సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్రంలో వారం రోజుల్లో కల్తీ ఆహార పదార్ధాల విక్రయాలను నిరోధించాలని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో శెనగపిండికి బదులు కేసరి పప్పు పిండిని విక్రయిస్తున్నట్టు సమాచారమందడంతో మంత్రి సీరియస్ అయ్యారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో కేసరి పప్పు విక్రయిస్తుండగా, అది తింటే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఐపీఎం డైరెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment