ప్రకాశం, సాక్షి: ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించేందుకు మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ , పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ వెంకయ్య , వరికూటి అశోక్ బాబు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.ఈ క్రమంలో వారిని రిమ్స్ ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఆదిమూలపు సురేష్, వెంకయ్య, అశోక్ బాబు అక్కడే నేలపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులుతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో నాలుగో తరగతి విద్యార్థినిపై స్కూల్ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
అనంతరం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘ టంగుటూరు మండలం కారుమంచి మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన చాలా దారుణం. రాష్ట్రంలో పిల్లలు, మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి. ‘దిశ’ను ఎందుకు నీరు గార్చారు. పోలీసులు ఎందుకు నిర్లప్తంగా తయారయ్యారు.
...కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాకుండా ఎందుకు వదిలేశారు. బాధితురాలు.. తనపై హత్యాచారం చేశారని చెబుతుంటే. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు. ఏ మంత్రి చెబితే కేసుని తొక్కిపట్టారు?. మేం వచ్చే వరకు పిర్యాదు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ అరచకాలపై సోషల్ మీడియా ద్వారా ఎండగడుతాం?. అలాగే సోషల్ మీడియాపై నిర్బంధాన్ని ఎదుర్కుంటాం. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వుంటాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment