
సాక్షి, తిరుపతి: పేదల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్‌లో వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు మంత్రి. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యేలు, భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment