సాక్షి, చిత్తూరు : తిరుపతి స్కేవెంజర్స్ కాలనీలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసికొంది. సానిటైజర్ తాగి నలుగురు చనిపోయారు. మృతులు స్కేవెంజెర్ కాలనీకి చెందిన కార్మికులు వీరయ్య, వెంకట రత్నం, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. దీంతో కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, ఇటీవలే ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్‌ను సేవించిన 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.(శానిటైజర్ తాగి 12 మంది మృతి)
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టుషాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. శానిటైజర్లు తాగుతున్న144 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్స్ లను పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లను తయారు చేస్తున్న 76 మందిపై ఎస్‌ఈబీ అధికారులు కేసులు నమోదు చేశారు.
తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి
Published Fri, Aug 7 2020 8:58 PM | Last Updated on Sat, Aug 8 2020 2:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment