
సాక్షి, ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. ఈ ఘటనలో గురువారం అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. (శానిటైజర్ తాగి 9 మంది మృతి )
ఇక ఈ విషాదకర ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైన మృతులు.. మందు దొరకకపోవడంతో శానిటైజర్లు తాగారని, సీనియర్ అధికారులతో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment