
సాక్షి, నెల్లూరు: కందుకూరు దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్ షో జరిగిన ఎన్టీఆర్ సర్కిల్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
చదవండి: (నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment