సాక్షి, ఏలూరు: రెవెన్యూ రికార్డుల నిర్వహణలో పనితీరును మెరుగుపర్చుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులకు సూచించారు. ఆయన మంగళవారం ఏలూరులో మంత్రులు శ్రీరంగనాథ రాజు, ఆళ్ల నాని, తానేటి వనితలతో కలసి గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిపారు. రెవెన్యూ రికార్డులను కరెక్ట్‌గా నిర్వహించకపోతే ప్రభుత్వం ఏం చేసినా ఫలితం ఉండదని బోస్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పేదలందరికీ ఇళ్లు అందించేందుకు ప్రతి జిల్లాలోనూ సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి సమీక్షలు ప్రారంభించామని వెల్లడించారు. పేదలకు ఇళ్ల మంజూరు కోసం భూమి సేకరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా యాప్‌ను నిర్వహిస్తున్నామని.. దీని ద్వారా లబ్ధిదారులకు సేవలందిస్తామన్నారు.
భూ సేకరణ కొంత కష్టంగా ఉంది..
డెల్టా ప్రాంతాల్లో భూ సేకరణ కొంత కష్టంగా ఉందని గృహనిర్మాణ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు అన్నారు. జిల్లాలో ప్రభుత్వభూమి చాలా ఉందని.. వివాదాల్లో ఉన్నప్రభుత్వ భూములను త్వరితగతిన స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment