
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు.
అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?, అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్‌కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎఎస్సార్‌సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment