
సాక్షి, ప్రకాశం జిల్లా : జిల్లాలోని చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి. యర్రగొండపాలెంలో అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటంపై నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) మీడియా సమావేశంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్టాడుతూ.. ‘అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటం పై నిర్వాహకులపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్ల దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశాం.
మంత్రి క్యాంప్ కార్యాలయం పై దాడి చేసిన టీడిపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించాం. నిన్నటి(శుక్రవారం) చంద్రబాబు సభలో గొడవ పై విచారణ జరువుతున్నాం. ముందుగా అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే చోట సభ నిర్వహించడం పై కేసు నమోదు చేసాం. విచారణ తర్వాత ఎవరెవరిని కేసులో పెట్టాలో నిర్ణయిస్తాం. యర్రగొండ పాలెం ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment