
సాక్షి, ప్రకాశం: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ చీమకుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మంచికలపాడుకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం బండ్లముడి, తొర్రగుడిపాడు క్రాస్, బండ్లముడి కాలనీకి పాదయాత్ర చేరుకుంటుంది. ఇక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పల్లమల్లి మీదుగా గడిపత్రివారి పాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోస్తా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.