ఖమ్మం: ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఇల్లందు మండలం నిజాంపేటలో రోడ్డు దాటుతున్న రాజేశ్వరి అనే మహిళను వేగంగా వస్తున్న లారీ ఢీకొనింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రాజేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.