నాగులుప్పలపాడు: ఐదు దశాబ్దాల క్రితం 1970లో పంచాయతీ బోర్డుకు ఒక యువకుడు ఎన్నికయ్యాడు. వామపక్ష భావజాలం నుంచి వచ్చిన అతడు 17 ఏళ్ల పాటు ఆ గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఈ రోజుకూ గ్రామానికి ‘పెద్ద దిక్కు’గానే కొనసాగుతున్నాడు. అదే ఉత్సాహంతో నేడు మరోసారి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ పర్యాయం ఆయన వయస్సు 80 ఏళ్లు. అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆయనే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కండ్లగుంటకు చెందిన పల్లెర్ల వెంకారెడ్డి.
ఇదీ రాజకీయ ప్రస్థానం..
నాడు వామపక్ష భావజాలం బలంగా ఉన్న గ్రామా ల్లో కండ్లగుంట కూడా ఒకటి. అభ్యుదయవాదిగా ప్రజల్లో గుర్తింపు పొందిన వెంకారెడ్డి 1970లో తొలిసారి పంచాయతీ బోర్డుకు ఎన్నికయ్యారు. 1982 వరకు సర్పంచ్ కొనసాగారు. 1983లో మరోసారి సర్పంచ్‌గా ఎన్నియ్యారు. నాడు పంచాయతీ సమితిలో వర్క్స్ కమిటీ చైర్మన్‌గానూ విధులు నిర్వహిం చారు. 1990లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక 2005లో కండ్లగుంట సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తన మద్దతుదారుల ను రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా గెలిపిం చుకు న్నారు. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న వెంకారెడ్డి ఈ పర్యాయం మరోసారి సర్పంచ్‌గా గెలిచి గ్రామ సచివాలయంలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment