టంగుటూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం బైపాస్ రోడ్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.