సాక్షి, ప్రకాశం: చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఘటనను సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ప్రతీ సచివాలయం పరిధిలో ఓ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. మారు మూల వైద్యశాలలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగం భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. వైద్యశాలలకు, మెడికల్ కళాశాలలకు కావాల్సిన అన్నీ మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన వైద్య ఏర్పాట్లకు అన్నీ ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆళ్ల నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment