prakasam distirct
-
ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం, సాక్షి: ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించేందుకు మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ , పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ వెంకయ్య , వరికూటి అశోక్ బాబు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.ఈ క్రమంలో వారిని రిమ్స్ ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఆదిమూలపు సురేష్, వెంకయ్య, అశోక్ బాబు అక్కడే నేలపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులుతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో నాలుగో తరగతి విద్యార్థినిపై స్కూల్ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘ టంగుటూరు మండలం కారుమంచి మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన చాలా దారుణం. రాష్ట్రంలో పిల్లలు, మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి. ‘దిశ’ను ఎందుకు నీరు గార్చారు. పోలీసులు ఎందుకు నిర్లప్తంగా తయారయ్యారు. ...కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ఎందుకు వదిలేశారు. బాధితురాలు.. తనపై హత్యాచారం చేశారని చెబుతుంటే. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు. ఏ మంత్రి చెబితే కేసుని తొక్కిపట్టారు?. మేం వచ్చే వరకు పిర్యాదు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ అరచకాలపై సోషల్ మీడియా ద్వారా ఎండగడుతాం?. అలాగే సోషల్ మీడియాపై నిర్బంధాన్ని ఎదుర్కుంటాం. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వుంటాం’’ అని అన్నారు. -
Memantha Siddham Photos: మండుటెండలోనూ పోటెత్తిన జన ప్రభంజనం (ఫొటోలు)
-
మేమంతా నీ వెంటే.. ఊరూరా అభిమాన వర్షం (ఫొటోలు)
-
పదో రోజు ‘మేమంతా సిద్ధం’: దారి పొడవునా జననేతకు నీరా‘జనం’
Memantha Sidham Day 10 Highlights CM Jagan Bus Yatra Details సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు దర్శిలో పండుగ వాతావరణం దర్శిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు దర్శిలో పండగ వాతావరణం కాసేపట్లో దర్శి చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర దర్శిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లు సిటీ మొత్తం మైక్ సెట్లు ఏర్పాట్లు చేసిన కార్యకర్తలు గజ మాలలు, తోరణాలు, మేళ తాళాలతో భారీ స్వాగతం పలకనున్న దర్శి ప్రజలు సీఎం జగన్ రాక కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు గడియారం సెంటర్‌కి భారీగా చేరుకున్న ప్రజలు.. ‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్ ప్రసంగం.. ముఖ్యాంశాలు జన సముద్రం కనిపిస్తోంది ఇసుక వేసినా రాలనంతా జనం కనిపిస్తున్నారు చేయి చేయి కలిపిన ప్రజా కెరటంలా మేమంతా సిద్ధం అని వినిపిస్తోంది పేదల వ్యతిరేకులను ఓడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా ఈ ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నికలు కావు పిల్లల బడులు, అక్క,చెల్లెల సాధికారత, అవ్వా,తాతల సంక్షేమం,రైతు భరోసా కొనసాగాలా మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడు అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్.. మీ బిడ్డ గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ జగన్.. మీ బిడ్డ అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్..మీ బిడ్డ పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్..మీబిడ్డ ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్..మీ బిడ్డ అమూల్‌ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్.. మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్..మీ బిడ్డ ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్..మీ బిడ్డ నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్..మీ బిడ్డ అమ్మఒడి ఇచ్చింది మీ జగన్.. మీ బిడ్డ పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్..మీ బిడ్డ ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్.. మీ బిడ్డ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ అంటే మీ జగన్ వాహన మిత్ర అంటే మీ జగన్ లా నేస్తం అంటే మీ జగన్ అక్కచెల్లెమ్మలకు రాజకీయ సాధికరత దక్కించింది మీ జగన్ 58 నెలల కాలంలో 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ అక్కచెల్లెమ్మలకే దక్కాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం చేశాం రాష్ట్రంలో 4 సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది కొత్త మెడికల్ కాలేజీలు శరవేగంగా నిర్మిస్తున్నాం మేనిఫెస్టోలో నూటికి 90 శాతం హామీలు నెరవేర్చాం స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఐదు జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు మళ్లీ అదే చంద్రబాబు,పవన్‌కల్యాణ్, మోదీ వస్తున్నారు హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు 80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా పక్కా ఇళ్లు నిర్మించాడా ఏపీని సింగపూర్‌గా మార్చాడా ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్ కారంటూ వస్తున్నాడు చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి మీరు సిద్ధమేనా సిద్ధమయితే సెల్ఫోన్లో టార్చ్ ఆన్ చేసి సిద్ధమే అని నినదించండి 175కు 175 ఎమ్మెల్యే..25కు25 ఎంపీ సీట్లు గెలిపించేందుకు సిద్ధమేనా మన గుర్తు ఫ్యాను.. గుర్తుంచుకుని ఓటేయండి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు పేదలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ దమ్మున్న నాయకుడు సీఎం జగన్ కొనకొనమిట్ల ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా, కొనకొనమిట్ల మేమంతా సిద్ధం సభకు చేరుకున్న బస్సు యాత్ర కాసేపట్లో సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సభకు భారీగా హాజరైన జనం పెత్తందారులపై పోరుకు సిద్ధం అని నినాదాలు పెద అరికట్ల చేరుకున్న బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం పెద అరికట్ల గ్రామం చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర 43 డిగ్రీల మండుటెండలోనూ తగ్గని జనాల ఉత్సాహం రోడ్డుకు రెండువైపులా బారులు తీరి సీఎం జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నారులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు, అన్నదాతలు, అవ్వాతాతలు కదిలి వచ్చిన కనిగిరి జగన్ బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం పామూరు బస్టాండ్‌లో సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండుటెండలోనూ కిక్కిరిసిన కనిగిరి రోడ్లు పూలు చల్లుతూ అభిమాన వర్షం కురిపించినమహిళలు సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్న రామాపురం గ్రామస్తులు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన రామాపురం గ్రామస్తులు తమ గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్.. ఇలా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలందుతున్నాయంటూ రామాపురం గ్రామస్తులు.. సీఎంను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కనిగిరి చేరుకుంది అడుగడునా సీఎం జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్న ప్రజలు కనిగిరిలో కొనసాగుతున్న యాత్ర ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడునా జననీరాజనం దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు ఆపూర్వ స్వాగతం నా స్టార్ క్యాంపెయినర్లతో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర: సీఎం జగన్ పదో రోజు ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది యాత్రలో కలిసిన పిల్లలు, వృద్ధులు, మహిళలతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు With my star campaigners from Day-10 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/wl7knYIYUD — YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2024 జగనన్న కోసం యువ స్టార్ క్యాంపెయినర్ కరోనా మహమ్మరి వల్ల తన తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఈ యువకుడి పేరు మునగ అభిరామ్, వయస్సు 18. తాను ఆనాధను కాదని తనకి జగనన్న ఉన్నారంటూ ఇవాళ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం యాత్రలో కనిపించాడు కోవిడ్ తో తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, ఆ విషయం తెలుసుకున్న సీఎం జగన్ చిన్న బిడ్డ ఆనాధగా మిగలకూడదని ఆయన ఆ బిడ్డ జీవితానికి ఒక లైఫ్‌లైన్‌గా నిలిచారు. దాదాపు రూ. 10 లక్షల సీఎం నిధులను కేటాయించి ఆ బిడ్డకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు, అదే బిడ్డ అభిరామ్ సీఎం జగన్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరిగి వచ్చాడు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు సీఎం జగన్‌ను చూడటానికి భారీగా తరలివస్తున్న ప్రజానికం పొన్నలూరు మండలం కే అగ్రహారం చేరుకున్న సీఎం జగన్ అగ్రహారంలో భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు సీఎం జగన్ సమక్షంలో చేరికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చెందిన కీలక నేతలు జువ్విగుంటక్రాస్ స్టే పాయింట్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి వైయస్సార్సీపీ కండువాలు వేసిన ముఖ్యమంత్రి వైయస్సార్సీపీలోకి చేరిన టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్‌లు. వైయస్సార్సీపీలోకి చేరిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్‌లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ మరికొద్ది సేపటిలో కె. అగ్రహారానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు గ్రామ ఎంట్రన్స్ వద్దకి భారీగా చేరుకున్న గ్రామస్థులు జువ్విగుంట క్రాస్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. రాత్రి బస పాయింట్ జువ్విగుంట క్రాస్ సీఎం జగన్ బస్సు యాత్ర బయలుదేరింది సీఎం జగన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేతలు చేరిక జువ్విగుంట రాత్రి బస వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్ పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కే అగ్రహారం వద్ద 10 గజమాలలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సీఎం జగన్‌ను చూడటానికి భారీగా చేరుకుంటున్న ప్రజానికం పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో మేమంతి సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో జువ్విగుంట క్రాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్దఅరికట్ల చేరుకోకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం చిన్నఅరికట్ల, మూగిచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనకనమెట్ల క్రాస్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్ , పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి బస్సు యాత్ర రాత్రికి వెంకటాచలంపల్లిలో బస చేయనున్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా సిద్ధమా...? పదో రోజు ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర కోసం సీఎం జగన్ ట్వీట్ చేశారు. Day-10 ప్రకాశం జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2024 పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగనుంది. సీఎం జగన్ బస్సు యాత్ర.. జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. మేమంతా సిద్ధం - 10వ రోజు ఆదివారం (ఏప్రిల్ 7) షెడ్యూల్ ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్‌లో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు. Memantha Siddham Yatra, Day -10. ఉదయం 9 గంటలకు జువ్విగుంట దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు కొనకనమెట్ల దగ్గర బహిరంగ సభ వెంకటాచలంపల్లి క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zqgVFAcXrX — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 తొమ్మిదో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ మీరే మా ఆశ.. మీరే మా శ్వాస అంటూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటెత్తిన జనాలు మండుటెండను సైతం లెక్క చేయక.. కావలి బహిరంగ సభలో జనసునామీ తన కోసం వచ్చిన వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరిచి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిన్నారులు.. యువతులు.. వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగి వారిలో ఆనందోత్సాహాలను నింపారు తొమ్మిది రోజుల మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అభిమానం ఇలా.. Moments of the Day 💫 Memantha Siddham Yatra, Day -9.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/z5dD3NKqk4 — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 Memorable moments from Day-8 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/2E1E92T1qy — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-7.#MemanthaSiddham pic.twitter.com/gDPSZ3rQk3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-6.#MemanthaSiddham pic.twitter.com/ilx21YyCAC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-5 of the Memantha Siddham Yatra.#MemanthaSiddham pic.twitter.com/dmCglCUqjC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-4 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/xqPvXEB4CW — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-3.#MemantaSiddham pic.twitter.com/OYKtc0ssb3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-2.#MemanthaSiddham pic.twitter.com/uEx9NXjGRO — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-1.#MemanthaSiddham pic.twitter.com/MVp6W2q0eM — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 -
జనసేనల మధ్య పెరుగుతున్న గ్యాప్
జిల్లాలో పొత్తు రాజకీయాల్లో జనసేన చిత్తయిపోయింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. పొత్తు ప్రకటన నుంచి సమన్వయ సమావేశాలు, సీట్ల కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వరకు టీడీపీ నేతలు తమను చిన్న చూపు చూస్తున్నారని జనసేనలు మండిపడుతున్నారు. జనసేన అంతర్గత వ్యవహారాల్లో దామచర్ల తలదూర్చి పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో తమ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం ఏమిటని రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లాలో నిర్వహించిన పలు సమన్వయ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహార శైలిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి సమావేశానికి దామచర్ల దాదాపు మూడు గంటల ఆలస్యంగా రావడమే కాకుండా తమ వారిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక రెండో సమావేశంలో అయితే కూర్చునేందుకు సీట్లు కూడా లేకుండా చేశారని వాపోతున్నారు. తాజాగా గురువారం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక సందర్భాల్లో తమ పార్టీ నేతలను అవమానించిన నేపథ్యంలో ఈ సమావేశానికి గ్లాస్ పార్టీకి చెందిన కీలక నేతలు, వారి అనుచర వర్గం డుమ్మా కొట్టింది. దామచర్ల తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జనసేన నేతలకు మింగుడు పడడంలేదు. ఇదిలా ఉంటే జనసేన సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండు పార్టీల్లోనూ ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వర్గ రాజకీయాలకు ఆజ్యం దామచర్ల తమ పార్టీలో రెండు వర్గాలను పెంచిపోషించాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమేమిటని నిలదీస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణను చిన్న చూపు చూశారని, ఇటీవల ఆమైపె జరిగిన దాడిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సీట్ల కేటాయింపులో మొండిచేయి ఇక సీట్ల విషయంలో కూడా అన్యాయమే జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లేదా మూడు సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే చివరకు ఒక్క సీటూ ఇవ్వకపోవడంపై కూడా గ్లాసు కేడర్ గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడిన తమను మిత్రపక్షం నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలను తనకు అనుకూలంగా పెట్టుకుని మీ అందరికీ న్యాయం చేస్తానని దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ శ్రేణులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా వారిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సమావేశానికి షేక్ రియాజ్, అరుణ వర్గాలు డుమ్మా కొట్టాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడు దామచర్ల గ్లాసులో తుఫాన్ సృష్టించి ఆ పార్టీ పతనానికి బీజాలు వేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దామచర్ల తీరుతో మనస్తాపం... ఇచ్చిన మాటను నిలుపుకోవడం అలవాటు లేని దామచర్ల జనార్దన్ సహజంగానే రియాజ్ కు ఇచ్చిన మాటను కూడా మరిచిపోయారు. ఎన్నికల ప్రచారానికి రియాజ్‌ను, అతడి వర్గాన్ని వాడుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జనసేనలు. దీంతో ఆ పార్టీ నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజుల కిందట నగరంలోని ఒక హోటల్లో దామచర్ల..రియాజ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరూ సహకరించండి ఎన్నికల తరువాత న్యాయం చేస్తానని జనార్దన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో రియాజ్ జనసేన సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మా కార్యకర్తలతో సమావేశమా... అంతేకాకుండా జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని రియాజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తేనే బాగుంటుందని ఆయన చెప్పినా దామచర్ల లెక్కచేయకపోవడంతో రియాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఉంచుకొని సొంతంగా కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటారని చెప్పినా వినకుండా కావాలనే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రియాజ్ వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్‌ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
సామాజిక సాధికార బస్సు యాత్ర.. తొమ్మిదోరోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నేటి(సోమవారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర గాజువాక, కాకినాడ రూరల్, మార్కాపురం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. గాజువాక సెంటర్లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. గం. 1.30 ని.లకు మింది గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభం కానుంది. రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉండగా, మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. పిల్లల పార్క్ మీదుగా కంభం సెంటర్‌వరకూ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం గం. 4.30ని.లకు వైఎస్సార్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొననున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మిథున్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. -
‘చంద్రబాబు యర్రగొండపాలెం రోడ్ షోపై మూడు కేసులు నమోదు’
సాక్షి, ప్రకాశం జిల్లా : జిల్లాలోని చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి. యర్రగొండపాలెంలో అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటంపై నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) మీడియా సమావేశంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్టాడుతూ.. ‘అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటం పై నిర్వాహకులపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్ల దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం పై దాడి చేసిన టీడిపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించాం. నిన్నటి(శుక్రవారం) చంద్రబాబు సభలో గొడవ పై విచారణ జరువుతున్నాం. ముందుగా అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే చోట సభ నిర్వహించడం పై కేసు నమోదు చేసాం. విచారణ తర్వాత ఎవరెవరిని కేసులో పెట్టాలో నిర్ణయిస్తాం. యర్రగొండ పాలెం ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు.’ అని తెలిపారు. -
గడపగడపకు మన ప్రభుత్వం: శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
ఒంగోలు సబర్బన్: నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని మూడో డివిజన్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. తొలుత డివిజన్ ప్రారంభంలోని బలరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు బాలినేనికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మిలటరీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి బాలినేని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో డివిజన్లో ఎక్కువ భాగం స్లమ్ ఏరియా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మూడో డివిజన్లో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మూడో డివిజన్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ డివిజన్లో ఎక్కువ అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. డివిజన్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గెలవాలని నినాదాలు చేశారు. మిలటరీ కాలనీలో ఒక మహిళ మంచినీటి ట్యాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వలేదని బాలినేని దృష్టికి తీసుకురాగా, ఎంఈ కే మాల్యాద్రిని పిలిచి బాలినేని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తామని ఎంఈ తెలిపారు. ఓ ఇంటి వాకిటికి ఎదురుగా విద్యుత్ స్తంభం ఉండటాన్ని బాలినేని గమనించారు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ ఇంటి మహిళ కూడా విద్యుత్ స్తంభం సమస్యను బాలినేని దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ఏఈని పిలిపించిన బాలినేని.. ఆ స్తంభాన్ని పక్కకు మార్చాలని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాలువల నిర్మాణానికి శంకుస్థాపన... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలటరీ కాలనీలో కాలువ నిర్మాణానికి బాలినేని శంకుస్థాపన చేశారు. టెంకాయలు కొట్టి భూమి పూజ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మిలటరీ కాలనీ, మసీదు కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేశామని, తొలుత మిలటరీ కాలనీలో కాలువ పనులు ప్రారంభించామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే జాఫర్, కార్పొరేటర్లు ఎందేటి పద్మావతి రంగారావు, చల్లా తిరుమల రావు, తాడి కృష్ణలత, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాకా బసివిరెడ్డి, ఇస్లాంపేట జిలానీ, బేతంశెట్టి శైలజ, యరజర్ల రమేష్, ఊసా మధుబాబు, డివిజన్ నాయకులు సుల్తాన్, రమీజా, కోటయ్య, చిన్నా, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, తదితరులు పాల్గొన్నారు. -
ఉనికి కోసం..సొంత పార్టీ వాళ్లకే మళ్లీ కండువాలేసి కొత్తగా చేరినట్లు..!
ఎక్కడైనా ఒక పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చిన వారిని ఆ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటారు. కానీ ఇప్పటికే పార్టీలో ఉన్న వారు మరోసారి కొత్తగా చేరినట్లు కలరింగ్ ఇవ్వడం, పక్క పార్టీకి చెందిన యువకులను మాయమాటలు చెప్పి పార్టీ కార్యాలయానికి పిలిపించి మెడలో పచ్చకండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు టీడీపీ జిల్లా నేతలు. నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందని జనాలకు చెప్పుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీకి ప్రజల్లో నూకలు చెల్లిపోతున్నాయి. పార్టీ కేడర్ క్రమంగా దూరమవుతోంది. దీంతో అధినాయకత్వం మొదలు జిల్లా స్థాయి నాయకుల వరకు ఏమీ పాలుపోవడం లేదు. ఎలాగైనా పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దొడ్డిదారి మార్గాన్ని అన్వేషించాడు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరిని బయటకు గెంటేస్తారా...వాళ్లను దగ్గరకు తీద్దామని ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి తోడు పార్టీలో ఉండేవాళ్లకే టీడీపీ కండువాలు వేసి వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీలో నుంచి కాకర్ల ఈశ్వర్ అనే కార్యకర్తను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా పెట్టాడు. దీనిని గమనించిన దామచర్ల.. కాకర్ల ఈశ్వర్‌కు వలవేశాడు. ఎలాగూ బాలినేని కుటుంబం తనను దూరంగా పెట్టింది. కాబట్టి ఇక్కడ మంచి ప్యాకేజీ మాట్లాకుంటే పోలా అని ఈశ్వర్ తలచాడు. దీంతో ఈశ్వర్ వైఎస్సార్సీపీలోని కొందరు అనుచరులకు ‘‘బాలినేని ప్రణీత్ అన్న వస్తున్నాడు వెళదాము రండి’’ అంటూ ఆదివారం కబురు పంపాడు. యువకులు కొందరు ద్విచక్ర వాహనాలు వేసుకొని వచ్చారు. వాళ్లందరి వాహనాలకు పెట్రోలు కొట్టించాడు. వీరితో పాటు టీడీపీ కార్యాలయం కూడా పార్టీలోని మరికొందరు యువకులను వాళ్లకు తోడు చేసింది. అయితే ఈశ్వర్ చెప్పింది ఒకటి..చేసింది మరొకటి. బాలినేని నివాసానికి అని చెప్పి పాత గుంటూరురోడ్డులోని టీడీపీ ఆఫీసుకు వాళ్లను తీసుకెళ్లాడు. దీంతో కొందరు ఆ విషయం పసిగట్టి వెనక్కు వెళ్లిపోయారు. కొందరు సన్నిహితంగా ఉండేవాళ్లు టీడీపీ కార్యాలయంలో ఇరుక్కుపోయారు. వాళ్లకు దామచర్ల చేత బలవంతంగా టీడీపీ కండువాలు వేయించాడు. సందట్లో సడేమియా అంటూ టీడీపీలో ఉన్న వాళ్లకు కూడా కొంతమందికి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్సీపీ నుంచి వచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా తేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పొరపాటు జరిగిపోయిందని సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కార్యాలయంలో ఈశ్వర్ చేసిన దుశ్చర్య గురించి చెప్పారు. టీడీపీలోకి వెళ్లటం తమకు ఇష్టం లేదంటూ మళ్లీ మేయర్ గంగాడ సుజాతతో పాటు మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల వద్ద పార్టీ కండువాలు వేయించుకున్నారు. పార్టీ కండువాలు వేయించుకున్న వారిలో బాపట్ల సాయి, కొప్పెర్ల విజయ్, శేఖర్, షాహిద్‌తో పాటు పలువురు ఉన్నారు. ఇదే తరహాలో నాలుగు రోజుల క్రితం మూడో డివిజన్లో కూడా మరో తంతు జరిగింది. మెప్మాలో గతంలో ఆర్పీగా పనిచేసిన టీడీపీ చెందిన ముంతాజ్.. గ్రూపు మీటింగ్ ఉందని చెప్పి కొంతమంది మహిళలను డివిజన్‌లోకి పిలిపించింది. వాళ్లలో పది మంది వరకు టీడీపీ వాళ్లే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ఏ ఒక్కరూ అక్కడకు వెళ్లలేదు. డివిజన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి దామచర్లను పిలిపించింది. వైఎస్సార్సీపీ నుంచి పార్టీలోకి వస్తున్నారంటూ దామచర్లకు చెప్పింది. అంతే ఆయన పచ్చకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కండువాల కార్యక్రమానికి ముందే కొంతమంది మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అసలు మూడో డివిజన్ టీడీపీ అధ్యక్షుడికి గానీ, కార్యదర్శికి కానీ ఈ కండువాల పంచాయితీనే తెలియదు. దీన్ని బట్టి అసలు టీడీపీలో ఎవరు ఉన్నారో కూడా దామచర్లకు తెలియదంటే ఆయనకు పార్టీ మీద ఉన్న పట్టు ఏపాటిదో అట్టే అర్థమవుతోంది. ప్యాకేజీల కోసం వచ్చే వారి కోసం దామచర్ల తివాచీలు పరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
అటవీశాఖ.. సరికొత్తగా
జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్‌ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్‌వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్‌లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్‌వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు. గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి... అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్‌గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్‌వో కేడర్‌లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది. ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఒంగోలు నగరంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – కే.మోహన రావు, డీఎఫ్ఓ, రెగ్యులర్ ఫారెస్ట్ -
జంగిల్ సఫారీ కొత్త కొత్తగా..!
నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం: రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్గాయ్లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్‌ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు. జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు. సఫారీకి అధునాతన హంగులు జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం. – విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల -
జీవనోపాధులను మెరుగుపరుస్తున్న స్త్రీ నిధి రుణాలు
మహిళా సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఇస్తున్న స్త్రీ నిధి రుణాలు వారి జీవనోపాధులను మెరుగుపరుస్తున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చేస్తున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. గుజ్జిబోయిన రంగలక్ష్మమ్మ. గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామం. రెండేళ్ల క్రితం వరకు కూలి పనులకు వెళ్తుండేది. ఆమె భర్త మేదర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రంగలక్ష్మమ్మ చెన్నకేశవ పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి తొలి విడత రూ.50 వేల స్త్రీ నిధి రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తూ తిరిగి రెండోసారి రూ.50 వేల రుణం తీసుకుంది. ఆ నగదుతో ఆరు నెలల క్రితం బుట్టలు, చాటలు, ఇతర వెదురు అల్లికల వస్తువులు పెద్ద మొత్తంలో తయారు చేసి ఇంటి వద్దనే దుకాణం పెట్టుకున్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉందని సంతోషంగా చెబుతోంది. గిద్దలూరు రూరల్: మహిళలు పురుషులపై ఆధారపడకుండా వారి స్వశక్తితో జీవితంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ నిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తూ నాలుగు రూపాయలు వెనకేసుకుంటూ ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. మహిళలు ఒకరి పై ఆధారపడకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం వారికి చేయూతనిస్తోంది. జిల్లాలో ని 38 మండలాలకు గాను 6599 పొదుపు గ్రూపులు ఉన్నాయి. అందులో 20,191 మంది సభ్యులైన మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.62.8 కోట్లను స్త్రీ నిధి కింద రుణాలిచ్చినట్లు స్త్రీనిధి ప్రాజెక్టు ఏజీఎం హర్షవర్ధన్ తెలిపారు. పొదుపు గ్రూపు సభ్యులందరి సమ్మతితో రుణం తీసుకుని వారి భాగానికి వచ్చే నగదుతో కొందరు బుట్టలు, తట్టలు, చాటలు, విసనకర్రలు, గొర్రెలు, మేకల పెంపకం, మెడికల్ షాపు, చిల్లర వ్యాపారం, చీరల దుకాణం, సప్లయర్స్ సామాన్లు వంటి వివిధ రకాల ఇతర వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో నెమ్మది నెమ్మదిగా తీసుకున్న రుణాలను తీర్చుకుంటూ రుణవిముక్తులవుతున్నారు. ఒక వైపు కుటుంబ భారాన్ని మోస్తూ మరో వైపు వ్యాపారాలు కొనసాగిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. స్త్రీ నిధి పథకం ద్వారా రుణం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే తిరిగి వారు తీసుకున్న రుణం చెల్లించాల్సిన అవసరం లేదు. పుష్కలంగా ఎరువులు ఖరీఫ్ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో అధికంగా వరి సాగు చేశారు. ఎరువులు వాడే తరుణం వచ్చింది. మార్కెట్‌యార్డులు, సొసైటీల వద్ద క్యూలైన్లు అవసరం లేదు. తెల్లవారుజామునే పరుగులు తీయాల్సిన పనిలేదు. బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పనిలేదు. పడిగాపులు కాయాల్సిన అవసరం అంతకంటే లేదు. పంటకు ఎరువు వేయాల్సిన సమయంలో ఎరువులు చేతికందుతాయో లేదో అనే చింత లేదు. రైతన్న సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్బీకేలు చింత తీరుస్తున్నాయి. ప్రస్తుతం అవసరం మేరకు ఎరువులు సిద్ధం చేశారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 2,42,314 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 3,16,169గా ఉంది. మిగిలిన 73,855 ఎకరాల్లో వరి, మిరప పంటల సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో వరి, పత్తి, మిరప, పసుపు ఇతర అపరాలు ఉన్నాయి. ఎరువులు వాడే తరుణం వచ్చింది. జిల్లాలో ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా కావాల్సిన ఎరువులకు ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఎరువు ఎంత అవసరమంటే.. ఇప్పటి వరకు జిల్లాలో సాగు చేసిన పంటలకు గాను 72,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఇప్పటికే 20,048 మెట్రిక్ టన్నుల యూరియా, 10,356 మెట్రిక్ టన్నుల డీఏపీ, 17,500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 1,763 మెట్రిక్ టన్నుల పోటాష్ కలిపి మొత్తం 49,667 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని డీలర్లు, సొసైటీలు, ఆర్బీకేల ద్వారా వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగునీరు అందుబాటులో.. ఈఏడాది వర్షమేఘాల కోసం ఎదురుచూడాల్సిన పనిలేకుండాపోయింది. జిల్లాలో జూన్, జూలై మాసాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం అన్ని ముఖ్య పంటలు జూలై చివరి వారం నుంచి సాగు మొదలైంది. దీంతో సెప్టెంబర్‌లో వాడే డీఏపీ ఎరువు ఈ నెలలోనే అవసరం అయింది. జిల్లాకు 12,850 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం కాగా, ఆగస్టు 26 నాటికి సుమారు 14,535 మెట్రిక్ టన్నుల డీఏపీ లభ్యతలోకి వచ్చింది. ఇంకా 2,758 మెట్రిక్ టన్నుల డీఏపీ ఆర్బీకేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. ఎరువుల సరఫరా నిరంతర ప్రక్రియ రైతులకు అవసరమైన ఎరువుల ఇండెంట్ మేరకు సరఫరా ప్రక్రియను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 24వ తేదీ నుంచి నెలాఖరువరకూ 2,650 టన్నుల డీఏపీ జిల్లాకు వచ్చింది. ఆర్బీకేలకు, సహకార సంఘాలకు సరఫరా చేయడం జరిగింది. అలాగే ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్ద కూడా ఎరువుల లభ్యత సంవృద్ధిగా ఉంది. జిల్లాకు వచ్చిన డీఏపీ ఎరువులను వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే రైతులకు అందించాలని, బ్లాక్ మార్కెట్, కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్‌లో కొరత లేదు జిల్లాలో ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు తీసుకున్నాం. కోటా మేరకు ఎరువులు సరఫరా జరిగేలా కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, మార్క్‌ఫెడ్ అధికారులతో తరచూ సమీక్షిస్తున్నాం. ఖరీఫ్ పూర్తయ్యేలోగా వేసిన పంటలకు జిల్లాకు నిర్దేశించిన ఎరువులు తెప్పిస్తాం. ఇంత వరకు జిల్లాలో ఎక్కడా ఏ రకం ఎరువు కొరతే లేదు. ఆగస్టులో కోటా కంటే ఎక్కువే తెప్పించాం. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడవద్దు. –నున్న వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
వాట్సాప్‌లో మెసేజ్.. అన్నా.. నేను చనిపోతున్నా..!
పెద్దారవీడు(ప్రకాశం జిల్లా): ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైనుంచి దూకి అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకం మిగిల్చిన ఈ విషాద సంఘటన పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వజ్రాల అశోక్‌రెడ్డి(17) మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదివాడు. చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. పరీక్షలు రాసిన తర్వాత నంద్యాల పట్టణంలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అశోక్‌రెడ్డి ఉత్తీర్ణుడు కాలేదు. గురువారం నంద్యాల నుంచి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులు, అన్న, అక్కతో గడిపాడు. అన్న ఆదినారాయణరెడ్డి ట్రాక్టర్ తీసుకుని పొలం పనులకు వెళ్లాడు. ఇంతలోనే అశోక్‌రెడ్డి గ్రామానికి సమీపంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైకి ఎక్కి తన అన్నతో పాటు జమనపల్లె గ్రామంలోని స్నేహితులకు ‘నేను చనిపోతున్నా’ అని వాట్సాప్‌లో మెసేజ్ పంపించాడు. తన సోదరుడు వచ్చేలోపు అశోక్‌రెడ్డి డ్యామ్ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యామ్ లోతు దాదాపు 400 అడుగులు ఉంటుందని స్థానికులు తెలిపారు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటరెడ్డి, రమణమ్మ గుండెలవిసేలా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
పవన్.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటి?: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం వెంపర్లడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనతో కలసి పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. జనసేన పార్టీ పెట్టి.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ -
వివాహేతర సంబంధం: గుంటూరులో చంపి.. మృతదేహం మార్టూరులో వేసి..
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని మార్టూరు వద్ద మూడు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోందంతంలో కిరాయి హంతకుల పాత్ర ఉందని గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికాగర్గ్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మార్టూరు మండలం కోనంకికి చెందిన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే మృతుడు ఎవరనేది తెలియరాలేదు. కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 గంటల్లోనే ఛేదించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న ఎస్పీ మలికాగర్గ్, పక్కన ఇతర పోలీసు అధికారులు ఇదీ..కథ మృతుడు గుంటూరు కొత్తపేట మంగళదాస్‌నగర్‌కు చెందిన గోగులపాటి బెన్నీ(41)గా గుర్తించారు. ఆయన సతీమణి బుజ్జికి అన్నం సుబ్బరామయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ వ్యవహారంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. చంపుతానంటూ పలుమార్లు భార్యను బెన్నీ హెచ్చరించేవాడు. 2021 సెప్టెంబర్ 1న భార్యతో గొడవపడి ఆమెను చంపేందుకు యత్నించాడు. కత్తిపోటు పక్కింటి వ్యక్తికి తగిలి అతను మృతి చెందాడు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చాడు. సుబ్బరామయ్యకు చెందిన అట్టల పరిశ్రమలో రూ.5 లక్షల విలువైన అట్టలు, ఆటోను తగలబెట్టాడు. ఎప్పటికైనా సుబ్బరామయ్యను చంపుతానని భార్యను అతడు బెదిరించాడు. ఈ విషయాన్ని ఆమె అన్నం సుబ్బరామయ్యకు చెప్పింది. ఇద్దరికీ ప్రాణహాని ఉందని సుబ్బరామయ్య భావించి బెన్నీని అడ్డు తొలగించుకునేందుకు పథక రచన చేశాడు. గుంటూరు వెంకటప్పయ్య కాలనీకి చెందిన చల్లా గోపీతో లక్ష రూపాయలకు బెన్నీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరామయ్య, గోపీ, గుంటూరు సంగడిగుంటకు చెందిన దొడ్డి వెంకట ప్రసాద్, సాయిబాబా కాలనీకి చెందిన ఇక్కుర్తి ఓంకార్, మంగళదాస్ నగర్‌కు చెందిన గోగులపాటి బుజ్జి, నల్లచెరువుకు చెందిన దుగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో మైనర్ బాలుడు కలిసి ముందుగా ఒక కారును అద్దెకు తీసుకున్నారు. కారులో బెన్నీ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని కోలలపూడి రోడ్లో కోనంకి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ముఠాగా ఏర్పడిన నిందులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో దొడ్డి వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్ గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు. లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో హిస్టరీ షీట్ కూడా ఉంది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి కిరాయి హత్యకు పాల్పడ్డారు. హత్యకు ఉపయోగించిన టవేరా కారు, ఇరన్రాడ్, కత్తి, పది ఫోన్లు, రూ.21 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, మార్టూరు, ఇంకొల్లు, జె.పంగులూరు ఎస్ఐలు ఎస్వీ రవీంద్రారెడ్డి, ఎన్సీ ప్రసాద్, పున్నారావు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఎస్ఐ పి.శరత్‌బాబు, హెడ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, జి.సుధాకరరావు, జి.పాపారావు, కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.అనీల్‌కుమార్, సీహెచ్ రత్నరాజు, బీవీ రమణ, బి.అవినాష్, ఎస్కే మొహ్మద్ రఫీ, హోంగార్డులు ఎం.ప్రభాకర్, టి.నాగరాజులను ప్రశంసపత్రాలు, రివార్డులతో ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
రాజన్న ప్రగతి బాట: ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే
ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే... ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే... బీడువారిన నేలతల్లికి జలసిరులందించిన భగీరథునిలా... లయతప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా... చదువు ‘కొన’లేక పేదింటి అక్షరం చిన్నబోతే... వయసుడిగిన నాడు ఆసరాలేక వృద్ధాప్యం ఉసూరుమంటే... ఇంటికి పెద్ద కొడుకై ఆదుకున్న ఆపన్న హస్తంలా.. ఆ మహానేత వైఎస్సార్ నిలిచారు.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆ చెరగని జ్ఞాపకాలతో, జిల్లాకు వైఎస్సార్ అందించిన అభివృద్ధి ఫలాలపై కథనం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ.. అభివృద్ధికి నోచుకోని ప్రకాశం జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధికి బాటలు వేశారు. జలయజ్ఞంతో ఇక్కడి దుర్భిక్ష పరిస్థితుల్ని పారదోలేందుకు నడుంకట్టారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే జిల్లాలో 2.60 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.480 కోట్లు రుణమాఫీ చేశారు. అందులో 2.17 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడ్డారు. 43,572 మంది రైతులకు వారు తీసుకున్న బ్యాంకు రుణాలు ఒకే మొత్తంలో పరిష్కరించుకునే విధానాన్ని అమలు చేశారు. దీంతో రైతులు రూ.97 కోట్ల మేర లబ్ధిపొందారు. కరువుతో అల్లాడిన రైతులు 1,23,147 మందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.62 కోట్లు రిలీఫ్ స్కీం కింద అందించారు. ఐదేళ్లలో ప్రాజెక్టులకు భారీగా నిధులు ►వైఎస్సార్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా నిధులిచ్చారు. 24.37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.6,280.11 కోట్లు ఖర్చు చేశారు. ►జిల్లాలోని 63,346 మంది విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. రూ.75 కోట్లు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించారు. ►2004 ముందు జిల్లాలో 2.86 లక్షల మందికి పింఛన్లు ఉన్నాయి. ఇందిరమ్మ మూడు దశల కార్యక్రమాల కింద అదనంగా 1.79 లక్షల మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశారు. పావలా వడ్డీ కింద రూ.20 కోట్లు పొదుపు గ్రూపులకు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. బ్యాంకు లింకేజి రుణాలు రూ.853 కోట్లు మంజూరు చేయించారు. ►జిల్లాలో 7.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించారు. 10,366 మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్ మెడికల్ కాలేజీ మంజూరు చేయించారు. 37.46 ఎకరాల్లో దాదాపు రూ.250 కోట్లతో మెడికల్ కళాశాల, వెయ్యి పడకల రిమ్స్ వైద్యశాలల నిర్మాణాలు చేపట్టారు. ►ఐదేళ్లలో 3,22,630 గృహాలు నిర్మించి పేదలకు అందించారు. 19,904 మంది భూమి లేని పేదలకు 31,734 ఎకరాలు పంపిణీ చేశారు. జిల్లాలో రూ.400 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టటంతో 4.50 లక్షల సాగర్ ఆయకట్టుకు నీరందింది. దీంతో యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల రైతులకు మేలు చేకూరింది. ►కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద పాలేరు నదిపై సంగమేశ్వరం వద్ద రూ.50 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేశారు. ►దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం, రూ.2 కోట్లతో మార్కెట్ యార్డు నిర్మించారు. ► కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ► కందుకూరులో రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. రూ.80 కోట్లతో రాళ్లపాడు ప్రాజెక్టు అనుసంధానం కోసం సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ నిర్మించారు. ►గిద్దలూరులో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.22 కోట్లతో రామన్న కతువ నిర్మించారు. ► చీరాల, పర్చూరుల్లో కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చారు. ► అద్దంకిలో రూ.400 కోట్లతో నార్కెట్‌పల్లి, అద్దంకి, మేదరమెట్లకు రాష్ట్రీయ రహదారి నిర్మించారు. 5 వేల ఎకరాలకు సాగునీరందించే యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు. ► 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది రైతుల కరెంట్ బకాయిలు రూ.59.5 కోట్లు వైఎస్సార్ రద్దు చేశారు. ఐదేళ్లలో మొత్తం 86,207 మంది రైతులు ఉచిత విద్యుత్ పొందారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 1.50 లక్షలకు చేరింది. ► 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలోనే ప్రజా రంజక పాలన సాగిస్తూ వ్యవసాయానికి, మహిళాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సాగుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ నవరత్నాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. -
అక్రమార్కులపై వేటు.. ఆపరేషన్ రెవెన్యూ
జిల్లా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి తిమింగళాలు, భూ బకాసురులు, అక్రమార్కులపై వేటుపడుతోంది. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రతి పనికో రేటు కట్టి రోజువారీ రాబడికి అలవాటుపడ్డారు. అలాంటి కలుపు మొక్కల ఏరివేత యజ్ఞానికి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చర్యలు అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములు కాపాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామంగా మారింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సరిగ్గా రెండు నెలల క్రితం జూన్ 2వ తేదీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అధికంగా భూ సమస్యలు ఉండటాన్ని గమనించారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలను సీరియస్‌గా తీసుకున్నారు. వాటిలో కొన్నింటిపై విచారణ చేయించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు రెవెన్యూ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే తహసీల్దార్‌ను కూడా సస్పెండ్ చేసి తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్న సంకేతాలు పంపారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రెండు సోమవారాలు మాత్రమే స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో దాదాపు 400కుపైగా రెవెన్యూ పరమైన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి అధికారులపై చర్యలు చేపట్టే దిశగా కలెక్టర్ వేగంగా అడుగులు వేశారు. గత వారంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సున్నితంగా మందలించారు. తప్పుచేసిన వారిని వదలబోనని, అక్రమాలకు పాల్పడిన వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని నిలదీశారు. వారం తిరగకుండానే అమలుచేశారు. ముగ్గురు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు... ప్రభుత్వ భూములను రక్షించలేకపోవడం, ఇతరులకు అక్రమంగా కట్టబెట్టడం లాంటి వాటితో పాటు భూ రికార్డులు తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. వారికి సహకరించిన ఆర్ఐలు, వీఆర్వోలను కూడా వదల్లేదు. పొదిలి తహసీల్దార్ ఏవీ హనుమంతరావుతో పాటు ఏఆర్ఐ శివరామ ప్రసన్న, కంబాలపాడు వీఆర్వో కె.కమలాకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా సిలికా సాండ్ భూముల లీజ్ అంశంలో అక్రమాలకు పాల్పడిన చినగంజాం తహసీల్దార్ కె.విజయకుమారిని కూడా సస్పెండ్ చేశారు. తాజాగా గత శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్ ఎన్.సుధాకరరావు, ఆర్ఐ పి.వి.శివప్రసాదు, వేములపాడు వీఆర్వో బి.నరసింహం, సీఎస్ పురం మండలం పెదగోగులపల్లి వీఆర్వో జే నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఆన్లైన్ చేసినట్లు వీరందరిపై ఆరోపణలు ఉండగా, విచారణలో రుజువు కావడంతో కలెక్టర్ కఠినంగా స్పందించారు. ప్రత్యేకంగా రెవెన్యూ ‘స్పందన’కు చర్యలు... జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు, కబ్జాదారుల బారి నుంచి కాపాడటంతో వారికి సహకరించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు కలెక్టర్ ఉపక్రమించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారితో పాటు వారికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులపై విచారణ నిర్వహించి వారందరినీ ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మారుస్తూ రికార్డులు తారుమారు చేస్తున్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కూడా ‘స్పందన’లో కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటన్నింటి పరిష్కారం కోసం గ్రామాల వారీగా భూ రికార్డులు పరిశీలించి ‘రెవెన్యూ స్పందన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల వ్యవధిలో ప్రైవేటు భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల్లో సగానికిపైగా భూ సమస్యలే... ఎన్ని స్పందన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని సమస్యలు పరిష్కరించినా.. రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పుల కారణంగా భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని కలెక్టర్ గుర్తించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం రెవెన్యూ పరమైన ఫిర్యాదుల్లో భూ సమస్యలు వేలల్లో ఉన్నాయి. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లా మొత్తం మీద భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై 13,766 అర్జీలు రాగా, 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 2,583 ఫిర్యాదులు వచ్చాయి. పాస్ పుస్తకాలు ఇవ్వాలని, వాటిని ఆన్లైన్ చేయాలని, ఒకరి భూమిని మరొకరి పేరుమీద ఆన్లైన్ చేశారని.. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకునే అధికారులకు అండగా ఉంటా. అధికారుల సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తానో, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలకు కూడా అదేవిధంగా వెనకాడేది లేదు. అన్ని శాఖల అధికారులు దీనిని గుణపాఠంగా తీసుకుని కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి. -
వేటపాలెం సొసైటీ అవకతవకలపై విచారణ
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ సొసైటీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆదివారం ఆయన స్పందించారు. ఏపీ సహకార సంఘాల చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రకాశం జిల్లా సహకార శాఖాధికారి రాజశేఖర్, డీఎస్పీ శ్రీకాంత్, సీఐ రోశయ్య ఇప్పటికే వేటపాలెం సొసైటీలో విచారణ చేపట్టారన్నారు. బాధితుల ఫిర్యాదుతో కార్యదర్శితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశారన్నారు. కాగా ఈ వ్యవహారంపై ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించామని, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
Munna Gang: దారుణాలు.. ఒంగోలు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ప్రకాశం జిల్లా: హైవే కిల్లర్ మున్నాకు ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతడితో పాటు మరో 10 మందికి కూడా మరణ శిక్ష ఖరారు చేసింది. కాగా పోలీసులం అంటూ లారీలను తనిఖీ చేసి పలువురు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపిన కేసులో మున్నా దోషిగా ఉన్నాడు. 2008లో వెలుగు చూసిన ఇలాంటి 4 కేసుల్లో మొత్తం 18 మందిపై నేరం నిర్ధారణ అయ్యింది. తనిఖీ పేరిట ఆపి.. మున్నా గ్యాంగ్ పోలీసుల మాదిరి వేషాలు ధరించి హైవేపై వాహనాలను ఆపేవారు చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు పాశవికంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో తేలింది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్టు నిరూపణ అయ్యింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్యచేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు. తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా గ్యాంగ్ పనేనని తెలుసుకున్నారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. అప్రమత్తమైన మున్నా.. దేశం వదిలి పారిపోయేందుకు యత్నించాడు. అయితే ఎట్టకేలకు కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఒంగోలుకు తీసుకువచ్చారు. చదవండి: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ దారుణాలు -
కడుపులో బిడ్డ.. కళ్ల ముందు జీవశ్చవంలా భర్త..
ఒంగోలు టౌన్: బ్లాక్ ఫంగస్ బారిన పడినవారి బతుకు చీకటి మయమవుతోంది. కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వ్యక్తి శరీరంలోని షుగర్ లెవల్స్‌పై బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఒంగోలులోని సీతారాంపురంలో నివాసముంటున్న పందిపంట్ల శ్రీను అనే యువకుడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారినపడి ఒక కనుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఫంగస్ ఇంకా శరీరంలోనే ఉండటంతో రెండో కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి.. చివరకు ఒక కన్నును కూడా కోల్పోయాడు. ప్రస్తుతం చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి దాదాపు రూ.18 లక్షల వరకు ఖర్చువుతుందని చెప్పడంతో శ్రీను భార్య మాలతి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆరో నెల గర్భిణి అయిన మాలతి కందుకూరులోని తన తండ్రి వద్ద ఉంటోంది. తల్లి చనిపోవడంతో తండ్రి వద్దనే ఉంటోంది. తిరగని ఆస్పత్రి లేదు... శ్రీను కరోనా బారిన పడటంతో గత నెల 21వ తేదీ కందుకూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వారం రోజుల తర్వాత 28వ తేదీ డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత నుంచి కుడి కన్ను వాసి ఎర్రగా ఉండటంతో కందుకూరులోని ఈఎన్టీ ఆస్పత్రికి వెళితే కంటిలో రక్తం గడ్డ కట్టిందని హైదరాబాద్ వెళ్లాలని వైద్యుడు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్, నిమ్స్ హాస్పిటల్, సరోజినిదేవి హాస్పిటల్, కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. అయితే కరోనా కేసులు ఉండటంతో అక్కడ చేర్చుకోలేదు. చివరకు యశోద హాస్పిటల్లో జాయినై ఎంఆర్ఐ, బ్రెయిన్, సిటీ స్కాన్ చేసిన తర్వాత మెదడుకు ఇన్ఫెక్షన్ పాకిందని, అర్జంట్‌గా చెన్నై తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 12వ తేదీ చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించిన వైద్యులు వెంటనే యాంటీ ఫంగస్ ఇంజక్షన్లు చేశారు. ఆ ఫంగస్ బ్రెయిన్‌కు కూడా పాకడంతో 18వ తేదీ ఆపరేషన్ చేసి కుడి కన్నుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఇన్ఫెక్షన్ ఎడమ కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దానికితోడు బ్రెయిన్‌కు కూడా ఫంగస్ వ్యాపించడంతో అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.. చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడాలంటూ మాలతి వేడుకుంటోంది. వైద్యానికి మొత్తం రూ.18లక్షల ఖర్చవుతుందని, ఎవరైనా దాతలు సాయంచేసి తన భర్త ప్రాణాలను కాపాడాలని కోరుతోంది. ఆరునెలల గర్భిణి యిన మాలతి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం కంటే, కంటి ముందే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న భర్త ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తోంది. సాయం చేయాలనుకునేవారు 7794896521 నంబర్‌ను సంప్రదించవచ్చు చదవండి: గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య మాయమాటలతో బాలికను మభ్యపెట్టి.. -
‘ఆ నలుగురూ’.. స్నేహితులే
కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు. భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు. చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై -
ప్యాంట్ విప్పి తనిఖీ.. అవమానంతో రైలు కిందపడి
సాక్షి, చీరాల: పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చీరాల్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కమల నాగరాజు, ఇందిర దంపతుల రెండో కుమారుడు ఎలీషా (19) బైపాస్ రోడ్డులోని యలమంచిలి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం నుంచి కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. స్లిప్పులు తెచ్చి పరీక్ష రాస్తున్నాడని స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రం వద్దే ప్యాంట్ విప్పించి తనిఖీ చేశారు. అంతేగాక పరీక్ష రాయకుండా బయటకు పంపించారు. డీబార్ కూడా చేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలీషా సాయంత్రం బేరుపేట సమీపంలో రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మంగళవారం ఉదయం విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ పాపారావు, ఎస్ఐలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు కళాశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాయంత్రానికి ఎలీషా మృతదేహంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ఎదుట బైఠాయించారు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తన సిబ్బందితో కళాశాల వద్దకు చేరుకుని సంఘటన జరగిన తీరు తెలుసుకున్నారు. బాధితుల ఆందోళన.. విద్యార్థుల నినాదాలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల తీరుతో ఎలీషా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు మధ్యవర్తుల హామీతో మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళన విరమించారు. చదవండి: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య -
టీడీపీలో అంతర్మథనం!
రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ పరాజయ యాత్రను కొనసాగిస్తోంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాలుగు దశల్లోనూ ఉనికి చాటేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడింది. తమ పార్టీ మద్దతుదారులు కాని వారిని తమ వారేనని చెబుతూ బుకాయించింది. వాస్తవానికి వరుస పరాజయాలు, వైఫల్యాలు టీడీపీ ముఖ్య నేతలను అంతర్మథనంలో పడేశాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు అభ్యర్థులు సాహసం చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పంచాయతీ ఎన్నికల్లో తన మద్దతుదారులతో కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ.. మున్సి‘పోల్’ సమరానికి ముందే ఢీలా పడింది! పంచాయితీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించేందుకు దూకుడు పెంచింది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో వైఎస్సార్ సీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా టీడీపీ తరఫున పోటీ చేసే వారు కరువయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు ఆరు పురపాలక సంఘాలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించి 14వ తేదీన ఓట్ల లెక్కించనున్నారు. గత ఏడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ సమయంలో అనామకులతో నామినేషన్లు వేయించి పరువు దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో ఇండిపెండెట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున మాత్రం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల పంచాయితీ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తర్వాత భయాందోళనలో ఉన్న టీడీపీకి పురపాలక సంఘాల ఎన్నికలు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారాయి. పరువు కాపాడుకునేందుకు అభ్యర్థులను బతిమాలి పురపాలక సంఘాల్లో నామినేషన్లు వేయించినా ఈ నెల 3వ తేదీ వరకు ఉపసంహరించుకోకుండా చూసేందుకు ఆ పార్టీ నేతలు నానాతంటాలు పడుతున్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కనీసం వార్డులకు సైతం అబ్యర్థులను నిలపలేని దుస్థితి టీడీపీకి ఏర్పడింది. టీడీపీ అభ్యర్థులతో పోలిస్తే ఇండింపెండెంట్లే అత్యధికంగా నామినేషన్లు వేశారంటే టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నామినేషన్ వేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలని యోచిస్తుండటంతో టీడీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి చెప్పనవసరం లేదు. చీరాల మున్సిపాలిటీలో టీడీపీకి అభ్యర్థులు కరువు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు మద్దతు తెలపడం, కరణం తనయుడు వెంకటేశ్, మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో చీరాల టీడీపీ ఖాళీ అయింది. దీంతో అక్కడ టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 13 వార్డుల్లో టీడీపీ తరఫున ఎవరూ బరిలోకి దిగలేదు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి వంటి చోట్ల సైతం టీడీపీకి అభ్యర్థులు దొరకక అనామకులతో నామినేషన్ వేయించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేనాటికి సగం మందికి పైగా పోటీ నుంచి తప్పుకుంటారనే విషయం టీడీపీ నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. చదవండి: బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! -
1970లో ఎన్నిక, ఇప్పటికీ పెద్ద దిక్కు ఆయనే!
నాగులుప్పలపాడు: ఐదు దశాబ్దాల క్రితం 1970లో పంచాయతీ బోర్డుకు ఒక యువకుడు ఎన్నికయ్యాడు. వామపక్ష భావజాలం నుంచి వచ్చిన అతడు 17 ఏళ్ల పాటు ఆ గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఈ రోజుకూ గ్రామానికి ‘పెద్ద దిక్కు’గానే కొనసాగుతున్నాడు. అదే ఉత్సాహంతో నేడు మరోసారి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ పర్యాయం ఆయన వయస్సు 80 ఏళ్లు. అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆయనే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కండ్లగుంటకు చెందిన పల్లెర్ల వెంకారెడ్డి. ఇదీ రాజకీయ ప్రస్థానం.. నాడు వామపక్ష భావజాలం బలంగా ఉన్న గ్రామా ల్లో కండ్లగుంట కూడా ఒకటి. అభ్యుదయవాదిగా ప్రజల్లో గుర్తింపు పొందిన వెంకారెడ్డి 1970లో తొలిసారి పంచాయతీ బోర్డుకు ఎన్నికయ్యారు. 1982 వరకు సర్పంచ్ కొనసాగారు. 1983లో మరోసారి సర్పంచ్‌గా ఎన్నియ్యారు. నాడు పంచాయతీ సమితిలో వర్క్స్ కమిటీ చైర్మన్‌గానూ విధులు నిర్వహిం చారు. 1990లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక 2005లో కండ్లగుంట సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తన మద్దతుదారుల ను రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా గెలిపిం చుకు న్నారు. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న వెంకారెడ్డి ఈ పర్యాయం మరోసారి సర్పంచ్‌గా గెలిచి గ్రామ సచివాలయంలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.