Yarragondapalem
-
Yerragondapalem: ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే సహకరించేది లేదు..
యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుస పరాజయాలను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గంలో అసమ్మతి బుసలు కొడుతోంది. పార్టీ సీనియర్ నేతకు, నియోజకవర్గ ఇన్చార్జికి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇరువర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యర్రగొండపాలెంలో డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం లేదు. అతని దరిద్రాన్ని వదిలిస్తాం. టీడీపీని గెలిపించి మా సత్తా చూపుతాం – నియోజకవర్గ ఇన్చార్జి, ఎరిక్షన్ బాబు వర్గం ఎరిక్షన్ బాబు పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడు. సీనియర్ నాయకులను కలుపుకొని పోవాలనే ఆలోచన అతనికి లేదు. ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే సహకరించేది లేదు – డాక్టర్ రవీంద్ర వర్గం ఇది యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. నిత్యం గ్రూపు తగాదాలతో తెలుగు తమ్ముళ్లు సిగపట్లు పడుతున్నారు. సందు దొరికితే చాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోణలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకుడు డా.రవీంద్ర వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. సాక్షాత్తు అధినేత చంద్రబాబు చెప్పినా ఇరువర్గాల నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కత్తులు దూసుకోవడం మానడం లేదు. నిన్నామొన్నటి వరకు తెరచాటున కొనసాగిన గ్రూపు తగాదాలు గత బుధవారం విలేకరుల సమావేశంతో భగ్గుమన్నాయి. రానున్న ఎన్నికల్లో ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే తామ సహకరించేది లేదంటూ రవీంద్ర వర్గం బహిరంగంగా ప్రకటించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఈ పరిణామాలు పార్టీ కేడర్‌ను మరింత అయోమయంలో పడేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి యర్రగొండపాలెంలో డాక్టర్ రవీంద్ర పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వేగినాటి కోటయ్య మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన క్రమంగా టీడీపీలో పట్టు పెంచుకొన్నారు. అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఇన్నాళ్లూ ఆయన ఆధిపత్యం కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ వరుస ఓటములతో పడరాని పాట్లు పడుతోంది. ఎస్సీ నియోజకవర్గమైన యర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన బూదాల అజితారావు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం ఆమె నియోజకవర్గ ప్రజలకు ముఖం చాటేశారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం గూడూరి ఎరిక్షన్ బాబును నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఎరిక్షన్ బాబు పార్టీలో రవీంద్ర వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. రవీంద్ర వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఇద్దరు నాయకుల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా.. యర్రగొండపాలెం నియోజకవర్గంలో డాక్టర్ రవీంద్ర వ్యవహార శైలి వల్లే టీడీపీ ఓడిపోతోందని ఎరిక్షన్ బాబు వర్గం సోషల్‌మీడియా వేదికగా ఆరోపిస్తోంది. అజితారావు ఓటమికి రవీంద్ర వెన్నుపోటు రాజకీయాలే కారణమని విమర్శలు గుప్పించడంతోపాటు టీడీపీ నుంచి రవీంద్రను సస్పెండ్ చేయిస్తామంటూ చాలెంజ్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనను సస్పెండ్ చేసే మగాడే పుట్టలేదంటూ రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. రవీంద్ర వ్యవహారశైలిని అధినేత చంద్రబాబుకు ఎరిక్షన్ వర్గం వివరించడంతో సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే రవీంద్ర సామాజికవర్గానికి చెందిన దామచర్ల జనార్దన్ రంగప్రవేశం చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రవీంద్ర సస్పెన్షన్‌ను అడ్డుకున్నారు. ఈ పరిణామాలు ఇరువర్గాల మధ్య మరింత దూరం పెంచాయి. ఆ మధ్య యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎరిక్షన్ బాబు అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. ఇరువర్గాలు కలిసి పని చేయాలని సూచించారు. కొంత కాలం ఇరువర్గాల నాయకులు కలిసి పనిచేసినట్టే కనిపించారు. అయితే బుధవారం మీడియా వేదికగా రవీంద్రబాబు ఎరిక్షన్ బాబుపై ఆరోపణలు గుప్పించడంతో ఆ ముచ్చట కూడా మున్నాళ్లకే ముగిసింది. ఇదిలా ఉండగా ఎరిక్షన్ బాబు సైతం తన వర్గం మనుషులతో రవీంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న నాయకుడు అందరినీ కలుపుకొని పోకుండా చిల్లర వ్యక్తులతో విమర్శలు చేయిస్తున్నారని రవీంద్ర వర్గం ఎరిక్షన్ బాబు మీద మండిపడుతోంది. ఈ క్రమంలోనే రవీంద్ర వర్గానికి చెందిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆంజనేయులు, మైనారిటీ నాయకుడు షేక్ జిలానీ విలేకరుల సమావేశం పెట్టి ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే సహకరించేది లేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇక లాభం లేదని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని రవీంద్ర వర్గం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రాజీనామా దిశగా రవీంద్ర వర్గం బాబుకు బదులుగా బూదాల అజితారావుకు సీటు ఇవ్వాలని రవీంద్ర వర్గం అధిష్టానం వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఆమెను అభ్యర్థిగా పోటీకి నిలబెడితే తామంతా సహకరిస్తామని, గతంలో రెండు సార్లు ఓటమి చెంది ఉండటంతో సానుభూతి కూడా కలిసొస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఎరిక్షన్ బాబు అభ్యర్థిత్వం వైపే అధిష్టానం మొగ్గు చూపితే పార్టీకి రాజీనామా చేయాలని రవీంద్ర వర్గం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మాజీ శాసనసభ్యుడు డేవిడ్‌రాజు కనుక కాంగ్రెస్ సీటు తెచ్చుకుంటే ఆయన విజయానికి పాటుపడాలని, తద్వారా ఎరిక్షన్ బాబును దెబ్బతీయాలని రవీంద్ర వర్గం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
వింత పక్షి
-
చంద్రబాబు లెగ్గు మహిమ.. సైకిల్ ముక్కలు
ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎనిమిది నియోజకవర్గాల్లో సైకిల్ ముక్కలు..ముక్కలుగా విడిపోయింది. జిల్లా కేంద్రం ఒంగోలు మొదలు పశ్చిమాన ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గం వరకూ అన్ని ప్రాంతాల్లో గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పైకి అందరూ కలసినట్టుగా బిల్డప్ ఇస్తున్నా అంతర్గతంగా ఒకరంటే ఒకరికి పడక రగిలిపోతున్నారు. ఆ పార్టీ అధినేత వచ్చి వెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కానరాలేదు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నూతనంగా ఏర్పాటైన జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీ పార్టీ ముక్కలు... ముక్కలుగా విడిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల తీరు ఎవరి దారి వారిదే అన్నట్లు తయారైంది. కొన్ని నియోజవర్గాల్లో పార్టీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంతదయనీయంగా ఉందో అవగతమవుతుంది. టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా జిల్లా పార్టీలోని నాయకుల మధ్య ఉన్న విభేదాలను సరిదిద్దలేకపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉన్నా వాటిని చంద్రబాబు సరిదిద్దకపోవడం విచారకరమని సొంత పార్టీ కేడరే నిరుత్సాహం వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీలోని నేతలు విడిపోయినా, పార్టీ పరువు గంగలో కలిసిపోతున్నా, చంద్రబాబు పార్టీలో అంతా బాగుంది అన్నట్లు బిల్డప్ ఇస్తూ జిల్లాలో మూడు రోజులు గడిపారు. జిల్లా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే కొందరు పెత్తందార్లు మిగతా వర్గాల నేతలను విస్మరించటం వల్ల ప్రతి నియోజకవర్గంలో వర్గాల వారీగా పార్టీ చీలిపోయింది. జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు తొలుత గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నేతల మధ్య విభేదాల ఫలితంగా తొలిరోజు సభ అట్టర్ ప్లాప్ అయింది. మూడు ముక్కలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. వైఎస్సార్సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు డబ్బు మూటలకు ఆశపడి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ కండువా కప్పుకున్న ముత్తుముల అశోక్ రెడ్డిది ఒక గ్రూపు. రెండో గ్రూపు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి. ఇక ముచ్చటగా మూడో గ్రాపు పెట్టెల నారాయణ యాదవ్‌ది. చంద్రబాబు వచ్చినప్పుడు పిడతల సాయి కల్పనా రెడ్డి అసలు ఆయనను కలవనే లేదు. అధినేత వస్తుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారంటూ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దామచర్ల జనార్దన్ ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా నిరాకరించినట్టు తెలిసింది. యర్రగొండపాలెంలో అయితే సైకిల్ పార్టీ నాలుగు ముక్కలైంది. సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం ప్రధానంగా ఉండగా ఎరిక్షన్ బాబు, పాలపర్తి డేవిడ్ రాజు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన బూదాల అజితరావుది మరో గ్రూపుగా ఎవరిదారి వారిదన్నట్లు వ్యవహరిస్తూ పోతున్నారు. పక్క నియోజకవర్గంలో పార్టీ అధినేత స్వయంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే ఇక్కడ ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. పార్టీలో కుమ్ములాటలు పక్కనపెట్టిన చంద్రబాబు యర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న దళితులపై వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తల చేత రాళ్ల దాడి చేయించే పనికి పూనుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పార్టీ కేడర్‌కు మార్గం చూపే నాయకుడే కరువయ్యాడు. దర్శి పార్టీ ఇన్చార్జ్గా ఉన్న పమిడి రమేష్ ఆ బాధ్యతలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరకు ఇన్చార్జ్ పదవికి, పార్టీ సభ్యత్వానికి సైతం సోమవారం రాజీనామా చేయటంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన శిద్దా రాఘవరావు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తరువాత దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన కదిరి బాబూరావు సైతం పచ్చ జెండాను కిందపడేసి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో దర్శిలో టీడీపీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడు. దీంతో ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా మారింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా నాయకత్వ లోపం స్పష్టంగా కనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను ఆ నియోజకవర్గంలో నాయకుడిగా పార్టీ కేడర్ గుర్తించటం లేదు. ఇక్కడ విజయకుమార్ సరిపోడు అని పార్టీ కేడర్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుబాటులో లేకుండా బయటే ఉంటుండడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తీరు పట్ల పార్టీలో కేడర్ కొంత గుర్రుగా ఉంది. కొంతమందిని దగ్గరకు తీసి మరికొంతమందిని పూర్తిగా విస్మరిస్తున్నాడన్న నైరాశ్యం కార్యకర్తల్లో నెలకొని ఉంది. కనిగిరి నియోజకవర్గంలో ఉగ్రనరసింహారెడ్డి వన్ మ్యాన్ షో నిర్వహిస్తూ సెకండ్ కేడర్‌ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలినేని దెబ్బకు దామచర్ల విలవిల... జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి దెబ్బకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విలవిల్లాడుతున్నాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలినేని ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులు ఖర్చు చేసిమరీ ప్రజలకు, బాధితులకు సేవలందించారు. అదే సమయంలో దామచర్ల ఒంగోలు ముఖం కూడా చూడకుండా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తలదాచుకున్నారు. వరదల సమయంలో కూడా ప్రజల సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. వీటికి తోడు దామచర్ల సోదరుడు సత్యతో విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌కు టీడీపీ టిక్కెట్టు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీలోని నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. బాలినేనిని ఎదుర్కోవాలంటే కొత్త అభ్యర్థి అయితే తప్ప టీడీపీకి వేరే గత్యంతరం లేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీని దామచర్ల పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దామచర్ల నిర్వహించే సమావేశాలకు కనీసం నూకసానిని పిలవటం కూడా లేదు. దీంతో నూకసాని పాత గుంటూరు రోడ్డులో నుంచి పార్టీ కార్యాలయాన్ని భాగ్యనగర్ మూడో లైన్‌కు మార్చుకున్నారు. టీడీపీ నాయకులను దామచర్ల భాగ్యనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఎవరూ వెళ్లొవద్దని ఆంక్షలు విధించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నూకసాని బాలాజీ కార్యాలయం వెలవెలబోతోంది. -
‘చంద్రబాబు యర్రగొండపాలెం రోడ్ షోపై మూడు కేసులు నమోదు’
సాక్షి, ప్రకాశం జిల్లా : జిల్లాలోని చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి. యర్రగొండపాలెంలో అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటంపై నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) మీడియా సమావేశంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్టాడుతూ.. ‘అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటం పై నిర్వాహకులపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్ల దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం పై దాడి చేసిన టీడిపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించాం. నిన్నటి(శుక్రవారం) చంద్రబాబు సభలో గొడవ పై విచారణ జరువుతున్నాం. ముందుగా అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే చోట సభ నిర్వహించడం పై కేసు నమోదు చేసాం. విచారణ తర్వాత ఎవరెవరిని కేసులో పెట్టాలో నిర్ణయిస్తాం. యర్రగొండ పాలెం ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు.’ అని తెలిపారు. -
‘చంద్రబాబు వీధి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?, అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్‌కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎఎస్సార్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున -
ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్
యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఖరారైందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. మంత్రి సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహ రిసెప్షన్ సోమవారం యర్రగొండపాలెంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరై నూతన దంపతులు శ్రిష్టి, సిద్ధార్థ్‌లను ఆశీర్వదిస్తారు. సోమవారం ఉదయం 10.40 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. 11.25 గంటలకు యర్రగొండపాలెం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 వరకు హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో మాట్లాడతారు. 11.40 నుంచి 11.55 గంటల వరకు రిసెప్షన్లో పాల్గొంటారు. తిరిగి 12 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకుంటారు. -
సమర్థులకు పట్టం కడదాం..
సాక్షి, పెద్దారవీడు: భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. యువత ప్రలోభాలకు లొంగి ఓటేస్తే వచ్చే ఐదేళ్లు ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థ నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. స్వార్థపరులు, అబద్ధాలు చెప్పే వ్యక్తులకు ఓటు వేయకూడదు. ప్రజల కోసం పాటుపడే వ్యక్తికే ఓటు వేయాలి. ఇదీ యువత మనోగతం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సమర్థవంతమైన పాలన అందించాలి. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడికే పట్టం కడతామని యువ ఓటర్లు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు మేము సైతం అంటూ ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. యువత ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తామని పేర్కొనడం విశేషం. హోదా కోసం పోరాడిన నాయకుడికే నా ఓటు మొదటి సారి ఓటు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఓటు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన నాయకుడికే వేస్తాను. మా భవిష్యత్ ప్రత్యేక హోదాపైనే ఆధారపడి ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వినియోగించుకుంటాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది. రాష్ట్రానికి మేలు చేసే వారికే పట్టం కడతాం. ఈ కష్టాలు పోవాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యం. హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీకే నా ఓటు. మాటపై నిలబడే నాయకుడికే యువత పట్టం కడతాం. – ఒద్దుల మాలతి, సానికవరం గ్రామం భవిష్యత్తు కోసం ఓటు రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రచార ఆర్భాటమే తప్ప పురోగతి కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌కి సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఉంది. యువత మేల్కొనే సమయం వచ్చింది. నా ఓటు బంగారు భవిష్యత్ కోసం వేస్తాను. రాష్టాన్ని సుభిక్షంగా, అభివృద్ధి దిశలో నడిపించే సత్తా కలిగిన నాయకకుడికే నా మొదటి ఓటు. కొత్త ఓటర్లు బాగా ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. – మూల హర్షవర్ధన్‌రెడ్డి, బద్వీడుచెర్లోపల్లె గ్రామం ప్రలోభాలకు గురికావొద్దు సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను ఓటు వేయాలి. ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఓటు దుర్వినియోగంతో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నష్టం కలుగుతోంది. మంచి నాయకున్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. – దుగ్గెంపూడి జగన్మోహన్రెడ్డి, మల్లవరం గ్రామం ఓటే మార్పుకు నాంది ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకునే నాయకునికి ఓటు వేస్తాం. ముఖ్యంగా కొత్త ఓటర్లు బాగా ఆలోచించి ఓటు వేయాలి. సంక్షేమం, సమాజాభివృద్ధి గురించి పాటు పడే నాయకున్ని ఎన్నుకోవాలి. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలను చేపట్టే వారికే పట్టం కట్టాలి. ఓటు వజ్రాయుధం. ఓటే మార్పుకు నాంది. ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును నిజాయతీగా వినియోగించుకోవాలి. – అల్లు పద్మ, పెద్దారవీడు గ్రామం భవిష్యత్ భరోసాకే నా ఓటు భవిష్యత్‌కు భరోసా కల్పించే నాయకుడికే నా ఓటు వేస్తా. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచే నాయకుడికే నా ప్రాధాన్యత. విద్యావంతులతో పాటు ప్రతి ఒక్కరూ అలోచించి ఓటు వేయాలి. ఇప్పటి వరకు చాలా మంది చాలా వాగ్ధానాలు చేశారు. అవి మాటలకే పరిమితం అయ్యాయి. జగనన్న అధికారంలోకి వస్తే ప్రతి కుంటుంబం సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు చూసిన పాలకతో పోల్చుకుంటే భవిష్యత్తు జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వెలుగులు విరజిమ్ముతుందని భావిస్తున్నా. – ఏర్వ వెంకటేశ్వరరెడ్డి, మద్దలకట్ట గ్రామం ఓటు వేసేందుకు ఆత్రుతగా ఉంది నా ఓటు నిజాయతీగా వేస్తాను. మొదటి సారి ఓటు వేయడానికి చాలా ఆత్రుతగా, సంతోషంగా ఉంది. భారత పౌరురాలిగా ఎన్నికల్లో నా హక్కును ఓటు రూపంలో వినియోగించుకుంటాను. నేటి ప్రభుత్వాలు అవినీతిమయంగా మారిపోయాయి. పాలకులు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. గెలుపు కోసం మోసపూరిత హామీలు ఇస్తున్నారు. గతంతో ఇచ్చిన హామీలు నేరవేర్చని వారు ఓటు అడిగే హక్కును కోల్పోయారు. అన్ని రంగాల్లో మార్పు రావాలి. అది యువతతోనే సాధ్యమవుతుంది. – సొంటి సౌజన్య, తోకపల్లె గ్రామం ఓటు అమ్ముకోను రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి నిలిచింది. ప్రభుత్వాలు అవినీతి ప్రోత్సహించడం చూస్తుంటే భయం వేస్తోంది. రాష్ట్రం పురోగతి సాధించాలంటే యువ నాయకత్వానికి ఓటు వేయాలి. నా ఓటు నోటుకు అమ్ముకోను. అందుకే అవినీతిని రూపుమాపే నాయకుడికే నా తొలి ఓటు వేస్తాను. ప్రలోభాలు, మభ్యపెట్టే మాటలు, నోట్లతో యువతను మోసగించలేరు. – అల్లు బలరామిరెడ్డి, పెద్దారవీడు గ్రామం -
ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో..
= మృత ఆడశిశువుకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ = రోడ్డు పక్కన వదిలి వెళ్లిన వృద్ధురాలు = మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు ప్రకాశం జిల్లా : ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. ఏ మృగాడి కామవాంఛకు బలి పశువుగా మారిందో.. తెలియదు..కానీ ఓ మతి స్థిమితం లేని మహిళ గర్భం దాల్చింది. నడిబజారులో నిస్సహాయస్థితిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న మహిళను గుర్తు తెలియని వృద్ధురాలు చూసింది. మానవత్వంతో సమీపంలోని వైద్యశాలకు చేర్చింది. ఆస్పత్రిలో ఆ అభాగ్యురాలు మృత శిశువుకు జన్మనిచ్చింది. మహిళకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును రోడ్డు పక్కన వొదిలేసి వెళ్లింది. ఈ సంఘటన యర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ (కోట్ల ఎస్తేరు) కొద్దిరోజుల క్రితం యర్రగొండపాలెం చేరింది. అప్పటి నుంచి పట్టణంలో యాచన చేస్తూ జీవిస్తోంది. ఎస్తేరుకు నెలలు నిండటంతో వృద్ధురాలి సాయంతో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరింది. అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న నర్స్, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్‌కు సమాచారం అందించారు. బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్ చంద్రశేఖర్ వైద్యసహాయం అందించారు. దీంతో తల్లి మృతశిశువు(ఆడ)కు జన్మనిచ్చి తాను ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎస్తేరుకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన వొదిలి వెళ్లింది. సోమవారం ఉదయం రోడ్డు పక్కన పడి ఉన్న మృతశిశువును గమనించిన కొందరు ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఎస్సై ఆదేశాల మేరకు ఏఎస్సై షేక్ రఫీ ఉద్దీన్ శువును పరిశీలించారు. అనంతరం వైద్యశాలలోనే ఉన్న ఎస్తేరు ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడంతో వైద్యాధికారి చంద్రశేఖర్‌ను విచారించారు. అనంతరం కొంత సమయం వేచి చూసిన పోలీసులు, మహిళ తరుపు బంధువులు ఎవరూ రాక పోవడంతో మృతశిశువును ఖననం చేశారు.