Meruga Nagarjuna
-
అది ‘విద్యా మీట్’ కాదు..దగా మీట్: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్‌లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..? -
తెనాలిలో యువతిపై పెమ్మసాని అనుచరుడి పాశవిక దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తెనాలి రూరల్: టీడీపీకి చెందిన రౌడీషీటర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి పాశవిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువతి చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఆదివారం తెనాలిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తెనాలి అయితానగర్‌కు చెందిన 26 ఏళ్ల యువతి ఓ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ సెంటర్లో పనిచేస్తోంది. శనివారం సాయంత్రం డ్యూటీకి వెళ్లిన బాధితురాలిని కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ (కొంతకాలంగా తెనాలిలో నివాసం ఉంటున్నాడు) తన పుట్టిన రోజు అని నమ్మించి వెంట తీసుకువెళ్లాడు.కొద్ది గంటల అనంతరం తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు. అనంతరం అక్కడకు చేరుకున్న యువతి తల్లిదండ్రులు వైద్యుల సూచనల మేరకు మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఎయిమ్స్ సహా పలు ప్రైవేటు వైద్యశాలలకు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. వెంటిలేటర్‌పై ఉన్న బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు..తమ కుమార్తెపై నిందితుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒంటిపై పలు చోట్ల గాయాలున్నాయని.. మెడ, తల కమిలిపోయిందని, దాడి చేసి గాయపర్చినట్లు నల్ల మచ్చలు శరీరంపై ఉన్నాయని బాధితురాలి తల్లి విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెమ్మసాని అనుచరుడిగా..బాధితురాలిపై దాడి చేసిన నిందితుడు నవీన్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల్లో పెమ్మసాని తరఫున ప్రచారం నిర్వహించాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నిస్సార్ బాషా తెలిపారు.పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలుగుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. యువతి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించినట్లు తెలుస్తోందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ముచ్చుమర్రి, హిందూపురం, పిఠాపురం, బద్వేలు, ఇప్పుడు తెనాలిలో మహిళలపై వరుసగా దాడుల ఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. -
కళ్ళు లేని కబోదిలా హోంమంత్రి అనిత.. తెనాలి ఘటనపై మేరుగ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యకర్త ,రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన కుటుంబ సభ్యుల్ని వైఎస్సార్సీపీ నేతలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌లు పరామర్శించారు.అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘తెనాలిలో యువతిపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. టీడీపీకి చెందిన రౌడీ షీటర్ నవీన్.. మదిర సహాన అనే యువతిని కొట్టి హింసించి దాడి చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలు, చిన్న పిల్లలపై దాడులు పెరిగిపోయాయి. చంద్రబాబు పరిపాలన మొత్తం మారణ హోమానికి తెర లేపుతున్నారుహోంమంత్రి అనిత కళ్ళు లేని కబోధిలా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆడబిడ్డకు ఏ కష్టం వచ్చినా వారికి న్యాయం జరిగేది. దిశ పోలీసులు క్షణాల్లో స్పందించే వారు. ఇప్పుడు అదే దిశ యాప్ ఏమైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. బాధితురాలికి ప్రభుత్వం అండగా నిలవాలి’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి మూడు మర్డర్లు.. ఆరు హత్యాచారాలు తరహాలో పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతుంది. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు అని ఆరోపణలు చేశారు.అధికారంలోకి వచ్చాక మరి వాళ్ళందరిని తీసుకువచ్చి ఎందుకు తల్లిదండ్రులను అప్పగించలేదు. ఆడపిల్ల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు. సహానాను నవీన్ అనే టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ దారుణంగా కొట్టి హింసించాడు. యువతి శరీరంపై గాయలయ్యాయి. బాధితురాలు ఇప్పుడు కోమాలోకి వెళ్లింది. ఇంతటి దారుణికి ఒడిగట్టిన నిందితుణ్ని కాపాడటానికి కూటమి నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. -
చంద్రబాబు.. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు?
సాక్షి,తాడేపల్లి: ఈవీఎంలపై మాట్లాడటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిగ్గుందా? అని నిలదీశారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు మేరుగ. గత ఎన్నికల తర్వాత ఈవీఎంలపై ప్రజలకు అనుమానం కల్గిందని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఈసీపై ఉందన్నారు. ఈరోజు(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన మేరుగ.. ఈవీఎంలపై అనేక అనుమానాలున్నాయరు‘విజయనగరంలో ఒక ఈవీఎం ఫుల్ చార్జింగ్‌తో ఉండటంతో మాకు అనుమానం వచ్చింది. ఒంగోలులో ఓట్ల విషయంలో కూడా అనుమానం వచ్చింది. దీనిపై మేము కోర్టుకు వెళ్లాం. హర్యానా ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాంటి అనుమానాలే ఉన్నాయని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం అని జగన్ అన్నారు. దీనిపై మేము ప్రశ్నిస్తే చంద్రబాబు కోప్పడుతున్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరి ఇప్పుడు కప్పదాటు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గుచూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా మేరుగ గుర్తు చేశారు. -
అరాచకాలకు అడ్డాగా ఏపీ: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి:కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిందని,దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.ఆదివారం(సెప్టెంబర్29) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు.‘పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారు.అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి.ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా మెదిలినా కేసులు పెడుతున్నారు. మక్కెలు విరగ్గొడతానంటూ ఏకంగా సీఎం చంద్రబాబే మాట్లాడటం దేనికి సంకేతం?మూడు నెలల్లోనే ఇంతటి దారుణాలకు ఎవరు బాధ్యులు?ఎమ్మెల్యేలు దాడులు చేయటానికి చంద్రబాబు లైసెన్సులు ఇచ్చేశారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారశైలికి నిరసనగా సొంత పార్టీ వారే ధర్నాలు చేశారు.తనను వ్యతిరేకించే వారిని ఇంటికొచ్చి కొడతానంటున్న కొలికిపూడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?కాకినాడలో ప్రొఫెసర్ మీద ఎమ్మెల్యే నానాజీ దాడి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?ఇంకో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తొలిగిస్తే ఏం చర్యలు తీసుకున్నారు?అఖిలప్రియ దాడులకు పాల్పడితే ఏం చేశారు?కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వాల్మీకి కులస్తులపై దాడి చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు?ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అరాచకాలపై ఏం చర్యలు తీసుకున్నారు?ఇన్ని దారుణాలు మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు?ఇవే పరిస్థితులు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’అని మేరుగ హెచ్చరించారు. -
దళితనేతను పరామర్శిస్తే అంత చులకనా?: మేరుగ
తాడేపల్లి, సాక్షి: రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందోని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ స్పందించారు.. ‘‘నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారు. దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా.. ఒక ముద్దాయిని చూడడానికి జైలుకు వెళ్లారని జగన్‌ను ఉద్దేశించి అంటున్నారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనా?. ఏం గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లలేదా?. దళితులంటే మొదటి నుంచి చంద్రబాబుకి చిన్నచూపు. అందుకే అలా మాట్లాడారు... వరదల్లో బొట్లు కొట్టుకొస్తే వైసీపీ వాళ్ళు చేయించారని కథ అల్లుతున్నారు. మరి కిందకు కొట్టుకుపోయిన మరో రెండు బోట్ల కోసం ఎందుకు మాట్లాడడం లేదు?. బోట్ల యజమాని ఉషాద్రి పాదయాత్రలో లోకేష్ ని కలవలేదా?. ఇలాంటి కేసులో నందిగం సురేష్‌ను ఇరికించాలని చూస్తున్నారు. వరదల సమయంలో అసలు తలశిల రఘురాం అసలు ఇక్కడ లేనే లేరు. అలాంటి వ్యక్తి పై అక్రమ కేసు పెట్టాలని చూడడం దారుణం.రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్నాయి. మొన్ననే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు పై దాడికి పాల్పడ్డారు.పల్నాడు లో సోషల్ మీడియా కార్యకర్తలు షేక్ మాబు, రాజశేఖర్ రెడ్డి పై దాడి చేశారు. పోలీసులకు చెప్పినా రక్షించకుండా హింసిస్తున్నారు అని మేరుగ ఆరోపించారు. -
త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కృష్ణా: దేశ రాజధానిలో ఢిల్లీలో వైఎస్సార్సీపీ చేసిన ధర్నా విజయవంతమైంది. పలు జాతీయ పార్టీలు వైఎస్సార్సీపీకి సంఘీభావం తెలిపాయి. ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా? అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. ఇవాళ (గురువారం) ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు.‘‘ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫొటోలు ప్రదర్శించి నిరసన తెలియజేసాం. ..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తోపాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తాం’ అని అన్నారు.‘టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైఎస్ జగన్ సారధ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయింది’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. -
బాబు శ్వేతపత్రం ఓ బూటకం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఓ బూటకమని, అబద్ధాలతో కూడిన నిందల పత్రమని మాజీ మంత్రి మేరుగ నాగార్జున దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు మోపి, అనరాని మాటలు అనడానికే ఈ తంతు సాగించారని మండిపడ్డారు.ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అత్యంత దారుణంగా పొగరు, కొవ్వు, ఉన్మాదం, మదం వంటి పదజాలం వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీఎం స్థానంలో ఉన్న బాబు నోటి నుంచి వచ్చిన ప్రతి అక్షరానికి అకౌంట్‌బులిటీ ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. శ్వేతపత్రంలోని ప్రతి అంశం టీడీపీ వారికి సంబంధించినవేనని చెప్పారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..హామీలు అమలు చేయకుండా దృష్టిని మళ్లించడానికేచంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసి, ఇప్పుడు ఇస్తున్న పథకాలను కూడా ఆపేసి, డబ్బుల్లేవని చెబుతున్నారు. ఎన్నికలప్పుడు ఈ విషయం తెలియదా? హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే శ్వేతపత్రాల తంతు తీసుకొచ్చారు. బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు జగన్ మాత్రమేనని, అలా నిలబడలేకే బాబు దూషణలకు పరిమితమయ్యారు.దసపల్లా భూములు ప్రభుత్వానివి కావని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయినా దాన్ని పట్టుకుని బాబు నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు గీతం కాలేజీ అక్రమాలపై ఎందుకు నోరెత్తరు? వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని గీతం వర్సిటీ ముసుగులో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి స్వాహా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందులో 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఎందుకు మాట్లాడరు?ఇళ్ల పట్టాలపై నిరాధార ఆరోపణలువైఎస్ జగన్ నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపైనా చంద్రబాబువి నిరాధార ఆరోపణలు. వైఎస్ జగన్ 28వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకిచ్చారు. మరో 25వేల ఎకరాలు అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎప్పుడైనా ఒక్క కుటుంబానికి సెంటు భూమైనా ఇచ్చారా? పైపెచ్చు కేసులతో అడ్డుకున్నారు. రాజధానిలో 52 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించే దమ్ము బాబుకు ఉందా?ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయించండిల్యాండ్ రీసర్వే, టైట్లింగ్ చట్టంపైనా చంద్రబాబు అవహేళనగా, తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది సరైంది కాదని అనుకుంటే, బాబే ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, ఆ చట్టాన్ని రద్దు చేయించవచ్చు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా?అడ్డూ అదుపూ లేకుండా ఇసుక దోపిడీఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి అడ్డూ అదుపూ లేకుండా ఇసుకను దోచుకుంటున్నారు. ఇసుక ఉచితం అని చెప్పి సీనరేజ్, రవాణా చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదీ గర్భాల్లో ఉన్న ఇసుకను కొల్లగొట్టిన గజదొంగలు కూడా బాబు పార్టీ మనుషులే. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఒక్కటీ పారదర్శకంగా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫాం మీద టెండర్లు పిలిచారు. మా ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు, ఐదేళ్లలో రూ.3,825 కోట్లు ఆదాయం వచ్చింది.గతంలో బాబు పాలనలో ఇన్ని వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి? దశాబ్దాలుగా గనులను దోచుకుని, అడ్డగోలుగా సంపాదించింది బాబు మనుషులే. ఆయన హయాంలో మైన్స్పై ఆదాయంలో పెరుగుదల (సీఏజీఆర్) 17 శాతం నమోదైతే, వైఎస్ జగన్ హయాంలో 40 శాతం. అంటే దోపిడీ బాబు మనుషులు చేసినట్టు కాదా? బాబు హయాంలో నిరుపేదలకు ఒక్కరికి కూడా ఒక ఎకరం భూమి ఇవ్వలేదు.పైగా రికార్డుల్లో క్లారిటీ లేదంటూ లేనిపోని సాకులు చూపి లక్షలాది ఎకరాలను నిషేధిత జాబితా (22 ఏ)లో చేర్చారు. దీంతో ఆ భూములపై హక్కులు దక్కక, ఆపత్కాలంలో అమ్ముకునే అవకాశం లేక లక్షలాది రైతు కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డాయి. అందుకే జగన్ చుక్కల భూములు, నిషేధిత భూములను ఆ జాబితాల నుంచి తొలగించి, అటవీ, ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించి, మేలు చేశారు. -
టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వ్యాఖ్యలు చేశారు.కాగా, మంత్రి మేరుగ నాగర్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది. పేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం. ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారు. డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్
సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి బద్ధ విరోధిలా పనిచేశారు. ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై కత్తి కట్టాడు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు ఆలోచన. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే. ఇదంతా చేసి ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్‌లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్(ట్విట్టర్)లో మెసేజ్‌లు పెడుతున్నావు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు. ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు. నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు. నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. టిప్పర్ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబు. టిప్పర్ డ్రైవర్‌కి టికెట్ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి సీఎం జగన్ పనిచేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్‌గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి...అంబేద్కర్ గారు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాసుకో చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు సీఎం జగన్ ముందు చెల్లవు. మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే జగన్ గారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్ కల్యాణే చెప్పాలి. విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు’ అని మేరుగ మండిపడ్డారు. ఇదీ చదవండి.. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. విధి విధానాలివే -
చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాము సిద్దమని వెల్లడించారు. తమతో చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు బాబు రావాలని చాలెంజ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరైనా చర్చకు రావాలని అన్నారు. సైకిల్‌ను జనం తొక్కేశారని, మడతపెట్టి పక్కన పడేశారని విమర్శించారు. త్వరలోనే మళ్ళీ అదే జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని మండిపడ్డారు. కళ్యాణమస్తు, షాదీతోఫా కింద రూ. 78.53 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. పెళ్లికానుక కింద చంద్రబాబు 70 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆ మొత్తాన్ని కూడా సీఎం జగన్ ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ నిబద్ధత కలిగిన నాయకుడు అని, ఆయన్ని నమ్ముకుని నడుస్తున్నామన్నారు. ఎవరైనా పక్కకు వెళ్లినా తిరిగి పార్టీలోకి వస్తారని చెప్పారు. -
Ap: ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’ పేదలకు వరం
తాడేపల్లి: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా స్కీమ్‌లపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున , లబ్ధిదారులు పథకాలు అద్భుతమని కొనియాడారు. సమావేశంలో వారేమన్నారంటే వారి మాటల్లోనే.. గొప్ప పథకం: మేరుగ నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అందరికీ నమస్కారం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో గౌరవ ప్రదంగా వివాహం నిర్వహించుకునేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్ళులేని కబోదుల్లా కళ్యాణమస్తు తీసేశారంటున్నారు. వారికి చెంపపెట్టు ఈ స్కీమ్. ఈ మధ్య బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. ఈ కళ్యాణమస్తు కూడా చదువుకు లింక్ అయింది, అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని చెప్పడంతో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని పొగిడారు. సీఎంగా మీరు చేస్తున్న ఈ గొప్ప విప్లవం సామాజిక విప్లవానికి తెరతీసింది. ఏపీ ప్రజానీకం దీనిని గమనించాలని కోరుకుంటున్నాను. పేదల ఇండ్లలో వెలుగు నింపుతున్నారు: భార్గవి, లబ్ధిదారు, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా అన్నా, మాది నిరుపేద కుటుంబం, మాలాంటి నిరుపేద కుటుంబంలో ఆడపిల్లకు ఇంత సాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అన్నా, నేను ఎస్సీని, పెళ్ళి చేయడం అంటే ఈ రోజుల్లో ఎంత భారమో అందరికీ తెలిసిందే. కానీ మీరు నేనున్నా మీకు తోడుగా అనే భరోసా కల్పించారు. మీరు అందరూ చదువుకునేలా చేస్తున్నారు. బాల్యవివాహాలు తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతోంది. మీ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాల వల్ల పేదలు ఆనందంగా ఉన్నారు. మా కుటుంబంలో మేం చాలా లబ్ధిపొందాం, మాకు పథకాలు అందాయి. మీరు ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్ధ, సచివాలయ వ్యవస్ధ చాలా ఉపయోగపడుతున్నాయి. నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి చదువులు చెబుతున్నారు. స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నారు. గతంలో రేషన్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటి ముందుకే అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మీరే సీఎంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ అన్నా. ఇదీ చదవండి.. పేద కుటుంబాలకు జగనన్న కానుక -
‘మంగళగిరిలో లోకేష్‌ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్‌ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్‌కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
AP: సీఎం జగన్ హయాంలో పేదరికం తగ్గింది: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలో 12 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గిందని, సీఎం జగన్ లోతైన ఆలోచనాసరళి సత్ఫాలితాలను చూపిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. తాడేపల్లిలోని సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ స్కీమ్‌లను రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాలకృష్ణ కమిటీ ప్రశంసించినట్లు తెలిపారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కమిటీ సభ్యులు మెచ్చుకున్నట్లు చెప్పారు. ‘ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాచుతున్నారు. బడుగు బలహీ వర్గాలను సీఎం జగన్‌కు దూరం చెసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు గతంలో చేయలేదు. మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు.175 నియోజక వర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను పెట్టలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం లేదు. 2014లో టీడీపీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తండ్రీ కొడుకులు అవినీతి పరులని స్వయంగా చెప్పాడు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని రాష్ట్రంలో పర్యటిస్తున్న జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి కోరామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి ఎలా పని చేస్తుందో వివరించామని చెప్పారు. గతంలో దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీలు గతంలో సామజిక అసమానతలను ఎదుర్కొనేవారు. సామాజిక పరిస్థితుల దృష్ట్యా వారు మతం మారారు. మతం మారినా ఇంకా ఎస్సీలతోనే కలిసి జీవిస్తున్నారు. జైనులుగా బుద్దులుగా మారిన ఎస్సీలు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ల లబ్ది పొందుతున్నారు. ఎస్సీలకు ఈ నాలుగేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని మేరుగ తెలిపారు. ఇదీచదవండి..లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. అచ్చెన్నాయుడిపై వేటు -
మా అభ్యర్థుల్ని మారిస్తే మీకేంటి నొప్పి: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మారిస్తే రామోజీరావు, రాధాకృష్ణలకు నొప్పేంటని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను చూస్తే రామోజీ రావు, రాధాకృష్ణలకు భయం పుడుతోందని చెప్పారు. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని విమర్శించారు. ఓసీ నియోజకవర్గాలలో కూడా సీఎం జగన్ ఇతరులకు అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఆయన పార్టీ ఇక కనుమరుగు అవుతుందనే భయం పుట్టిందన్నారు. టీడీపీకి బీటీమ్ పురంధేశ్వరి పార్టీ బీటీమ్ అన్నారు. చంద్రబాబు కోసం తెగ తాపత్రయం పడుతోందన్నారు. ఆమె ఇంట్లో ఒక్కొకరు ఒక్కొక పార్టీలో ఉన్నారని, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా పురంధేశ్వరి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారని మేరుగ ఫైరయ్యారు. చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్ ‘చంద్రబాబు ఒక పొలిటికల్ బ్రోకర్. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు న్యాయం జరుగుతోంది. అంబేద్కర్ కోరుకున్న పాలన ఏపీలో ఉంది. గతంలో ఇచ్చిన హామీల్లొ ఒక్కదానినైనా చంద్రబాబు నెరవేర్చారా. మా పార్టీ అభ్యర్థులను మారిస్తే మీకు నొప్పేంటి. మా అభ్యర్థులను చూస్తే రామోజీ, రాధాకృష్ణలకు భయం పుడుతోంది. అందుకే ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారు. పేదలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ..బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాసింది చంద్రబాబు కాదా’ అని మేరుగ ప్రశ్నించారు. బాబు రాజకీయ జీవితమంతా పొత్తులే ‘మా పార్టీలో ఎస్సీలను మార్చితే ఇంకో ఎస్సీకే అవకాశం వస్తుంది. అందరికీ అవకాశం కల్పించాలన్నదే జగన్ లక్ష్యం. అందరం కలిసి జగన్‌ని గెలిపిస్తాం. ఎంఎస్ బాబు మా ఎమ్మెల్యే, ఆయన మా వాడు. మా సీఎం జగన్ అందరివాడు, అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడు టికెట్ రాకపోయినా సరైన రీతిలో జగన్ న్యాయం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం చూస్తే.. ఆయన పొత్తు పెట్టుకోని పార్టీ ఏమైనా ఉందా..? ఆయన కాంగ్రెస్‌తో, బీజేపీతో, కమ్యూనిస్టులతో, ఆఖరుకు జనసేన పార్టీతోనూ పొత్తులు పెట్టుకున్నాడు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ముందు నిలబడి గెలిచే దమ్ముంటే మూకుమ్మడిగా పార్టీల్ని కూడగట్టి పొత్తులు పెట్టుకోవడం ఎందుకు’ అని మేరుగ నిలదీశారు. బాబుకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలు సిద్ధం ‘సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన ఏనాడైనా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నావా..? రాజకీయాల్లో మమ్మల్ని ఉద్దేశించి నువ్వు చేసిన హేళనలు, అసమానతలు మాకు గుర్తుకురావని అనుకుంటున్నావా..? ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా, మళ్లీ మేము గుర్తుకొస్తున్నామా..? ఒకపక్క, మా జాతి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ మా నాయకుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. మా కులాన్ని అవహేళన చేసినటువంటి నిన్ను అంత తేలిగ్గా వదులుతామా..? నీకు బుద్ధిచెప్పేందుకు ఎస్సీలంతా సిద్ధంగా ఉన్నారు’అని మేరుగ తెలిపారు. మీ కుట్రలన్నీ చివరికి నీటిమూటలే.. ‘చంద్రబాబు విషకూటమిలో పచ్చమీడియా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పచ్చమీడియా రోజూ కారుకూతలు రాస్తూ.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు.. జరగనివి కూడా జరిగినట్లు అభూతకల్పనలు, కట్టుకథలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా వర్గాలను రెచ్చగొడుతూ కార్మిక సంఘాలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. మీరెంత విషాన్ని నూరిపోసి, కుట్రలతో దొంగ ఉద్యమాలు చేయించినా అవన్నీ చివరికి నీటిమూటలుగానే తేలుతాయి. మీరు గుడ్డ కాల్చి మామీద వేయడానికి తప్పుడు కార్యక్రమాలు చేయిస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు’ అని మేరుగ అన్నారు. మళ్లీ సీఎంగా జగనన్నే అనేది ప్రజా నినాదం ‘పేదల ఆకలి చూసి తిండి పెట్టేది ఎవరు..? భావితరాల భవిష్యత్తు కోసం ఎవరు చూస్తున్నారు..? బడుగు, బలహీనవర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలబెట్టి ప్రోత్సహించే నాయకుడు ఎవరనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉంది. అందుకే, వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో అడుగడుగునా ఆదరణ లభిస్తోంది. మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా తెచ్చుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకే, మళ్లీ సీఎం జగనన్ననే అనేది ప్రజా నినాదమైంది. మీ పచ్చమీడియా పైత్యం, ఎన్ని వెర్రితలలేసినా ప్రజలు మీ మాటల్ని, రాతల్ని నమ్మరు గాక నమ్మరు’ అని మేరుగ నాగార్జున అన్నారు. ఇదీచదవండి..పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్ -
‘అడ్డంకులెన్నొచ్చినా ఏపీలో సంక్షేమం ఆగలేదు’
సాక్షి,అనంతపురం:ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ‘టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. తన ముగ్గురు భార్యలకు పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం సాధ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టి మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు’ అని సురేష్ గుర్తు చేశారు. ‘ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు. జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి’ అని సురేష్ తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’ అని ఎంపీ మాధవ్ కొనియాడారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ ‘ఎస్సీ ఎస్టీ బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం లభించింది’ అని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శంకర్ నారాయణ, డాక్టర్ తిప్పేస్వామి, అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, డీసీసీబీ చైర్మన్ లిఖిత, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం.. -
‘పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే’
సాక్షి, ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఇక, బస్సు యాత్ర సందర్భంగా ఇచ్చాఫురం బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పలాలు డైరెక్ట్‌గా ఇస్తున్నాం. ప్రజలు అది గమనించాలి. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. అవినీతి లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఏ ఒక్కరూ తలవంచకుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉంది. సిల్క్ కుంభకోణం కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. ఈడీ, ఐటీల వద్ద స్కిల్ స్కామ్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్. ఇక్కడ ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో మనం గెలవాలి. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే. మంచి భవిష్యత్తు ఉండాలని బడి, వైద్యం, విద్య అందించాం. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి అని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం క్యాడర్ అందరూ పనిచేయాలని కోరారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మత్స్యకార సోదరులారా మన సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళితే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు. గడిచిన ఎన్నికల్లో తొక్కతీసి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం. ఎస్సీ, ఎస్టీలో పుట్టడానికి మనం కోరుకుంటామా అని చంద్రబాబు అన్నారు. కానీ, మన ప్రభుత్వంలో దళితుడే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు. వైద్యం, విద్యను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.. బహిరంగ సభలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన సీఎం జగన్ వల్లే. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం జగన్ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారు. విద్యలో ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే మన కులాలు మంచి స్థితిలో ఉన్నాయి. పేదల పక్షపాతి సీఎం జగన్.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
సంక్షేమ పథంలో సాహసోపేత అడుగులు
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక ఎత్తు, దళితుల భూముల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం మరోఎత్తు. ఒకవైపు పేద లకు కొత్తగా ప్రభుత్వ భూముల్ని అసైన్ చేస్తూ, మరోవైపు అందని ద్రాక్షలా ఉన్న భూములపై దళితు లకు పూర్తి స్థాయి యాజమాన్య హక్కులను కల్పిస్తున్నారు. పేదలకు చోటే లేదన్న అమ రావతి రాజధాని భూముల్లో నిరుపేదలకు ఇళ్లను నిర్మిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకం. మహానేత డా‘‘ వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న ప్పుడు భూమిలేని నిరుపేదలకు భూములను ఇచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి మళ్లీ ఆయన తనయుడు సీఎం జగన్ పేదలకు భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,935 మంది భూమిలేని నిరుపేదలకు 54,129.45 ఎకరాలను అసైన్ చేయాలని జగన్ ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అలాగే 3 కేటగిరీల్లో 9,062 ఎకరాల లంక భూముల విషయంలోనూ రైతులకు అనుకూలంగా అసైన్మెంట్ పట్టాలు, 5 ఏళ్ల లీజు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయానికి కూడా కేబి నెట్లో ఆమోద ముద్ర వేశారు. ‘ల్యాండ్ పర్చేజ్’ స్కీమ్ కింద దళిత రైతులకు కొని ఇచ్చిన భూములపై వారికి పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు కల్పించాలన్న చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకో వడంతో దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. 14,223 మంది దళిత రైతులు గతంలో వారు పొందిన భూములకు సంబంధించి వారు కట్టాల్సిన రుణాలను కూడా మాఫీ చేశారు. అలాగే దళిత రైతులకు వారి భూములపై యాజ మాన్య హక్కులను కల్పించడానికి అవసరమైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మాఫీ చేస్తూ, ప్రభుత్వమే ఖర్చులు భరించి వారి భూములు రిజిష్టర్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన హక్కు పత్రాల పంపిణీకి ఆగస్టు మొదటి వారంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు అసైన్ చేసిన పేద రైతుల పరిస్థితి కూడా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్‌లో భూములు పొందిన పేద దళిత రైతుల్లాగే ఉంది. తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు ‘డీకేటీ’ పట్టాలు పొందిన రైతులకు కూడా వాటిపై పూర్తి హక్కులు ఉండవు. ఈ భూమలన్నీ నిషేధిత జాబితాలో ఉన్న కార ణంగా ఇవి రిజిష్టర్ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములపై కూడా పేద రైతులకు పూర్తి స్థాయి యాజమాన్యపు హక్కులు కల్పించి ఇతర రైతుల తరహాలోనే వారు కూడా తమ భూములను అవసరమై నప్పుడు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి వీలుగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసు కున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద సాహసోపేత మైన నిర్ణయం. ఆయా భూములను అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా ఆమోదముద్ర వేశారు. ఇది మాత్రమే కాదు, గ్రామాల్లోని కుల వృత్తులు చేసు కునేవారికి ఇచ్చిన ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రజక, నాయీబ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ వంటి ఇతర కులవృత్తులకు సంబంధించిన వారి భూముల విలువలు పెరగనున్నాయి. వారి కష్టాలు శాశ్వ తంగా తీరిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత వాడలలో చాలా వాటికి ఇప్పటి వరకూ శ్మశానాలు లేని కారణంగా దళితులు మరణించినప్పుడు వారికి అంత్యక్రియలు చేయడం కూడా ఇబ్బంది కరంగా ఉండేది. వారి కష్టాన్ని గుర్తించి గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా ఎస్సీల శ్మశాన వాటికల కోసం ప్రత్యేకంగా ఒకేసారి భూములను కేటాయించడం ఇదే తొలిసారి. ఒక గ్రామానికి ఒక ఎకరా వరకూ శ్మశానం కోసం ఇవ్వనున్న ప్రభుత్వం ఈ భూమి కేటాయింపు అధికారం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రంలోని 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాజధాని ప్రాంతమైన అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికే చెందిన ధనిక రాజధాని ప్రాంతంగా మిగిలిపోకూడదని సీఎం జగన్ భావించారు. ఈ కారణంగానే అత్యంత ఖరీదైన రాజధాని భూముల్లోనూ పేదలకు భాగస్వామ్యం ఉండాలని వారికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను ఇచ్చారు. అత్యంత నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారితో పాటుగా అగ్ర కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన పేదలకు పట్టాలు ఇవ్వాలని సీఎం సంకల్పించినప్పుడు ప్రతిపక్షాలవారు రాజధాని రైతులతో సుప్రీం కోర్టులోనూ కేసులు వేయించారు. వీటినేమీ పట్టించుకోకుండా ఏపీ ఆర్–5 జోన్లో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న సీఆర్డీఏప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం అవ్వబోతు న్నాయి. ఈ పనులను ప్రారంభిస్తూ సీఎం స్వయంగాశంకుస్థాపన కూడా చేయనున్నారు. సీఎం జగన్ చేపడుతున్న ప్రతి సంక్షేమ పథకం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లోని పేద వర్గాల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కారణంగానే రాష్ట్రంలోని పేద వర్గాలకు చెందిన వారందరూ కుల, మతాలకు అతీతంగా మరోసారి జగనన్నకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. -డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
నైతికతకు నిలువుటద్దం..నిజంగా నవశకమే
ఎన్నికల్లో గెలవడం కోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేయడం, తర్వాత వాటిని మరిచిపోవడం మామూలే అనే అభిప్రాయం ప్రజానీకంలో పాతుకుపోయింది. కానీ అటువంటి అభిప్రాయాన్ని తారుమారు చేస్తూ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో 98 శాతం నెరవేర్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం. ఇక ముందెవరైనా హామీ ఇవ్వాలంటే జగన్ నెలకొల్పిన ఈ ప్రమాణం అందుకోవాలి. అందుకే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయపార్టీలు ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇస్తూ ఉంటాయి. వాటిని తమ మేని ఫెస్టోలో చేర్చి ప్రచారం చేసుకోవడం కూడా సహజం. అయితే గెలి చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలోనే ఆయా పార్టీలు, లేదా నాయకుల మను గడ ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు నేతృత్వం వహిస్తున్న టీడీపీ, వైసీపీల పనితీరును అంచనా వేయాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేయలేని వాగ్దానాలెన్నో చేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేస్తూ వాటిని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో గెలిచారు. అయితే సీఎం అయ్యాక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో కనీసం 10 శాతం కూడా నెర వేర్చలేదు. సీఎంగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో మేని ఫెస్టోను ఏ మేరకు అమలు చేశాననే విష యాన్ని కనీసం సమీక్షించుకోవడానికి కూడా ఆయనకు తీరిక దొరకలేదు. అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు 1994, 1999లలో కూడా రెండు సార్లు సీఎంగా పని చేశారు. ఆ సమయాల్లో కూడా తన పార్టీ మేనిఫెస్టోను అమలు చేయడంగానీ, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గానీ చంద్రబాబు చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తాను సీఎంగా కొనసాగిన 2014 –19 మధ్య కాలంలో ఉద్యోగాల విషయంలో రాష్ట్రంలోని యువతకు, రుణమాఫీ విషయంలో మహిళలకు, రైతులకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాలయాపన చేశారు. పైగా బాబు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాల్లో కూడా అర్హులైన వారందరికీ లబ్ధి కలి గించకుండా పైరవీలకు, అక్రమాలకు పెద్దపీట వేస్తూ ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో ప్రజ లను దోచుకోవడానికి టీడీపీ శ్రేణులను ప్రజల మీదికి వదిలారు. అలా ఐదేళ్లు గడిచి పోతుండగా 2019 నాటి ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళలకు ‘పసుపు కుంకుమ’ లాంటి పథ కాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నైజమేమిటో అప్పటికే బాగా అర్థమైన రాష్ట్ర ప్రజలు ఆయనను ఓడించి ఇంటికి పంపారు. జగన్మోహన్ రెడ్డి తన ‘నవరత్నాల’ పథ కాలతో పాటుగా ప్రజలకు చేసే ఇతర మేళ్లని గురించి రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికీ పంచారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో పోల్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే మేనిఫెస్టోను అమలు చేయడం ప్రారంభించారు. జగన్ మూడేళ్ల పరిపాలనలోనే తన మేని ఫెస్టోలో 98 శాతం హామీలను నెరవేర్చారు. అంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టోలో హామీ ఇవ్వని కొత్త పథకాలను కూడా అమలు చేయడం మొదలు పెట్టారు. డీబీటీ, నాన్– డీబీటీ పథకాల ద్వారా గత నాలుగేళ్ల కాలంలో ప్రజలకు సుమారుగా రూ. 2.82 లక్షల కోట్ల రూపాయలను అందించినా అందులో ఎక్కడా ఒక్క పైసా అవినీతి కూడా జరిగిందని ఎవరూ చెప్పలేని విధంగా పూర్తి నీతివంతమైన పరిపాలనను అందించడం జగన్ సృష్టించిన మరో చరిత్ర. అంతేకాదు దేశ చరిత్రలోనే మొదటి సారిగా ఒకేసారి 1.26 లక్షల ప్రభుత్వ ఉద్యోగా లను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడం ఇవాళ దేశమే అబ్బురపడు తున్న అభివృద్ధి. పథకాలను అందించడంలో అర్హతే ప్రామాణికంగా తీసుకొని కుల, మత, ప్రాంతీయ, వర్గ, వర్ణ, రాజకీయ పార్టీ విబేధా లకు తావివ్వకుండా చూడటం జగన్ నైతికతకు నిలువుటద్దం. 2014 ఎన్నికల్లో వాడుకొని మోసం చేసిన పవన్ కల్యాణ్‌తో మళ్లీ పొత్తుకోసం వెంపర్లా డటం, గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన నరేంద్ర మోదీ చెలిమి కోసం ఇప్పుడు తహతహలాడటం చంద్రబాబు అనై తిక విధానానికి నిదర్శనమైతే, అప్పుడూ ఇప్పుడూ కూడా కేవలం ప్రజలనే నమ్ముకొని ఒంటరిగా బరిలో నిలబడటానికి సిద్ధపడటం జగన్ నైతికతకు తార్కాణం. ఈ నేపథ్యంలోనే 2024లో రాబోయే ఎన్నికల కోసం చంద్రబాబు అప్పుడే తన మేని ఫెస్టోను ప్రకటించేశారు. షరా మామూలుగా తాను గతంలో ప్రజలకు ఏం చేసింది చెప్పకుండా ఇక ఇప్పుడేదో చేసేస్తాననే రీతిలో రాజమండ్రిలో టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలోని అంశాలకే పేర్లు మార్చి తన మేని ఫెస్టోగా ప్రకటించడం గమనార్హం. ఆయన భావ దారిద్య్రం ఏ స్థాయికి చేరిందంటే జగన్ పరిపాలనలో తల్లులందరి మన్ననలు పొందిన ‘అమ్మఒడి’ పథకానికి ‘అమ్మకు వందనం’ అని పేరుమార్చి తన మేనిఫెస్టోలో పెట్టేసుకున్నారు. అసలు ఎన్నడూ తన హామీలను నెరవేర్చని చంద్ర బాబు ప్రకటించిన మేనిఫెస్టోకి విలువేముంటుంది? అయినా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైన, జగన్ పరిపాలనపై చేస్తున్న ఆరోపణల మీద బహిరంగ చర్చకు రావాలని మేము చేసిన సవాల్‌కు ఇప్పటివరకూ బాబు నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇదివరకు అధికారమిచ్చి అందలం ఎక్కిస్తే చంద్రబాబు, ఆయన అనుచరగణం చేసిందేమిటో బాగా తెలి సిన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబు మేని ఫెస్టో పేరిట కొత్తగా ఇస్తున్న హామీలను నమ్మే అవకాశం ఏ మాత్రం లేదు. :::డా. మేరుగు నాగార్జున, వ్యాసకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు నిజంగా నవశకమే... ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2019 వరకూ రెండే పార్టీల పాలన సాగింది. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండగా, ఆ తర్వాత కాంగ్రెస్ అధి ష్ఠానం చేసిన అపరా ధాల వల్ల నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ అధి కారాన్ని చేజిక్కించుకుంది. ప్రజల నమ్మకాన్ని ఎన్టీఆర్ వమ్ము చేయలేదు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరమని భావించి ఆ దిశగా కొత్త సంక్షేమానికి తెర తీశారు. సమాజంలో అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ ఫలాలు దక్కేలా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీని లాక్కొని అధికారంలోకి వచ్చారు. అక్ర మంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. ప్రజల ప్రాథమిక అవసరాలను పక్కన పెట్టి నేల విడిచి సాము చేశారు. హైటెక్ అంటూ కొన్ని వర్గాలకు రాష్ట్ర సంపదను దోచిపెట్టి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. విజన్ 2020 అంటూ త్రిశంకు స్వర్గంలో తేలియాడుతూ ప్రజలను గాలికొదిలేశారు. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ రాజ శేఖరరెడ్డి ‘నేనున్నా’ అంటూ తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చారు. మండు వేసవిలో కాళ్లకు బొబ్బలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలో తన ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చీ రాగానే ప్రజలను తమ అగచాట్ల నుంచి విముక్తి కలిగించేలా పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కరవు కాటకాలతో అల్లాడు తున్న ప్రజలకు ఊపిరి పోశారు. వైఎస్ఆర్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల్లో ప్రజలు హాయిగా, సంతోషంగా గుండెలో మీద చేతులు వేసుకుని బతికారు. ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను బాధించింది. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే నేను రాజకీయా ల్లోకి అడుగు పెట్టాను. జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యేగా ఎది గాను. వైఎస్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమతుల్యత దెబ్బతింది. ప్రాంతీయ వాదా లతో అట్టుడికి పోయింది. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ విభజన, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం జరిగి పోయాయి. ఎప్పుడూ ఎవరో ఒకరి సహాయంతో లేదా అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చే చంద్రబాబు చేతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి దోపిడీకి గురైంది. 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, గొప్ప విజనరీ అని డప్పాలు కొట్టుకునే చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓడిపోయారు. ఇదే సమయంలో దిక్సూచిలా వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించారు. నేను విన్నా... నేను కన్నా... నేను ఉన్నా అంటూ ప్రజల ఆదరాభిమానాలతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్‌కు కూడా ఇవ్వని భారీ మెజారిటీని ప్రజలు జగన్‌కు ఇచ్చారు. తన పాదయాత్రలో కనిపించిన, వినిపించిన ప్రజల కష్టాలను, అవస్థలను మేనిఫెస్టోగా రూపొందించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాను, బైబిలు మాదిరిగా భావించి అందులో పొందుపరిచిన ప్రతి అంశాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో 98.5 శాతం హామీ లను అమలు చేయడం చాలా గొప్ప విషయం. ఓ వైపు చంద్రబాబు ఖజానా ఖాళీ చేసినా... మరో వైపు కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనా... ఏ మాత్రం బెదరకుండా మొక్కవోని ధైర్యంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకే వెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టు కుంటూ, పొదుపు మంత్రం పాటిస్తూ చంద్ర బాబు హయాంలో చెల్లాచెదురైన ఆర్థిక వ్యవ స్థను గాడిలో పెట్టి ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని రెండు కళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. విద్యా, వైద్య రంగా లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. చదువు ఒక్కటే భావితరాలకు తర గని ఆస్తి అని చెప్పి విద్యార్థుల పాలిట మేన మామగా మారారు. ప్రతి పేద వాడి ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం చక్కగా ఉంటుందని భావించారు. రైతు సంక్షేమమే ప్రధానంగా భావించి గత టీడీపీ హయాంలో పడకేసిన వ్యవసాయాన్ని పండుగ చేశారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు వరుసగా టకటకా చెబితే పది లక్షల బహుమతి ప్రకటించా! ఇంతవరకూ నా వద్దకు వచ్చి ఎవరూ చెప్పలేక పోయారు. అంటే అన్ని పథకాలను ఆయన ప్రజలకు అందిస్తున్నారు. అన్ని ప్రాంతాలకూ, అన్ని వర్గాలకూ సమ న్యాయం చేయడం సాధ్యమని ఈ నాలుగేళ్లలో జగన్ నిరూపించారు. పరిపాలనలో పారదర్శ కత, ప్రజల గుమ్మం ముందుకు ప్రభుత్వం వెళ్లడం, అవినీతికి అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో నగదు బదిలీ, వాలంటీర్ల సేవలు తదితరాలు గతంలో ఎన్నడూ లేనివి. ఇవన్నీ కొత్తగా ప్రవేశపెట్టిన జగన్ పెద్ద విజనరీ. ప్రతిపక్షాల విమర్శలు, పచ్చ మీడియా దాడులకు అదరని, బెదరని గొప్ప ధైర్యశాలి. నాలుగేళ్ల పాలనతో 42 ఏళ్ల రాజ కీయ సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. జగన్ పాలన నిజంగా నవ శకమే! :::వ్యాసకర్త రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి డా‘‘ కారుమూరి వెంకట నాగేశ్వరరావు (వైఎస్పార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా) -
చంద్రబాబుని తరిమి తరిమి కొడతారు..!
-
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు
సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న 1791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలను కూడా పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఇటీలు, హెల్త్ సూపర్ వైజర్లు వేతనాలను పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల (జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా దీనిని రూ.24,150 లకు పెంచామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) వేతనం రూ.16,100 ఉండగా దీన్ని కూడా రూ.24,150కు పెంచామని తెలిపారు. ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్ల( టీజీటీ) వేతనం రూ.14,800 ఉండగా దీన్ని రూ.19,350కు పెంచడం జరిగిందన్నారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా దీనిని రూ.16,350కు, హైల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ ల వేతనం రూ.12,900 ఉండగా దానిని రూ.19,350లకు పెంచడం జరిగిందని నాగార్జున వివరించారు. ఈ పెంపుదలతో 1791 మంది పార్ట్ టైమ్ టీచర్లతో పాటుగా ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసామన్నారు. 2019 తర్వాత పార్ట్ టైమ్ టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలను పెంచడం ఇదే ప్రథమం అని మంత్రి చెప్పారు. కాగా తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు,టీచర్లు శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జునను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే జేఏసీ ఛైర్మెన్ నాగభూషణం మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే బీజీ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తమకు మంత్రి తమకు న్యాయం చేసారని చెప్పారు. బీసీ వెల్ఫేర్ టీచర్లతో సమానంగా పీజీటీలు, టీజీటీల వేతనాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి నాగార్జునను కోరారు. -
‘ఏపీలో రూ.65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.65 కోట్లతో లెదర్ పరిశ్రమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా లెదర్ పరిశ్రమాభివృద్ధి సంస్థకు చెందిన భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావడానికి కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్ క్యాప్) కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున ఆటోనగర్ గేట్లో లిడ్ క్యాప్ కు అత్యంత విలువైన భూమి ఉందని చెప్పారు. ఇది కాకుండా శ్రీకాకుళం జిల్లాలోని వెన్నెలవలస, పార్వతీపురం జిల్లాలోని అద్దపుశీల, ఏలూరు జిల్లాలోని నూజివీడు, పల్నాడు జిల్లాలోని అడిగొప్పుల, ప్రకాశం జిల్లాలోని యడవల్లి, అనంతపురం జిల్లాలోని రాచపల్లి, రాళ్ల అనంతపురం, కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, తిరుపతి జిల్లా కేంద్రాల్లో మొత్తం 133.74 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూముల్లో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉన్నాయన్నారు. వీటిలో భవనాలతో పాటుగా శిక్షణలకు ఉపయోగపడే షెడ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ భూములు, భవనాలన్నింటినీ ఉపయోగంలోకి తెచ్చేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు. పీఎం అజయ్ పథకం కింద ఇదివరకు మంజూరైన రూ.11.50 కోట్ల నిధులతో కృష్ణా జిల్లాలోని జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని యడవల్లిలలో రెండు పాదరక్షల తయారీ (ఫుట్ వేర్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్) కేంద్రాల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని నాగార్జున వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ గేట్ లో ఉన్న భూమిలో చర్మ ఉత్పత్తుల శిక్షణ, విక్రయాలకు అవసరమైన ఒక పెద్ద భవనాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మినీ లెదర్ పార్క్ లను నిర్మించడానికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదికాకుండా రూ.65 కోట్లతో లిడ్ క్యాప్ లో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, దీనిలో భాగంగానే పాదరక్షల కు సంబంధించిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.10 కోట్లతోనూ, చర్మపరిశ్రమకు సంబంధించిన శిక్షణల కోసం మరో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను రూ.30 కోట్లతోనూ, కొత్త భవనాల నిర్మాణాలను రూ.15 కోట్లతోనూ, ప్రస్తుతం ఉన్న భవనాల అభివృద్ధిని రూ.10 కోట్లతోనూ చేపట్టనున్నామని మంత్రి వివరించారు. అలాగే లిడ్ క్యాప్‌ను మరింత బలోపేతం చేయడానికి ఉన్న ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్రంలో చర్మపరిశ్రమాభివృద్ధికి, చర్మకారుల సంక్షేమానికి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. తాను సూచించిన ప్రతిపాదనలు, కోరిన వివరాలతో వారం రోజుల్లో మరోసారి సమీక్షా సమావేశానికి రావాలని లిడ్ క్యాప్ అధికారులను నాగార్జున ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ ఎండీ శంకర్, జీఎం నల్లమోతు అధికారి, ఫెలో శ్యామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ఈ భేటీలో సజ్జల రామాకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, గురుమూర్తి కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు. 'ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించాం. రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే జగన్‌ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించాం.' అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పార్టీల తీరు మారాలి: సజ్జల సజ్జల మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీల తీరు మారాలన్నారు. మన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని -
‘చంద్రబాబు వీధి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?, అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్‌కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎఎస్సార్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున -
చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే: మంత్రి మేరుగ
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు అన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయనవి అన్నీ దిగజారుడు రాజకీయాలే. అంటూ ఫైరయ్యారు. కాగా, మంత్రి మేరుగ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా ఒక్క మంచి పని కూడా చేయలేదు. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. కరోనాకు భయపడి పక్క రాష్ట్రం పారిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని వర్గాల అభివృద్ది జరిగింది. డీబీటీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేశాం. టీడీపీ హయాంలో ఒక్క మంచి పథకమైనా ఉందా?. చంద్రబాబుకు అధికార యావ తప్ప మరొకటి లేదు. చంద్రబాబు చెప్పేవన్నీ అభూత కల్పనలే. చంద్రబాబువి అన్నీ దిగజారుడు రాజకీయాలే. పేదల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు. పేదలను పీల్చి పిప్పి చేసిన వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు.