సదా చనిపోయినట్లు నిర్ధారించిన వైద్య బృందం
సాక్షి, ఖమ్మం: బంధువుల ఇంట వేడుకకు హాజరై తిరుగుపయనమై వెళ్తుండగా నవ వధువును మృత్యువు కబళించింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబర్‌పేటకు చెందిన బలవంతపు మధు, సదా(24) కు ఫిబ్రవరి 14న వివాహమైంది. గంపలగూడెం మండలం చింతలనర్వలో బంధువుల ఇంట ఓ వేడుకకు వెళ్లారు. గురువారం అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి స్వగ్రామానికి వస్తుండగా ఖమ్మం జిల్లాలోని మధిర మండలం రాయపట్నం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బైక్ కిందపడింది.
ఈ సంఘటనలో సదా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు108 అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించగా..అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ మనోరమ నిర్ధారించారు. బయల్దేరి 2కి.మీ.దూరం కూడా చేరలేదు. కాసేపటికే ఈ ప్రమాదం గురించి తెలియడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. కొత్త దంపతులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా దుర్ఘటన జరిగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment