారు. తీగ లాగితే డొంక మాత్రమే కదిలిందని.. ఇంకా లక్షల కోట్ల అవినీతి బాగోతం బయటపడాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి వనిత డిమాండ్ చేశారు. (ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి) -
టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
సాక్షి, నరసాపురం: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం పేరుపాలెంలో రెండు రోజులపాటు జరిగే బీచ్ ఫెస్టివల్ శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ సభలో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పశి్చమగోదావరి జిల్లా పేరు చెబితేæ ఆతిథ్యానికి ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు. ఆతిథ్యానికి, టూరిజానికి అవినావభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. మన జిల్లాలో టూరిజం అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. కార్తీకమాసంలో పేరుపాలెం బీచ్‌కు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం త్వరలో ఈ ప్రాంతంలో భారీ శివాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఏటా ఫిబ్రవరిలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. బీచ్ అభివృద్ధికి కృషి : రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ఉన్న పేరు పాలెం బీచ్ ప్రచారానికి నోచుకోక అన్ని విధాలుగా వెనుకబడిపోయిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ బీచ్‌ను జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తామని, దేశంలో పేరున్న బీచ్‌లకు పేరుపాలెం బీచ్ ఏ మాత్రం తీసిపోదని చెప్పారు. అధిక ఆదాయాన్ని సమకూర్చే రంగాల్లో టూరిజం అభివృద్ధి కూడా ప్రధానమైందన్నారు. జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న బీచ్ ఫెస్టివల్‌ను ఈస్థాయిలో నిర్వహించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. శివాలయం నిర్మిస్తాం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ముందడుగు వేస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రణాళిక తయారవుతుందని పేర్కొన్నారు. బీచ్‌లో శివాలయాన్ని నిర్మిస్తామని, దీనికి శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల సహకారం తీసుకుంటామన్నారు. 10 బీచ్‌ల అభివృద్ధికి ప్రణాళిక పర్యాటకశాఖ సీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రుషికొండ, ఆర్కే బీచ్‌ల తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఉన్న మరో 10 బీచ్‌లను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ నిర్ణయించిందన్నారు. పేరుపాలెం బీచ్ కూడా టూరిజం శాఖ గుర్తించిన బీచ్‌లలో ఉందన్నారు. రాబోయే కాలంలో పేరుపాలెం బీచ్‌ను రూ.5 కోట్ల నుంచి 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేరళ మాదిరి ప్రకృతి సోయగం సభకు అధ్యక్షత వహించిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ కూడా పేరుపాలెం బీచ్‌లో కనిపిస్తాయన్నారు. కేరళలో కూడా లేనివిధంగా ఇక్కడి తీరం పొడవునా కొబ్బరి చెట్లు దర్శనమిస్తాయన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో నరసాపురం తీరాన్ని పర్యాటకంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో పేరుపాలెం బీచ్‌కు విదేశీ పర్యాటకులు వచ్చేస్థాయిలో అభివృద్ధి ఉంటుందన్నారు. కలెక్టర్ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న బీచ్ ఫెస్టివల్‌కు మొదటి రోజే అనూహ్య స్పందన వచ్చిందన్నా రు. మంత్రులు, ఇతర అతిథులు ముందుగా గాలిలో పా వురాలు ఎగరేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే వీ ఆర్ ఎలీజా, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, ఉండి ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత చెల్లం ఆనంద ప్రకాషం, పార్టీ కేంద్ర మండలి సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘మార్కెట్ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తాం’
సాక్షి, గుంటూరు: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేసి.. రైతులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని తెలిపారు. మార్కెటింగ్ యార్డ్‌లకు పూర్వ వైభవం తెస్తామని మోపిదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నేడు మంచి రోజులు వచ్చాయని అన్నారు. అందరికీ చైర్మన్ పదవులు దక్కే అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు. మిర్చికి రికార్డుస్థాయిలో ధర దక్కుతోందని ఆమె గుర్తు చేశారు. క్వింటా రూ. 21వేలు పలకడం జగన్ పుణ్యమే అని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ.. గతంలో అగ్రవర్ణాలకే మార్కెటింగ్ పదవులు దక్కేవి అని అన్నారు. జగన్ చేసిన బీసీ డిక్లరేషన్‌లో భాగంగా అన్ని వర్గాలకి ఇప్పుడు న్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం అని శ్రీరంగనాధ్ రాజు అన్నారు. -
ఇసుకపై టీడీపీ తప్పుడూ ప్రచారాన్ని నమ్మద్దు
-
త్వరలోనే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తాం
-
‘నాణ్యమైన బియ్యం పంపిణీకి సిద్ధం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బురద చల్లుతున్నారని మంత్రి శ్రీరంగనాథ రాజు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంగళవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ ద్వారా 3.50 లక్షలు టన్నులు ధాన్యం సేకరించామని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే 1.75 లక్షల టన్నులు సేకరించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లైకు కేంద్రం ఇచ్చిన నిధులను వేరే పథకాలకు చంద్రబాబు మళ్లించారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు సకాలంలో కొనుగోలు పై చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ధాన్యం పై మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. 25 లక్షలు టన్నుల నాణ్యమైన బియ్యం ఏప్రిల్ నుంచి పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శ్రీరంగ నాథ రాజు వెల్లడించారు. -
ప్రతిష్టాత్మకంగా మూర్తిరాజు శత జయంతి వేడుకలు
సాక్షి, గణపవరం: మాజీ మంత్రి, విద్యాదాత, గాంధేయవాది దివంగత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు శతజయంతి వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానుండటంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదివారం మంత్రి శ్రీరంగనాథరాజు, ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సందర్శించారు. కళాశాల ఆవరణను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి పాల్గొనే వేదిక నిర్మాణం, ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లపై సమీక్షించారు. జీవితాంతం గాంధేయవాదాన్ని ఆచరించి, విలువలు కలిగిన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందడమే కాక 100కు పైగా విద్యాలయాలు, కళాశాలలను స్థాపించిన ఆదర్శ నాయకుడు మూర్తిరాజు శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమం భావితరాలకు గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. తొలుత శత జయంతి వేడుకల ముగింపు కార్యక్రమాన్ని నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో మూర్తిరాజు నిర్మించిన గాంధీ భవనం వద్ద నిర్వహించాలని భావించారు. ఈ ప్రాంతాన్ని వారం క్రితం మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే వాసుబాబు పరిశీలించారు. అయితే ఈ ప్రదేశంలో భద్రతా కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల ట్రా ఫిక్ సమస్య ఉంటుందని కార్యక్రమాన్ని గణపవరం మూర్తి రాజు డిగ్రీ కళాశాలకు మార్చారు. ఇక్కడ మూర్తి రాజు జీవిత విశేషాలతో కూడిన చిత్రాల ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, ఇతర విశేషాలు తెలిపే ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు గాదిరాజు సుబ్బరాజు, మండల పార్టీ కనీ్వనర్ దండు రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి నడింపల్లి సోమ రాజు, పట్టణ కనీ్వనర్ బత్తి సాయి, నాయకులు తెనాలి సునీల్, తోట శ్రీను, సరిపల్లె చిన్నా, వెజ్జు వెంకటేశ్వరావు పాల్గొన్నారు. -
నవరత్నాల్లో ముఖ్యమైనది ఇది: మంత్రి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టామని వాటిలో మొదటిది పేదలందరికి ఇళ్లు, రెండవది భూ రికార్డుల ప్రక్షాళన అని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం విలేకరుల సమావేశంలో డిప్పూటీ సీఎంతో పాటు మంత్రి పేర్ని నాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... పేదల ఇళ్లు, భూ రికార్డుల ప్రక్షాళనను అధికారులు సవాలుగా తీసుకోని, గ్రామ వాలంటీర్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రభుత్వ స్థలాల గుర్తింపు జరిగిందని... ప్రైవేటు స్థలాల గుర్తింపు జరుగుతోందని తెలిపారు. పశ్చిమ, కృష్ణ జిల్లాల కలెక్టర్లు రికార్డుల నిర్వహణలో ముందంజలో వున్నారని, గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. గత కొంత కాలంగా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళనకు నోచుకోలేదని, రికార్డులు సరిగా లేకపోవడంతో ప్రభుత్వానికి నష్టం వస్తుందని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నాన్ రెవెన్యూ పనుల్లో సైతం వినియోగించుకోవాలని అన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జమాబందీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనులు త్వరితగతిన జరగవనే విమర్శ ఉందని, రికార్డుల ప్రక్షాళన జరిగాక అత్యంత మంచిపేరు తెచ్చుకునే శాఖగా రెవెన్యూ శాఖ ఉంటుందని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ.. ఉగాది నాటికి పేదలందరికి ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలపై రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో 9 జిల్లాలో 3 లక్షల మందికి ఇళ్లు కావాల్సి ఉన్నట్లు వెల్లడించారు. ఇక నవరత్నాల్లో ముఖ్యమైనది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే అని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద వాడికీ ఇల్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన అన్నారు. అలాగే మార్చి నాటికి 13 లక్షల ఇళ్లు కేంద్రం నుంచి పొందేలా చర్యలు చేపడుతున్నామని, వీలైనన్ని మండలాలను యుడీఐ కిందకు తెచ్చెలా అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. ఇక రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. 25 లక్షల ఇళ్లు పేదవారికి ఇవ్వబోతున్నామని, తమ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు, ఇళ్ల స్థలాలు దాదాపు 70శాతం మంది అత్యంత పేద వర్గానికి చెందిన వారి కోసమేనని తెలిపారు. ఇళ్ల బిల్లులు మంజూరు చేసేటప్పుడు అధికారులు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవద్దని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. డబ్బులు తీసుకునే క్రమంలో పై అధికారులకు కూడా ఇది చెడ్డపేరు వస్తుందని.. ఇలాంటివి జరగకుండా ఉన్నతాధికారుల దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. -
‘డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి’
సాక్షి, పాలకొల్లు: డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ కుమార్ రాజును సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొల్లు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల విష జ్వరాల బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చేస్తామని తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ తదితరులు ఉన్నారు. -
ముఖ్యమంత్రి గదిలో అవే కనిపిస్తాయి!
సాక్షి, వైఎస్సార్ : ‘సచివాలయంలోని ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లగానే ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన ‘నవరత్నాలు’ హామీలే కనిసిస్తాయి. అనునిత్యం వాటిని గుర్తుపెట్టుకొని కార్యాచరణ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నదే వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని’ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధ్ రాజుతో కలిసి వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకు వేసి నెరవేరుస్తున్నారని ప్రశంసించారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కుల, మత భేదాలు చూడకుండా ప్రతీ ఒక్క పేద కుటంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో రాక్షస పాలన చేసినందునే ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని గర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి అందరూ విభేదాలు పక్కనపెట్టి కృషి చేయాలని, అంబేద్కర్, గాంధీల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలున్నా ప్రజా సంక్షేమం కోసం అంబేద్కర్‌తో రాజ్యాంగాన్ని రాయించారని తెలిపారు. మంత్రి రంగనాధ్ రాజు మాట్లాడుతూ.. మహానేత ఆశయాల కొనసాగింపుగా బడుగు, బలహీన వర్గాలకు 25 లక్షల ఇళ్లు కట్టించాలని నవరత్నాలలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాజన్న పాలనను అందించడానికి తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. -
‘సొంతింటి కల నెరవేరుస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో 25 లక్షలమందికి ఇంటి నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యమని గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం ఏలూరులో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 34,879 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. 1,12,700 మంది ఇళ్ల స్థలాలు ఉండి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒంటరి, వితంతు, వికలాంగులకు ఇంటి నిర్మాణం పూర్తిగా ప్రభుత్వమే నిర్మించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. భూ సేకరణ, గ్రూప్ హౌస్‌ల నిర్మాణం ద్వారా ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
పనితీరును మెరుగుపర్చుకోండి..
సాక్షి, ఏలూరు: రెవెన్యూ రికార్డుల నిర్వహణలో పనితీరును మెరుగుపర్చుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం ఏలూరులో మంత్రులు శ్రీరంగనాథ రాజు, ఆళ్ల నాని, తానేటి వనితలతో కలసి గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిపారు. రెవెన్యూ రికార్డులను కరెక్ట్‌గా నిర్వహించకపోతే ప్రభుత్వం ఏం చేసినా ఫలితం ఉండదని బోస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పేదలందరికీ ఇళ్లు అందించేందుకు ప్రతి జిల్లాలోనూ సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి సమీక్షలు ప్రారంభించామని వెల్లడించారు. పేదలకు ఇళ్ల మంజూరు కోసం భూమి సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా యాప్‌ను నిర్వహిస్తున్నామని.. దీని ద్వారా లబ్ధిదారులకు సేవలందిస్తామన్నారు. భూ సేకరణ కొంత కష్టంగా ఉంది.. డెల్టా ప్రాంతాల్లో భూ సేకరణ కొంత కష్టంగా ఉందని గృహనిర్మాణ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు అన్నారు. జిల్లాలో ప్రభుత్వభూమి చాలా ఉందని.. వివాదాల్లో ఉన్నప్రభుత్వ భూములను త్వరితగతిన స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
తణుకులో పర్యటించిన మంత్రి, ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి : గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజులు శనివారం తణుకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు సుమారు రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇరగవరం మండంలం రేలంగి గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడానికి ముందుకు వచ్చారు. దీంతో వారందరికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, మంత్రి శీరంగనాథరాజులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే తణుకులో వైఎస్సార్సీపీ అభిమానులు నడిపిస్తున్న రాజన్న క్యాంటీన్‌ను వారు సందర్శించారు. మండలంలోని తేతలి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్‌ను మంత్రి ప్రారంభించగా, తణుకు బ్యాంకు కాలనీ నందు రహదారి నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. సమారు 12000 మంది గ్రామ వాలంటీర్లతో తణుకులోని పద్మశ్రీ ఫంక్షన్ హాలులో సమావేశమై, అక్కడి సమస్యలపై మంత్రి శీరంగనాథరాజు, ఎంపీ ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధిదారులకు చేరాలని వారు ఆదేశించారు. -
‘పోలవరం నిర్వాసితులకు భరోసా’
రంపచోడవరం(తూర్పుగోదావరి) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భరోసా లభించింది. ఏజెన్సీ, మైదాన ప్రాంతంలోని పునరావాస కాలనీల్లో రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పర్యటించారు. ఎంతోకాలంగా అనేక సమస్యలతో సతమతమవుతున్న నిర్వాసితులు మంత్రి పర్యటనతో సంతృప్తి వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల్లో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు)తో కలిసి పర్యటించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం, దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్, ఇందుకూరు, పెద్దబియ్యంపల్లి గ్రామాల్లో పునరావాస కాలనీలు మంత్రి సందర్శించారు. కృష్ణునిపాలెంలో గిరిజనేతరులకు నిర్మించిన కాలనీని సందర్శించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు తొమ్మిది ఫిల్లర్స్‌తో నిర్మించిన మోడల్ గృహాన్ని పరిశీలించారు. పెద్దబియ్యంపల్లి వద్ద కొండమొదలు నిర్వాసితులు తమకు భూమికి భూమి ఇవ్వలేదని, చెట్లకు డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో మంత్రి భూమికి భూమి ఇవ్వకుండా నిర్వాసితులకు ఎలా ఇళ్లు నిర్మించారని అధికారులను ప్రశ్నించారు. తక్షణం సేకరించిన భూమిని వారికి ఇచ్చే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాసితులకు అండగా ఉండాలి అనంతరం ఐటీడీఏలో జరిగినలో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ అధికారులు నిర్వాసితులకు అండగా ఉండి పునరావాసాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు మెరుగైన పునరావాసం, నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంలో నాణ్యతపై థర్డ్ పార్టీ ఇంజినీర్లతో తనిఖీలు చేపడతామన్నారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా కాఫర్‌డ్యామ్ నిర్మించడం వల్ల రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వరద పరిస్థితిని అంచనా వేయలేకపోయారన్నారు. వచ్చే ఏడాది మార్చి 31నాటికి నూరుశాతం ఆర్అండ్ఆర్ పనులు పూర్తి చేయాలన్నారు. నిర్వాసితుల గృహ నిర్మాణం, రంపచోడవరం ప్రాంతంలో అమలు జరుగుతున్న గృహ నిర్మాణాలపై సమీక్షించారు. గిరిజనేతరులకు ఇళ్లు మంజూరు చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ఏజెన్సీలో గృహనిర్మాణ పథకం నిధుల కేటాయింపును పెంచాలని కోరారు. పేద గిరిజనేతరులకు గృహలను మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహ నిర్మాణం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం ఏజెన్సీ పర్యటనలో భాగంగా గృహనిర్మాణశాఖ ఎండీ కాంతిలాల్ దండే ఐటీడీఏలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఏజెన్సీలో 24,620 గృహాలు మంజూరు కాగా 15 వేల ఇళ్లు నిర్మించినట్టు తెలిపారు. ఇంకా 7,650 గృహాలు పూర్తి కాలేదన్నారు. వీటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే నెల సెప్టెంబర్ నుంచి బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్, ఆర్డీఓ బి.శ్రీనివాసరావు, ఏఎస్పీ వకుళ్ జిందాల్, పీడీ జీవీ ప్రసాద్ పాల్గొన్నారు. అదనపు నిధులు ఇస్తాం రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ నిర్వాసితులకు త్వరితిగతిని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏజెన్సీలో 2004 నుంచి 2009 వరకు ఇందిరమ్మ ఒకటి, రెండు, మూడు విడతల్లో మంజూరు చేసిన సుమారు నాలుగువేల ఇళ్ల నిర్మాణాలు అసంతృప్తిగా నిలిచిపోయాయన్నారు. వాటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ ఇందిరమ్మ పథకంలో నిలిచిపోయిన ఇళ్లు పూర్తి చేసేందుకు అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఇతర నిధులు నుంచి కూడా కొంత మొత్తం కేటాయిస్తే గిరిజనులు మంచి ఇళ్లు నిర్మించుకుంటారని తెలిపారు. ఇందుకోసం నిలిచిన గృహాల జాబితా సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని గృహ నిర్మాణశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. -
టీడీపీకి షాకిచ్చిన నేతలు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పాలకోడేరు మండలంలో టీడీపీకి చెందిన వేండ్ర చంటిరాజు, శృంగవృక్షం బుజ్జిరాజు ,గొరగణమూడి పాపారావు,గరగనర్రు రాము తదితరులు వైసీపీలో చేరారు. ఉండి వైసీపీ కన్వీనర్ పి.వి.ఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమక్షంలో దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలతో కలిసి చేరారు . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు
సాక్షి, పశ్చిమ గోదావరి : అవినీతి రహిత పరిపాలన అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవరత్నాలను ఏపీ ప్రజలందరికీ అంద చేయడమే తొలి లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను అధికారులు గుర్తించి పనిచేయాలని సూచించారు. ఎన్నికల హామీలను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అధికారులు కూడా సహకరించాలని కోరారు. అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడమే తమ లక్ష్యమని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. జిల్లాలోని ప్రజలకు సురక్షిత తాగునీరు ఇవ్వడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ విద్యార్ధులకు సైతం అమ్మ ఒడి అందిస్తున్నామని తెలిపారు. గోదావరి డెల్టాకు మరో వెయ్యి క్యూసెక్కుల నీరు పెంచాలని, కొల్లేరుకు కూడా నీరు అందించాలన్నారు. ప్రజలందరికీ మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. -
అందుకే నాకు ఈ శాఖ ఇచ్చారేమో..
సాక్షి, తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఇంట్లో ఉండే మహిళల పేరు మీద పట్టాలను ఇస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన గృహనిర్మాణ శాఖను నామీద నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ నియోజవకర్గంలో 300 ఎకరాల్లో 3000 మందికి పైగా ఇళ్లు కట్టించాను. నేను చేసిన హౌసింగ్ అభివృద్ధి చూసి వైఎస్ జగన్ నిన్ను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. అందుకే నాకు గృహనిర్మాణ శాఖ ఇచ్చారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నవరత్నాలలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా పాటిస్తామ’ని వెల్లడించారు. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీరంగనాథ్ రాజు
-
అలా... ‘పేరు’ గాంచారు
సాక్షి, కొవ్వూరు : జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన నేతలకు, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులుగా చలామణిలో ఉన్న వారికి అసలు పేరు కంటే నిక్ నేమ్స్, ముద్దుపేర్లే బాగా ప్రాచూర్యం పొందాయి. నాని.. బాబు.. బుజ్జి వంటి పేర్లు కలిగిన నాయకులు ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్నారు. కొందరు పొడవాటి పేర్లు కలిగిన నాయకులను చిన్నపేర్లు పెట్టి పిలవడం పరిపాటి. ఇలా ఆ పేర్లే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. కొందరికైతే అసలు పేరు కంటే ముద్దుపేర్లు చెబితే గాని తెలియని పరిస్ధితి ఉంది. ఏలూరుకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. అయినా జిల్లా వాసులకు ఆయన నానిగానే సుపరిచితులు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు వెంకటేశ్వరరావు. జిల్లా నాయకులతోపాటు రాష్ట్ర పార్టీ నాయకులంతా ఆయన్ను బాబుగానే పిలుస్తుంటారు. పూర్తి పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. నాని అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది. మాజీ రాజ్యసభ సభ్యుడు యర్రా నారాయణస్వామి జిల్లావాసులకు సుపరితులు. ఆయన్ను బెనర్జీగా పిలుస్తుంటారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆచంట వైఎస్సాఆర్ సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగరాజు పూర్తిపేరు శ్రీరంగనాథరాజు. సన్నిహితులు రంగరాజుగా పిలుస్తుంటారు. ఉండి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును ఎక్కువ మంది అబ్బాయిరాజుగా పిలుస్తుంటారు. వైఎస్సార్ సీపీ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును ఈ ప్రాంత వాసులు కృష్ణబాబుగా పిలుస్తుంటారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన పూర్తి పేరు మాత్రం గెడ్డం సూర్యారావు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును సన్నిహితులంతా రామంగా పిలుస్తుంటారు. మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజును సన్నిహితులు మీసాల బాపిరాజుగా పిలుస్తారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు. ఉంగుటూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వుప్పాల శ్రీనివాసరావుని వాసుబాబుగా పిలుస్తారు. జిల్లా వాసులందరికీ వాసుబాబుగానే సుపరిచితులు. -
రంగరాజన్న రైతు రథం
పశ్చిమగోదావరి, ఆచంట: రైతులకో శుభవార్త. రూ.లక్ష సబ్సిడీపై పెద్దట్రాక్టర్లు అందించేందుకు వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు శ్రీకారం చుట్టారు. అంతేకాదు. పన్నులు సైతం చెల్లించకుండా మినహాయింపునిచ్చారు. ఈ అవకాశం జిల్లాలోని రైతులందరికీ రాజకీయాలకతీతంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకంతో అవస్థలు ప్రస్తుతం ప్రభుత్వం రైతు రథం పథకం కింద రూ.1.50 లక్షల సబ్సిడీతో రైతులకు పెద్ద ట్రాక్టర్లు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకంలో రైతులు ట్రాక్టరు పొందాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. కాళ్లరిగిపోయేలా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టరుకు రూ.50 వేల వరకూ అనధికార మామూళ్లు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇంత చేసినా చివరకూ ట్రాక్టర్ అందుతుందో లేదో భరోసా ఉండడం లేదు. అధికార పార్టీ నేతలకే ట్రాక్టర్లు అందుతున్నాయన్న విమర్శలు తీవ్రంగా వినబడుతున్నాయి. రైతుల కష్టాలకు చలించి.. ఈనేపథ్యంలో రైతులు పడుతున్న అవస్థలు తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేత శ్రీరంగనాథరాజు చలించిపోయారు. తాడేపల్లిగూడెంలోని మహీంద్రా ట్రాక్టర్ డీలర్‌తో సంప్రదింపులుజరిపారు. రైతులకు ఇన్వాయిస్పై రూ.లక్ష తగ్గింపుతోపాటు, పన్ను కూడా చెల్లించకుండా నేరుగా ట్రాక్టరు చేరేలా ఏర్పాట్లు చేశారు. డీలరు తగ్గించే మొత్తం తానే చెల్లిస్తానని శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలవడానికి ముందుకొచ్చారు. మొదటి ట్రాక్టరు పంపిణీ : ఆచంట మండలం శేషమ్మచెరువులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఇదే మండలం భీమలాపురం గ్రామానికి చెందిన రైతు కుడిపూడి వెంకటరత్నం(చిన్నా)కు మొట్టమొదటి ట్రాక్టరును శ్రీరంగనాథరాజు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల సాధకబాధలు తెలుసునని, ట్రాక్టరు కోసం వారు పడుతున్న కష్టాలు తెలుసుకుని వారికి తగ్గింపుతో ట్రాక్టర్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. కుల మతాలకు అతీతంగా జిల్లాలోని సన్న,చిన్నకారు రైతులందరికీ ట్రాక్టర్లు అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంలో లక్షలాది రూపాయలతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీరంగనాథరాజు రైతన్నకు అండగా నిలిచి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకోవడం పట్ల రైతుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుంకర సీతారామ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడవర్తి వెంకన్నబాబు, పార్టీ రాష్ట్ర నాయకులు ముప్పాల వెంకటేశ్వరరావు, ముత్యాల నాగేశ్వరరావు, కర్రి వెంకటనారాయణ(వాసు), వైట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
రంగనాథన్న చేరికతో పార్టీ బలోపేతం : వైఎస్ జగన్
సాక్షి, జక్కారం (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. టీడీపీ నేత, అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు, ఆయన మద్దతుదారులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డిలు ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలుసుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఆయన టీడీపీకి ఇటీవల రాజీనామా చేశారు. ప్రజల కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని చూసి ఎంతో మంది ఆయన అడుగులో అడుగు వేస్తున్నారన్నారని, జననేత పాదయాత్ర రగిలించిన స్ఫూర్తితో పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. 2014-18 కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ సమన్వయకర్తగా రంగనాథరాజు వ్యవహరించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రంగనాథ్ అన్నతో పాటు లక్ష్మీరెడ్డిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. రంగనాథ్ అన్న గురించి నాకంటే ఈ జిల్లా ప్రజలకే బాగా తెలుసు. రంగనాథ్ అన్న చేరికతో జిల్లాలో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరుతుంది. కేవలం వైఎస్సార్పీపీలోకే కాదు, మన అందరి గుండెల్లోకి ఆహ్వానించి వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యుడిగా ఆయనను చూసుకుంటాం. ప్రజలకు సేవ చేయాలని వైఎస్సార్సీపీలో చేరుతున్న వారికి ఎప్పుడూ పార్టీలోకి ఆహ్వానం ఉంటుంద’ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 173వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జక్కారం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద అమిరం చేరుకోగానే జననేత వైఎస్ జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మరోవైపు నవరత్నాలు ప్రకటించి, అన్ని వర్గాల వారిని అభివృద్ధిపథంలోకి తెచ్చేందుకు వైఎస్ ఇస్తున్న ఆచరణయోగ్యమైన హామీలకు అధికార పార్టీ నేతలు సైతం ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరుతుండటం గమనార్హం. -
టీడీపీకి గుడ్‌బై చెప్పిన శ్రీ రంగనాధ రాజు