kurichedu
-
సీఎం జగన్ రాకతో హోరెత్తిన వినుకొండ
-
కురిచేడు సీఎం కాన్వాయ్ డ్రోన్ విజువల్స్
-
జగన్ మామయ్య ని చూడడానికి నేరుగా
-
సీఎం జగన్ బస్సుయాత్ర: పోటెత్తిన పల్నాడు (ఫొటోలు)
-
సీఎం జగన్ రాకతో జనసంద్రమైన కురిచేడు
-
‘పర్ఫెక్ట్’వల్లే శానిటైజర్ మరణాలు
సాక్షి, ప్రకాశం : కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో సహా 10 మందిని సిట్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేసు వివరాలను ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. ఈ ఘటనకు హైదరాబాద్‌లో తయారు చేసిన ‘పర్ఫెక్ట్’సొల్యూషన్స్ శానిటైజర్లే కారణమని ఆయన తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా జీడిమెట్లలో అక్రమంగా నకిలీ శానిటైజర్లను తయ్యారు చేశారన్నారు. మిథైల్ క్లోరైడ్‌ను విచ్చలవిడిగా వినియోగించినట్లు విచారణలో తేలిందన్నారు. శానిటైజర్ల తయారీలో అధికారులకు చిక్కినా లంచాలు ఇచ్చి బయట పడ్డారని తెలిపారు. ఈ నకిలీ శానిటైజర్లను బెంగళూరు, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు నిందితులు సరఫరా చేశారని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. (చదవండి : కురిచేడు ఘటన: ఆసక్తికర విషయాలు వెలుగులోకి) మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు, శానిటైజర్ నిర్వాహకుడు సాలె శ్రీనివాస్‌ను విచారించిన సిట్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ ఆదాయంపై ఆకర్షితుడై లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి శానిటైజర్ తయారు చేసి ఆ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెట్టిన పదిరోజులల్లో బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో ఈ వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్ రోడ్డులో పర్ఫెక్ట్ కెమికల్స్ అండ్ సాల్వెంట్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అక్కడ తయారు చేసిన శానిటైజర్‌ని తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను నియమించుకున్నాడు. అయితే పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్ ఆల్కాహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి విక్రయించాడు. అదే పరిస్థితుల్లో శ్రీనివాస్ కరోనా బారిన పడటంతో, ఆ బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో శ్రీనివాస్ తలదాచుకోగా.. అతడి ఆచూకీని తెలుసుకున్న సిట్ బృందం అదుపులోకి తీసుకున్నారు. -
కురిచేడు శానిటైజర్ ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం
-
కురిచేడు ఘటన: ఆసక్తికర విషయాలు వెలుగులోకి
సాక్షి, ప్రకాశం: కురిచేడు శానిటైజర్ ఘటనపై సిట్ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. శానిటైజర్ నిర్వాహకుడైన సాలె శ్రీనివాస్‌ను సిట్ విచారించి అన్ని కోణాల్లో కూపీ లాగింది. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ తొలుత ఓ యజమాని వద్ద వాహనాలకు వాటర్ సర్వీసింగ్ చేసే పనిలో చేరినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం సొంతంగానే వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ సమయంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో శానిటైజర్ల తయారీపై చేసిన వీడియోను చూసి శ్రీనివాస్ ఆకర్షితుడయ్యాడు. దీంతో వెంటనే ఇంట్లోనే శానిటైజర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన కూతురుకు చెందిన బంగారు వస్తువులను అమ్మి రూ. 4,500 నగదు సమీకరించుకున్నాడు. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి) ఆ నగదుతో శానిటైజర్ తయారీకి కావాల్సిన ముడిసరుకులను కొని తొలుత ఇంట్లోనే శానిటైజర్ల తయారీని ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించిన పదిరోజుల్లోనే బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్ రోడ్డులో పర్ఫెక్ట్ కెమికల్స్ అండ్ సాల్వెంట్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. అంతేగాక.. తయారు చేసిన శానిటైజర్లను తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను శ్రీనివాస్ నియమించుకున్నాడు. (కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం) అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో శ్రీనివాస్ కరోనా బారిన పడ్డాడు. దీంతో బాధ్యతలను తమ్ముడికి అప్పగించాడు. పెరిగిన ఖర్చులకు తోడు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్ ఆల్కహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి శ్రీనివాస్ విక్రయాలు సాగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో తల దాచుకున్నాడు. అయితే శ్రీనివాస్ ఆచూకీని గుర్తించిన సిట్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 12.30కి శానిటైజర్ కేసులో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. -
కురిచేడు ఘటన.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, ప్రకాశం జిల్లా: కురిచేడులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో శానిటైజర్లు విక్రయించిన పర్ఫెక్ట్ శానిటైజర్ కంపెనీ నిర్వహకుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శానిటైజర్లలో మిథైల్ ఆల్కహాల్‌కు బదులు మిథైల్ క్లోరైడ్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నాడని.. ఏజెంట్ల ద్వారా కురిచేడు, దర్శిలలో శానిటైజర్లు విక్రయించినట్టు విచారణలో తేలింది. (చదివింది మూడు.. నకిలీ కంపెనీని సృష్టించి) కురిచేడు మండల కేంద్రంలో జూలై 30వ తేదీ గురువారం రాత్రి శానిటైజర్ తాగి ఇద్దరు మరణించారనే వార్త బయటికొచ్చింది. అంతా అప్రమత్తమయ్యే లోపే శుక్రవారం 11 మంది, శనివారం ఇద్దరు, ఆదివారం మరొకరు చొప్పున ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారి ఇళ్ల వద్ద పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్ బాటిళ్లు గుర్తించిన పోలీసులు అవి ఎవరు అమ్మారనే దానిపై విచారణ జరిపినప్పటికీ కురిచేడులో వాటిని అమ్మిన మెడికల్ షాపులు నిర్వాహకులు అప్పటికే వాటిని దాచేసి తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. బృందం ఐదు రోజుల పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్ ఫ్యాక్టరీలకెళ్లి తనిఖీలు నిర్వహించింది. అయితే పర్ఫెక్ట్ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగరంలో శానిటైజర్లు అమ్మే మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో పర్ఫెక్ట్ కంపెనీ శానిటైజర్లను అమ్ముతున్న డిస్ట్రిబ్యూటర్ పాయింట్‌ను కనిపెట్టారు. వీరిని విచారించడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ గోడౌన్లో అక్రమంగా తయారవుతున్న పర్ఫెక్ట్ కంపెనీ కేంద్రాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. -
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు : తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసికొంది. సానిటైజర్ తాగి నలుగురు చనిపోయారు. మృతులు స్కేవెంజెర్ కాలనీకి చెందిన కార్మికులు వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. దీంతో కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, ఇటీవలే ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.(శానిటైజర్ తాగి 12 మంది మృతి) మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టుషాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. శానిటైజర్లు తాగుతున్న144 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్స్ లను పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లను తయారు చేస్తున్న 76 మందిపై ఎస్ఈబీ అధికారులు కేసులు నమోదు చేశారు. -
శానిటైజర్ తాగి 12 మంది మృతి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/కురిచేడు: ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో పెనువిషాదం చోటుచేసుకుంది. శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు గురువారం రాత్రి.. మిగిలిన తొమ్మిది మంది శుక్రవారం మరణించారు. మృతులంతా యాచకులు, రిక్షా పుల్లర్లు, కూలీలే. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలివీ.. కురిచేడు మండల కేంద్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు గత కొద్దిరోజులుగా లాక్డౌన్ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయించారు. దీంతో గత 14 రోజులుగా వీరంతా మద్యం దొరక్క శానిటైజర్లకు అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో.. అనేకమంది చేతులు వణుకుతున్నాయంటూ ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పి గురువారం శానిటైజర్ సేవించారు. దీంతో ఈ రెండ్రోజుల్లో మొత్తం కలిపి 12మంది బలయ్యారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని.. తాము అన్యాయమైపోయా మంటూ మృతుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆక్రందనలు కురిచేడులో మిన్నంటాయి. మృతులంతా నిరుపేదలే శానిటైజరు తాగి మృతిచెందిన బాధితులంతా నిరుపేదలే. గురువారం రాత్రి ఇద్దరు..శుక్రవారం మరో 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో కోటగిరి రమణయ్య (45), కడియం రమణయ్య (27), గుంటక రామిరెడ్డి (57), మాడుగుల చార్లెస్ (36), రాజారెడ్డి (65), అనుగొండ శ్రీను (30), భోగ్యం తిరుపతయ్య (35), పాలెపోగు దాసు (65), కుండా అగస్టీన్ (42), షేక్ సైదా (30), కనకాల బాబూరావు (49) ఉన్నారు. బొనిగల శ్రీను అనే మరో యువకుడు స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మృతుల కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్ణకరమన్నారు. ఘటనపై కురిచేడు వీఆర్వో సీహెచ్ వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందం : ఎస్పీ కాగా, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ శుక్రవారం గ్రామంలోని మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు సేకరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మార్కాపురం ఓఎస్డీ చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. వివిధ మెడికల్ షాపుల్లో అమ్ముతున్న శానిటైజర్లను సీజ్ చేయడంతో పాటు మృతులు తాగిపడేసిన సీసాలను సీజ్ చేసి కెమికల్ ఎనాలసిస్ కోసం ల్యాబ్‌కు పంపుతున్నామని చెప్పారు. రిపోర్టు అందిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యానికి అలవాటుపడ్డ వారు ఎలాంటి శానిటైజర్లు, మత్తు పదార్థాలను సేవించవద్దంటూ ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా దీనిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. మూడు నెలలుగా శానిటైజర్లే గ్రామంలో 30 మందికి పైగా మత్తు కోసం శానిటైజర్లు తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు గత మూడు నెలలుగా శానిటైజరు తీసుకుంటున్నట్లు అధికారులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే, గ్రామంలో ఇంకా ఎంతమంది దీనికి అలవాటుపడ్డారనే దానిపై నిఘా పెట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్క కొందరు.. మద్యం ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటిని కొని తాగలేక మరికొందరు శానిటైజర్లకు అలవాటుపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ వ్యాపారం కోసం కొందరు మెడికల్ షాపు నిర్వాహకులు వాటిని అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుల్లో నలుగురికి కరోనా శానిటైజర్ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం సందర్భంగా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. వారి కుటుంబసభ్యులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సన్నద్ధమవుతున్నారు. -
మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..
-
కురిచేడు మృతుల ఘటన బాధాకరం: లక్ష్మణరెడ్డి
సాక్షి, గుంటూరు: ఆల్కహాల్ తీసుకోవడంతో అది మనిషి రోగ నిరోధక శక్తిపై గణనీయమైన ప్రభావం చూపే ప్రమాదముందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం అందుబాటులో లేదని శానిటైజర్ తాగి ప్రాణాలొదిలిన ఘటనపై లక్ష్మణరెడ్డి తీవ్రంగా చలించి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. మద్యం, మత్తు పదార్ధాలు వ్యసనంగా మారి వత్తిడికి గురవడంతోనే పేదలు వివిధ ప్రత్యామ్నాలకు పోయి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం బాధాకరమన్నారు. అలాంటి వ్యసనపరులను మద్యం, మత్తుల నుంచి విముక్తి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం డి- అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 15చోట్ల ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రులలో డి- అడిక్షన్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. మరో 10 చోట్ల సైతం ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టిందని తెలియజేశారు. (మద్యానికి బానిసై.. ప్రాణాలు కోల్పోయి..) వ్యక్తిగత కౌన్సిలింగ్‌తో పాటు వ్యసనపరులు తాగుడుకు దూరమైనప్పుడు కనిపించే లక్షణాలకు తగిన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ మనసును నియంత్రించుకోవడం కూడా అవసరమేనని లక్ష్మణరెడ్డి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ కోవిడ్ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు పొగతాగడం, మద్యం, మత్తు మందులు వినియోగించడం చేయరాదని సూచించిందని గుర్తుచేశారు. మద్యం, మత్తు ఒక్కసారిగా ఆగిపోతే చేతులు, కాళ్లు వణకడం, గందరగోళానికి గురి కావడం, కొన్ని కేసులలో ఫిట్స్‌కు గురి కావడం జరుగుతుందని..ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మద్యం తీసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో నష్టమే ఎక్కువ ఉందని తెలిపారు. మద్యం తీసుకుంటే ఆందోళన కాస్త తగ్గించవచ్చేమో కానీ మద్యం ప్రియులు డిప్రెషన్లోకి చేరుకునేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. (కురిచేడులో విషాదం..) సాధారణ రోజుల్లో తాము ఎంత తాగాలనే దానిపై మద్యం ప్రియులకు ఓ అంచనా ఉంటుందని.. కానీ, కరోనా లాంటి కాటస్ట్రోపిక్ ఈవెంట్స్ లాంటివి ఈ మొత్తాన్ని అధికం చేస్తాయని హెచ్చరించారు. మద్యపానం వల్ల వైరస్ దరిచేరదన్నది అపోహ మాత్రమేనని...నిజానికి లివర్, శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మద్యం అధికంగా సేవించడం వల్ల కోపం, నిరాశ, డిప్రెషన్‌లోనికి జారిపోవడంతో పాటుగా గృహ హింస లాంటివి సైతం పెరిగే అవకాశాలున్నాయని సైకాలజిస్టులు చెబుతుండటం గమనార్హం అన్నారు. మద్యపానం మానేయడంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడంతో పాటుగా సరిగా నిద్ర పట్టడం, భావోద్వేగాలు నియంత్రణలో ఉండటం లాంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయని వివరించారు. మద్యపానం మానేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని.. కాలేయ ఆరోగ్యం, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గేందుకు అవకాశం ఉండటంతో పాటుగా కొన్ని రకాల కేన్సర్లు కూడా నివారించబడే అవకాశాలున్నాయని చెప్పారు. ఆల్కహాల్ తీసుకోకపోవడంతో బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. లిక్కర్లో ఉండే కేలరీలతో బరువు పెరగడమే కాకుండా, ఆల్కహాల్ వల్ల తెలియకుండానే అధికంగా తినడం జరుగుతుందన్నారు. ఒత్తిడితోనే చాలామంది మద్యం తీసుకుంటుంటారని.. దాన్ని నియంత్రించుకోగలిగితే చాలా వరకూ అలవాటుకు దూరం కావచ్చని తెలిపారు. వ్యాయమాలు, యోగా లాంటి వాటితో ఈ ఒత్తిడిని కొంతమేర నియంత్రించుకోవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. (శానిటైజర్ అమ్మకాలపై కీలక ప్రకటన) ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు వచ్చే ప్రమాదమున్నందున ప్రతీ ఒక్కరు ఏదొక ఉపయోగకరమైన పని కల్పించుకుంటే ఈ అలవాటుకు దూరం కావచ్చన్నారు. మనసును మద్యం నుంచి ఇతర అంశాలపైకి దృష్టి మళ్లించడం మంచిదన్నారు. మద్యం దొరకడం లేదనే బెంగతో కొంతమంది కృశించిపోతున్నారని.. దానికి బదులు కరోనా తనకు మద్యం అలవాటు మాన్పించేందుకు ఓ అవకాశం ఇచ్చిందని ప్రతీ ఒక్కరూ భావించాలన్నారు. ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని ఉద్భోదించారు. వత్తిడి తట్టుకోలేని వారు స్నేహితులు, కుటుంబసభ్యుల సలహాలను తీసుకోవడమే మంచిదని... వారి సలహాలతో పాటు సకాలంలో ఆయా జిల్లాకేంద్రాల్లోని డి-అడిక్షన్ కేంద్రాలకు వెళ్లడం లాభించవచ్చని లక్ష్మణరెడ్డి సూచించారు. -
వారం రోజులుగా శానిటైజర్ తాగుతూ..
సాక్షి, ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. ఈ ఘటనలో గురువారం అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. (శానిటైజర్ తాగి 9 మంది మృతి ) ఇక ఈ విషాదకర ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైన మృతులు.. మందు దొరకకపోవడంతో శానిటైజర్లు తాగారని, సీనియర్ అధికారులతో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
నిన్న నిశ్చితార్థం.. నేడు నామినేషన్..!
సాక్షి, కురిచేడు: కురిచేడు ఎంపీపీ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ తరఫున ఓ యువతి బరిలోకి దిగుతోంది. అందులో ఆశ్చర్యమేముందంటారా..?...ఉంది!! మంగళవారం రాత్రి అప్పటికప్పుడు ఆ యువతికి ఓ యువకుడితో నిశ్చితార్థమైంది. కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమైంది. తాను ఎంపీపీ పదవి రేసులో ఉంటానని ఆ యువతి ఊహించి ఉండదు. అనుకోని విధంగా వరించిన ఈ అవకాశంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేవు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ అయింది. వైఎస్సార్ సీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌కు అప్పగించారు. చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు కావడంతో తన భార్యను పోటీకి నిలిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన పెద్దకుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. గంగదొనకొండ గ్రామానికి చెందిన పార్శ్వపు వెంకటనర్సయ్య కుమార్తె శిరీషతో మంగళవారం రాత్రి అప్పటికప్పుడు నిశ్చితార్థం చేశారు. ఈ నెల 11వ తేదీతో ఎంపీటీసీ పదవులకు నామినేషన్ గడువు ముగియనుండటంతో తన కోడలిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో ఈ వివాహం నిశ్చయించారు. తమ గ్రామానికి చెందిన ఎంపీటీసీ స్థానం ఇతర వర్గాలకు రిజర్వు కావడంతో కల్లూరు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా కాబోయే కోడలు పార్శ్వపు శిరీషతో బుధవారం నామినేషన్ వేయించేందుకు బెల్లం చంద్రశేఖర్ సిద్ధమయ్యారు. -
140 మందికి ఒక్కటే మరుగుదొడ్డి..!
సాక్షి కురిచేడు(ప్రకాశం) : కనీస వసతులు లేని ఓ ప్రైవేటు అద్దె భవనంలో స్థానిక ఎస్సీ బాలుర హాస్టల్ కునారిల్లుతోంది. హాస్టల్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు సొంత భవనం లేకపోవడంతో ప్రైవేటు భవనాల్లో అరకొర సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. ఫలితంగా అందులో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ హాస్టల్లో ప్రస్తుతం 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10 మంది, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నలుగురు, 5వ తరగతి చదువుతున్న వారు 17, 6వ తరగతి వారు 36, 7వ తరగతి వారు 22, 8వ తరగతి వారు 12, 9వ తరగతి వారు 20, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 19 మంది ఉన్నారు. కాగా, వీరందరికీ కేవలం 7 గదులు మాత్రమే ఉండటంతో ఒక్కో గదిలో 20 మంది వరకూ ఉంటూ ఆ గదుల్లోనే పెట్టెలు పెట్టుకుని అక్కడే చదువుకుని అక్కడే పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గదులు ఇరుకుగా ఉండటంతో విద్యార్థులు నిత్యం అవస్థపడుతున్నారు. హాస్టల్లో పేరుకు మూడు మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన రెండూ మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారాయి. దీంతో బహిర్భూమి కోసం గ్రామం వెలుపల గల శ్రీజ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం అవతలికి వెళ్తున్నారు. రాత్రివేళ మల, మూత్ర విసర్జన చేయాలన్నా.. ఆరుబయటకు వెళ్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్నానాలు, దుస్తులు ఉతుక్కోవడానికీ ఇబ్బందులే... హాస్టల్లో స్నానాలు చేసేందుకు, దుస్తులు ఉతుక్కునేందుకు, భోజనం చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం ఇక్కట్లకు గురవుతున్నారు. హాస్టల్ భవనం వెనుక గల కొద్దిపాటి ఖాళీ స్థలంలోనే ఈ పనులన్నీ చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు చదువుకునేందుకు హాలుగానీ, భోజనశాలగానీ లేకపోవడంతో ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు. సుమారు 40 సంవత్సరాల నుంచి ప్రైవేటు భవనాలలోనే ఎస్సీ హాస్టల్‌ను నిర్వహిస్తున్నప్పటికీ సొంత భవనం నిర్మాణం గురించి ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపానపోలేదు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించి సరైన వసతులు కల్పించడంలో అధికారులు, గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్ఎస్పీ కాలనీలో ఎస్సీ హాస్టల్‌కు అన్ని వసతులతో కూడిన విశాలమైన నూతన భవనం నిర్మిస్తే 150 మందికిపైగా విద్యార్థులు చేరినా ఇబ్బంది ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం, పాలకులు, అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. హాస్టల్లో వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం మా హాస్టల్లో సరైన వసతులు లేవు. రాత్రివేళ మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాలంటే భయంగా ఉంటోంది. కానీ, బయటకు వెళ్లక తప్పడం లేదు. అన్నం తినడం, దుస్తులు ఉతుక్కోవడం, స్నానం చేయడం అన్నీ ఒకేచోట కావడం వలన బాగా ఇబ్బంది పడుతున్నాం. మంచి హాస్టల్ నిర్మిస్తే బాగుంటుంది. - అనూక్, ఐదో తరగతి విద్యార్థి సొంత భవనం నిర్మిస్తేనే సమస్య తీరేది హాస్టల్‌కు సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులకు గదులు చాలక, సరైన వసతులు లేక ఇబ్బందిగా కుంది. ప్రైవేటు భవనం కావడంతో చాలీచాలని గదులు, సౌకర్యాల కొరతతో సమస్య నెలకొంది. విద్యార్థులు సర్దుకుపోతూ చదువుకుంటున్నారు. సొంత భవనం నిర్మిస్తేనే ఈ సమస్యలన్నీ తీరి మరికొంతమంది విద్యార్థులకు కూడా హాస్టల్లో అవకాశం కల్పించవచ్చు. ఎం.శివశంకర్, వార్డెన్ -
భళా...రైతన్నా
కురిచేడు: కురిచేడు సమీపంలోని నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ 124వ మైలురాయిలోని ఐనవోలు మేజరు హెడ్ గత నెల 27వ తేదీన కుప్పకూలిపోయింది. సంబంధితాధికారులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులైనా ప్రధాన కాలువకు నీటి పరిమాణం తగ్గించి మరమ్మతులు చేపట్టకపోవటంతో ఆదివారం50 మంది రైతులు స్వచ్ఛందంగా శ్రమదానానికి శ్రీకారం చుట్టారు. మేజరు పరిధిలోని నాగిరెడ్డి పల్లె, మృత్యుంజయపురం గ్రామాలకు చెందిన ైరె తులు చందాలు వసూలు చేసుకుని ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జలయజ్ఞానికి దిగి ఫలితం సాధించారు. గత నెలలో మేజరులో పేరుకున్న పూడికతీతకు కూడా అధికారులు సహకరించకపోవటంతో వినుకొండ శాసనసభ్యుడి ద్వారా ఎన్.ఎస్.పి. ఉన్నతాధికారులతో మాట్లాడుకుని పూడిక తీసుకున్నారు. మేజరు హెడ్ కూలిపోవటం, వారం రోజులైనా పనులు ప్రారంభించకపోవటంతో వరినాట్లు, నార్లు ఎండిపోతున్నాయి. ఈ తరుణంలో రైతులు నడుంబిగించి మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వంకాయలపాటి బాలకోటయ్య,అమృతపూడి నాగేశ్వరరావు,మృత్యుంజయపురానికి చెందిన ముండ్రు సుబ్బారావు,యోగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శేషిరెడ్డిలు ముందుండి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు నడిపించారని గ్రామస్తులు అభినందించారు. దీని నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఎన్.ఎస్.పి.అధికారులు తెలిపారు. ఖర్చు రైతులే భరిస్తున్నారు పణిదెపు చిన్న వెంకటేశ్వర్లు, మృత్యుంజయపురం మేజరు మరమ్మతులకు అవసరమైన ఖర్చు మృత్యుంజయపురం, నాగిరెడ్డిపల్లె గ్రామాల రైతులే భరిస్తున్నారు. అందరం కలిసి నిర్మించుకోవాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనులు చేసుకుంటున్నాం. అధికారులు చేసేపాటికి పంటలు ఎండిపోతాయి- వంకాయలపాటి బాలకోటయ్య,నాగిరెడ్డి పల్లె అధికారులు చేస్తారని వారం రోజులుగా ఎదురు చూశాం. కానీ చేయలేదు. వారు చేసే పాటికి పంటలు ఎండిపోతాయి. ఏటా కాలువలో పూడిక తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా తీసుకున్నాం. మరమ్మతులు కూడా చేసుకుంటున్నాం. ఇంతవరకు అధికారులు రూపాయి కూడా ఇవ్వలేదు. నలుగురితో పెట్టుబడి పెట్టి చేస్తున్నాం -సి.హెచ్.మస్తాన్,చింతలచెరువు నలుగురు రైతులతో పెట్టుబడి పెట్టించి ముందు పనిచేయిస్తున్నాం. మా శ్రమను గుర్తించి సంబంధితాధికారులు కనీస వ్యయాన్ని అయినా ఇప్పిస్తే మరో పనికి వెచ్చిస్తాం. బిల్లు చేసి రైతులకు ఇస్తాం- ఈ.ఈ. బి.ఎస్.వి.ప్రసాదు ప్రస్తుతం రైతులు, మేము కలిసిపనులు చేస్తున్నాం. ఈ పనికి మూడు లక్షల అంచనా వేస్తున్నాం. పని పూర్తయ్యాక బిల్లులు చేసి రైతులకు ఇస్తాం. అయకట్టు పరిధిలోని రైతులు ముందుకు వచ్చి ఇలా సహకరిస్తే బాగుంటుంది. -
చేపల చెరువులకు.. సాగర్ జలాలు
కురిచేడు: ప్రజల దాహార్తి తీర్చేందుకు నాగార్జున సాగర్ కాలువకు విడుదల చేసిన నీటిని మేజర్లు, ఎస్కేప్ చానళ్ల ద్వారా చేపల చెరువులకు మళ్లిస్తున్నారు. జిల్లాకు విడుదల చేసిన జలాలు మంగళవారం రాత్రి కురిచేడు చేరాయి. ఈ నీటితో మంచినీటి చెరువులు, రిజర్వాయర్లను నింపాల్సి ఉంది. అయితే ఆ నీటితో చేపల చెరువులు నింపేందుకు పక్కా ప్రణాళిక తయారు చేశారు. అందుకు ఎన్ఎస్పీ అధికారుల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి. చేపల చెరువులున్న మేజర్లకు నీటిని విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూరుస్తోంది. తాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేసిన నీటిని మేజర్ కాలువలకు విడుదల చేయకూడదు. కానీ ప్రధాన కాలువ పరిధిలోని 115వ మైలులో ఉన్న పడమర కాశీపురం మేజరుకు నీటిని విడుదల చేశారు. 116, 117, 118 మైళ్లలో ఉన్న కల్లూరు మేజర్లకు స్వల్పంగా నీటిని విడుదల చేసి సీపేజి అని చెబుతున్నారు. ఆ నీరు కల్లూరు చేపల చెరువుకు చేరుతోంది. 119 వ మైలులోని నాంచారపురం మేజరును ఎత్తివేసి ఆవులమంద చేపల చెరువుకు నీటిని తరలిస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని చేపల చెరువులు నింపేందుకు 124 వ మైలులోని ఐనవోలు మేజరును పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. దర్శి బ్రాంచి కాలువ పరిధిలోని పడమరవీరాయపాలెం మేజరుకు స్వల్పంగా నీటిని విడుదల చేశారు. పమిడిపాడు బ్రాంచి కాలువ పక్కనున్న ఎస్కేప్ చానల్ గుండా నీరు చేపల చెరువులకు చేరుతోంది. ఈ ఎస్కేప్‌ఛానల్ గోడను చేపల చెరువులకు నీరు వెళ్లేందుకు పడగొట్టారు. దీనిపై ఈనెల 11న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్ఈ కోటేశ్వరరావు అదేరోజు కాలువపై పర్యటించి పడిపోయిన గోడ నిర్మించాలని ఆదేశించారు. అయితే కిందిస్థాయి అధికారులు ఆ గోడ నిర్మిస్తూ రంధ్రాలు వదిలేయడంతో నీరు యథాప్రకారం బయటకు వచ్చి వాగుద్వారా చేపల చెరువుకు తరలిపోతోంది. స్థానిక అట్లపల్లి రిజర్వాయర్ ఉన్నచోట సాగర్ కాలువకు తూము ఏర్పాటు చేస్తే..కాలువకు నీరు వచ్చిన సమయం లో ఎటువంటి వ్యయం లేకుండానే రిజ ర్వాయరు నింపుకోవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో తాగునీటి కోసం నీరు విడుదల చేసినప్పుడల్లా వేలకు వేలు వెచ్చించి నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మేజర్లిలా..నీరు పారేదెలా..?
కురిచేడు: సాగర్ కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా..మేజర్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మేజర్ల నిండా చెట్లు, మట్టి కుప్పలు నిండి నీరు పారే దారి లేకుండాపోయింది. మండలంలోని నాగార్జున సాగర్ ప్రధాన కాలువ పరిధిలో 7 మేజర్లున్నాయి. వాటి పరిధిలో 13,285.93 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే దర్శి బ్రాంచ్ కెనాల్ పరిధిలో 9 మేజర్లున్నాయి. వాటి కింద 8077.21 ఎకరాల ఆయకట్టు ఉంది. పమిడిపాడు బ్రాంచ్ కాలువ పరిధిలో పది మేజర్లుండగా..వాటి కింద 36,730 ఎకరాల ఆయకట్టు ఉంది. దర్శి బ్రాంచ్ కాలువ పరిధిలోని చింతలచెరువు మేజరు పరిస్థితి అధ్వానంగా ఉంది. దీనికింద 1542 ఎకరాల ఆయకట్టు ఉంది. మేజరు నిండా చెట్లు పెరిగి, మట్టికుప్పలు అడ్డుగా ఉన్నాయి. కట్టకు గండ్లు పడినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పక్క పొలంలోని రాళ్లను తెచ్చి తాత్కాలికంగా గండిపూడ్చి రాకపోకలు సాగిస్తున్నారు. మేజరుకు 11.71 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. ఆ నీరు గండ్లలో నుంచి చెరువులకు చేరుతున్నాయే తప్ప చివరి భూములకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కెల్లపాడు మేజర్ల పరిధిలో 516 ఎకరాల ఆయకట్టు ఉంది. వాటికి 8 క్యూసెక్కుల నీరు విడుదల కావాల్సి ఉంది. మేజరు ఆరంభంలోనే కాంక్రీటు పగిలిపోవడంతో నీళ్లు వదిలినప్పుడు వృథాగా పోతాయి. దర్శి బ్రాంచ్ కాలువపై పమిడిపాడు బ్రాంచ్ కాలువ పక్కన ఉన్న ఎస్కేప్ చానల్‌కు గోడకూలి నీరు వృథాగా వాగులపాలవుతోంది. మొక్కుబడిగా సీఈ పరిశీలన జిల్లాకు తాగునీరు విడుదల చేసిన సందర్భంగా ఆధునికీకరణ పనులు ఎంత మేర జరిగాయి..పనుల్లో నాణ్యత ఎలా ఉందనే అంశాలపై ఎన్ఎస్పీ సీఈ వీరరాజు శనివారం పరిశీలించారు. అయితే మొక్కుబడి పరిశీలనే తప్ప మేజర్లు, మైనర్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎస్కేప్ ఛానల్గుండా నీరు వృథాగా వాగుకు వెళ్లి..అటునుంచి చేపల చెరువుకు చేరుతోంది. ఎన్ఎస్పీ అధికారులు చేపల చెరువుల కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎస్కేప్ ఛానల్‌కు పడిన రంధ్రాన్ని పూడ్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పమిడిపాడు బ్రాంచ్ కాలువ ఆరంభంలో లైనింగ్‌కు రంధ్రాలు పడి నా దాని గురించి అధికారులను సీఈ ప్రశ్నించలేదు. జిల్లాకు తాగునీటి అవసరాల కోసం విడుద ల చేసిన జలాలు సక్రమంగా తాగునీటి చెరువులకు చేరతాయా? లేక చేపల చెరువులను నింపుతా యా ? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం చేప ల చెరువుల్లో నీరంతా వెళ్లగొట్టి చేపలను పట్టారు. ఇప్పుడు ఆ చెరువులకు నీటి అవసరం చాలా ఎక్కు వ. ఈ తరుణంలో తాగునీరు వృథా కాకుండా, చేపల చెరువులకు వెళ్లకుండా ఎన్ఎస్పీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచిచూడాలి. సీఈ ఆదేశాలు బేఖాతరు కాలువ ఆధునికీకరణ పనులను పరిశీలించిన ఎన్ఎస్పీ సీఈ వీరరాజు కాలువలో అడ్డుగా ఉన్న మట్టికట్టలను, మట్టికుప్పలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. లైనింగ్ పనుల సందర్భంగా వదిలేసిన రాళ్లు, మట్టి కుప్పలు వెంటనే తీసేయాలని ఆదేశించారు. కానీ అధికారులు ఆ ఆదేశాలను అమలు చేయలేదు. -
గణనీయంగా తగ్గిన సాగర్ జలాలు
కురిచేడు, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ కాలువ ద్వారా జిల్లాకు సరఫరా అయ్యే జలాలు గణనీయంగా తగ్గాయి. కాలువకు నీరు విడుదల చేసి నాలుగు నెలలైనా ఇంత వరకు జిల్లాకు రావాల్సిన పరిమాణంలో నీరు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఎన్ఎస్పీ అధికారులు ఇష్టం వచ్చినట్లు నీటి పరిమాణం తగ్గించి సరఫరా చేస్తున్నా..జిల్లా స్థాయి అధికారులు కానీ, నాయకులు కానీ జిల్లాకు రావాల్సిన నీటి వాటాను తెప్పించడంలో విఫలమయ్యారు. అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారు. గుంటూరు జిల్లా నాయకులు, అధికారులు కాలువలపై పర్యటించి నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ మన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో జిల్లాలో ప్రధాన కాలువ, బ్రాంచి కాలువ పరిధిలోని మేజర్లకు నీరు ఎక్కడం లేదు. వాటి పరిధిలోని పంటలు ప్రస్తుతం పొట్ట, కంకి దశలో ఉన్నాయి. ఈ తరుణంలో నీటి అవసరం చాలా ఉంది. కానీ నీటి సరఫరా నానాటికీ తగ్గిపోతోంది. జిల్లా సరిహద్దు 85/3 మైలువద్ద 3350 క్యూసెక్కులు నీరు విడుదలవాల్సి ఉండగా శనివారం 1130 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేశారు. దీంతో ఆదివారం జిల్లాకు రావాల్సిన నీటి మట్టం కాలువల్లో పూర్తిగా పడిపోయింది. దర్శి బ్రాంచి కాలువ హెడ్‌రెగ్యులేటరు కురిచేడు వద్ద 2828 క్యూసెక్కులు రావాల్సి ఉండగా ఆదివారం 1128 క్యూసెక్కులు మాత్రమే రావడం ఎన్ఎస్పీ అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది. -
ఎన్ఎస్పీ అధికారుల తీరుపై రైతుల ఆందోళన
కురిచేడు, న్యూస్‌లైన్: సాగర్ కాలువ పరిధిలోని మేజర్లకు నీటి సరఫరాలో అధికారులు అవలంబిస్తున్న వైఖరి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన కాలువ పరిధిలోని 124వ మైలులో ఉన్న ఐనవోలు మేజరుకు శనివారం పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయడంతో నీరు కాలువ పట్టక పొంగి పొర్లుతోంది. మేజరు హెడ్‌కు కూతవేటు దూరంలో ఉన్న యూటీ పొంగి వాగులోకి నీళ్లు పొర్లిపోతున్నాయి. మేజరు ఆసాంతం పంట పొలాల గట్లపైకి ప్రవహిస్తున్నాయి. మేజరు పరిధిలోని 2వ కిలోమీటరు వద్ద రెండేళ్ల క్రితం గండిపడిన చోట నీళ్లు కట్ట పొర్లిపోతున్నాయి. ఈ నీటి సరఫరా మరో 24 గంటలు ఇలాగే కొనసాగితే కట్టకు గండిపడే అవకాశం ఉంది. కాలువపై పర్యవేక్షించాల్సిన అధికారులు గుంటూరు జిల్లా వినుకొండ సబ్‌డివిజన్ విడిచి వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా కాలువపై ఉండాల్సిన లస్కర్లను సైతం వారి సొంత పనులకు వినియోగించుకుంటుండటంతో మేజరుపై పర్యవేక్షణ కొరవడింది. ఎక్కడ ఎంత నీరు వృథా అవుతోందీ పట్టించుకునే నాథుడే లేడు. ఈ తరుణంలో మేజరుకు గండిపడితే దాని పరిధిలోని ఆయకట్టు సుమారు 1500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దర్శి బ్రాంచ్ కాలువ పరిధిలోని మేజర్లకు నీరు అరకొరగా విడుదల చేయడంతో చివరి భూములకు నీరందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మేజరు ప్రారంభంలోని రైతులు డ్రాపులకు అడ్డుకట్టలు వేసి తూములు మళ్లించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల మధ్య గొడవలు ప్రారంభమై నీటి యుద్ధాలు చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. అధికారులు మేజర్ల పరిస్థితి గమనించి చివరి భూముల రైతులకు సక్రమంగా నీరందేలా చర్యలు తీసుకోకుండా కార్యాలయానికే పరిమితమవుతున్నారు. పడమర వీరాయపాలెం మేజరు పరిధిలో రైతులు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వారు తూములు ఏర్పాటు చేసుకున్నా..పట్టించుకున్న నాథుడు లేడు. ఇప్పటికైనా ఎన్ఎస్పీ అధికారులు స్పందించి మేజర్లపై నీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కురిచేడులో గుంటూరు రైతుల ఆందోళన
కురిచేడు,న్యూస్‌లైన్: నీరందక తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ గుంటూరు జిల్లా రైతులు కురిచేడు ఎన్ఎస్పీ డీఈ కార్యాలయాన్ని శనివారం ముట్టడించారు. తమ భూములు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు చివరిలో ఉండడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండల పరిధిలోని పాతనాగిరెడ్డి పల్లె, కొత్తనాగిరెడ్డిపల్లె, లింగమొక్కపల్లె గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు ద్విచక్రవాహనాలు,ట్రాక్టర్లపై తరలి రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రైతులు వారి సమస్యలను డీఈఈ షేక్ లాల్ అహ్మద్‌తో చెప్పుకున్నారు. ఐనవోలు మేజర్ పరిధిలోని చివరి భూములకు నేటికీ సక్రమంగా నీరు విడుదల కావడంలేదని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లక్షలాది రూపాయల పెట్టుబడులు నష్టపోక తప్పదన్నారు. ఆందోళన చేపట్టినప్పుడు మాత్రం కాస్తోకూస్తో విడుదల చేస్తూ.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదని తెలిపారు. నీటి పరిమాణాన్ని తగ్గించకుండా ఐనవోలు మేజర్‌కు కేటాయించినవిధంగా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈఈ మాట్లాడుతూ తమ జిల్లాకు ప్రధాన కాలువ ద్వారా విడుదలయ్యే నీటి కోటాను దృష్టిలో ఉంచుకొని బ్రాంచ్ కాలువలు, మేజర్లకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశానికి నిర్దేశించిన మేర జలాలు రాకపోవడంవల్లే సమస్య ఎదురవుతున్నట్లు చెప్పారు. మేజర్లకు విడుదలైన నీరు దుర్వినియోగం కాకుండా సక్రమంగా పొలాలకు చేరేవిధంగా సిబ్బంది పర్యవేక్షిస్తే సమస్యను సులువుగా పరిష్కరించవచ్చన్నారు. ప్రస్తుతానికి నీటి సరఫరా పెంచాలని జేఈ శ్రీనివాసరావును ఆదేశించడంతో.. ఆయన మేజర్ హెడ్ వద్దకు వెళ్లి పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఐనవోలు మేజర్‌కు 83 క్యూసెక్కుల నీరు సరఫరా కావాల్సి ఉండగా..కేవలం 65 క్యూసెక్కులు మాత్రమే విడుదలవుతున్నాయి. వెంటనే మేజర్ షట్టర్‌ను పైకి లేపడంతో నీటి సరఫరా 80 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేసి ఆందోళన విరమించారు. విడుదల చేయడం వరకే మా బాధ్యత: షేక్‌లాల్ అహ్మద్: డీఈఈ ప్రధాన కాలువ ద్వారా వచ్చిన నీటిని మేజర్లకు, బ్రాంచీలకు సరఫరా చేయడమే మా బాధ్యత. అక్కడ నుంచి పంటపొలాలకు వెళుతున్నాయా లేదా? నీరు దుర్వినియోగమవుతుందా? వంటి విషయాలను గమనిం చాల్సింది వినుకొండ సబ్‌డివిజన్ అధికారులే. ఏఈలు, డీఈఈలు ఎవరో తెలియదు: పరిమి వెంకటేశ్వర్లు: రైతు: కొత్త నాగిరెడ్డిపల్లె మా కాలువకు సంబంధించిన ఏఈలు, డీఈఈలు ఎవరో మాకు తెలియదు. ఎన్నిసార్లు నీటి సమస్య వచ్చినా వారు వచ్చి పరిష్కరించలేదు. మేమే కురిచేడు వచ్చి పోట్లాడి నీరు తీసుకు పోతున్నాం. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి: దూలం యలమందారెడ్డి: రైతు: లింగమొక్కపల్లె మా భూములు మేజర్ చివర ఉండడమే మా ఖర్మ. సాగర్ నీరు విడుదల చేసినప్పుడల్లా సంబరపడి సాగు చేస్తున్నాం. తీరా సగం పంట వచ్చాక నీరు నిలిచిపోతోంది. దీనివల్ల ఎంతో నష్టపోతున్నాం.