
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ-4 లాంఛింగ్ సభ అట్టర్ ప్లాపయ్యింది. ప్రారంభ సభకు టీడీపీ నాయకులు బస్సుల్లో జనాల్ని రప్పించారు. అయినా సరే మీటింగ్ జరుగుతుండగా జనం మధ్యలోనే వెళ్లిపోయారు.
సమావేశం మధ్యలోనే జనం వెళ్లిపోవడంతో చంద్రబాబుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడుగు బలహీన వర్గాలను అవమానిస్తూ మాట్లాడారు. ఇలాంటి బడుగుల,బలహీనుల ఆలోచనలు పూట వరకే. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వాళ్ల ఆలోచన వచ్చాం. మీటింగ్ అయ్యింది. మా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు మన ఆలోచనా విధానాన్ని తప్పుబడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది ... కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు’అని వ్యాఖ్యానించారు. అయితే, సీఎం వ్యాఖ్యల పట్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.