
సాక్షి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో జననేత చేపట్టిన పాదయాత్రలో భాగంగా సంతనూతల పాడు నియోజక వర్గంలోని చీమకుర్తిలో ఈ ఉదయం పలువురు విద్యార్థినులు వైఎస్ జగన్‌ను కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు.
కాగా జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ చీమకుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడవునా రాజన్న తనయుడికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోస్తా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.
Wishing everyone a safe and fun-filled Holi. #HappyHoli pic.twitter.com/kTFYNVbLHF
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 2, 2018
Comments
Please login to add a commentAdd a comment