
గుంటూరు: చంద్రన్న కానుక పేరుతో రెండు రోజుల క్రితం గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన షోలో తొక్కిసలాట కారణంగా చనిపోయిన కుటుంబాలను మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, మేరుగ నాగార్జునలు పరామర్శించారు. కుటుంబాలను పరామర్శించిన మంత్రులు ఆ బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రులు మాట్లాడారు.
‘చంద్రన్న కానుక పేరుతో అమాయకుల్ని బలితీసుకున్నారు. చంద్రబాబు సభలు, ర్యాలీలకు విరామం పాటించాలి’ అని అంబటి పేర్కొన్నారు. చంద్రన్న కానుక పేరుతో అమాయకులు బలైపోయారు. బాధిత కుటుంబాలను పరిమర్శిచి చెక్కులు అందజేశాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి 40 మందిని బలితీసుకున్నారు. చంద్రబాబు సభకు టీడీపీ నేతలే అనుమతి తీసుకున్నారు. గుంటూరు ఘటనను ఎన్‌ఆర్‌ఐ సంస్థపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని విడదల రజనీ విమర్శించారు.
‘పేదల కడుపు కొట్టాలని చంద్రబాబు ఆలోచన.చంద్రబాబు పేద బతుకులను చిద్రం చేస్తున్నారు.చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాం. చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాం. కందుకూరు, గుంటూరు ఘటనలకు సంబంధించి చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని మేరుగ నాగార్జున మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment