stampede incident
-
ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరం
-
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్రేగ్రేషియా
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
-
ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు కారణాలు..
-
కుంభమేళా ఘటనకు అసలు కారణం ఇదే
-
పరిస్థితి అదుపులోనే ఉంది సీఎం యోగి
-
కుంభమేళా తొక్కిసలాట ఘటన.. యోగికి మోదీ, అమిత్ షా కాల్
-
కుంభమేళా తొక్కిసలాట.. అమృతస్నానం కోసం ఎగబడిన జనం
-
మహా కుంభమేళాలో తొక్కిసలాట..
-
Magazine Story: చంపేసి సారీ చెప్తే సరిపోతుందా..?
-
బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!
సాక్షి, అమరావతి: తిరుమల చరిత్రలో తొలిసారిగా తొక్కిసలాట జరగటం, ఆరుగురి ప్రాణాలను హరించడం వెనుక అసలు కుట్ర బట్టబయలైంది. శ్రీవారి ఆలయం పవిత్రత, సంప్రదాయాలకు భంగం కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఆ వ్యవస్థనంతటినీ తన బినామీలైన ప్రైవేటు ముఠా ఆధిపత్యంలోకి తేవడం, వారి నిర్వాకంతోనే ఈ ఘటన జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. పైగా, ఆ నిందను వైఎస్సార్సీపీపై వేసేందుకూ టీడీపీ నేతలు వెనుకాడలేదు. ఇప్పుడు అసలు కుట్ర చంద్రబాబుదేనన్న విషయం బట్టబయలైంది. ఇంతకు ముందు శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ లేని అపోహలు సృష్టించిన చంద్రబాబు.. ఇప్పుడు ఏకంగా ఆలయంలోకి ప్రైవేటు వ్యక్తులను ప్రవేశపెట్టి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు సాగించిన గూడుపుఠాణి బట్టబయలైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందించే ముసుగులో చంద్రబాబు తన బినామీ ముఠాను టీటీడీలో అనధికారికంగా చేర్చారు. తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా సమస్తం ఆ ముఠాకే కట్టబెట్టాలన్న దురాలోచనకు తెగించారు. అందుకోసం ప్రయోగాత్మకంగా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీని ఆ ముఠాయే పర్యవేక్షించడం, సరైన ప్రణాళిక లేక తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తుల దుర్మరణానికి కారణమైందన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఆలయాన్ని గుప్పిట పట్టేందుకు చంద్రబాబు బినామీ ముఠా చేస్తున్న కుతంత్రాన్ని కొన్ని నెలలుగా పరిశీలిస్తున్న టీటీడీ వర్గాలు అసలు విషయాన్ని ‘సాక్షి’కి సాధికారికంగా వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి అశేష భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న చంద్రబాబు కుట్ర ఇదిగో ఇలా ఉంది..టీటీడీలో బాబు బినామీలు పాగా..పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంపై తన బినామీలకు పెత్తనం కట్టబెట్టి, యావత్ టీటీడీ వ్యవస్థను హైజాక్ చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీకి అందిస్తారంటూ ప్రైవేటు వ్యక్తులను టీటీడీలోకి ప్రవేశపెట్టారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ నేతృత్వంలోనే ఈ కుతంత్రానికి తెరతీశారు. చంద్రబాబు ఏరికోరి నియమించిన తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందుకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వీరి సహకారంతో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులైన లక్ష్మణ్ కుమార్, చందు తోట అనే ఇద్దరు సాఫ్ట్వేర్ నిపుణులు గుట్టుచప్పుడు కాకుండా టీటీడీలోకి ప్రవేశించారు.వాస్తవానికి టీటీడీలో ఏదైనా పోస్టు ఇవ్వాలన్నా, కన్సల్టెంట్‌గా నియమించాలన్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వాలి. టీటీడీ పాలకమండలి తీర్మానం చేయాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, టీటీడీ పాలకమండలి తీర్మానం లేకుండానే లక్ష్మణ్ కుమార్, చందు తోట టీటీడీలోకి దర్జాగా ప్రవేశించారు. ఓ కేంద్ర మంత్రి వద్ద గతంలో పీఎస్‌గా పని చేశానని చెప్పుకునే లక్ష్మణ్ కుమార్ ఏకంగా టీటీడీ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి పక్కనే ఆయనకు కుర్చీ వేసి మరీ ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు.ఆయనకు ప్రత్యేక ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పించడం గమనార్హం. అంటే టీటీడీలోకి అనధికారికంగా, అక్రమంగా ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులకు రాచమర్యాదలు కూడా కల్పిస్తున్నారు. అదీ భక్తులు తిరుమల ఆలయంలో సమర్పించిన కానుకల నిధుల నుంచీ..ఆలయాన్ని గుప్పిటపట్టే కుట్ర..ఏఐ పరిజ్ఞానాన్ని టీటీడీ వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి లక్ష్మణ్ కుమార్, చందు తోట సహకరిస్తున్నారని టీటీడీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మేరకు అధికారిక నోటిఫికేషన్ ఏమీ జారీ చేయలేదు. ఎందుకంటే.. ఏఐ పరిజ్ఞానం పేరుతో తిరుమల–తిరుపతిలో అన్ని వ్యవస్థలనూ బినామీలకు కట్టబెట్టాలన్నది చంద్రబాబు అసలు కుట్ర. తిరుమలలో గదుల కేటాయింపు, శ్రీవారి ఆలయం క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ, దర్శనాలు, ప్రసాదం పంపిణీ.. ఇలా అన్నింటినీ ఆ ముఠా ఆధిపత్యంలోకి తేవడమే అసలు వ్యూహం. వేలాదిమంది టీటీడీ ఉద్యోగులతో పటిష్టంగా ఉన్న వ్యవస్థను క్రమంగా నీరుగార్చి.. తన బినామీ ముఠాకే తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీపై గుత్తాధిపత్యం కట్టబెట్టాలన్నది అంతిమలక్ష్యం. అంటే తిరుమలలో గదులు, దర్శనం, ప్రసాదాలు ఇలా ఏదైనా ఈ ముఠా ద్వారానే జరగాలి.వైకుంఠ ఏకాదశి టికెట్లపై ప్రయోగంతిరుమల శ్రీవారి ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, టికెట్ల జారీ వ్యవస్థను గుప్పిట పట్టేందుకు రూపొందించిన విధానాన్ని వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో ప్రయోగాత్మకంగా పరీక్షించాలని ఆ ముఠా భావించింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట కొన్ని రోజులుగా తిరుమల–తిరుపతిలోనే తిష్ట వేసి అదే పనిలో ఉన్నారు. పైలట్ ప్రాజెక్టును తిరుమలలో నిర్వహించే అవకాశం లేదు. అందుకే ముందుగా తిరుపతిలో పరీక్షించాలని భావించారు. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియను ఉద్దేశçపూర్వకంగా తిరుపతిలో 8 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు బినామీ ముఠా రూపొందించిన విధానం పూర్తిగా బెడిసికొట్టింది. వారు చెప్పినట్టుగా టీటీడీ అధికార యంత్రాంగం చేయడంవల్లే టికెట్ల జారీ అస్తవ్యస్తంగా తయారైంది. భక్తులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. చివరికి తొక్కిసలాటకు దారి తీసి ఆరుగురు భక్తులను బలి తీసుకుంది.పరారైన బాబు ముఠాతమ ప్రయోగం వికటించి, ఆరుగురు మరణించారని తెలియగానే చంద్రబాబు బినామీ ముఠా బిచాణా ఎత్తేసింది. వేమూరి హరికృష్ణ, లక్ష్మణ్ కుమార్, చందు తోట తిరుమల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. ఈ వ్యవహారమంతా బయటకు రాకూడదని తిరుపతిలో చంద్రబాబు పెద్ద డ్రామా నడిపించారు. ఆయన తిరుపతిలో అధికారులపై చిందులు తొక్కినట్టుగా డ్రామా నడిపి, నేరుగా బాధ్యతలేని అధికారులపై చర్యలు తీసుకుని అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించారు. కాగా, తిరుమలలో కొన్ని నెలలుగా చంద్రబాబు బినామీ ముఠా బాగోతంపై టీటీడీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన తిరుమల ఆలయం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు, సనాతన సంప్రదాయాలను కాలరాసేందుకు, భారీ ఆర్థిక దోపిడీకి చంద్రబాబు బినామీ ముఠా పన్నాగం పన్నిందని ధ్వజమెత్తుతున్నాయి. -
Magazine Story: కలియుగ దైవానికి కళంకం తెచ్చిన కలి పుత్రులు
-
ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి, తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు
-
Big Question: ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
తిరుపతి తొక్కిసలాట.. ఎస్పీ సుబ్బారాయుడు ఎస్కేప్..?
-
టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట : రోజా
-
ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శనం: రోజా
-
తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం
-
అల్లు అర్జున్ లాగే వీళ్ల మీద కేసులు పెట్టాలి!
-
చంద్రబాబు చేసిన పాపం.. BR నాయుడు రాజీనామా చేయలి
-
బాబు సేవలో పోలీసులు.. బలైన భక్తులు!
-
ప్రచారం పీక్స్.. తొక్కిసలాట ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
భక్తులను బలిగొన్న నిర్లక్ష్యం.. చేతులెత్తేసిన టీటీడీ!
-
అంతులేని నిర్లక్ష్యం.. ఆసుపత్రుల్లో మృత్యుఘోష
-
ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
-
తిరుపతి ఘటన ఘోరమైనది.. బీఆర్ నాయుడు మాటలు దుర్మార్గం.. టీటీడీనే బాధ్యత వహించాలి
-
నిన్న తొక్కిసలాట సమయంలో 10 మంది పోలీసులు కూడా లేరు
-
అంతులేని నిర్లక్ష్యం
-
అడ్డదారిలో వైకుంఠం టిక్కెట్లు.. నిజాలు బయటపెట్టిన అవుతు శ్రీధర్ రెడ్డి
-
KSR Live Show: భక్తులకు మృత్యు ద్వారం తెరిచిన యమదూతలు.. బాబు, డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలి
-
తిరుపతి తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ వింత వ్యాఖ్యలు
-
నా చావు కళ్ళ ముందే కనిపించింది.. ఆ దేవుడే కాపాడాడు
-
భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. ఎందుకు ఇలా చేశారు
-
టీటీడీ చరిత్రలో మహా విషాదం..
-
టీటీడీ, చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్
-
తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ వింత వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. చింతించడం తప్ప చేసేదేమీ లేదన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయం. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట. గొడవలు జరుగుతాయని ముందే తెలుసు’’ అంటూ వ్యాఖ్యానించారు. భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘క్యూలైన్లలో సౌకర్యాలు లేవు.మమ్మల్ని చావిడిలో గొడ్డుల్లా లోపల వేశారు. క్యూ లైన్లలో రద్దీని నియంత్రించకలేకపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. టీటీడీ వైఫల్యం వల్లే తొక్కిసలాట’’ జరిగిందని భక్తులు మండిపడుతున్నారు.వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి..ప్రభుత్వ వైఫల్యమే తిరుపతిలో తొక్కిసలాటకు దారితీసిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చిత్తశుద్ధి లేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చి.. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా మార్చారన్నారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: ప్రాణాలతో చెలగాటం.. తిరుమల ఘటనపై భక్తుల రియాక్షన్టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు. హిందూ ధర్మంపై భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసని, తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని నిలదీశారు.తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందన్నారు. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదన్నారు. అధికారుల, పోలీసుల మధ్య సమన్వయం లేదని, శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ చైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. ఆయన పనంతా రాజకీయ దు్రష్పచారం చేయడమేనని, టీటీడీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలని, టీటీడీ చైర్మన్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
దొడ్లో పశువులు వేసినట్లు వేశారు.. ఈ పాపం టీటీడీదే!
-
తిరుపతిలోని 2 ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట
-
టీటీడీ నిర్లక్ష్యం.. ఏడుగురు మృతి.. 40మందికి పైగా గాయాలు
-
తిండి లేదు, నీళ్లు లేవు.. సంచలన నిజాలు బయట పెట్టిన తిరుపతి భక్తులు
-
తిరుపతిలో తొక్కిసలాటకు కారణం అదే..
-
తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట... ఆరుగురు భక్తులు మృతి, 40 మందికి గాయాలు
-
భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి
-
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ముగ్గురి అరెస్ట్
చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్లో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట..ఒకరి మృతి ఘటనలో థియేటర్ యజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజునాయక్, ఎస్ఐ మౌనికలు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ థియేటర్లో ముందు రోజే భారీ హంగామా చేయడం, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే రేవతి అనే మహిళ మృతిచెందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. సినిమా నటులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు వస్తున్నారన్న విషయం థియేటర్ నిర్వాహకులు తమకు తెల్పలేదన్నారు. విచారణ అనంతరం సంధ్య థియేటర్‌కు సంబంధించిన ఏడుగురు యజమానుల్లో ఒకరైన ముడుపు సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కనీని చూసుకునే మేనేజర్ గంధం విజయ్చందర్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి..తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. -
కేరళ కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట
-
ఆ విషయంలో టీడీపీ వెనకడుగు.. ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ఒకటిపై విపక్షం ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు? ఇది కొంత ఆశ్చర్యం కలిగించే అంశమే. మామూలుగా అయితే ప్రభుత్వం ఏ జిఓ విడుదల చేసినా, మరుసటి రోజుకల్లా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడడం రివాజుగా మారింది. ఎక్కువ సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకురావడంలో తెలుగుదేశం సఫలం అవుతూ వస్తోందన్న భావన ఉంది. ఈ విషయంలో టీడీపీకి ఉన్న శక్తి సామర్ధ్యాలను చూసి అంతా నివ్వెరపోయే పరిస్థితే. కాని అదే సమయంలో టీడీపీ లేదా ఆ పార్టీ మద్దతుదారులు, వేసిన వ్యాజ్యాల వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ప్రజలు అభిప్రాయపడుతుండడంతో టీడీపీ ఆశించిన విధంగా ఆ పార్టీకి అంత రాజకీయ లబ్ది చేకూరలేదనే చెప్పాలి. ఉదాహరణకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంగ్ల మీడియంపై వ్యాజ్యం పడడంపై పేద వర్గాలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజధాని అంశంలో అయితే బహుశా దేశంలోనే ఎక్కడా వేయనన్ని పిటిషన్లు పడ్డాయి. వీటిలో అత్యధికం టీడీపీ మద్దతుతో పడినవే అన్న సంగతి బహిరంగ రహస్యమే. అమరావతి రైతుల పేరుతో తలపెట్టిన పాదయాత్ర వల్ల ఉద్రిక్తతలు వస్తాయని పోలీస్ శాఖ అభిప్రాయపడినా, హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోగలిగారు. పోలీసులు అంచనా వేసినట్లే ఆ పాదయాత్రలో పాల్గొన్నవారు ఎన్నిసార్లు ఉద్రిక్తత సృష్టించింది అంతా గమనించారు. ఆ పాదయాత్రలో రైతుల కన్నా, వారి ముసుగులో టీడీపీ వారే పాల్గొన్నట్లు వెల్లడైంది. హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను వీరు పట్టించుకోవడం లేదని రుజువు అయింది. చివరికి పాదయాత్రను విరమించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇలా పలు సందర్భాలలో న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించరాదని, పర్మిషన్ తీసుకునే రోడ్డు షో వంటివి జరపాలని ఆదేశాలు ఇవ్వగా, దానిపై టీడీపీ, జనసేన, వామపక్షాలు నానా రాద్దాంతం చేస్తున్నాయి. వాటిని ధిక్కరిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పంలో హై డ్రామా చేశారు. అయినా హైకోర్టుకు వెళ్లలేదు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ జిఓ పై హైకోర్టుకు వెళితే కొట్టివేస్తారని అన్నారు. మరి ఆయనకూడా ఇప్పటికే పలు అంశాలపై కోర్టుకు వెళ్లారు కదా!. కాని దీనిపై ఇంతవరకు ఎందుకు వెళ్లలేదన్నది చర్చనీయాంశం అవుతుంది. ఇందుకు కొన్ని కారణాలు ఉండవచ్చు. బహుశా న్యాయ స్థానం వారు జిఓని సమర్దిస్తూ ఆదేశాలు ఇస్తే తమ ప్రచారం అంతా వృథా అవుతుందని అనుకోవచ్చు. రోడ్లపై సభల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరితే దానిని వాదించుకోవడం కష్టం కావచ్చు. గతంలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుకూలంగా నిర్ణయం వచ్చినా, ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలలో హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. వాటిని పాటించడం సాధ్యం కాదని యాత్రనే విరమించుకోవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా గైడ్ లైన్స్ ఇస్తే విపక్షాలకు అది మరింత ఇబ్బంది కావచ్చు. కోర్టుకు వెళ్లే బదులు ప్రభుత్వం ఏదో అణచివేస్తోందని ప్రచారం చేస్తే దానివల్ల ఏమైనా రాజకీయ లబ్ధి వస్తుందేమోనన్న ఆశ వారికి ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలతో టీడీపీ, జనసేన లేదా ఇతర విపక్ష పార్టీలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లి ఉండకపోవచ్చన్నది నిపుణుల అంచనాగా ఉంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలలో పదకుండు మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం రోడ్లపై సభల నిర్వహణకు ఆంక్షలు పెట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలలోనే ఈ తొక్కిసలాటలు జరిగాయి. కందుకూరులో డ్రోన్ షూటింగ్ కోసం ఇరుకు సందులోసభ నడిపే యత్నం చేయడం, గుంటూరులో సభకు వచ్చేవారికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున పేదలు తరలి వచ్చి తొక్కిసలాటకు గురయ్యారు. ఇవన్ని టీడీపీకి తీవ్ర నష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేనలు కొత్త డ్రామాలకు తెరదీశాయి. జిఓ వన్ ఆధారంగా తమ గొంతు నొక్కుతున్నారన్న ప్రచారానికి దిగాయి. చదవండి: చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగింది? అసలు సమస్య అదేనా? చంద్రబాబు, పవన్‌లు ఒకరికొకరు సంఘీభావం ప్రకటించుకునే సన్నివేశాన్ని ప్రజల ముందుంచారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. దీనిపై ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్పందించలేకపోయారు. ఈ తొక్కిసలాటకు గురైనవారిని పరామర్శించకుండా, ఆ ఘటనకు కారణమైన చంద్రబాబు నాయుడును పరామర్శించడం విడ్డూరంగానే ఉంటుంది. అయినా దీనిని ఒక వ్యూహంగా వారు భావిస్తున్నారు.కందుకూరు, గుంటూరు విషాదాలను పక్కదారి మళ్లించడానికి ఈ డ్రామాలు నడుపుతున్నారు. వీటిని ప్రజలు నమ్ముతారా? అసహ్యించుకుంటారా? -హితైషి -
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై విచారణ కమిషన్
-
గన్ షాట్: చంద్రబాబు మరణహోమానికి మద్దతిస్తున్నావా పవన్..?
-
చంద్రబాబు.. జీవో నెం1లో ఏముందో అసలు చదివావా?
కాకినాడ: ప్రజల భద్రత, సంరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో నెం1ను చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్యగా చిత్రీకరించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అసలు జీవో నెం1లో ఏముందో పూర్తిగా చదివావా అంటూ ప్రశ్నించారు. ఒకసారి జీవో నెం1ను చదవమని చంద్రబాబుకు విజ్తప్తి చేస్తున్న అని ప్రెస్‌మీట్ ద్వారా కురసాల పేర్కొన్నారు. ‘కేవలం ఇరుకు రోడ్లు మీద సభలు నిర్వహించుకోవద్దని, అవి చేయాలంటే వేరే ప్రదేశాల్లో నిర్వహించుకోవాలి జీవోలో చెప్పారు. ర్యాలీలు వద్దని జీవో నెం1 లో ఎక్కడైన పేర్కోన్నారా?, 1861 యాక్ట్ అనేది ఇవాళే పుట్టి కొచ్చినట్లు చెబుతున్నారు.చంద్రబాబు ప్రచార చీప్ ట్రిక్ వల్లప్రాణ నష్టం జరగకూడదని జీవో నెం 1 అమలు చేస్తున్నాం. చంద్రబాబు అంటిస్తున్న రక్తపు మరకలను తుడవడానికే జీవో నెం1 ను అమలు చేశారు. చంద్రబాబు నాయుడిని తొక్కేయడం కోసం జీవో నెం 1 ఇవ్వలేదు. రోడ్డు షోలు, ర్యాలీలు నిషేధిస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మన దేశంలో..రాష్ట్రంలో అమలు చేస్తున్న చట్టాలు బ్రిటిష్ నాటి చట్టాలే. 2014 తరువాత సెక్షన్ 30ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ళ పాటు అమలు చేసిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిది. ఎల్లో మీడియా చంద్రబాబు భజన కోసమే పుట్టినట్లు ఉంది. మీ పరిపాలనలో ముద్రగడను ఏ చట్టం ఉందని నిర్భందించారు. ముద్రగడను పరామర్శించేందుకు వస్తే చిరంజీని రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ఎందుకు నిర్భంధించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్ ను ఎందుకు నిర్భంధించారు.’ అని కురసాల నిలదీశారు. -
కందుకూరు తొక్కిసలాట ఘటన.. ఇంటూరి నాగేశ్వరరావు అరెస్ట్
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు కందుకూరు సభ తొక్కిసలాట ఘటనలో కందుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది మృతికి కారణమైన నాగేశ్వరరావు, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 304 పార్ట్ 2 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరులో ఇరుకు సందులో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే చంద్రబాబు సభ పెట్టడంతో తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా.. కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చదవండి: Fact Check: ప్రాణాలు పోతున్నా ఆగని టీడీపీ ప్రచార యావ.. ఫేక్ వీడియోలతో.. -
చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలి : KA పాల్
-
డ్రోన్ కింద ప్రాణాలు..బాబు పిచ్చికి అమాయక జనం బలి
-
టీడీపీ ప్రచార ఆర్భాటానికి అమాయకుల ప్రాణాలు బలి : మల్లాది విష్ణు
-
‘కందుకూరు, గుంటూరు ఘటనలపై చంద్రబాబే ప్రధాన ముద్దాయి’
గుంటూరు: చంద్రన్న కానుక పేరుతో రెండు రోజుల క్రితం గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన షోలో తొక్కిసలాట కారణంగా చనిపోయిన కుటుంబాలను మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, మేరుగ నాగార్జునలు పరామర్శించారు. కుటుంబాలను పరామర్శించిన మంత్రులు ఆ బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రులు మాట్లాడారు. ‘చంద్రన్న కానుక పేరుతో అమాయకుల్ని బలితీసుకున్నారు. చంద్రబాబు సభలు, ర్యాలీలకు విరామం పాటించాలి’ అని అంబటి పేర్కొన్నారు. చంద్రన్న కానుక పేరుతో అమాయకులు బలైపోయారు. బాధిత కుటుంబాలను పరిమర్శిచి చెక్కులు అందజేశాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి 40 మందిని బలితీసుకున్నారు. చంద్రబాబు సభకు టీడీపీ నేతలే అనుమతి తీసుకున్నారు. గుంటూరు ఘటనను ఎన్ఆర్ఐ సంస్థపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని విడదల రజనీ విమర్శించారు. ‘పేదల కడుపు కొట్టాలని చంద్రబాబు ఆలోచన.చంద్రబాబు పేద బతుకులను చిద్రం చేస్తున్నారు.చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాం. చంద్రబాబు సభలో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించాం. కందుకూరు, గుంటూరు ఘటనలకు సంబంధించి చంద్రబాబే ప్రధాన ముద్దాయి’ అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
బాబు సభలకు బలి పశువులు!
సాక్షి, అమరావతి: తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని తరచూ చెప్పుకునే చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వేసిన ఎత్తుగడలు ప్రజల పాలిట శాపాలుగా మారాయి. ఆయన తీరు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ఏమాత్రం పట్టనట్లు చేతులు దులుపుకొని వెళ్లిపోతుండడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. చంద్రబాబు సభలకు స్పందన లేదనే విషయం అర్థమవడంతో ఇరుకు ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రజలు వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, అందువల్లే రెండుసార్లు తొక్కిసలాటలు జరిగాయని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. కందుకూరు, గుంటూరు సభలే ఇందుకు నిదర్శనం. విశాలమైన రోడ్లు లేవా? టార్గెట్లు నిర్దేశించి తన సభకు ప్రజలను తేవాలని చంద్రబాబు ఆదేశిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఎంత ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోకపోవడంతో ఏదో ఒక ఆశ చూపి తరలిస్తున్నారు. ఇందుకోసం ఇరుకు సందులు, చిన్న రోడ్లను ఎంచుకుంటున్నారు. కందుకూరు సభను అనుమతి తీసుకున్న విశాలమైన రోడ్డులో కాకుండా పక్కనే ఉన్న ఇరుకు సందులోకి చంద్రబాబు మార్చారు. అక్కడ తొక్కిసలాట జరిగి 8 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విశాలమైన రోడ్డు పక్కనే ఉండగా దాన్ని కాదని ఇరుకు రోడ్డులో సభ నిర్వహించడంలోనే చంద్రబాబు ఉద్దేశం స్పష్టంగా కనబడుతుతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లు జన ప్రభంజనమే ఉంటే విశాలమైన రోడ్లలో సభ ఎందుకు నిర్వహించడం లేదనే ప్రశ్నకు టీడీపీ ముఖ్య నేతల నుంచి సమాధానం లేదు. గుణపాఠం నేర్చుకోలేదు కందుకూరు సభలో జరిగిన ఘోరం నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్లీ అదే తప్పులను చంద్రబాబు పునరావృతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. గుంటూరులో తాజాగా చంద్రన్న కానుకల పంపిణీ సభకోసం 10–15 రోజుల నుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజంగా ప్రజాదరణ ఉంటే ఇంటింటికీ తిరిగి కానుకలు ఇస్తామని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందా? జనం రారని గ్రహించే టోకెన్లు ఇచ్చిమరీ ప్రజలను, పేదలను మభ్యపెట్టారు. మొహం చెల్లకే.. గుంటూరు ఘటనపై చంద్రబాబు నోరు మెదపకపోవడాన్ని బట్టి ఆయనకు మొహం చెల్లడంలేదని అర్థమవుతోందనే వాదన వినిపిస్తోంది. ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నానని, అక్కడ తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ అది టీడీపీ సభ కాదని అడ్డంగా అబద్ధం ఆడేశారు. అదే నిజమైతే సభకు అనుమతుల నుంచి నిర్వహణ దాకా పూర్తిగా టీడీపీ నేతలే దగ్గరుండి పర్యవేక్షించడం నిజం కాదా? -
గుంటూరు తొక్కిసలాట.. మొత్తం చేసింది టీడీపీనే
-
‘హైదరాబాద్ వెళ్లి ఆ ఘటనతో సంబంధం లేదని చెప్తావా?’
సాక్షి, గుంటూరు: తొక్కిసలాటలో గాయపడిన వారిని మంత్రి జోగి రమేష్ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రాంతి కానుక పేరుతో పేదలను బలి తీసుకున్నారని, వారి ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదని దుయ్యబట్టారు. ‘‘కందుకూరు సభ తర్వాత కూడా చంద్రబాబుకు పశ్చాత్తాపం లేదు. హైదరాబాద్ వెళ్లి ఆ ఘటనతో నాకు సంబంధం లేదని చెప్తావా? నమ్మించి మోసం చేయడం చంద్రబాబు రక్తంలోనే ఉంది. చంద్రబాబును నమ్మినవారు నట్టేట మునిగినట్టే’’ అని మంత్రి అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: కన్నబాబు కాకినాడ జిల్లా: చంద్రబాబుకు తన రాజకీయాలు తప్పా.. ప్రజల ప్రాణాలు పట్టవని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత సంఘటన జరిగితే.. దానికి చంద్రబాబుకు బాధ్యత లేదా?. అని కన్నబాబు ప్రశ్నించారు. పుష్కరాల్లో చంద్రబాబు కుటుంబం స్నానాలకు 29 మంది చనిపోయారు. కనీసం వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించ లేదు. రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కన్నబాబు హితవు పలికారు. చదవండి: డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు.. -
డేంజర్ గేమ్.. చంద్రబాబు ప్లాన్ అదే..? ఇదిగో రుజువులు..
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అకృత్యాలకు జనం బలి అవుతున్నారు. తమ ప్రచార యావ ముందు ఏదీ కనిపించదని వారు పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కందుకూరు వద్ద జరిగిన ఘటనలో ఎనిమిది మంది మరణించిన ఘటనను మరవక ముందే గుంటూరులో మరో దారుణం జరిగింది. ఇక్కడ ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. రెండు చోట్ల టీడీపీకి ఒకటే లక్ష్యం. జనాన్ని పోగు చేయడం, భారీగా తరలివచ్చారని తమ మీడియాలో డ్రోన్ షాట్ల ద్వారా భ్రమలు కల్పించడం. జనం రారేమో అనుకున్న చోట వారికి తాయిలాలు ఇస్తామని ఊరించడం, సభలకు జనాన్ని తరలించడం అన్నది కొత్తగా జరిగేది కాదు. కాని దానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించాలి. కాని ఇందులో కూడా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది విలక్షణ శైలి. ఆయనకు ఈ విద్య కొత్తగా వచ్చింది కాదు. ఆయన రాజకీయాలలోకి వచ్చింది మొదలు ఇలాంటివి ఎన్నో చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక వాటిని కొత్త పుంతలు తొక్కించారు. జనానికి డబ్బులు ఇవ్వవచ్చని, డ్వాక్రా మహిళలను, ఇతర లబ్దిదారులను సభలకు తరలించవచ్చని కనిపెట్టింది ఆయనే. పార్టీ పరంగా ఏదైనా సభ జరిపితే హైదరాబాద్ నుంచి పార్టీ స్థానిక నేతలకు పెద్ద ఎత్తున డబ్బు పంపించడం ఆయనకు అలవాటే. వచ్చిన వారికి మందు పోయించడం మామూలే. కాని ఇటీవలికాలంలో తెలుగుదేశం కాని, చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు చాలా అధమ స్థాయికి చేరుతున్నాయని అనడానికి కందుకూరు, గుంటూరు సభల విషాదాలే ఉదాహరణగా నిలుస్తాయి. గతంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూనో, ఇతరత్రానో సభలు పెట్టినప్పుడు లేదా రోడ్ షోలు నిర్వహించినప్పుడు విపరీతంగా జనం వచ్చేవారు. అయితే టీడీపీ మీడియా వారు ఏమనుకున్నారంటే పై నుంచి ఫోటోలు తీయడం వల్ల జనం బాగా వచ్చినట్లు కనిపిస్తున్నారని అనుకుని టీడీపీ వారికి కూడా ఇదే సలహా ఇచ్చారు. అందులోను చంద్రబాబు ఇలాంటి ప్రచారాలలో మరీ ముందంజలో ఉంటారు. వెంటనే ఆయన అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని పార్టీ వారిని పురమాయిస్తుంటారు. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత, స్థానిక ఎన్నికలలో ఓటమి తర్వాత ఈ ప్రచార పిచ్చి బాగా పెరిగింది. ఇటీవలి కాలంలో రకరకాల పేర్లతో చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు రోడ్డులో సభ పెట్టి, ఇంత జనం తన జీవితంలో చూడలేదని అన్నారు. ఆయన మాటలకు కర్నూలు వారు కాదు కాని, ఇతర ప్రాంతాలవారు అవునా నిజమా అని ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే ఒక రోడ్డు మీద జనాన్ని పోగు చేసి, పైనుంచి ఫోటో తీసి అబ్బో అనుకుంటే ఏమి ఉపయోగం. నిజంగా జనం పెద్ద ఎత్తున స్వచ్చందంగా రావాలి.. వచ్చిన ప్రజలలో అభిమానం ఉండాలి కాని. అక్కడ నుంచి టీడీపీకి ఈ డ్రోన్ల పిచ్చి ముదిరింది. ఒక వైపు ముఖ్యమంత్రి జగన్ తన సభలను విశాలమైన మైదానాలలో పెడుతుంటే చుట్టు పక్కల కూడా జనం కిక్కిరిసి కనబడుతుంటారు. మరో వైపు చంద్రబాబు సభలేమో ఇరుకు రోడ్లలో పెట్టి డ్రోన్ ఫోటో తీసి వారికి వారే మురిసిపోతున్నారు. వారు మురిస్తే ఇబ్బంది లేదు. కాని జనాన్ని చావ కొడుతున్నారు. పైగా అలా మరణించిన వారు ఫలానా కులం అని, రాష్ట్రం కోసం త్యాగం చేశారని దిక్కుమాలిన ఫిలాసఫీ చెప్పి ప్రజలను మరింతగా అవమానిస్తున్నారు. కందుకూరులో నిర్దిష్ట చోట కాకుండా ఇరుకు రోడ్డులో సభ పెట్టారు. అక్కడ తొక్కిసలాట జరిగి, కొందరు చనిపోతే, అక్కడ ఉన్న సభికులను తాను వెళ్లి చూసి వస్తానని, తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండండని చంద్రబాబు చెప్పడం పరాకాష్టగా భావించాలి. ఆ తర్వాత ఆ కార్యక్రమాలను వాయిదా వేసుకోకుండా కావలి, కోవూరు తదితర చోట్ల కూడా ఇవే షోలు నడిపారు. అక్కడితో ఆగలేదు. గుంటూరులో మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబు వస్తున్నారు. సంక్రాంతి కిట్లు ఇస్తారు అంటూ పది రోజుల నుంచే ప్రచారం చేశారట. ఏదో గతంలో డబ్బిచ్చి జనాన్ని మళ్లించడం చూశాం. కాని ఇప్పుడు సంక్రాంతి సరుకులు ఇస్తాం సభకు రండి అని పేద ప్రజల జీవితాలతో ఆడుకోవడం చూస్తున్నాం. పాపం.. వారంతా సభకు నాలుగు గంటల ముందు వచ్చారట. చాలామంది నిలబడే ఉండాల్సి వచ్చిందట. చంద్రబాబు స్పీచ్ అయ్యేవరకు ఓపికగా ఉన్న జనానికి తమకు సంక్రాంతి కిట్లు అందడం లేదని తెలుసుకుని ఒక్కసారిగా తోసుకు రావడంతో ముగ్గురు మరణించడం, పలువురు గాయపడడం జరిగింది. ఈ రెండు ఘటనలకు కారణం తెలుగుదేశం నేతల నిర్వాకం. కాని టీడీపీ మీడియా, పార్టీ నేతలు దీనిని పోలీసులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈనాడు మీడియా అయితే ఈ వార్తల కవరేజీలో ఇంతగా దిగజారి పోతుందని అనుకోలేదు. గుంటూరు ఘటన లో స్థానికులదే తప్పన్నట్లుగా, వేలాది కిట్లు ఉన్నా సరిగా నిర్వహించలేకపోయినట్లు ప్రచారం చేశారు. అసలు ఈ ఘటన వార్తను ఏదో మొక్కుబడిగా ఇచ్చారు తప్ప, జర్నలిజం ప్రమాణాలకు తగినట్లుగా ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. ఏదో షాపుల వారు తమ ప్రచారం కోసం చీరలు ఇస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించడం, అందరికి ఇవ్వలేక చేతులు ఎత్తివేయడం, దాంతో పోలీసులు జోక్యం చేసుకోవల్సి రావడం జరుగుతుంటాయి. సరిగ్గా అదే రీతిలో తెలుగుదేశం పార్టీ కూడా జనాన్ని తరలించడానికి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్స్ వేస్తుంటే, వాటి గురించి రాయవలసిన ఈనాడు మీడియా, మిగిలిన టీడీపీ మీడియా మాదిరే మరీ నగ్నంగా కనిపించడానికి సిగ్గుపడడం లేదు. కందుకూరులో బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు ఉవాచ. రాష్ట్రం కోసం ఆయన ఉద్యమం చేస్తున్నారట. ఆయన తంటాలన్నీ ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధలుగా మారారని ఆయన చెబుతున్నారు. చదవండి: కాటేసిన కానుక! ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే, అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?. కుంభమేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. ఆ మధ్య మాచర్లలో ఒక టీడీపీ కార్యకర్త స్థానిక గొడవల్లో హత్యకు గురైతే దానికి రాజకీయం పులిమి, అతని పాడె కూడా మోసి చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నించారు. మరి ఈ ఘటనలలో చనిపోవడానికి టీడీపీనే కారణం. అయినా మరి డబ్బు ఇచ్చి ఎందుకు ఊరుకున్నారో తెలియదు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైనవారిపై కేసులు పెట్టవలసి ఉంటుంది. అలా చేసిన వెంటనే అక్రమ కేసులు అంటూ మళ్లీ వీరే ప్రచారం చేస్తుంటారు. ఏది ఏమైనా టీడీపీ ప్రచార పిచ్చి ఏపీ ప్రజలకు కర్మగా మారుతోంది. -హితైషి -
చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం
-
అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం
సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ నేతల అమానుష చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు సభలో గాయపడి కొన ఊపిరితో ఉన్న మహిళను కారు డిక్కీలో కుక్కి టీడీపీ నేతలు జీజీహెచ్‌కు తరలించారు. దీంతో తొక్కిసలాటలో గాయపడిన ఆమె.. ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. టీడీపీ నేతల అమానుషంపై సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. కాగా, విజయవాడ ఏలూరు రోడ్లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు. చదవండి: కాటేసిన కానుక! -
గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్
-
గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్
సాక్షి, గుంటూరు: విజయవాడ ఏలూరు రోడ్లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన విషాదం మరువక ముందే మరో దారుణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందారు. చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. చదవండి: పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన.. వాసిరెడ్డి పద్మ ఫైర్ ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్ షో కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది. దీంతో, చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడితున్నారు. -
గుంటూరు తొక్కిసలాట ఘటనపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
గుంటూరు తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు
-
గుంటూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
-
గుంటూరు టీడీపీ సభ తొక్కిసలాట ఘటనపై కేసులు
-
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది : మోపిదేవి వెంకటరమణ
-
‘క్యూలో ఎక్కువసేపు నిలబెట్టారు.. అందుకే తొక్కిసలాట’
గుంటూరు: క్యూలో జనాన్ని ఎక్కువ సేపు నిలబెట్టిన కారణంగానే గుంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రమాద స్థలిని కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన తర్వాత ఎస్పీ మాట్లాడారు. ‘బారికేడ్డు విరిగిపడటంతో ప్రమాదం జరిగింది. మేం సరిపడా బందోబస్తు ఇచ్చాం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. ఫస్ట్ కౌంటర్ వద్దే ప్రమాదం జరిగింది. క్యూలో ఎక్కువసేపు నిలబెట్టారు. జనం ఒక్కసారిగా రావడంతోనే తొక్కిసలాట. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం’ అని ఎస్పీ పేర్కొన్నారు. కాగా, ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందగా పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన విషాదం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందగా పలువురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్ షో కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది. దీంతో, చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడితున్నారు. గుంటూరు చంద్రబాబు సభకు 5వేల లోపే జనం హాజరు కాగా, హాజరైన వారిలో సగం మందికి కూడా కానుకలు అందలేదు. కానుకలు అయిపోయాయంటూ నిర్వహకులు చేతులెత్తేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతో ఒక మహిళల అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. కానుకల దృశ్యాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేసే యత్నం చేశారు. జనాలు ఎక్కువగా కనిపించేందుకు అందరినీ ఒకేవైఉపు తరలించే ప్రయత్నం చేశారు.కానుకల కోసం ఒక్కసారిగా జనాలు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. -
ఇలా చెప్పడం ఆత్మవంచన కాదా చంద్రబాబు?
కందుకూరు విషాద ఘటన తర్వాత కూడా ప్రతిపక్ష తెలుగుదేశం విపరీత ధోరణిలో ఏ మాత్రం మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, తదితర మీడియా సంస్థలు కందుకూరులో టీడీపీ అదినేత చంద్రబాబు రోడ్ షో లో ఎనిమిది మంది మరణిస్తే దాని ప్రభావాన్ని తగ్గించి ప్రచారం చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఇదే వైసీపీ వారి సభలో ఏదైనా చిన్న ఘటన జరిగినా చిలవలు,పలవలుగా రాసేవి. ఇలాంటివి ఏ సభలోను జరగకూడదు. ఇక్కడ జరిగింది మానవ తప్పిదమా? ప్రచార యావతో జరిగిన తప్పిదమా? లేక ఇంకేదైనా కారణమా ? అన్న విషయాలపై విశ్లేషణకు వెళ్లకుండా టీడీపీ మీడియా జాగ్రత్తపడుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీనికి ఎలా కవరింగ్ ఇస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.ఇలాంటి ఘటనలను కూడా దిక్కుమాలిన రాజకీయాలకు వాడుకుంటారా అన్న బాద కలుగుతుంది. బాధితులు తొక్కిసలాటకు గురై మరణిస్తే వారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని అన్నారట. ఆయన ఉద్యమం రాష్ట్రం కోసం చేస్తున్నారట. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నమాట. చనిపోయినవారు రాష్ట్రం కోసం సమిదలుగా మారారని ఆయన చెబుతున్నారు. ఇంత ఘోరంగా మాట్టాడవచ్చని చంద్రబాబు పదే, పదే రుజువు చేస్తున్నారు. కందుకూరులో డ్రోన్‌తో షూటింగ్ జరపడం కోసం, జనం బాగా వచ్చారని రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు గాను చిన్న బజారులో సభ పెట్టి, తొక్కిసలాటకు కారణమై, పలువురు మురికి గోతిలో పడిపోతే రాష్ట్రం కోసం చనిపోయినట్లా?మరి అలాగైతే గోదావరి పుష్కరాలలో తన సినిమా యావకోసం 29 మంది చనిపోతే వారు ఎందుకు మరణించారు?అప్పుడు ఆయన ఏమని చెప్పారో గుర్తుందా?కుంభ మేళాలలో మరణించడం లేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించి అవమానించారు. మరి ఇప్పుడేమో రాష్ట్రం కోసం చనిపోయారని అంటున్నారు. నిజానికి ఈ ఘటన జరిగిన తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నిటిని వాయిదా వేసుకుని కందుకూరు బాధితులను పరామర్శించిన తర్వాత విజయవాడకో, హైదరాబాద్ కో వెళ్లిపోయి ఉంటే బాగుండేది. కాని అలాకాకుండా తన టూర్ షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసుకోకుండా ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ యాత్ర కోసం పర్యటించడం పద్దతిగా కనిపించదు. ఘటన జరిగిన తర్వాత బాదితులను పరామర్శించి వస్తానని, అంతవరకు జనం రోడ్డు మీదే ఉండాలని ఆయన కోరారంటే ఆయన యావ ఎలాంటిదో ఊహించుకోవచ్చు. అయినా ఆయన ఇష్టం. రాజకీయమే ఊపిరిగా జీవించే ఆయనకు ఇలాంటివి చిన్నవిగానే ఉండవచ్చు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రభుత్వం కోటి రూపాయలు సాయం ప్రకటిస్తే అదేమి సరిపోతుంది అని ప్రశ్నించి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన ఇప్పుడు పది లక్షలతో సరిపెట్టుకున్నారు. మరో పాతిక లక్షలు పార్టీ ఇతర నేతలు ఇస్తారట. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. టీడీపీ ఆర్దికంగా పటిష్టంగా ఉన్న పార్టీనే. అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. విరాళాలు కూడా కోట్లలోనే వస్తుంటాయి. అయినా పది లక్షలకే పరిమితం అయ్యారు. ఎదుటివాడికి చెప్పడం కాకుండా మరికొంత అదనంగా పార్టీ తరపున సాయం చేసి ఉండాల్సింది. చంద్రబాబు సభకు వెళితే మంచి కూలీ వస్తుందనుకున్నవారు ఈ తొక్కిసలాటలో మరణించారని వార్తలు వచ్చాయి. కూలి కోసం వచ్చినవారు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు చెప్పడం ఆత్మవంచనే అవుతుంది.ఇక పోలీసులు భద్రత ఎక్కువగా ఉండాల్సిందని ఆయన చెబుతున్నారు.ఎక్కువ మందిని పెడితే ఒక ఆరోపణ. ఇలాంటివి జరిగితే మరో ఆరోపణ. అసలు ప్రజలంతా అంత ఎగబడి వస్తుంటే ఏదైనా పెద్ద మైదానంలో సభ పెట్టుకుని సవాల్ విసిరి ఉండవచ్చు కదా! దాని గురించి మాట్లాడారు. గతంలో ఎన్.టిఆర్ సర్కిల్ లో సభలు జరిగాయని అంటున్నారు. జరిగి ఉండవచ్చు.కాని ఏభై మీటర్ల దూరం వెళ్లి సభ ఎందుకు పెట్టినట్లు? పర్మిషన్ తీసుకున్నదెక్కడ? మీటింగ్ జరిగిందెక్కడ?వాటన్నిటిని పోలీసులు వివరిస్తున్నారు కదా? అయినా ఇక్కడా డబాయింపేనన్నమాట. తెలుగుదేశం, చంద్రబాబు చేసిన తప్పులను పోలీసులపై తోసి వేయడానికి ఈనాడు పత్రిక ముందుగానే వ్యూహం రచించింది. ముఖ్యమంత్రి సభకు వందల సంఖ్యలో పోలీసులు వస్తున్నారని, చంద్రబాబు సభకు అలా రావడం లేదని పేర్కొంది.ఇది ఎంత దారుణంగా ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పోలీసులు ఉండేవారు?ఆనాటి ప్రతిపక్ష నేత జగన్‌కు భద్రతగా ఎందరు ఉండేవారు? ఆ సంగతి తెలియదా? మరో సంగతి ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబుకు ఉన్నంత మంది భద్రతా సిబ్బంది మరే నేతకు లేరు. కేంద్ర బలగాలు సైతం ఆయన వెన్నంటి ఉంటాయి. అయినా వారెవ్వరూ చాలలేదట. రోడ్ షో లో ఎవరినైనా పోలీసులు ఆపితే ఇదే ఈనాడు, టీడీపీ మీడియా ఎంతగా గగ్గోలు పెట్టేవి. సీఎం సభ నిమిత్తం రోడ్డుపై బారికేడ్లు పెట్టారని వీరే కదా విమర్శించింది. ఇలా ఎక్కడ ఏ అవకాశం వస్తే, ఆ విదంగా అడ్డగోలుగా కథనాలు రాయడం, వాటిని టీడీపీవారు ప్రచారం చేయడం మామూలు అయింది . మామూలుగా అయితే రెండు, మూడు రోజుల పాటు ఈ ఘటనపై పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసే ఈనాడు, ఈ ఘటనకు వచ్చేసరికి పందా మార్చేసింది. చంద్రబాబు వారిని ఆదుకుంటానన్నారన్న విషయాలకే ప్రాదాన్యత ఇచ్చి ఇక్కడ కూడా సానుభూతి సంపాదించాలన్న నీచమైన ఆలోచన చేసినట్లు అనిపిస్తుంది. లేకుంటే రోడ్డు అంతా కొలతలు వేసి, ఎక్కడ సభ జరగాలి? ఎక్కడ జరిగింది?రోడ్డు పై ఏమి అడ్డం ఉన్నాయి.. డ్రోన్ ఎవరు పెట్టారు? ఎవరు సలహా ఇచ్చారు? ఇలా నానా పరిశోధనలతో వార్తలు ముంచెత్తే ఈనాడు తెలుగుదేశం విషయంలో మాత్రం పూర్తిగా నోరుమూసుకుని ఉండడం వారి ప్రమాణాల పతనానికి అద్దం పడుతుంది. కావలిలో జరిగిన సభలో చంద్రబాబు పోలీసులను మళ్లీ ఎలా బెదిరిస్తున్నారో చూడండి. మా పై కేసులు పెడతారా? పెట్టండి. అక్రమ కేసులు పెట్టిన ఏ అధికారిని వదలం. చట్టం ప్రకారం శిక్షిస్తాం. కావలిలో ఇరవై కేసులు పెట్టారు. మేము వచ్చాక 200 కాదు.. రెండువేల కేసులు పెడతాం అని ఆయన అంటున్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయా? చంద్రబాబును ఎన్నుకుంటే వేల కేసులు పెడతామని ఆయన పోలీసులను కాదు హెచ్చరిస్తున్నది. ప్రజలందరిని అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు. కేసులు కావాలంటే ఆయనను ఎన్నుకోవాలన్నమాట!ఇది కొత్త నినాదమే. దీని ఆధారంగానే తెలుగుదేశం ఎన్నికలకు వెళుతుందా! -
అనుమతి ఇచ్చిన ప్రాంతంలో సభ నిర్వహించలేదు: ఎస్పీ
నెల్లూరు: జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్‌షోలో చోటు చేసుకున్న విషాద సంఘటనపై జిల్లా ఎస్పీ విజయరావు విచారం వ్యక్తం చేశారు. సాక్షి టీవీతో ఎస్పీ మాట్లాడుతూ.. ‘కందుకూరు సంఘటన దురదృష్టకరం. ఎన్టీఆర్ సర్కిల్లో చంద్రబాబు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అయితే తొక్కిసలాటకు ఆస్కారం ఉండదు. అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి ఇరుకుగా ఉన్న రోడ్లోకి చంద్రబాబు వెళ్లారు. 46 మీటర్లు ముందుకు వెళ్లిపోయారు. ఒకే చోటికి జనం ఒక్కసారిగా చేరటంతో తొక్కిసలాట జరిగింది. గాయపడ్డ పిచ్చయ్య ఇచ్చిన ఫిర్మాదుతో కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెక్షన్లు నమోదు చేస్తాం’ అని తెలిపారు. -
ఇదేం ఖర్మ, ఇదేం ప్రచార యావ?
నెల్లూరు జిల్లా కందుకూరు వద్ద జరిగిన దుర్ఘటన విచారకరం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఒక కార్యక్రమం చేపట్టి వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కందుకూరు వెళ్లారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సభలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేతలు ఎలా స్పందించాలి? అసలు ఈ ఘటనకు కారణం ఏమిటి? ఇందులో పోలీసుల తప్పు ఏమైనా ఉందా? లేక నేతల అతి తెలివి వల్ల ఇంతమంది బలయ్యారా? రాజకీయ ప్రచారం ఇరుకు రోడ్లపై పెడితే ఆ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా? జనం సరిపడ రాకపోతే, వెలితిగా కనిపించి పార్టీకి నష్టం జరుగుతుందని ఇలా చేస్తుంటారా? ఇలాంటి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఒక అవగాహనకు రావాలి. ప్రజల ప్రాణాలతో ఆటలా? మీడియాలో వచ్చిన కధనాల ప్రకారం కందుకూరులో మరో పెద్ద సర్కిల్ ఉన్నప్పటికీ, చిన్న ప్రదేశంగా ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ ను తెలుగుదేశం ఎందుకు ఎంపిక చేసుకుంది? టీడీపీ అధిష్టానం సూచనల మేరకే ఎక్కడ సభ ఏర్పాటు చేయాలన్నది నిర్ణయిస్తారు. కొన్ని కధనాల ప్రకారం తెలుగుదేశం అధినాయకత్వం అనండి.. చంద్రబాబు లేదా.. లోకేష్ వంటివారు ఇలా కాస్త చిన్న , చిన్న రోడ్లపై మీటింగ్ లు పెడితే తక్కువ జనం వచ్చినా.. పత్రికలలోను, టివీలలోను జనం బాగా వచ్చారని ప్రచారం చేసుకోవచ్చన్న యావతో ఇలా చేస్తున్నారట. ఏ పార్టీ ఇలా చేసినా మంచిది కాదు. నిజానికి ప్రజల మద్దతు తమకు ఉందని భావించే ఏ పార్టీ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు పొడవాటి రోడ్లను, ఉన్నంతలో విశాలమైన రోడ్లను ఎంపిక చేసుకుని అనుమతి తీసుకుని , అందుకు తగ్గ ఏర్పాట్లను ముందుగానే చేసుకుని సభ నిర్వహించేవారు. కానీ చంద్రబాబు సభలకు అలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. సన్నని సందు ఉంటే ఫోటో బాగా వచ్చి విశేష సంఖ్యలో జనం వచ్చారని రాష్ట్రం అంతటా నమ్మించవచ్చన్నది వారి ఆలోచన అట. అలాంటి దిక్కుమాలిన ఐడియా వల్ల ఇప్పుడు కందుకూరులో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. దీనికి ఎవరు బాద్యత వహించాలి? ఈ వీడియో చూడండి.! మీరే నిర్ణయించుకోండి తెలుగుదేశం అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఉన్న కందుకూరు వీడియోను చూడండి. సంఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు.. వీడియోలో 17వ నిమిషం దగ్గర చూడండి. చాలా చిన్న దారిలో సభ ఏర్పాటు చేశారు, అక్కడే లైవ్ కవరేజ్ కోసం వ్యాన్ పెట్టారు. 17వ నిమిషం నుంచి 19వ నిమిషం వరకు చంద్రబాబు ఏం మాట్లాడారో పరిశీలిస్తే.. జనం ఎక్కుతున్నందున తన లైవ్ ప్రసారాలకు ఆటంకం ఏర్పడుతుందన్నదే తన ఆందోళనగా కనిపించింది. ఆ వ్యాన్‌కు అత్యంత సమీపంలోనే తొక్కిసలాట జరిగింది. నిజానికి జనాన్ని సరిగా సమన్వయం చేసుకుంటే .. పరిస్థితి మరోలా ఉండేది. లైవ్ ప్రసారాలు బాగా రావాలన్నా తాపత్రయం తప్ప.. జనాన్ని క్రమ పద్ధతిలో ఉంచాలన్న అంశాన్ని విస్మరించినట్టు అనిపిస్తుంది. పాపం.. పచ్చ ప్రకోపం దీని ప్రభావాన్ని తగ్గించడానికి ఈనాడు వంటి టీడీపీ మీడియా సంస్థలు చాలా పాట్లు పడినట్లు వారు రాసిన కథనాలు చదివితే అర్దం అవుతుంది. వాస్తవ విశ్లేషణతో నిమిత్తం లేకుండా పోలీసులు తక్కువగా ఉన్నారని ఒక వార్త ఇచ్చారు. పోలీసులు ఎక్కువమంది ఉంటే అప్పుడు తొక్కిసలాట జరగకుండా వారు ఎలా ఆపగలుగుతారు? పోలీసులు ఎక్కువ మందిని పెడితే జనాన్ని రాకుండా పోలీసులు అడ్డుపడ్డారని అప్పుడు రాసేవారు. అసలు ఇరుకు రోడ్డులో సభ పెట్టడమేమిటని ఈ మీడియా ప్రశ్నించాలి. పైగా చంద్రబాబు ముందు నుంచీ జాగ్రత్తలు చెపుతూనే వున్నాడు అంటూ ఓ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. వ్యాన్ దిగండి, లేకపోతే లైవ్ టెలికాస్ట్ ఆగిపోతుందని చంద్రబాబు చెప్పారు కానీ, అంత మంది ఒకే చోట గుమ్మిగూడితే ప్రమాదం , జాగ్రత్త అని చెప్పలేదు, హెచ్చరించలేదు. చేయాల్సిన పని చేయకపోగా, గతంలోను ఇలాంటి ఘటనలు జరిగాయని ఒకసారి జగన్ సభలో గోడ కూలి ఒకరు, పవన్ సభలో ఒకరు, కుప్పం సభలో మరొకరు మరణించారంటూ కందుకూరు విషాదం తీవ్రతను తగ్గించే యత్నం చేశారు. బాబుకు ఇవి కొత్తేం కాదు ఇది చూశాక ఒక విషయం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు జరిగాయి. తనకు కేటాయించిన ఘాట్ లో కాకుండా సామాన్య భక్తుల ఘాట్‌లో చంద్రబాబు తన కుటుంబంతో సహా స్నానాలు చేయడం, ఈ కార్యక్రమం ప్రచారం కోసం కెమెరాలు పెట్టడం, ఓ స్టార్ డైరెక్టర్‌ను తెచ్చి షూటింగ్ ఏర్పాట్లు చేయడం, ఆ క్రమంలో భక్తులందరిని గేటు వద్ద నిలిపివేయడం, తదుపరి ఒక్కసారిగా గేటు తెరవడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు వేల మంది పోలీసులు చంద్రబాబు భద్రతకు, పుష్కరాల నిమిత్తం ఉన్నారు. అయినా అంతమంది ఎలా చనిపోయారు? పైగా ఆ ఘటన నేపధ్యంలో చంద్రబాబు ఏమన్నారు? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో జరగలేదా? అని ఎదురు ప్రశ్నించి అంత విషాదాన్ని అపహాస్యం చేశారు. పైగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ అంటూ హడావిడి పెట్టి ఫైల్ మూసేశారు. చంద్రబాబు కుటుంబ స్నానాల వల్లే ఆ ఘటన జరిగిందని కలెక్టర్ ఇచ్చిన నివేదికను తొక్కేశారు. తప్పెవరిదో తెలుసా బాబు.? ఇప్పుడు చంద్రబాబు మరో ప్రకటన చేశారట. ప్రభుత్వంపై అవేశంతో ఎక్కువ మంది వచ్చారట. అది నిజమో,కాదో, ఆయనకు తెలుసు.సభలకు జనాన్ని ఎలా సమీకరిస్తారో, అందులో చంద్రబాబు స్టైల్ ఏమిటో, ఒక్కో సభకు ఎంత ఖర్చు చేస్తారో పార్టీ వారిని రహస్యంగా అడిగితే అంతా చెబుతారు. పాపం.. కొంతమంది డబ్బుకు ఆశపడి ఇలా సభలలోకి వస్తుంటారు. కొందరు మద్యం కోసం వస్తుంటారు. ఎలాగైనా రానివ్వండి.. అది వేరే విషయం. కాని వారు ఇలాంటి విషాద ఘటనలో మరణించడం మాత్రం బాధాకరం. నిజంగానే ప్రజలలో ప్రభుత్వంపై అంత ఆవేశం ఉందని టీడీపీ భావిస్తుంటే పెద్ద సభా స్థలి తీసుకునో, ఏ కాలేజీ మైదానమో తీసుకుని సభ జరిపితే వారికి మైలేజీ వచ్చేది కదా? వేలాది మంది వచ్చారని చెప్పుకునే అవకాశం ఉండేది కదా! మరి ముప్పై అడుగుల పట్టి,పట్టని రోడ్డు, అందులోను మళ్లీ తోపుడు బండి , లైవ్ వాన్ అన్నీ ఆ సందులోనే.. ఇదంతా కచ్చితంగా నిర్వాహకుల తప్పిదం. దానిని అనుమతించిన చంద్రబాబు నాయుడి తప్పిందం అన్నది తెలుస్తూనే ఉంది. తనంత సీనియర్ లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన సభలను ఇలా చిన్న రోడ్లపై ఎందుకు పెడుతున్నారు? వీటిని డ్రోన్ ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. నిజమే. ఏ సభకైనా ప్రచారం కోరుకుంటారు. తప్పు లేదు. కానీ ఆ ప్రచార యావలో ఇలా మనుషులను బలి తీసుకునే పరిస్థితి మంచిదికాదు. ఇప్పుడు జనం ఏమనుకోవాలి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కాదు .. తెలుగుదేశం సభలకు వెళ్లినవారికని ప్రజలు అనుకోరని ఎవరైనా భావించగలమా! -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కందుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, అమరావతి: కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామన్నారు. గవర్నర్ దిగ్భ్రాంతి నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ.. -
కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సాక్షి, నెల్లూరు: కందుకూరు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్ షో జరిగిన ఎన్టీఆర్ సర్కిల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. చదవండి: (నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు) -
ఇండోనేసియా : ఫుట్ బాల్ గ్రౌండ్ లో తొక్కిసలాట
-
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో మహిళ మృతి
-
మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట 8మంది మృతి
-
ఛాత్ ఉత్సవాల్లో 30 మంది మృతి
పాట్నా: గోడ కూలడం, తొక్కిసలాట, మునిగిపోవడం వంటి వాటి కారణంగా బిహార్‌లో 30 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు బిహార్ ప్రజలు జరుపుకునే ఛాత్ పండగ సందర్భంగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు గోడ కూలిన ఘటనలో, ఇద్దరు పిల్లలు తొక్కిసలాటలో, మరో 26 మంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్సవాల సందర్భంగా మునిగిపోయి మరణించారు. ఛాత్ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. లక్షలాది మంది ఈ పండుగను దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద స్నానాలాచరించి జరుపుకున్నారు.