అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం | Shame On Injured Woman In Guntur Chandrababu Meeting | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం

Published Mon, Jan 2 2023 3:32 PM | Last Updated on Mon, Jan 2 2023 4:30 PM

Shame On Injured Woman In Guntur Chandrababu Meeting - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ నేతల అమానుష చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు సభలో గాయపడి కొన ఊపిరితో ఉన్న మహిళను కారు డిక్కీలో కుక్కి టీడీపీ నేతలు  జీజీహెచ్‌కు తరలించారు. దీంతో తొక్కిసలాటలో గాయపడిన ఆమె.. ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. టీడీపీ నేతల అమానుషంపై సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు.

కాగా, విజయవాడ ఏలూరు రోడ్‌లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్‌ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు.
చదవండి: కాటేసిన కానుక!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement