సాక్షి, శ్రీకాకుళం : మొన్నటి వరకు సురక్షిత ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు కరోనా వైరస్ సోకడం దురదృష్టకమరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ళ నాని అన్నారు. జిల్లాలో వైరస్ బయటపడిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనను వెంటనే శ్రీకాకుళం వెళ్లాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. కరోనాపై అందరూ జాగ్రత్త వహించాలని, జిల్లాపై సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలని ఆదేశించారు. కాగా శ్రీకాకుళంలో శనివారం కరోనా వైరస్ తొలి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలసి ఆళ్ల నాని ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. (సిక్కోలులో కరోనా ఎందుకొచ్చిందంటే)
అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు శ్రీకాకుళం జిల్లాకు కూడా సోకిందన్నారు. ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే ప్రజలు స్వయంగా తెలియజేయాలని సూచించారు. ‘రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధంగా ఉండాలి. లక్షణాలతో ఉన్న 3718 మంది పరిస్థితిని గమనించాలి. శ్రీకాకుళంలో సర్వే బాగా చేశారు. అయినా మరోసారి మరింత పకడ్బందీగా సర్వే చేయాలి. ప్రతి వ్యక్తికి ప్రత్యేక గదులు ఏర్పాటు చర్యలు చేపట్టాలి. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో వైద్యులు తక్కువగా ఉంటే భర్తీ చేస్తాం. పారిశుద్ధ్య కార్మికులకు కూడా పీపీఈ, మాస్క్లు ఇవ్వాలి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్‌తో పాటు ఎరిత్రోమైసిన్ మందులు సిద్ధంగా ఉంచాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment