woman injured
-
చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం
-
అమానుష చర్య.. చంద్రబాబు సభలో గాయపడిన మహిళకు అవమానం
సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ నేతల అమానుష చర్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు సభలో గాయపడి కొన ఊపిరితో ఉన్న మహిళను కారు డిక్కీలో కుక్కి టీడీపీ నేతలు జీజీహెచ్‌కు తరలించారు. దీంతో తొక్కిసలాటలో గాయపడిన ఆమె.. ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. టీడీపీ నేతల అమానుషంపై సభ్య సమాజం సిగ్గుపడుతోంది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. కాగా, విజయవాడ ఏలూరు రోడ్లో ఉయ్యూరు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేశారు. ఏ-1గా ఉన్న శ్రీనివాస్‌పై నల్లపాడు పీఎస్‌లో సెక్షన్లు 304, 174 కింద కేసులు నమోదయ్యాయి. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశారు. చదవండి: కాటేసిన కానుక! -
Hyderabad: నిలిచిపోయిన కార్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై టర్బో రైడర్స్ మహిళారేసర్కు గాయాలయ్యాయి. క్వాలి ఫైయింగ్ రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో కార్ రేసింగ్ ఆలస్యంగా జరిగింది. రేసింగ్ ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, లైటింగ్ తగ్గడంతో రేసింగ్ లీగ్ నిలిచిపోయింది. ఫార్మూలా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. కాగా, శనివారం మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. చదవండి: టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు? -
విశాఖలో కారు బీభత్సం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): పూర్ణామార్కెట్‌లో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై వేగంగా దూసుకెళ్తూ ఓ మహిళతో పాటు విద్యుత్ స్తంభాన్ని సైతం బలంగా ఢీకొని ఆగిపోయింది. దీంతో ఆ స్తంభం కారుపై ఒరిగిపోయింది. కారుపై విద్యుత్ తీగలు పడి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. అలాగే జనం కూడా ఆ సమయంలో తక్కువగా ఉండడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఏపీ 09 బీఎన్ 1410 గల అంబాసిడర్ కారు డాబాగార్డెన్స్‌లోని సంస్థ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్, పూర్ణామార్కెట్ మీదుగా వెలంపేటలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి బయలుదేరింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగదాంబ జంక్షన్ దాటి పూర్ణామార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఆ కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. వేగంగా దూసుకొస్తూ సాలిపేటకు చెందిన కేజీహెచ్ ఎస్–3 వార్డులో స్వీపర్(కాంట్రాక్ట్ వర్కర్)గా పని చేస్తున్న బండారు అప్పలనరసమ్మ(50)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు రోడ్డుకు కుడివైపున ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం ఆ కారుపై పడిపోయింది. హైటెన్షన్ వైర్లు తెగిపడి రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ శాఖ సిబ్బంది ఘటన జరిగిన 15 నిమిషాలు తరువాత వచ్చి సరఫరాను నిలిపివేశారు. అంతవరకు పోలీసులు ఘటన స్థలం వద్ద భదత్ర చర్యలు చేపట్టారు. గాయపడిన అప్పలనరసమ్మను చికిత్స కోసం పోలీసులు వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్పటి వరకూ రద్దీగా ఉన్న పూర్ణామార్కెట్ జంక్షన్ అప్పుడే ఒక్కసారిగా ఖాళీగా కనిపించింది. లేదంటే కారు బీభత్సానికి ఎంత మంది బలయ్యేవారోనని స్థానికులు చర్చించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల కోసం వెళ్తున్న కారు.. బీఎస్ఎన్ఎల్ గ్రూప్–సీ, డీ ఉద్యోగుల ఎన్నికలు సోమవారం జరిగాయి. డాబాగార్డెన్స్‌లోని జనరల్ మేనేజర్ కార్యాలయంతో పాటు వెలంపేటలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం వెలంపేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చేందుకు డాబాగార్డెన్స్ జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి అంబాసిడర్ కారు బయలుదేరి వెళ్లింది. ఆ కారులో పలువురు బీఎస్ఎన్ఎల్ అధికారులు కూడా ఉన్నారు. పూర్ణామార్కెట్ వద్దకు వచ్చేసరికి కారుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. -
మీర్పేట్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
-
జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి..!
సాక్షి, భువనేశ్వర్: ఏడాది కాలం నుంచి వేధిస్తున్నా తనకు లొంగడం లేదని ఓ ఉన్మాది అమాయకురాలిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర కాలిన గాయాలైన యువతి ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. పరశురామ్ మఝీ (35) కలహండి జిల్లాలోని కలాంపూర్ బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. గతేడాది నుంచి ఓ యువతి(22) ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పటిలాగే యువతిపై బెదిరింపులకు దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో నీ సంగతి తర్వాత చెప్తానంటూ పరశురామ్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సోమవారం కంప్యూటర్ క్లాస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న యువతిని బంకపల్లా సర్కిల్ వద్ద ఆ ఉన్మాది అడ్డగించాడు. తనతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో ఆవేశానికి లోనైన నిందితుడు తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను బాధితురాలి ముఖంపై పోసి దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ముఖం, చేతిపై తీవ్ర కాలిన గాయాలైన యువతిని భవానిపట్నా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి అందర్నీ నమ్మించి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన పరశురామ్ మఝీ ఇంత దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలినట్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్‌లో ఏడాదికేడాది యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. 2011లో 80గా నమోదైన యాసిడ్ దాడులు, 2016లో 307కు పెరగడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తుంది. -
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటి మార్కెట్ మార్డ్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నూరి నాగసుబ్బమ్మ(50) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని కొత్తపేటలో నివాసం ఉంటున్న నాగసుబ్బమ్మ నూనె వ్యాపారం చేస్తుంది. ఈక్రమంలో మాసాపేట రెడ్డివారిపల్లికి నడుచుకుంటూ వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్ ఆమెను ఢీకొంది. ఈ సంఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని 108లో రాయచోటి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధం
మహిళకు గాయాలు రూ.5లక్షల ఆస్తి నష్టం రేగొండ : గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మడ్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెం దిన కొయ్యడ బిక్షపతి ఇంట్లో శనివారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు లేచాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వృద్ధురాలు కొయ్యడ నర్సమ్మకు మంటలం టుకొని గాయపడింది. అలాగే పక్కనే ఉన్న కొయ్యడ గట్టయ్య, కొయ్యడ నర్సయ్య పూరిళ్లు కూడా అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు ఇళ్లలో విలువైన సామ గ్రి, వస్తువులు దగ్ధమయ్యాయని బాధితులు ఆవేదన వ్య క్తం చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వా టిల్లిందని వాపోయారు. కాగా బాధితుల ఫిర్యాదు మేర కు రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామ నిర్వహించారు. బాధిత కుటుం బాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
బస్సు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో..
తిరుపతి: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులోని అత్యవసర ద్వారం అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో పక్కనే కూర్చుని ఉన్న మహిళ అందులో నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుపతిలోని అలిపిరి వినాయక ఆలయ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. టీటీడీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న వాణి(35) ఆర్టీసీ బస్సులో వెళ్తూ ప్రమాదవశాత్తు అత్యవసర ద్వారం తెరుచుకుంది. దీంతో ఆమె అక్కడ నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొంది!
హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. ఆ మహిళ వెంటనే అప్రమత్తమై చైన్ స్నాచర్లను ప్రతిఘటించడంతో పాటు వారిని వెంటాడింది. బైక్ వెంట పరిగెత్తి వారిని పట్టుకొవడానికి యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చందానగర్ డివిజన్ సురక్ష హిల్స్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లింది. మోటార్ సైకిల్ పై వచ్చిన దొంగలు ఆమె వాకింగ్ చేస్తున్న సమయంలో మెడలో నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించడానికి యత్నించారు. రాధాబాయి వారిని ధైర్యంగా అడ్డుకొంది. ఈ క్రమంలో ఆమె బైక్‌పై ఉన్న వారిని వెంబడిస్తూ.. కిందపడి గాయాలపాలైంది. దీంతో ఆమెకు తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. అయినా ధైర్యంతో దొంగల భారీ నుండి గొలుసును కాపాడుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి పరామర్శించారు. -
సిలిండర్ పేలి మహిళకు తీవ్రగాయాలు
ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) : ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మారూరి ముత్యమ్మ(50) అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
లారీ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఇల్లందు మండలం నిజాంపేటలో రోడ్డు దాటుతున్న రాజేశ్వరి అనే మహిళను వేగంగా వస్తున్న లారీ ఢీకొనింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రాజేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
చర్చిలో ఉన్మాది బీభత్సం
కర్నూలు : చర్చిలో ప్రార్థనలు జరుగుతన్న సమయంలో అక్కడకు వెళ్లిన ఓ సైకో తన చేతిలో ఉన్న సుత్తితో ఓ వైద్యురాలిపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన కర్నూలులోని సీఎస్ఐ చర్చిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న హిమబిందు(45) సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ప్రదీప్ కుమార్ అనే ఉన్మాది సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన తోటివాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు వాహనం ఢీ: మహిళకు తీవ్రగాయాలు
తుర్కయంజాల్ (రంగారెడ్డి) : పోలీసు వాహనం ఢీకొని ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా వెల్డండకు చెందిన దండు అంజయ్య వనస్థలిపురం వైదేహి నగర్లో నివాసముంటూ మల్కాజిగిరిలోని సీఐడీ కార్యాలయంలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పోలీసు శాఖకు చెందిన క్వాలిస్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. శనివారం ఉదయం అంజయ్య కొడుకు(13)కు క్వాలిస్ వాహనంపై వైదేహినగర్లో డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఆ సమయంలో అదే కాలనీ నివాసి నాంపల్లి శోభారాణి (45) నడిచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి శోభారాణిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో భయాందోళనలకు గురైన అంజయ్య, అతని కొడుకు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శోభారాణిని కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తన కొడుకును ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై అంజయ్య తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. -
లారీ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
టేకులపల్లి: లారీ ఢీకొన్న ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి బోడు రోడ్ సెంటర్లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. టేకులపల్లికి చెందిన వృద్ధురాలు రాయల సక్కుబాయి ఆర్టీసీ బస్సు దిగి రోడ్డు దాటుతుండగా కేబీసీ నుంచి బీపీఎల్‌కు బొగ్గు రవాణా చేస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సక్కుబాయిని 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
మహిళపై దాడి చేసిన చైన్ స్నాచర్లు
-
మహిళపై చైన్ స్నాచర్ల దాడి
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పరిధిలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... ఆమె మెడలో బంగారం గొలుసును తెంచుకుని... బైక్‌పై పరారైయ్యారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూపీలో మరో దారుణం
ముజఫర్‌నగర్ : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. భూవివాదాల నేపథ్యంలో ఓ యువతిపై కిరోసిన్ పోసి సజీవదహనం చేసేందుకు యత్నించిన ఘటన గడవకముందే, షామ్లి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. నడుస్తున్న రైల్లోంచి ఓ మహిళను గుర్తుతెలియని దండుగులు బయటకు తోసివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే అధికారి అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షామ్లి జిల్లాలోని ఢిల్లీ-సహరనపూర్ మార్గంలో బుద్ధపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో నడుస్తున్న రైల్లోంచి ఓ మహిళను బయటకు తోసివేశారు. తీవ్రగాయాలతో రైల్వే ట్రాక్ పక్కన అపస్మారకస్థితిలో పడివున్న మహిళను ఓ స్థానికుడు గమనించి షామ్లిలోని ఓ ఆస్పత్రికి తరలించాడు. ఆ మహిళ వయసు సుమారు 35 ఉంటుందని, ఆమె పరిస్థితి చూస్తే రైల్లోంచి ఎవరో ఆమెను తోసివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని షామ్లి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాధిత మహిళ ఇంకా తెలియలేదని రైల్వే అధికారి అజయ్ కుమార్ వెల్లడించాడు. -
మహిళ వేళ్లు కొరికేశాయి..
-
ఆటో బోల్తా : మహిళకు తీవ్రగాయాలు
ఇల్లందు (ఖమ్మం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం కొత్తలింగాల సమీపంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. గోవిందరాల నుంచి ప్రయాణికులతో కొత్తలింగాల వెళ్తున్న ఆటో కొత్తలింగాల శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కొత్త లింగాలకు చెందిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. -
వానరాల దాడి.. గర్భిణికి గాయాలు
మెదక్ రూరల్: కోతుల దాడితో భయపడిన ఓ గర్భిణి భవనం నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన సంఘటన మెదక్ మండలం బ్యాతోల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొనిగండ్ల స్రవంతి ఐదు నెలల గర్భిణి. సాయంత్రం వేళ తన భవనంపై ఆరబెట్టిన బట్టలను తెచ్చేందుకు పైకి ఎక్కింది. దీంతో కోతులు స్రవంతిపై దాడి చేశాయి. భయపడిన ఆమె వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో స్రవంతి రెండు చేతులు విరిగిపోయాయి. వెంటనే కుటుంబీకులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
-
మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మెదక్ : మెదక్ జిల్లా పుల్కల్ మండలం న్యూఉమ్నాపూర్లోని పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ వద్ద గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. సిబ్బంది శిక్షణ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మిస్‌ఫైర్ అయ్యింది. ఆ సమయంలో న్యూఉమ్నాపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ వ్యవసాయ పనుల నిమిత్తం నడుచుకుంటూ వెళుతుండగా ఆమె తలలోకి ఓ బుల్లెట్ దూసుకు వెళ్లింది. దాంతో ఆమెను బంధువులు హుటాహుటీన చికిత్స నిమిత్తం సంగారెడ్డి గోకుల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చంద్రకళ తలలోని బుల్లెట్‌ను తొలగించారు. కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.