Madhira
-
‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’
మధిర: వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం మధిరలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఈ సభకు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. పోరాటాల గడ్డ మధిర ‘మధిర పోరాటాల గడ్డ. కేసీఆర్ మొన్న ఇక్కడ సభ పెట్టి ఇక్కడ భట్టి విక్రమార్క గెలవడని చెప్పారు. ఒక్క కేసీఆర్ కాదు వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు. మధిరలో 50 వేల మెజార్టీతో గెలుస్తా. కేసీఆర్, కేటీఆర్ ఉడత ఊపులకు మధిర ప్రజలు భయపడరు’ అని దీటుగా బదులిచ్చారు భట్టి విక్రమార్క. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తుందో వివరించారు. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్‌కే ఓటాయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారం వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆనందంగా ఉంది: ప్రియాంక ఇవాళ సంతోషంగా ఉందని, భట్టి నియోజకవర్గానికి వచ్చినందుకు ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ మధిర ప్రచార సభలో పేర్కొన్నారు. పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కను అభినందిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. బీజేపీపైనా విమర్శలు చేశారు. ‘రాత్రి సోనియా గాంధీతో మాట్లాడాను. హైదరాబాద్‌లో ఉన్నాను, భట్టి నియోజకవర్గానికి వెళ్తున్నానని చెప్పాను. తెలంగాణ వెళ్తున్నావు.. ప్రజలకు ఏం సందేశం ఇస్తావని సోనియా అడిగారు. సత్యమ మాత్రమే చెబుతానన్నాను. మంచి ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు ఆశపడ్డారని, తెలంగాణ కలల సాకారం కోసం బలమైన ప్రభుత్వం రాబోతోందని సోనియా చెప్పారు’ అని ప్రియాంక పేర్కొన్నారు. -
భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని తెలిపారు. మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు మద్దతుగా ఆయన ప్రసంగించారు.. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం చూడాలని అన్నారు.బీఆర్ఎస్ను గెలిపిస్తే రైతు బంధు ఏడాదికి రూ. 16 వేలు ఇస్తామన్న కేసీఆర్.. 24 గంటల విద్యుత్ ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. దళిత సమాజం దోపిడీకి గురైందన్నారు సీఎం కేసీఆర్. దళితుల పేదరికం తొలగించేందుకు దళితబంధు తీసుకొచ్చామని తెలిపారు. దళితబంధు లాంటి ఆలోచన కాంగ్రెస్ ఏనాడైనా చేసిందా అని ప్రశ్నించారు. మధిరలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ అని తెలిపారు. పాత మెజార్టీ కంటే రెండు సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిరకు చుట్టపుచూపుగా వస్తారని కేసీఆర్ విమర్శించారు. భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదని దుయ్యబట్టారు. భట్టి చేసిందేమి లేదని, దళితవర్గం ఒక్క ఓటు కూడా ఆయనకు వేయొద్దని హితవు పలికారు. ఈ పట్టి లేని భట్టి విక్రమార్కకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి బంగాళాఖాతంలో వేస్తామన్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారని.. కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు, భూమేత అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిచేది లేదు సచ్చేది లేదని.. ఆ పార్టీకి ఈసారి 20 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. చదవండి: కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి నిర్మలా -
తెలంగాణలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు: భట్టి
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. నవంబర్ 30 తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించారని తెలిపారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ఏర్పాటైనా 100 రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో భట్టి విక్రమార్క గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు వదిలించుకోవాలనుకుంటున్నారని అన్నారు. రామచంద్రపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి భట్టి సమక్షంలో 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి. చదవండి: ‘అది వదంతి మాత్రమే.. ఆ వార్తలను నమ్మకండి’ -
మూడుసార్లు ఓటమే.. బీఆర్ఎస్కు మళ్లీ భంగపాటు తప్పదా..
సాక్షి, ఖమ్మం: మధిర నియోజకవర్గ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి సీఏల్పీ నేత భట్టి విక్కమర్క రంగంలో దిగుతున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి సైతం లింగాల కమల్ రాజ్ బరిలో నిలుస్తున్నారు. అయితే వరుసగా మూడు సార్లు గెలిచిన భట్టి నాలుగోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుండగా.. మరోవైపు మూడుసార్లు భట్టిపై ఓటమిపాలైన లింగాల కమల్‌రాజ్ ఈసారైన పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలనే ఉద్దేశ్యంతో సీరియస్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఏంత చేసిన వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు లింగాల కమల్ రాజ్‌కు తక్కువగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మధిర నియోజకవర్గంలో ఈసారి సీఏల్పీ నేత భట్టి విక్కమార్కకు బీఆర్ఎస్ అధిష్టానం చెక్ పెడుతుందా.. మధిర నియోజకవర్గంలో పొలిటికల్‌గా ఏటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి?. ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గం...ఒకప్పుడు సీపీఏంకు కంచుకోటగా ఉన్న మధిర ఇప్పుడు హస్తం పార్టీకి కంచుకోటగా మారింది. సర్దార్ జమలాపురం కేశవరావు, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి లాంటి మహనీయులు ఈ నియోజకవర్గానికి చెందినవారు. లింగాల కమల్ రాజు ఎస్సీ రిజర్వడ్‌గా ఉన్న మధిర నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా ప్రస్తుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేసి గెలుపోందారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో భట్టి విక్కమార్కనే గెలుస్తూ వస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. రోడ్లు,ప్రభుత్వ నూతన కార్యాలయాలు, 100 పడకల హాస్పిటల్, జాలిముడి ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మధిర నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్లుతుంది. చదవండి: రెండుచోట్లా మైనంపల్లికి బీఆర్ఎస్ చెక్. తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని, మధిర మండలాలను దళిత బంధు పథకంకు ఎంపిక కావడంలో భట్టి విక్కమార్కనే కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశం కల్పించారు. వ్యవసాయధారిత ప్రాంతం కావడంతో రైతు సంక్షేమ పథకాలు నుండి ఎక్కువగా లబ్ధి పొందారు. ఇవన్ని వచ్చే ఎన్నికల్లో భట్టికి మరింత ప్లేస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజును మధిర ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం కమల్‌రాజ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో స్థానికులు అడిగిన సమస్యలపై దృష్టి పెట్టి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో నెరవేర్చేల ప్రయత్నాలు జరుపుతున్నారు. గత మూడుసార్లు పోటీలో నిలిచినా ఒక్కసారి కూడ గెలవలేకపోయారు. అయితే ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం అభ్యర్థిని మార్చి భట్టికి పోటిగా బలమైన అభ్యర్థిని పోటిలో దించుతుందనుకున్నారు. కాని మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో బీఆర్ఎస్లింకు గాల కమల్ రాజే అభ్యర్థిగా దిక్కయ్యారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే తనను ఈ సారైనా గెలిపించాలని స్థానిక ప్రజలను కోరుతున్నారు..అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నేతలు పార్టీలో చేర్పించేందుకు మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి మధిరలో లింగాల కమల్‌రాజ్ ఓటమి పాలైతే పొలిటికల్‌గా రాబోయే రోజుల్లో గట్టు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో కమల్‌రాజ్ కు ఈ ఎన్నికలు డూ ఆర్ డై గా మారయన్న ప్రచారం నడుస్తుంది. మధిర మున్సిపాలిటీలో సుమారు 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో అత్యధికంగా కమ్మ, ఎస్సీ, వైశ్య సామాజిక వర్గం వారికి చెందినవారు ఉండటంతో వీళ్ల ఓటు బ్యాంకును బట్టి ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటమిలు ఆధారపడ్డాయి. అదేవిధంగా ఎర్రుపాలెం, ముదిగొండ మండలంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో అత్యధిక వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. దీంతో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. మొత్తానికి మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అనేలా దూసుకుపోతున్నాయి..రెండు పార్టీలు గెలుపు పై దీమాతో ఉన్నాయి..కాంగ్రెస్ నుంచి సీఏల్పీ నేతగా ఉన్న భట్టి విక్కమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ రసవత్తరమైన పోటి ఉండే అవకాశం ఉంది... -
శాతవాహన ఎక్స్‌ప్రెస్: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు
మధిర/ఖమ్మం మామిళ్లగూడెం: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న శాతవాహన (12714) ఎక్స్‌ప్రెస్ రైలుపై మధిర రైల్వే స్టేషన్ సమీపాన బ్రాకెట్ ఇన్సులేటర్లు తెగిపడ్డాయి. దీంతో పెద్ద శబ్దం రావడమే కాక మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. మధిర రైల్వేస్టేషన్‌కు పది అడుగుల దూరాన రైలు నిలిచిపోగానే ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరిన శాతవాహన ఎక్స్‌ప్రెస్.. రాత్రి 9.30 గంటలకు కిలోమీటర్ నంబర్ 528/26 వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ట్రాక్ పక్కన ఉండే స్తంభాల నుంచి రైళ్లు నడిచేలా ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలకు అనుసంధానంగా బ్రాకెట్ ఇన్సులేటర్లు ఉంటాయి. ప్రమాదవశాత్తు ఈ ఇన్సులేటర్లు తెగిపడటంతో బోగీలపై మంటలు వచ్చినట్లు చెబుతున్నారు. విద్యుత్ తీగలు కూడా తెగిపోయినా రైలుకు పక్కన పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వెంటనే రైలు ఆగింది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడి ఉంటే, విద్యుత్ సరఫరా ఉన్నందున పెనుప్రమాదం జరిగేదని చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన భారీ శబ్దాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే లగేజీ, పిల్లలతో కలిసి కిందకు దిగి పరుగులు పెడుతూ మధిర స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయమై టీవీల్లో స్క్రోలింగ్ మొదలుకావడంతో వారికి బంధువులు ఫోన్ చేసి క్షేమ సమాచారాలను ఆరా తీయడం కనిపించింది. నిలిచిన రైళ్లు: శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఇంజన్ ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ (ఓహెచ్ఈ) వైర్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఓ పక్క సరఫరా నిలిచిపోయి శాతవాహన మధిరలో ఆగగా, మిగతా రైళ్లను కూడా ముందు జాగ్రత్తలో భాగంగా అటూ, ఇటు స్టేషన్లలో ఆపేశారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్ – తిరుపతి ప్రత్యేక రైలు, మధిర సమీపాన జీటీ, గోదావరి రైళ్లు, డోర్నకల్, పాపటపల్లి స్టేషన్లలో పద్మావతి, చారి్మనార్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. రైల్వే ఉద్యోగులు మధిర వెళ్లి శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఓహెచ్‌ఈకి రెండుగంటల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. 11.30 గంటల తర్వాత నిలిచిపోయిన రైళ్లన్నీ ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. పెద్ద శబ్దం వచ్చింది.. సికింద్రాబాద్ నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరా. మధిర స్టేషన్ సమీపిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత బోగీలపైన మంటలు వస్తున్నాయని ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో నేను కూడా భయపడ్డా. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు. – ప్రశాంత్ కుమార్, ప్రయాణికుడు ప్రాణం పోయిందనుకున్నా.. అప్పుడే నిద్ర పోతున్నా. బోగీలపై ఏదో రాడ్డు దూసుకుపోతున్న శబ్దం వచి్చంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచా. ఆ తర్వాత బోగీలపై మంటలు కూడా వచ్చాయి. ప్రాణం పోయిందనే అనుకున్నా. రైలు ఆగగానే అందరం కిందకు దిగి పరుగులు తీశాం. – వి.శ్రీనివాస్, ప్రయాణికుడు ఇది కూడా చదవండి: మీడియా ఎదుటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నిలదీసిన కూతురు.. ఏడ్చేసిన ముత్తిరెడ్డి -
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
-
సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఎంపీ పొంగులేటి
మధిర: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని శుక్రవారం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కలుపుతూ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం సమీపంలోని కట్టలేరుపై ఉన్న బ్రిడ్జి నాలుగేళ్ల కిందట వరద ఉధృతికి కొట్టుకుపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జగన్‌ను కలిసిన వారిలో భద్రాచలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. చదవండి: (ఊపందుకుంటున్న ‘ఊళ్లు’) -
‘నీ అప్పు తీరలేదు.. ఇంకా చెల్లించాలి, లేదంటే మీ అమ్మ ఫోటో మార్ఫింగ్ చేసి’
సాక్షి, ఖమ్మం: ‘నువ్వు తీసుకున్న అప్పు తీరలేదు. ఇంకా చెల్లించాలి. లేకపోతే.. మీ అమ్మ ఫోటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్సైట్లో అప్లోడ్ చేస్తాం’.. ఇది లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న ఆరాచకాలు. మంచిర్యాల ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా మధిరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న డబ్బు చెల్లించినా ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు ఓ యువకుడిని వేధిస్తుండడంతో పాటు ఆయన తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపిస్తున్న ఘటన ఇది. మధిరకు చెందిన ప్రదీప్ ఆన్లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఆ సమయాన ప్రదీప్‌తో పాటు ఆయన ఆధార్‌కార్డుతో పాటు తల్లి పాన్‌కార్డును యాప్ నిర్వాహకులు తీసుకున్నారు. అయితే, రుణం తిరిగి చెల్లించేందుకు యత్నించగా, వెబ్సైట్ పనిచేయలేదు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ లింక్ పంపడంతో డబ్బు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్‌ను ఫోన్ చేసి వేధించసాగారు..రాత్రి, పగలు తేడా లేకుండా రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తు నరకం చూపిస్తున్నారని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన తల్లి పాన్‌కార్డులోని ఫొటోను మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. అంతేగాక ఆయన ఫోన్లో నంబర్లు ఉన్న వారికి సదరు మహిళ మోసాలకు పాల్పడుతోందంటూ మెసెజ్‌లు పంపడం ప్రారంభించారు. ఈ విషయమై ప్రదీప్ చేసిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ ఎస్సై సంకీర్త్ తెలిపారు. -
విషాదం: పెళ్లైన 24 రోజులకే నవ వధువు దుర్మరణం
సాక్షి, ఖమ్మం: బంధువుల ఇంట వేడుకకు హాజరై తిరుగుపయనమై వెళ్తుండగా నవ వధువును మృత్యువు కబళించింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబర్‌పేటకు చెందిన బలవంతపు మధు, సదా(24) కు ఫిబ్రవరి 14న వివాహమైంది. గంపలగూడెం మండలం చింతలనర్వలో బంధువుల ఇంట ఓ వేడుకకు వెళ్లారు. గురువారం అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి స్వగ్రామానికి వస్తుండగా ఖమ్మం జిల్లాలోని మధిర మండలం రాయపట్నం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బైక్ కిందపడింది. ఈ సంఘటనలో సదా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు108 అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించగా..అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ మనోరమ నిర్ధారించారు. బయల్దేరి 2కి.మీ.దూరం కూడా చేరలేదు. కాసేపటికే ఈ ప్రమాదం గురించి తెలియడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. కొత్త దంపతులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా దుర్ఘటన జరిగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఉప్పూపప్పు కోసం అసెంబ్లీలో మాట్లాడతా
ముదిగొండ (మధిర): దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డుల పంపిణీ చేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.కార్డులు లేనివారిందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. రేషన్ కార్డులు ఈ దఫాలో రానివారికి కూడా వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రాక్టర్ ఉందనో, పిల్లలకు ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు ఉన్నాయనో, లేకపోతే రాబడి పొలం ఉందనే కారణంతోనే దరఖాస్తులు తిరస్కరించడం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. కూలీకి వెళ్లే కుటుంబం ఫైనాన్స్ నుంచి సెకెండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కుని, బతుకుదెరువు కోసం ప్రయివేట్ కంపెనీలకు ఉద్యోగాలకు పోయిన బిడ్డలున్న కుటుంబాలకు మానవతా హృదయంతో కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అధిక నిధులు ఉన్న మన రాష్ట్రంలో గతంలో చేసిన దానికంటే కాస్త ఎక్కువగా ప్రజలకు చేయాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతోపాటు 9 రకాల వస్తువులను సంచిలో పెట్టి ‘అమ్మహస్తం’ పేరుతో ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు సరకులు ఎత్తేసి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. బియ్యంతో పాటు గతంలో ఇచ్చిన సరుకులు ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తాను గతంలో అసెంబ్లీలో మాట్లాడాను.. మళ్లీ మాట్లాడతాను అని స్పష్టం చేశారు. పప్పులు, ఉప్పులు, నూనెలు, చింతపండు కూడా కొనలేని పరిస్థితులు ఉండడంతో పేదలకు రేషన్‌లో ఆ వస్తువులు ఇవ్వాలని కోరారు. -
ఖమ్మం : భర్త చేతనే భార్య పన్ను పీకించారు
-
Khammam: ఎస్సీ కాలనీలో దారుణం.. భర్త చేత భార్య పన్ను పీకించి
-
ఖమ్మం: భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించి దారుణం
సాక్షి, ఖమ్మం: మధిర ఎస్సీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారన్న నెపంతో వృద్ధ దంపతులపై స్థానికులు విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. అంతేగాకుండా భర్త చేత బలవంతంగా భార్య పన్ను పీకించి అమానుషంగా వ్యవహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. ఖమ్మం జిల్లా మధిర కళామందిర్ రోడ్డులో దంపతులు గద్దల మోహన్‌రావు (75), గద్దల సరోజినీ (68) నివాసం ఉంటున్నారు. వీరి మనవడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో... పెనుగంచిప్రోలులో ఓ పూజారిని కలవగా ఇంటి వద్ద పూజను నిర్వహించాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో, అదే కాలనీకి చెందిన ఓ కుటుంబం.. మోహన్‌రావు దంపతులు తమకు చేతబడి చేయిస్తున్నారనే అనుమానంతో వారిపై దాడి చేశారు. ఇలా రెండు రోజులుగా వారిపై దాడులు చేస్తుండటంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. కాగా వృద్ధులు అన్న కనికరం లేకుండా మూఢనమ్మకాలతో వీరిపై దాడి చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. చదవండి: మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ ‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’ -
క్షణికావేశంలో కట్టుకున్నోడినే!
మధిర: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను హతమార్చిన సంఘటన మండలంలోని దెందుకూరులో బుధవారం చోటుచేసుకుంది. ముక్కసాని పుల్లయ్య(45), సుజాత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య స్వల్పఘర్షణ జరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. పుల్లయ్యను సుబాబుల్ కర్రతో కొట్టగా తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో చికిత్స నిమిత్తం మధిర సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి కుమార్తె ఉంది. రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: దారుణం : కన్నబిడ్డనే చంపి నదిలో పడేశారు -
చనిపోతున్నాను నన్ను క్షమించండి
మధిర: ఫోన్ చేసి మాట్లాడుతూనే ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం రాత్రి మధిర రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. భద్రాద్రి జిల్లా పాత కొత్తగూడేనికి చెందిన అన్నపూర్ణమ్మ, మాధవాచారి దంపతులకు అనిల్ (25), వినయ్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్‌కుమార్‌కు వివాహం కాగా, మనస్పర్థలతో భార్యాభర్తలు విడిపోయారు. ఈ క్రమంలో కొంతకాలంగా మనస్తాపానికి గురైన అనిల్ మధిరలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళుతున్నానని చెప్పి శనివారం ఉదయం ఇంటినుంచి బయటకు వచ్చాడు. సాయంత్రం సమయంలో మధిరలోని వైరా నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో కొంతసేపు తిరిగి సెల్ఫీ ఫొటోలు తీసుకున్నాడు. రాత్రి 10:30 గంటల సమయంలో రైల్వేట్రాక్‌పైకి వచ్చి అతడి బాబాయి లక్ష్మీనారాయణకు ఫోన్‌చేశాడు. మధిర రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉన్నానని, ‘చనిపోతున్నాను నన్ను క్షమించండి’ అంటూ కాల్లో చెప్పాడు. అనిల్ మాట్లాడుతుండగానే పెద్ద శబ్ధం వినిపించిందని లక్ష్మీనారాయణ రోదిస్తూ వివరించారు. కాగా, ఆదివారం సాయంత్రం పాతకొత్తగూడెంలో అనిల్ అంత్యక్రియలు నిర్వహించారు. -
సారూ.. ప్రాణాలు నిలిపారు..!
మధిర: తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఒక సామాన్యుడి ప్రాణాలు కాపాడారు. మానవత్వాన్ని చాటుకుని పలువురు ప్రశంసలు పొందారు ఖమ్మం జిల్లా మధిర సీఐ. మడుపల్లి గ్రామానికి చెందిన రాఘవయ్య శుక్రవారం చేపలు పట్టేందుకు వైరా నది వద్దకు చేరుకున్నాడు. నీటిలో చేపలు పట్టే క్రమంలో ఒక్కసారి వరద ప్రవాహం పెరిగింది. దీనిని గమనించిన రాఘవయ్య కేకలు వేస్తూ తన ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు కొమ్మలు పట్టుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మధిర సీఐ వేణుమాధవ్, టౌన్ ఎస్ఐ ఉదయ్‌కుమార్ ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సీఐ వెంటనే నదిలోకి దిగి తాడు, ట్యూబు సహాయంతో నీటిలో చిక్కుకున్న బాధితుడి వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో రాఘవయ్య కుటుంబ సభ్యులు సీఐకి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. రాఘవయ్యను కాపాడిన సీఐ వేణుమాధవ్ ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. (ఐదేళ్ల తరువాత అమ్మఒడికి..! ) -
మొక్కజొన్నను వెంటనే తరలించాలి
సాక్షి, మధిర: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని కరోనా రహితంగా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి పల్లెకు, ప్రతిగడపకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో పర్యటించిన ఆయన.. స్థానికంగా ఉన్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సమయంలో పలువురు రైతులు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోని సమస్యలను భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. లారీలు లేకపోవడంతో మొక్కజొన్నలు, ధాన్యం అక్కడి ఉండిపోయిందని వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతామని వారు భట్టివి వివరించారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క.. కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్నలను వెంటనే తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాక రైతులకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాస్కులు, శానిటైజర్ల పంపిణీ ఎడవల్లి గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో హమాలీలు, కూలీలకు మాస్కులు, శానిటైజర్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనాపై వారికి అవగాహన కల్పించారు. ముదిగొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పండ్లు, కూరగాయల అమ్మకం దార్లకు, పోలీసులు, వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. -
మందుపార్టీలో మధిర తహశీల్ధార్
-
పాఠశాలలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. మహిళ మృతి
సాక్షి, మధిర : డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకుపోయింది. వంట చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పాఠశాల హెచ్ఎం ఆదినారాయణ కథనం ప్రకారం... మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తరగతులు పూర్తయిన అనంతరం మధ్యాహ్న భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పంతంగి నర్సింహారావు అనే ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ట్రాక్టర్ నడిపాడు. ఆ ట్రాక్టర్ అదుపుతప్పి పాఠశాలలోకి దూసుకువచ్చి అక్కడే వంటచేస్తున్న వంట మనిషి జాన్‌పాటి లక్షి్మ(65)ని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, నర్సింహారావు మద్యం మత్తులో అతివేగంగా ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి పాఠశాల ఆవరణలోకి దూసుకుపోయింది. ఈ ఆవరణలో ఉన్న జాతీయ జెండా దిమ్మెసైతం ధ్వంసమైంది. ఈ దిమ్మెను ఢీకొట్టి తరగతిగదిలోకి దూసుకుపోవడంతో తలుపులు, తరగతి గోడసైతం కుప్పకూలిపోయాయి. హఠాత్పరిణామంతో.. అతిసమీపంలో ఉన్న విద్యార్థులందరూ భయంతో పరుగులు తీశారు. తరగతి గదిలోనే విద్యార్థులు ఉన్నట్లయితే ఈ సంఘటనలో ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేదోనని ఆ సంఘటన తీరును చూసిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్ష్మి సుమారు 15 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట తయారు చేస్తోంది. రోజూ నాణ్యమైన భోజనాన్ని తయారుచేయడం, విద్యార్థులతో కలిసిపోవడం, గ్రామస్తులతో కలివిడిగా ఉండే లక్ష్మి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ లవణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కండక్టర్ నుంచి యాక్టర్‌గా...
సాక్షి, మధిర(ఖమ్మం): నటించాలనే తపనతో విశ్రాంత జీవితంలోనూ బుల్లితెర, వెండితెరపై తనదైన శైలిలో రాణిస్తున్నారు మధిర పట్టణానికి చెందిన దూదిపాళ్ల వీరభద్రం. ఈయన దశాబ్దాల కిందట నాటక రంగ కళాకారుడిగా ప్రదర్శనలు ఇచ్చేవారు. ఉద్యోగ విరమణ తర్వాత తనలోని కళాకారుడిని ఖాళీగా ఉంచలేక..వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కళామతల్లి సేవలో తరిస్తున్నారు. కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రి పాత్రల్లో రాణించారు. ముఖ్యంగా రైతు పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. మధిరలో 1952లో జన్మించిన డి.వీరభద్రం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1969లో హెచ్ఎస్సీ పూర్తిచేశారు. ఆయన సోదరి భర్త రణధీర్ మద్రాస్‌లో నృత్య కళాకారుడిగా పనిచేస్తుండడం..అప్పటికే రంగస్థల కళాకారుడిగా నటనపై ఉన్న ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి..విజయవంతంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఈయన వీలు దొరికినప్పుడల్లా స్వస్థలం వసూత్..విుత్రులతో ఆత్మీయంగా గడుపుతూ ఉండటం విశేషం. అనేక సీరియళ్లు అమ్మ, అభిషేకం, మాటే మంత్రం, రాజారాణి, శుభసంకల్పం, నాపేరు మీనాక్షి వంటి సీరియళ్లు ఈయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. ఇప్పటి వరకు వివిధ చానెళ్లలో ప్రసారమయ్యే 40వరకు సీరియళ్లలో నటించారు. పలు సినిమాలు.. ఇప్పటి వరకు 60వరకు సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు. మొట్టమొదటి సినిమా బ్రహ్మానందంతో కలిసి అయ్యప్ప పూజా మహిమలో నటించారు. గుర్తింపునిచ్చినవి.. శ్రీరామ రాజ్యం, నేనింతే, బాహుబలి, ఆగడు, పవర్, పటాస్, వెంకీమామ తాజాగా డిగ్రీ కాలేజ్ నాడు కండక్టర్ నేడు యాక్టర్ డి.వీరభద్రం గతంలో ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం చేశారు. 1985నుంచి 2010వరకు మధిర, ఖమ్మం, నర్సంపేట, జనగాం, కామారెడ్డి, కరీంనగర్ తదితర డిపోల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. మధిరలో ఉన్నప్పుడు తోటి కళాకారులను ప్రోత్సహించేందుకు స్పందన ఆర్ట్ క్రియేషన్స్‌ను స్థాపించారు. ఆ రోజుల్లో మధిరకు రాజనాల, కాంతారావు, శోభన్‌బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబుమోహన్, బ్రహ్మానందం వంటి కళాకారులను తీసుకొచ్చానని..ఆనందంగా చెబుతుంటారు. సంతృప్తిగా అనిపిస్తుంది.. నటించడం, ఆ పాత్రకు న్యాయం చేయడం ద్వారా ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సినీనటి శ్రీకుమారితో కలిసి ఎక్కువగా రైతుపాత్రలో కనిపించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రూపొందించిన కౌలురైతు సంక్షేమ చట్టం యాడ్‌లో రైతుపాత్ర పోషించా. తెలంగాణ ప్రభుత్వ ఓ ప్రకటనలోనూ అవకాశవిుచ్చారు. పూర్వ విద్యార్థి సంఘ సమ్మేళనానికి, స్నేహితులను కలుసుకునేందుకు నా ఊరు వస్తుంటా. ఒక లక్ష్యం, ప్రణాళికతో యువత యాక్టింగ్‌లో లక్ష్యం సాధించాలి. కాలాన్ని వృథా చేసుకోవద్దు. – డి.వీరభద్రం, నటుడు -
కాంగ్రెస్ కంచు కోటకు బీటలు
సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం జిల్లాలో కారుజోరు కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు పడ్డాయి. మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారు టీఆర్ఎస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 8 వార్డుల్లో 5 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ సీపీఐ తలఒక్క స్థానంలో గెలుపొందాయి. మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజంలో ఉంది. దీంతో మధిర మున్సిపాలిటీపై తొలిసారి గులాబీ జెండా ఎగరేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించిన భట్టికి మరోసారి భారీ షాక్ తగిలినట్లయింది. (మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణి) గత ఏడాది ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిన్పటికీ.. ఖమ్మంలో మాత్రం చేదు ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, గులాబీ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించారు. దానికి తోడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా భట్టికి చెక్ పెట్టేందుకు మధిరపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 75కుపైగా టీఆర్ఎస్ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
'సినిమాలంటే నాకు చచ్చేంత ఇష్టం'
సాక్షి, మధిర : చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టమని సినీనటి పునర్నవి అన్నారు. మధిర పట్టణంలోని వూట్ల వేణు నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెనాలిలో పుట్టి, విజయవాడలో చదువుకున్నాని, పక్కా తెలుగింటి అమ్మాయినని తెలిపారు. ఉయ్యాల జంపాలలో మొదటిసారిగా హీరోయిన్ పాత్ర చేశానని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 8 సినిమాల్లో నటించానని, ఒక చిన్న విరామం, సైకిల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పిట్టగోడ సినిమాలో తన పాత్ర సంతృప్తినిచ్చిందన్నారు. బిగ్‌బాస్ ఎపిసోడ్లో 11 వారాలు ఉన్నానని, అది ఒక విలాసవంత జైలులాగా అనిపించిందని చెప్పారు. జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తిచేశానని, ఏడు సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నానని, భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాల్లో నటిస్తానని వివరించారు. ఈ సమావేశంలో వూట్ల వేణు, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. -
'వారికి ఓట్లు అడిగే అర్హత లేదు'
సాక్షి, మధిర : ప్రజా సమస్యలు పరిష్కరించని అధికార పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారాలని్నంటినీ సీఎం కేసీఆర్ కేంద్రీకృతం చేశారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అన్నింటికీ సర్వాధికారిగా ముఖ్యమంత్రే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని అధికారాలను తన వద్దనే ఉంచుకుని రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆత్మ గౌరవం కోసమని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, పౌరులకు, అధికారులకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి వింత చర్యలను అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆరేళ్లుగా ఉద్యోగాల భర్తీ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని చెప్పారు. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మౌలిక వసతులు కరువయ్యాయని, ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో సమాధానం చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే భవిష్యత్ అంధకారమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లు అప్పుచేశారని, ఇంకా అప్పులు చేసి ప్రభుత్వం ప్రజలను తాకట్టు పెడుతోందన్నారు. సమగ్ర ప్రణాళికతో, సంపూర్ణ అభివృద్ధితో మధిర అభివృద్ధికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశామని, చైర్మన్‌గా మధిర మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది తూములూరి కృష్ణారావు, సభ్యులుగా వీరమాచనేని శ్రీనివాసరావు, కటుకూరి శ్యామారావు, బిక్కి రాజా, మైనిడి జగన్మోహన్రావు, సయ్యద్ రషీద్ తదితరులు ఉంటారని తెలిపారు. -
రోడ్డు ప్రమాదం.. సిసిటివి కెమెరాలో రికార్డైన దృష్యాలు
-
కన్న కొడుకే కాలయముడు..!
మధిరరూరల్: ఇన్సూరెన్స్ డబ్బు కోసం కన్న కొడుకే కాలయముడుగా మారి తండ్రిని హత్యచేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. మధిర మండల పరిధిలోని మాటూరుపేట గ్రామానికి చెందిన మేడిశెట్టి ఉద్దండయ్య (55) అనుమానాస్పద స్థితిలో ఈనెల 15న మృతి చెందినట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మధిర రూరల్ ఎస్ఐ లవణ్‌కుమార్ సోమవారం విలేకరులకు వివరాలు తెలిపారు. ఉద్దండయ్యకు కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఉద్దండయ్య చనిపోతే ఇన్సూరెన్స్ వస్తుందని, ఆ ఆడబ్బుతో తనకు ఉన్న అప్పులను తీర్చుకోవచ్చని కృష్ణ ఆలోచించి తండ్రిని ఈనెల 13న హత్య చేసేందుకు పథకం పన్నాడు. హత్యలో స్నేహితుడి సహకారం.. ఈ హత్యకు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు, గుంటూరులో నివసిస్తున్న దుర్గారెడ్డిని సహాయం కోరాడు. అంతేకాకుండా ఒక పాత ఆటో కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేస్తానని అతనికి చెప్పాడు. నాన్నా.. నీకు బట్టలు కొనిస్తానని చెప్పి కృష్ణ తండ్రి ఉద్దండయ్యను మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని మధిరకు వచ్చాడు. అక్కడ రెండు లుంగీలు, రెండు కండువాలు కొనుగోలు చేశాడు. దుర్గారెడ్డి గుంటూరు నుంచి ఇంటర్సిటీ రైలులో మధిరకు వచ్చాడు. కృష్ణ తన తండ్రితో పాటు దుర్గారెడ్డిని కూడా మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని రాయపట్నం, దెందుకూరులో ఉన్న వైన్‌షాపుల్లో మద్యం సేవించారు. ఉద్దండయ్యను ఎక్కించుకుని సఖినవీడు వెళ్లే రోడ్డు వైపునకు తీసుకెళ్లి కండువాతో మెడకు బిగించి హత్యచేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కనే లోతైన కందకంలో పడేసి వెళ్లిపోయారు. కృష్ణ ఇంటికి వెళ్లగా స్నేహితుడు దుర్గారెడ్డి అదేరోజు రాత్రి శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలులో గుంటూరుకు తిరిగి వెళ్లాడు. ఏమీ తెలియనట్లు బంధువులకు ఫోన్లు.. ఎవరికీ అనుమానం రాకుండా కృష్ణ తన తండ్రి ఇంటికి రాలేదని ఏమీ తెలియనట్లు బంధువులు, స్నేహితులకు ఫోన్‌చేశాడు. ఉద్దండయ్య మృతదేహాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో కృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి బంధువులకు ఇక్కడ మృతదేహం ఉందని సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనపై బంధువులకు పలు అనుమానాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని కృష్ణకు చెప్పాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ లవణ్‌కుమార్ కేసు విచారించారు. ఈ విచారణలో అక్కడ మృతదేహం ఉందని నీకు ఎలా తెలిసిందని కృష్ణను ప్రశ్నించగా మధిరలోని లడక్బజారుకు చెందిన రత్తమ్మ అనే మహిళ చెప్పిందన్నాడు. అయితే రత్తమ్మ అనే మహిళ లేకపోవడంతో కృష్ణను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై మధిర సీఐ కరుణాకర్ దర్యాప్తు చేసి నిందితులను కోర్టుకు రిమాండ్Š చేశారు. -
మధిరలో టీఆర్ఎస్కు షాక్
సాక్షి, మధిర : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ మధిర పట్టణ అధ్యక్షురాలు గూడెల్లి ఉషారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెను విక్రమార్క పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెలోపాటు, టీడీపీ మధిర ఇన్చార్జ్ డాక్టర్ వాసిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధిర నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని భట్టి విక్రమార్క ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు అనుబంధంగా ఎర్రుపాలెంలో డ్రై పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలకు కారమవుతున్న నకిలీ విత్తనాలను లేకుండా చేస్తామని, వందకోట్ల వ్యయంతో మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మధిరను స్మార్ట్ సిటీగా చేసి, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రకటించారు. -
‘ఓట్లు అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది’
సాక్షి, మధిర : మధిర నియోజకవర్గ ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు తనకు తప్ప మరెవరికీ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో కలిసి భట్టి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురం గ్రామంలో మాట్లాడుతూ.. జాలిముడి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో తాను విశేష కృషి చేశానన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సిరిపురంలో తీసిన కాలువ గ్రామానికి ఒక మణిహారంలా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల గురించి పట్టించుకోని కొందరు నాయకులు ఎన్నికలు వచ్చే సరికి డబ్బు మూటలతో సిద్ధమైపోయారని విమర్శించారు. నాలుగు పార్టీలు మారిన వాళ్లు ప్రజలు కూడా తమలాగే అమ్ముడుపోతారనే భ్రమలో ఉన్నారని..అటువంటి వారికి సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసలు వారికి ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు. కాగా ఈ రోడ్ షోలో భట్టితో పాటు విజయశాంతి, ప్రజాయుద్ధనౌక గద్దర్, మధిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వాసిరెడ్డి రస్మనాథం తదితరులు పాల్గొన్నారు. -
‘ఈ మధ్య ఓ పిల్లకాకి నన్ను ప్రశ్నించాడు’
సాక్షి, ఖమ్మం : మధిర గడ్డ పౌరుషాల అడ్డ.. ఇక్కడ ఎవరూ అమ్ముడుపోరు.. ఆత్మాభిమానంతో జీవిస్తారు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సోమవారం నామినేషన్ వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. తాను ప్రజల కొరకు మాత్రమే పని చేస్తానని గుత్తేదారుల కోసం కాదని వ్యాఖ్యానించారు. కొంతమంది కాంట్రాక్టర్లు డబ్బు సంచులతో ఇక్కడికి వచ్చి ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిల్లకాకి నన్ను ప్రశ్నించాడు..! ‘ఈ మధ్య ఒక పిల్లకాకి ఇక్కడకు వచ్చి నేనేం చేశానని ప్రశ్నించాడు. నేను ఏమి చేసానో తెలియాలంటే.. జాలిముడి ప్రాజెక్టు, కట్టలేరు జలాలు, కుదుమూరు- వందనం లిఫ్ట్ ఇరిగేషన్లను అడిగితే సమాధానం చెబుతాయి. నువ్వు వచ్చిన ఆర్ఓబీ కూడా నేను కట్టించిందే.. నువ్వు నడిచిన రహదారులు కూడా నా హయాంలో వేయించినవే. ఇక్కడ పొలాల్లో పారె నీళ్లు చెబుతాయి నేను ఏమి చేసానో’ అంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధిర ప్రజలకు ఏమి చేశారని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిందిగా ప్రజలు తనను ఎన్నుకున్నారని.. కాబట్టి తాను కేవలం వారికోసమే పనిచేస్తానని భట్టి చెప్పుకొచ్చారు.(అహంకారానికి, ఆత్మగౌరవానికి పోటీ) కాగా ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, తెలుగుదేశం పార్టీ మధిర ఇంచార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
అహంకారానికి, ఆత్మగౌరవానికి పోటీ
మధిర: రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ వంటివని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) అన్నారు. మధిర టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ నామినేషన్ సందర్భంగా మండల కేంద్రంలోని వైరారోడ్డులో బుధవారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. మధిర నియోజకవర్గానికి సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుబంధు పథకం ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఉన్న రైతులకు తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు. కేసీఆర్ మనుమడు, మనుమరాలు ఏ సన్నబియ్యం తింటున్నారో.. పేదింటి విద్యార్థులకు కూడా ఆ సన్నబియ్యం అందిస్తున్నది కేసీఆరేనని అన్నారు. నేతన్నలు, గీతన్నలు, బీడీ కార్మికులకు, బోదకాలు బాధితులకు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రైతుబంధు పథకం కింద రైతులకు ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఇది మరెక్కడా లేదన్నారు. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయడానికి కట్నం ఇచ్చే స్తోమత లేనప్పటికీ, పెళ్లికి మేనమామ రాకపోయినప్పటికీ పెద్దకొడుకుగా రూ.లక్ష అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ చెక్కులపై సంతకాలు పెట్టకుండా.. హైదరాబాద్‌లో కూర్చొని ఆరు నెలలు, 8 నెలలు ఆలస్యం చేస్తూ లబ్ధిదారుల పొట్టకొడుతున్న భట్టి విక్రమార్కను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే మడుపల్లిలో లెదర్ పార్క్, బోనకల్లో డిగ్రీ కళాశాల, వైరా నదిపై మడుపల్లి వద్ద బ్రిడ్జి తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. రూ.5లక్షలు ఇచ్చి అనుకూలమైన స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. భట్టి ఎమ్మెల్సీగా ఉండి.. తెలంగాణ వద్దని ఢిల్లీకి వెళ్లి చెప్పిన మాట వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న తనను మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏనాడూ స్థానిక ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయాలని అడగలేదన్నారు. కేసీఆర్‌ను విమర్శించడమే పని.. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్మీట్లు పెట్టి కేసీఆర్‌ను విమర్శించడమే భట్టి విక్రమార్క పనిగా పెట్టుకున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని ఆయన ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. పిలిస్తే పలికే నాయకుడు కమల్‌రాజ్ అని, ప్రజల్లో ఉండే కమల్‌రాజ్ కావాలో.. హైదరాబాద్‌లో కూర్చునే భట్టి కావాలో తేల్చుకోవాలన్నారు. జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్ పార్టీ పనితీరుకు నిదర్శనమైతే.. భక్తరామదాసు ప్రాజెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును తెలియజేస్తుందన్నారు. ఇటీవల కేసీఆర్‌ను కుటుంబ పాలన అని విమర్శిస్తున్న భట్టి.. మల్లు అనంతరాములు కుటుంబం నుంచి రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆయన గెలుపు కోసం ప్రస్తుతం కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి టీడీపీ తోక పార్టీగా మారిందని విమర్శించారు. జెండాలు, ఎజెండాలు వేరని, అటువంటి పార్టీలు మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్‌ను గద్దె దించాలని ఎజెండాగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మహాకూటమి పొత్తును స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖరరెడ్డి చూసి బాధపడతారని తెలిపారు. గోదావరి జలాలు రావాలన్నా.. అభివృద్ధి కొనసాగాలన్నా.. ఉచిత విద్యుత్ ఉండాలన్నా.. సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మీరు ఏగట్టున ఉంటారో తేల్చుకోవాలన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఆలోచించి కమల్‌రాజ్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రామ్మూర్తి ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం మేయర్ పాపాలాల్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తుంబూరు దయాకర్‌రెడ్డి, చావా రామకృష్ణ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, నగర పంచాయతీ చైర్పర్సన్ మొండితోక నాగరాణి సుధాకర్, ఎంపీపీ వేమిరెడ్డి వెంకట్రావమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు మూడ్ ప్రియాంక, ఎర్రుపాలెం ఎంపీపీ చావా అరుణ పాల్గొన్నారు. -
ఆయనే తొలి మంత్రి..
మధిర: ఖమ్మం జిల్లాలో తొలి మంత్రి పదవి మధిర నియోజకవర్గానికే దక్కింది. 1964లో శాసనమండలికి ఎన్నికైన శీలం సిద్ధారెడ్డి 1967వ సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన ఆయన 1947–48లో ఆయన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోసవీడు క్యాంపు ఇన్చార్జ్గా ఉండి నిజాం ప్రభుత్వంపై పోరాటం నిర్వహించారు. నాటి హైదరాబాద్ స్టేట్‌లో 1949నుంచి 1952 వరకు మధిర తాలూకా కాంగ్రెస్‌పార్టీ కార్యదర్శిగా, 1958నుంచి 1962వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1963నుంచి 1967వరకు పీసీసీ కార్యదర్శిగా, 1964నుంచి 2004వరకు ఏఐసీసీ సభ్యునిగా పనిచేశారు. 1958లో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసన మండలి కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1964 సంవత్సరంలో ఆప్కాబ్ తొలి చైర్మన్‌గా ఎన్నికై అదే సంవత్సరం రెండోసారి శాసన మండలికి ఎన్నికయ్యారు. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో జిల్లా నుంచి తొలిమంత్రిగా పనిచేశారు. 1970లో మూడో సారి శాసనమండలికి ఎన్నికై పీవీ నర్సింహారావు మంత్రి వర్గంలో 1972వరకు నీటిపారుదల శాఖామంత్రిగా పనిచేశారు. 1983లో మధిర ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం పలుమార్లు పోటీ చేసి ఓడిపోయారు. చివరగా 1998 మధిర ఉప ఎన్నికల్లో కూడా పోటీచేసి నాటి సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్యచేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. కమ్యూనిస్టులతో రాజీలేని పోరు అనేక దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో సిద్ధారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించేస్థాయికి ఎదిగారు. ముక్కుసూటిగా వ్యవహరించే తొలిమంత్రి సిద్ధారెడ్డి రాజీలేని మనస్తత్వంతో పనిచేయడంవల్ల అప్పట్లో ముఖ్యమంత్రి పదవినికూడా వదులుకున్నారని ఆయన స్నేహితులు చెబుతుంటారు. 1972లో ఆయన రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో ఆ పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తున్న శీలం సిద్ధారెడ్డికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని ఇందిరాగాంధీ తనదూత పీవీ నర్సింహారావు ద్వారా రాయభారం పంపగా, ఆయన ముఖ్యమంత్రి పదవిని నిరాకరించినట్లు చెబుతారు. నిబద్ధత కలిగిన కాంగ్రెస్‌వాదిగా సిద్ధారెడ్డి సుదీర్ఘకాలం రాజకీయ కురుక్షేత్రంలో పనిచేశారు. ఒకవైపు సొంత పార్టీలోనూ, మరోవైపు జిల్లాలోని కమ్యూనిస్టులతో రాజీలేని పోరాటంచేసి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే సిద్ధారెడ్డికి ఆయన మంత్రి వర్గంలోకి తన ముఖ్య అనుచరుడు సంభాని చంద్రశేఖర్‌కు మంత్రి పదవి ఇప్పించారు. లంకా సాగర్ ప్రాజెక్ట్, ఎన్నెస్పీ కాలువలకు రూపకల్పన సర్దార్ జమలాపురం కేశవరావు, పొట్లూరి సుందరం వంటి జాతీయ నాయకులతో కలిసి గ్రంథాలయ ఉద్యమం, పత్రికా ఉద్యమాలను నడిపారు. జీవహింసకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. ఆయన తన స్వగ్రామంలో నాటికాలంలో రాత్రిపూట పాఠశాలలను నడిపి అభ్యుదయ ఉద్యమానికి నాందిపలికారు. అంటరానితనం పీడిస్తున్న తరుణంలో దళితవర్గాల ఉద్ధరణకోసం హాస్టళ్లను ఏర్పాటుచేశారు. భారీ నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఎన్ఎస్పీ కాలువలు, లంకా సాగర్ ప్రాజెక్టు, బేతుపల్లి హైలెవల్ కాలువలకు రూపకల్పన చేశారు. మధిర మండలంలోని సిరిపురం గ్రామంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తనసొంత మండలంలో కట్లేరు ప్రాజెక్టును నిర్మించి వేలాది ఎకరాల పంటపొలాలకు సాగునీరు అందించారు. తన స్వగ్రామంలో ప్రభుత్వ ఆస్పత్రిని, ఇంటర్మీడియట్ కళాశాలలను నెలకొల్పేందుకు కృషిచేశారు. అనారోగ్యంతో 2011లో మృతిచెందారు. -
కేసీఆర్ అంతమే ..కాంగ్రెస్ లక్ష్యం
మధిర/బోనకల్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. మండలంలోని రావినూతల గ్రామంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ పాలన చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ పార్టీని మోసం చేసి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారన్నారు. రాష్ట్ర సాధన కోసం 20 ఏళ్లు పోరాటం చేశానని విజయశాంతి గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటువేస్తే దొరల పాలన వస్తుందన్నారు. బంగారు తెలంగాణ ఉండదని, రాష్ట్రమంతా సర్వనాశనం అవుతుందన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఆ దొర నిజస్వరూపం బయటపడిందన్నారు. రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాతలకు ఖమ్మంలో సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తీసి వేసి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారన్నారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులుగా మారి.. జీవితంపై విరక్తి కలిగేటట్లు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేజీ టు పీజీ విద్య ప్రవేశపెడతామని చెప్పి 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశాడన్నారు. రానున్నది ప్రజా ప్రభుత్వమే : భట్టి విక్రమార్క టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మధిర నియోజకవర్గానికి వేలాది కోట్ల రూపాయలను తెచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ ఊసే లేకుండా చేశాడన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ తిన్న సొమ్మును తిరిగి కక్కిస్తామన్నారు. టీడీపీ, టీజేఏసీ, సీపీఐతో కలిగి మహా కూటమిని ఏర్పాటు చేశామని, రానున్నది ప్రజా ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. మధిరలో 35 నుంచి 40వేల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు ఉప సభాపతిగా ఉండి.. తెలంగాణ బిల్లును నా చేతులమీది నుంచి ప్రవేశపెట్టానన్నారు. బీజేపీ మతోన్మాదం పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తోందన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి బొమ్మ పెట్టుకుని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి.. కాంట్రాక్టర్ల కోసం కేసీఆర్ వద్దకు వెళ్లిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తనను విమర్శించే నైతిక అర్హత ఎక్కడిదన్నారు. మూడు పార్టీలు మారి.. కాంట్రాక్టర్ల సంచులు మోసే లింగాల కమల్‌రాజ్‌ను చూసి ఓటు వేసే అవివేకులు మధిర ప్రజలు కారని, ఇక్కడి ప్రజలు ఎంతో విజ్ఞులన్నారు. పనులు చేయకుండా బిల్లులు చేయించుకునేందుకే ఎంపీ పొంగులేటి పార్టీ మారారన్నారు. టీఆర్ఎస్ పతనం బోనకల్ నుంచే ప్రారంభమైందని, ఈ పార్టీకి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బడ్జెట్లో కోట్లాది రూపాయలను కేటాయించినప్పటికీ నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి డ్యామ్‌లు ఏమైనా కట్టారా? కొత్త పరిశ్రమలు పెట్టారా? ఎక్కడైనా ఆనకట్టలు నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్యను అమలు చేయకుండా మోసం చేశాడన్నారు. అమ్మహస్తం పథకాన్ని తీసి వేసి.. 9 రకాల వస్తువులను ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడన్నారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని, రైతు కూలిబంధు పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు సొంత స్థలాల్లో నిర్మించుకునేలా రూ.5లక్షలను లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తామన్నారు.బోనకల్ పోరాటాల పురిటిగడ్డ అని, మూడోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ రామనాథం, కాంగ్రెస్, టీడీపీ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పైడిపల్లి కిషోర్, బంధం నాగేశ్వరరావు, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టు పార్టీలోనూ ప్రజాస్వామ్యం లేదు
సాక్షి,మధిర: చిన్నతనంనుంచి ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, బోడపూడి వెంకటేశ్వరరావు అడుగు జాడల్లో పయనించారు. మధిర నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందారు. ప్రతీ గ్రామానికి రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్న శాసన సభ ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ప్రస్తుతం రాజకీ యాల్లో కొనసాగుతున్నారా? కట్టా: పదేళ్ల క్రితం సీపీఎంకు రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నాను. జరగబోయే ఎన్నికల్లో నేను ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. నేను మొదటినుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకున్నా. నా ప్రాణం ఉన్నంతవరకు కమ్యూనిస్టుగానే కొనసాగుతా. కొంతమంది మద్దతు తెలిపినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. మద్దతు ఇస్తే నేనే స్వయంగా ప్రకటిస్తా. కానీ అటువంటి ఆలోచనే లేదు. సాక్షి: రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఏమిటీ? కట్టా: రానురాను పాలకవర్గాలు ఓటర్లలో ఉన్నటువంటి రాజకీయ అభిప్రాయాలను దిగజార్చాయి. స్థిరమైన రాజకీయ అభిప్రాయాలు నాడు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలోకానీ, బూర్జువా పార్టీల్లోకానీ ప్రజాస్వామ్యం కోల్పోయింది. సైద్ధాంతిక, సామాజిక పరిస్థితులను ప్రజలకు వివరించి ప్రజలు వాటిమీద ప్రభావితం చేసేవిధంగా రాజకీయ పరిస్థితులు ఉండేవి. కానీ నేడు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడంలేదు. ఇప్పుడు డబ్బు ప్రభావం పీక్ స్టేజ్‌లోకి వచ్చింది. సాక్షి: అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? కట్టా: సంక్షేమ పథకాల పేరుతో డబ్బు బాగా ఖర్చవుతోంది. కొంత వృథా చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా అమలు జరగడంలేదు. పాత మధిర నియోజకవర్గంలో 162 గ్రామాలు ఉండేవి. నా హయాంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. -
నా గెలుపును ఆపలేరు
ముదిగొండ: మధిరలో తన గెలుపును ఎవరూ ఆపలేరని, రాష్ట్రంలో దొరల పాలనను అంత మొందించేందుకే ఆత్మగౌరవ యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ మండలంలోని ముత్తారం, వనంవారికృష్టాపురం, వల్లాపురం, అమ్మపేట, కమలాపురం, అయ్యగారిపల్లి, గంధసిరి గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఆత్మగౌరవ యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహానుభావుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటోతో ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్‌కు అమ్ముడు పోయారని ఆరోపించారు. పార్టీలు మారి పబ్బం గడుపుకుంటున్న ఖమ్మం ఎంపీ మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. మధిరలో టీఆర్ఎస్ గెలుస్తుందని ప్రచారం చేస్తున్నారని, కలలో కూడా అది సాధ్యం కాదన్నారు. మిషన్ భ గీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టారని, గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేశారని, ఇసుక మాఫీయాను అడ్డుకున్న పేదలను చితకబాదారన్నారు. తెలంగాణ వస్తే ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం వస్తుందని చెప్పి న కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మరోసారి తనను ఆదరించి.. ఆశీర్వదించాలని, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముత్తారంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పసుపులేటి లక్ష్మి, జెడ్పీటీసీ మందరపు నాగేశ్వరరావు, ఎంపీటీసీ టుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌లు వడ్డేపూడి వెంకటేశ్వర్లు, బిచ్చా ల బిక్షం, మాజీ జెడ్పీటీసీ పసుపులేటి దేవేంద్రం, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్మినేని రమేష్‌బాబు, జిల్లా నాయకుడు రాయల నాగేశ్వరరావు, మండల నాయకులు వల్లూరి భద్రారెడ్డి, మట్టా బాబురామిరెడ్డి, ఎస్కె సలీంపాఫా, పల్లిపాటి కృష్ట, మల్లెల అజయ్, పందిరి అంజయ్య, మూల శ్రీను, మందరపు ఉపేందర్‌రావు పాల్గొన్నారు. -
మధిర మున్సిపాలిటీలోఅవినీతి తిమింగలాలు..!
మధిర ఖమ్మం : మధిర మున్సిపాల్టీలో ఏదైనా పని కావాలంటే అధికారులకు, సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందేనన్న విమర్శలు వినవస్తున్నా యి. ఇటీవల ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టపగలే అక్రమంగా డబ్బులు తీసుకున్న ఇద్దరు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కార్యాలయంలో మరికొన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడ ఒక్కో పనికి ఒక్కో రేటును సిబ్బంది నిర్ణయించినట్టు తెలిసింది. జనన, మరణ ధృవీకరణ పత్రాలతోపాటు ఎల్ఆర్ఎస్, విద్యుత్ మీటరు కనెక్షన్ పొందాల న్నా, తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిని పిల్లల పేరు మీదకు బదలాయించాలన్నా ముడుపులు చెల్లిం చాల్సిందేనట. ముడుపులు ఇస్తేనే ఫైలు కదులుతుందని దరఖాస్తుదారులకు సిబ్బంది ప్రత్యక్షంగానే చెబుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. కొన్ని ఉదాహరణలు సుమారు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మధిర రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరికి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మరొకరికి ఇవ్వకుండా ఆపి, ఆ ఒక్కరికి పోస్టుమార్టం రిపోర్టు రాలేదని చెప్పారు. దీంతో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు గుంటూరు నుంచి పలుమార్లు మధిర మున్సిపల్ కార్యాల యం చుట్టూ తిరిగారు. పైసలిస్తేనే ఆ డెత్ సర్టిఫికె ట్ ఇస్తామంటున్రాని వారు విలేకరులతో చెప్పా రు. దీనిపై మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని విలేకరులు.. ‘‘పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఉండ గా పోస్టుమార్టం రిపోర్టుతో సంబంధమేమిటి? కాజ్ ఆఫ్ డెత్ లేకుండా ఇచ్చే డెత్ సర్టిఫికెట్‌కు పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు?’’ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. రెండు మూడు రోజులు తరువాత కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసిన తరువాతనే వారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఒక ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చారు. మృతుని పేరు మీద ఉన్న ఇంటిని కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చాలని కోరారు. ఇందుకోసం అక్కడి సిబ్బంది రెండువేల రూపాయలు లంచంగా తీసుకున్నారట. డబ్బులు ఇచ్చి నెల దాటినప్పటికీ ఈ రోజుకు కూడా ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు. రెడ్డి గార్డెన్స్ కల్యాణ మండపం సమీపంలో ఒకరు నూతనంగా భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.12వేలు లంచం డిమాండ్ చేశారట. నూతన కట్టడాల సంగతి చెప్పనక్కరలేదు. రేకుల షెడ్డు నిర్మాణానికి, భవన నిర్మాణానికి, దుకాణం ఏర్పాటుకు, బడ్డీకొట్టు నడుపుకునేందు కు రేట్లు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. పలుకుబడిగల వారికి ఇంటి పన్ను తగ్గిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇంటిపన్ను ఎక్కువ వస్తున్న దని సాధారణ వ్యక్తులు ఫిర్యాదు చేస్తే... ‘‘అందు లో మేము చేసేదేమీ ఉండదు. కంప్యూటర్లో కొలతలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా పన్ను నిర్థారణతో రశీదు వస్తుంది’’ అని చెబుతున్నారని కొందరు చెప్పారు. అవినీతి తిమింగలాలకు డబ్బులు ముట్టచెప్పలేక కొంతమంది ఇల్లు కట్టుకోలేకుండా, దుకాణాలు నడపలేక చేతులెత్తేసిన దాఖలాలు ఉన్నాయి. కమిషనర్ వివరణ పై ఉదాహరణలను, ఆరోపణలను మున్సిపల్ కమిషనర్ దేవేందర్ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన వివరణ కోరింది. ‘‘ఇక్కడ అవినీతి అనేదే లేదు. కొంతమంది బురద జల్లుతున్నారు. ఎవరైనా అడిగితే నాతో చెప్పండి’’ అని అన్నారు. ప్రక్షాళన చేయాలి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు, సిబ్బంది అడుగుతున్న లంచాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టచెప్పాల్సిందే. అదేమిటని ప్రజాప్రతినిధులమైన మేము ప్రశ్నిస్తే.. నిబంధనలు అడ్డం వస్తున్నాయని చెబుతున్నారు. కానీ పైసలిస్తే మాత్రం వారికి నిబంధనలు అడ్డురావు. పరిస్థితి దారుణంగా ఉంది. – ములకలపల్లి వినయ్‌కుమార్, 15వ వార్డు సభ్యుడు. -
లుంగీతో ఆఫీస్‌కు.. ఉద్యోగినుల ఫిర్యాదు!
మధిర : మహిళల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన ఐసీడీఎస్ శాఖలో ఉద్యోగినులకు భద్రత కరువైంది. పద్ధతి మార్చుకోమని సూచించిన పై స్థాయి అధికారిపై జూనియర్ అసిస్టెంట్ దురుసుగా ప్రవర్తించిన సంఘటన గురువారం మధిర ఐసీడీఎస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మధిర ఐసీడీఎస్ కార్యాలయ ఇన్చార్జ్ సీడీపీఓగా కనకదుర్గ విధులు నిర్వరిస్తున్నారు. గతంలో మధిర ఐసీడీఎస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహించేవారు. దాన్ని కనకదుర్గ గ్రహించి పనితీరును మార్చుకోవాలని వారికి సూచించారు. అదే సమయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న దేవకుమార్ను సైతం మందలించారు. అయితే దేవకుమార్ ఆమె మాటలను పెడచెవినపెట్టి లుంగీతో కార్యాలయానికి రావడం ప్రారంభించారు. దీంతో తమకు ఇబ్బందిగా ఉందని మహిళా ఉద్యోగులు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇది సరైన విధానం కాదని, పద్ధతి మార్చుకోవాలని మరోసారి తీవ్రంగా దేవకుమార్ను సీడీపీఓ మందలించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌ద్వారా సమాచారం అందిస్తుండగా.. అప్పుడే కార్యాలయానికి వచ్చిన దేవకుమార్ తన కంప్యూటర్ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఉన్నతాధికారిణి అనికూడా చూడకుండా దుర్భాషలాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది.. దేవకుమార్ వ్యవహార శైలిపై ఖమ్మం పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీడీపీఓ కనకదుర్గ కన్నీటి పర్యంతమై.. ఈ ఉద్యోగి తమకొద్దని.. ఉన్నతాధికారులకు దండం పెడతానని ఇక్కడినుంచి పంపించాలంటూ విలేకరుల ఎదుట వాపోయారు. -
రైలు కిందపడి ముగ్గురి ఆత్మహత్య
మధిర: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి మధిర రైల్వేస్టేషన్ సమీపంలో ఇది జరిగింది. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన బుంగా వెంకయ్య(47), గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులుగా కుమార్తె వివాహం విషయంలో వీరి ఇంటిలో వివాదం జరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, వెంకయ్య, ఆయన భార్య రజిని(40), కుమార్తె సాయి కృష్ణవేణి(19) కలిసి గుంటూరు నుంచి రైలులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మధిరకు చేరుకున్నారు. మధిర రైల్వే స్టేషన్ సమీపంలోని విజయవాడ వైపు వెళ్లే డౌన్‌లైన్ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వెంకయ్య దంపతుల కుమారుడు సాయి గోపినాథ్, గుంటూరులో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వెంకయ్య జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా వారిని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి బంధువులకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి సమాచారమిచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి బలవన్మరణం.. ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. -
నాన్న లేడు...
అమ్మ–నాన్న..ఈ సృష్టికి మూలం వీరిద్దరే..!వీరిద్దరూ లేకపోతే..మనమెవరమూ లేము.కన్నీళ్లు.. కష్టాలు దిగమింగి..బిడ్డల కోసమే జీవితాన్ని ధారపోసి..అంత్య దశకు చేరిన ఆ ఇద్దరూ..ఇప్పడు మనకు ‘బిడ్డలు’..‘చంటి పిల్లల్లాంటి’ వాళ్లు..!!పిల్లలు.. ‘దేవుళ్ల’తో సమానం..‘పిల్లల్లా’ మారిన వీరిద్దరూ..నిజంగానే మనకు దేవుళ్లు..!!!ఆ ‘దేవుడి’ని ఊరవతలకువిసిరేశాడు.. ఆకలిదప్పులతోప్రాణం పోయేలా చేశాడు.. మధిర: అతడి పేరు యలమందల వెంకటేశ్వరరావు(70). మధిర పట్టణంలోని ముస్లిం కాలనీలో నివాసముంటున్న యలమందల లక్ష్మీనారాయణను కని పెంచిన తండ్రి. ♦ వెంకటేశ్వరరావుకు ఈ కొడుకుతోపాటు కూతురు విజయలక్ష్మి కూడా ఉంది. వీరిద్దరూ వివాహితులే. కోడలి పేరు సుధారాణి. అల్లుడి పేరు లంకెమళ్ల శ్రీనివాసరావు. ♦ కొడుకు–కోడలు (లక్ష్మీనారాయణ–సుధారాణి), మధిర పట్టణంలోని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కూతురు–అల్లుడు (విజయలక్ష్మి–శ్రీనివాసరావు), బిడుగుపాడు గ్రామంలో ఉంటున్నారు. ♦ వృద్ధుడైన వెంకటేశ్వరరావు, సుమారు ఏడేళ్ల నుంచి తన కుమార్తె–అల్లుడి వద్దనే ఉంటున్నాడు. ♦ ఇతడు ఇటీవల తీవ్రంగా అస్వస్థుడయ్యా డు. కూతురు–అల్లుడి ఇంటి పక్కన ఉంటున్న కుటుంబంలో కొద్ది రోజుల్లో శుభకార్యం జరగాల్సుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరరావుకు ఏదైనా జరిగితే...? శుభకార్యం ఆగిపోతుందేమో..! ఆ పక్కనున్న కుటుంబం లోని వచ్చిన సందేహమిది. వారు తమ సందేహాన్ని, భయాన్ని విజయలక్ష్మి చెవిన పడేశారు. ♦ విజయలక్ష్మికి కూడా ‘అవును కదా..’ అనిపించింది. ‘‘ఆ ఇంట శుభకార్యం పూర్తయ్యేంత వరకు మా నాన్నను నా సోదరుడి ఇంటికి పంపించు. ఆ తరువాత తీసుకొద్దాం’’ అని, భర్త శ్రీనివాసరావుతో చెప్పింది. ఆమె భర్త సరేనన్నాడు. ♦ ఆదివారం ఉదయం. తన మామను వెంటబెట్టుకుని బావమరిది లక్ష్మీనారాయణ ఇంటికి శ్రీనివాసరావు వెళ్లాడు. విషయమంతా వివరించి చెప్పాడు. వెంకటేశ్వరరావును అక్కడ అప్పగించి తిరుగు ప్రయాణమవుతున్నాడు. ♦ ఇంతలోనే... ‘‘ఇన్నేళ్లపాటు ఉంచుకున్నావు. అనారోగ్యంతో బాధపడుతున్న ‘ముసలోడిని’ నా దగ్గర వదిలేసి వెళ్తావా..?’’ అంటూ, బావ శ్రీనివాసరావును లక్ష్మీనారాయణ దూషిం చాడట. ♦ అదే రోజు (ఆదివారం) సాయంత్రం, తాను నివసిస్తున్న ముస్లిం కాలనీ సమీపంలోగల తన సొంత ఖాళీ స్థలంలోగల చెట్టు కిందకు తండ్రి వెంకటేశ్వరరావును కొడుకు లక్ష్మీనారాయణ తీసుకెళ్లాడు. అక్కడే వదిలేసి వచ్చాడు. ♦ తింటానికి తిండి లేదు. తాగేందుకు నీళ్లు లేవు. లేచేందుకు శక్తి లేదు. ఆ రోజంతా ఆ వృద్ధుడు అక్కడే ఒంటరిగా పడుకున్నాడు. ♦ దీనిపై ‘అయ్యో నాన్న..’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది. ఇది కలెక్టర్ లోకేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. ఆయన తీవ్రంగా స్పందించారు. మధిర తహసీల్దార్ మంగీలాల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ మంగీలాల్, టౌన్ ఎస్సై బెంద్రం తిరుపతిరెడ్డి కలిసి ఆ వృద్ధుడి వద్దకు వెళ్లారు. ♦ ప్చ్.. ఆ వృద్ధుడు ‘లేడు’.. సజీవంగా లేడు..! తీవ్ర అనారోగ్యం.. మండుటెండ.. కలిదప్పులు.. వడదెబ్బతో ప్రాణాలొదిలాడు. ఆకలిదప్పులు తీర్చి ఆదుకుందామని అధికారులు వెళ్లేసరికి.. విగతుడిగా కనిపించాడు. ♦ కన్న తండ్రన్న కనికరం కూడా లేకుండా ఆ వృద్ధుడిని చెట్టు కింద వదిలేసి, ప్రాణాలు పోవడానికి కారణమైన కొడుకు లక్ష్మీనారాయణపై, కోడలు సుధారాణిపై కేసును ఎస్సై నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. ♦ ‘అయ్యో పాపం’.. ఈ దీన గాథను తెలుసు కున్న పట్టణ వాసులంతా ఇలా అనుకోకుండా ఉండలేకపోయారు. ‘మానవత్వం మంటగలిసింది. అనుబంధం అపహాస్యంగా మారింది. ఆప్యాయతానురాగం అదృశ్యమైంది’... ఇలా, ప్రతి ఒక్కరి మది మూగగా రోదించింది. -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. బాంబు కలకలం
సాక్షి, ఖమ్మం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మధిర రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ట్రైన్‌లోని S 11 కోచ్ సీట్ నెంబర్ 57 కింద అనుమానాస్పదంగా ఉన్న రెండు చిన్న బాక్స్‌లు, ఒక చేతి సంచీని పోలీసులు గుర్తించి వాటిని స్టేషన్‌కి దూరంగా తరలించారు. అనంతరం బాంబు స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. రైల్వే స్టేషన్లో మరోసారి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఖమ్మంలో కాసేపు నిలిపివేశారు. -
ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు
వైరా: ఖమ్మంజిల్లా వైరా బస్ స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ బస్ స్టేషన్లో నైట్ హాల్ట్‌గా ఉన్న మధిర డిపోకు చెందిన బస్సు తిరిగి తెల్లవారుజామున బయల్దేరి వెళ్తుంది. అయితే అర్ధరాత్రివేళ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బస్సు పాక్షికంగా తగులబడింది. కాగా, బస్సుకు వెనుకవైపు ఎమ్మార్పీఎస్ జెండా కట్టి ఉంది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్టు చేసినందున ఆయన్ను విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సుకు నిప్పుపెట్టడంతో ఇది వారి పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు.
-
అమెరికాలో ప్రమాదం.. గాయపడ్డ తెలుగు విద్యార్థిని
మధిర(ఖమ్మం జిల్లా): మధిర పట్టణం ఆజాద్ రోడ్డులో నివాసముంటున్న కొల్లూరు సురేష్, సుమతీ దంపతుల కుమార్తె శ్రీలేఖ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంఎస్ చదివేందుకు శ్రీలేఖ 3 నెలల క్రితం అక్కడకు వెళ్ళింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. శస్త్ర చికిత్స అనంతరం ఐసీయూలో ఉంచారని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. గాయపడిన యువతికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఒక్కగానొక్క కూతురు దేశం కానీ దేశంలో ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
కోణార్క్‌లో మరోసారి గంజాయి స్వాధీనం
మధిర: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో 30 కేజీల గంజాయి తరలిస్తుండగా మధిర రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, పట్టుబడిన గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువగా గంజాయి స్వాధీనం చేసుకుంటున్న విషయం విదితమే. -
దైవసన్నిధిలో వ్యక్తి ఆత్మహత్య
మధిర (ఖమ్మం) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి దైవ సన్నిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక బంజారా కాలనీకి చెందిన కొనుమూరి నాగేశ్వరరావు(48) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాసం చెంది రైల్వే స్టేషన్ సమీపంలోని రామాలయానికి చేరుకొని దైవ సన్నిధిలో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకుతో కలిసి భర్తను హతమార్చింది
ఖమ్మం(మధిర): మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. మీరమ్మ అనే మహిళ తన కుమారుడితో కలిసి భర్త రాళ్లకంటి ప్రకాశరావు(55)ను రోకలి బండతో మోది పాశవికంగా హత్యచేసింది. భార్య, కుమారుని దాడిలో భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమరవీరుల స్థూపానికి కోదండరామ్ నివాళి
మధిర: మధిరలోని తెలంగాణ తల్లి విగ్రహం, నూతనంగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి తెలంగాణ జెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం నివాళి అర్పించారు. మధిర జెఏసీ కన్వీనర్ మందడపు రామారావు, కో-కన్వీనర్ చెరుపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోదండరామ్ మాట్లాడారు. 1969లో హైద్రాబాద్ నగర మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. దిగ్బంధాల నడుమ, ప్రజల ఆకాంక్ష మేరకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, అమరవీరులకు గుర్తుగా ఇటువంటి స్థూపాలను ఏర్పాటు చే సుకోవడం అభినందనీయమన్నారు. పోరాటం పట్ల నిబద్దత ఉంటేనే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చునన్నారు. ఆంధ్రా సరిహద్దులో ఉన్న మధిరలో వీరోచిత పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను అభినందించారు. రాబోయే రోజుల్లో స్థూపంవద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన కనకం ఆశీర్వాదం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగ ని విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు జరిగాయని గుర్తుచేశారు. ఢిల్లీలో యాదిరెడ్డి వంటి ఉద్యమకారులు రాష్ట్రం కోసం బలిదానాలు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంతోమంది తెలంగాణ అమరవీరుల బలిదానాల ఫలితంగా, ఉద్యమాల వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని.. పనిచేయాల్సి ఉందన్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కోదండరామ్ మధిరకు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా జెఏసీ ఆధ్వర్యంలో మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, మధిర డివిజన్ కన్వీనర్ ఎస్.విజయ్, నాయకులు బిచ్చాల తిరుమలరావు, బెజవాడ రవిబాబు, టీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, బీజెపీ ఇన్చార్జ్ పెరుమాళ్లపల్లి విజయరాజు, సురేష్, అర్జున్‌రావు, అవ్వా విజయలక్ష్మి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే సామాజిక మార్పు : కోదండరామ్ సామాజిక మార్పుకు విద్యారంగమే మూలకారణమని తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మధిర పట్టణంలోని రిక్రియేషన్‌క్లబ్ ఆవరణలో శనివారం తెలంగాణ ప్రొగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో విద్యారంగం-సంస్కరణలు-సవాళ్లు- కర్తవ్యాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో వనరులున్నా మౌలిక వసతులు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఆంధ్ర పాలనలో చితికిపోయిన అన్ని వ్యవస్థలను బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అవమానాలు, అసమానతల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనే ఆలోచన ఇటువంటి ఉద్యమాలతోనే వచ్చిందన్నారు. విద్యారంగాన్ని పటిష్టం చేయూలని, తెలంగాణ పునఃనిర్మాణం జరగాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఉపాధ్యాయుడు ఉండాలన్నారు. 1996నుంచి 2004వరకు విద్యారంగం అభివృద్ది చేయాలని కోరుతూ ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి పాలకులకు వినతిపత్రాలు అందజేసినట్లు గుర్తుచేశారు. అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ప్రజల్లో ైచె తన్యం రావాలన్నారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు ఊరూరా తిరిగి ప్రచారం చేయాలన్నారు. కళాశాలలకు నిధులను పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు, ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా కన్వీనర్ విజయ్, పీఆర్టీయూ నాయకులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరిపురం ప్రభు త్వ పాఠశాల విద్యార్థినులు నిర్వహించిన జై తెలంగాణ నృత్యం అలరించింది. -
కదం తొక్కిన ఎర్రదండు
మధిర: అరుణ పతాకాలు.. రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతుతో పట్టణం ఎరుపెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా మధిరలో సీపీఎం జిల్లా 19వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు ముందు నడవగా కార్యకర్తలు వారిని అనుసరిస్తూ కొనసాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానిక రెడ్డి గార్డెన్స్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు వైఎస్ఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్‌బ్రిడ్జి, సీపీఎం కార్యాలయం, అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణమైన టీవీఎం పాఠశాల వద్దకు చేరుకుంది. ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు, బుచ్చిరెడ్డిపాలెం చిన్నారుల కోలాటాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యహితంగా, కార్యకర్తల ఆలోచనల మేరకు పనిచేసే పార్టీ సీపీఎం ఒక్కటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకెంతో మేలు జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని అన్నారు. తెలంగాణలో 6 నెలల్లో 680 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిని బట్టి వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇంత మంది రైతులు మరణించినా సీఎం కానీ, ఒక మంత్రి కానీ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలనే మానవత్వం కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొరలా మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక రైతులు, పరిశ్రమల వారు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ సింగపూర్ పర్యటన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి.. ఉన్న పాఠశాలలనే తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1956 స్థానికత పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ స్థిరపడిన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు పంపిణీ చేయడమే కాకుండా, భూస్వాముల కోరలు పీకి వారి వద్ద ఉన్న భూమిని కూడా సేకరించి దళితులకు పంపిణీ చేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019 ఎన్నికల్లో సీపీఎంను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో డివిజన్ కార్యదర్శి లింగాల కమల్‌రాజ్, నాయకులు బుగ్గవీటి సరళ, హైమావతి, సోమయ్య, బి.వెంకట్, సుబ్బారావు, సామినేని రామారావు, బండారు రవికుమార్, కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బండి రమేష్ పాల్గొన్నారు. -
మధిరలో 'బాలోత్సవ్'ను ప్రారంభించిన పొంగులేటి
-
మధిరలో వింత శిశువు జననం!
మధిర: ఖమ్మం జిల్లాలోని మధిరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం వింత శిశువు జన్మించింది. వింత శిశువుకు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పుట్టిన వెంటనే శిశువు మరణించిందని, తల్లి ఆరోగ్య పరిస్థితి క్షేమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వింత శిశువు జనం వార్త బయటకు రావడంతో పెద్ద ఎత్తున జనం చూసేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చారు. -
వరికి ఇది సమయం కాదు
మధిర: ప్రస్తుత సమయంలో వరి వేసి రైతులు నష్టపోవద్దని మధిర వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు బి. బాలజీనాయక్, డాక్టర్ డి.శివాని, బీవీ వరప్రసాద్, వి.శ్రీధర్ సూచిస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల రైతులు వరినారు పోయటం, నాట్లు వేయటం వంటివి చేస్తున్నట్లు తాము గమనించామన్నారు. ఇప్పుడు వరినాట్లు వేస్తే దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు. వరి నార్లు పోయటం, నాట్లు వేయడానికి ఇది సరైన సమయం కాదన్నారు. సోమవారం వారు ‘సాక్షి’కి వరి పంట- మెళకువలను వివరించారు. రైతులు నవంబర్ నెల వరకు వేచివుండి రబీసీజన్‌కు సిపారసు చేసిన రకాలను నాటుకోవాలి. ఖరీఫ్ సీజన్లో నాటే సమయం ఇప్పటికే మించి పోయింది. ఆలస్యంగా వేసే వరిలో చీడపీడలు వ్యాపిస్తాయి. తాలుగింజలశాతం అధికంగా ఉంటుంది. దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ముదురునారు వేసుకున్న రైతులు పలు యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముదురు నారు (45-55 రోజులు) వేసిన పొలాల్లో సిఫారసు చేసిన నత్రజని ఎరువులను రెండు దఫాలుగా వేయాలి. అందులో 1/3వ వంతు నాటిన 10-15 రోజుల్లో, మిగిలినది 30-40 రోజుల్లో వేయాలి. సిపారసు చేసిన నత్రజని ఎరువులను 15-20 శాతం అధికంగా వేయాలి. వరినాట్లు దగ్గరదగ్గరగా అనగా చదరపు మీటర్‌కు 44 నుంచి 60 కుదుళ్లు ఉండే విధంగా వేయాలి. కుదురుకు నాలుగైదు మొక్కల చొప్పున నాటాలి. నారు బాగా పెరిగితే కొసలు తుంచి వేసుకోవాలి. ముఖ్యంగా ఎంటీయూ-1010 రకం ముదురునారు వేయకూడదు. వరినాటిన 20-25 రోజుల్లో ఎకరానికి కార్బోప్యూరాన్ గుళికలు 10 కేజీలు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు 8 కేజీల చొప్పున వేయాలి. వరినాటిన 20-25 రోజుల్లో కలుపును కూలీల సహాయంతో తీయించాలి. లేనిపక్షంలో బిస్ పైరీబాక్ సోడియం ఎకరానికి 100 మి.లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి. ఈ సూచనలతోపాటు వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనమేరకు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
బిల్లు కట్టు.. లేదంటే ‘కట్’
- ఎస్సీ, ఎస్టీలపై విద్యుత్‌శాఖ ఉక్కుపాదం - మొండి బకాయిల పేరుతో కనెక్షన్లు తొలగింపు - కనీస సమాచారం ఇవ్వని అధికారులు - దళిత కాలనీల్లో అంధకారం మధిర : విద్యుత్ పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని దళితవాడలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయి. సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే పేరుతో విద్యుత్ అధికారులు కనెక్షన్లను తొలగిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఇబ్బడిముబ్బడిగా చార్జీలు పెంచారు. సర్‌చార్జీలు, ఓవర్‌లోడ్ పేరుతో మరింత భారం మోపారు. ఆ తర్వాత ఒక బల్బు వాడే వినియోగదారునికి 50 యూనిట్ల లోపు ఉచితంగా కరెంట్ ఇస్తామని కిరణ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగ బిల్లులనూ మాఫీ చేస్తామని ప్రకటించినా అది అమలుకునోచుకోలేదు. జిల్లాలో మొత్తం ఎస్సీ గృహ వినియోగదారులు 48,305 మంది ఉన్నారు. ఎస్టీ వినియోగదారులు 78,888 మంది ఉన్నారు. వారిలో ఎస్సీ వినియోగదారులు 22,318 మందికిగాను రూ.8.15 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 24,253మంది ఎస్టీ వినియోగదారులకుగాను రూ.15.31 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో 2013 సెప్టెంబర్‌లో ఎస్సీలకు రూ.2.25 కోట్లు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించింది. మిగిలినవి అలాగే ఉండిపోయాయి. నాటి బిల్లులతో కలిపి రశీదులు.. నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కలిపి విద్యుత్‌శాఖ కొత్త బిల్లులు ఇస్తోంది. కొంతమంది చెల్లిస్తున్నారు. మిగిలినవారు ఆర్థిక ఇబ్బందులతో చెల్లించలేకపోతున్నారు. గతంలో తల్లిదండ్రుల పేరుతో విద్యుత్ కనెక్షన్లు ఉంటే ఆ బకాయిలను రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ సంబంధిత శాఖకు చెల్లించలేదు. తమ తండ్రులపేరుమీద ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించాలంటున్నారని మధిర మండలం సిరిపురం గ్రామానికి చెందిన మందలపు కుటుంబరావు, మందలపు గోపీనాథ్, గుజ్జు సిల్వరాజు తదితరులు వాపోతున్నారు. తమ పేరుతో కొత్తకనెక్షన్లు కూడా ఇవ్వడంలేదని వాపోతున్నారు. మధిర సబ్‌డివిజన్ పరిధిలో 11,200 సర్వీసులు ఉండగా వాటికి సంబంధించి రూ.56 లక్షలు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో గ త ప్రభుత్వం రూ.28 లక్షలు చెల్లించగా మరో రూ.28 లక్షల బకాయి ఉంది. ఈ బకాయిలు చెల్లించడంలేదని విద్యుత్ అధికారులు గ్రామాల్లో తిరిగి బకాయిదారుల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయి. అటు కొత్త క నెక్షన్లు ఇవ్వక, ఇటు పెండింగ్ బకాయిలు చెల్లించక తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని బాధితులు వాపోతున్నారు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష
వెల్దుర్తిపాడు(పెనుగంచిప్రోలు) : హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నందిగామలోని 16వ జిల్లా అదనపు కోర్టు జడ్జి జి.రామకృష్ణ బుధవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని వెల్దుర్తిపాడుకు చెందిన ముచ్చు నర్సయ్యను భార్య ధనలక్ష్మి, ముచ్చు కృష్ణ ప్రసాద్ కలిసి హత్య చేసి ఖమ్మం జిల్లా మధిర ఏటిలో పూడ్చారు. వీరికి గ్రామానికే చెందిన పుల్లారావు సహకరించారు. దీనిపై అప్పటి గ్రామ వీఆర్వో రామారావు పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేయగా, సీఐ బీ సాంబశివరావు దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించి జడ్జి మొత్తం 24 మందిని విచారించారన్నారు. నేరం రుజువు కావటంతో 235(2)సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం నిందితులు కృష్ణప్రసాద్‌కు రూ.2వేలు, ధనలక్ష్మికి రూ.1500, పుల్లారావులకు రూ.1000లతో పాటు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ పేర్కొన్నారు. -
ఫోర్జరీ సంతకాల్లో సూత్రధారులెవరు ?
మధిర : శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజీ రుణాల కుంభకోణంలో బాధితర రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2013లో శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజిలో మిర్చి బస్తాలను నిల్వ చేయనప్పటికీ, విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్‌బ్రాంచిలో రుణాలు తీసుకోకపోయినప్పటికీ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వటం, పత్రికాప్రకటనలలో జప్తు చేస్తామని ప్రకటించటంతో వారు ఆందోళన చెందుతున్నారు. కోల్డ్ స్టోరేజిలో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలపై రుణాలు ఇవ్వాలంటే ఎన్ని బస్తాలను, ఏ ఛాంబర్లో రైతులు నిల్వ చేశారో స్వయంగా బ్యాంకు అధికారులు తనిఖీ చేయాలి. అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలను తయారుచేసి రుణం తీసుకునే రైతు ఫొటోలతో పాటు అతనికి సంబంధించిన రేషన్‌కార్డు, పాస్‌పుస్తకాల జిరాక్స్‌లు తదితర పత్రాలపై రైతుల సంతకాలు తీసుకోవాలి. అనంతరం బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి. అయితే కోల్డ్‌స్టోరేజిలో మిర్చి బస్తాలు నిల్వ చేయకపోయినప్పటికీ, సంబంధిత పత్రాలు అందకచేయపోయినప్పటికీ, రైతులు సంతకాలు చేయనప్పటికీ రుణాలు ఇవ్వటంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని చెబుతున్నారు. 2011లో శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజిలో మిర్చి నిల్వ చేసి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినప్పటికీ అప్పట్లో ఇచ్చిన ధృవీకరణపత్రాలను కోల్డ్‌స్టోరేజీ యాజమాన్యం తమకు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల పరిధిలోని 63మంది రైతులకు ఒకే రోజు(2013, మార్చి 28న) బ్యాంకు ఖాతాలు ప్రారంభించి బినామీపేర్లతో సుమారు రూ.6కోట్లకు పైగా రుణాలు ఏ విధంగా ఇచ్చారని బాధితరైతులు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒక రైతుకు రుణం మంజూరు చేయాలంటే నో డ్యూస్, ఆస్తుల తాకట్టు తదితర ధృవీకరణ పత్రాలు అడగటంతోపాటు రోజుల తరుబడి బ్యాంకు చుట్టూ తిప్పుకోవటం చేసే అధికారులు ఈ విషయంలో రుణాలు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో వాస్తవ విషయాలు నిగ్గుతేలాలంటే బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం
ఖమ్మం జిల్లాలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. కొత్తగూడెం, వైరా, ఖమ్మం, మధిర ప్రాంతాల్లో గాలివానతో బీభత్సం సృష్టించింది. కొత్తగూడెంలో అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగడం, చెట్లు రోడ్లపై కూలడంతో రాత్రి వరకు కూడా విద్యుత్ సరాఫర కాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కెటీపీఎస్ నుంచి సీతరామపట్నం వచ్చే విద్యుత్ లైన్ ట్రిప్ కావడం, లక్ష్మీదేవిపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్‌పై పిడుగు పడడంతో 5 లక్షల వరకు నష్టం జరిగింది. దీంతో విద్యుత్ సరాఫర నిలిచిపోయింది. పాల్వంచలో జాతీయ రహదారిపై పాత పాల్వంచ సమీపంలోభారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మున్సిపల్ , పోలీసు అధికారుల చొరువతో సిబ్బంది చెట్టును తొలగించారు. ఖమ్మం నగరంలో కూడా సాయంత్రం భారీ వర్షం పడింది. గాలివానతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో నగరంలో రాత్రి 10 గంటల వరకు అంధకారం నెలకొంది. గాలి దుమారంతో బయ్యారం మండలం జగ్గుతండలో 3 విద్యుత్ స్తంభాలు విరిగాయి. వైరా, కొణిజర్లలో భారీ వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. మధిర, చింతకాని మండలాల్లో జల్లులతో వర్షం పడింది. -
మధిర కీర్తి ఆకాశమంత
మధిర, న్యూస్‌లైన్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. మే 1, 2 తేదీల్లో ఒడిశాలోని చాంద్‌పూర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి ఇక్కడివారే కావడం గమనార్హం. స్థానిక టీవీఎం పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చంద్రమౌళి సాధించిన ఈ కీర్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఏడాదికోసారైనా తన స్వగ్రామం మధిరకు వచ్చి బంధుమిత్రులతో గడిపివెళ్లే గడ్డమణుగు చంద్రమౌళి ‘ఆకాశ’మంత ఎత్తు ఎదగడానికి దోహదపడిన అంశాలు ఆయన మాటల్లోనే... చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథం మా నాన్నగారు పేరు గడ్డమణుగు సత్యనారాయణరావుగారు. ప్రభుత్వశాఖలో చిరుద్యోగి. ఆయనకు నవలలంటే ఎంతో ఇష్టం. నేను ఆరు, ఏడు తరగతులు చదివేటప్పుడు మధిరలోని గ్రంథాలయం నుంచి తెలుగు నవలలను ఇంటికి తెచ్చి చదివేవారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు గ్రంథాలయానికి నన్ను పంపేవారు. అప్పుడు అక్కడి పుస్తకాలు, మేగజైన్లు చూసేవాణ్ని. వాటిలో రోదసికీ సంబంధించిన అంశాలు, కలర్ ఫొటోలతో కూడిన పుస్తకాలు నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి. చిన్నప్పటి నుంచి నాకు శాస్త్రీయ దృక్పథం ఎక్కువగా ఉండేది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే నాకెంతో ఆసక్తి. మానాన్నగారి లాగే నేను కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకునేవాణ్ని. సైన్స్‌పై ఉన్న ఆసక్తితో క్షి పణి ప్రయోగాల గురించి పరిజ్ఞానం పెంచుకున్నాను. చిన్ననాటి నుంచి నాకున్న ఆసక్తి నేడు ఆకాశ్ క్షిపణి ప్రయో గం దాకా తీసుకెళ్లింది. దేశానికి ఎంతో ఉపయోగపడే అత్యాధునిక క్షిపణిని నా చేతులమీదుగా తయారు చేయడం, ప్రయోగించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. పుట్టుపూర్వోత్తరాలు... ఇంటర్మీడియెట్ వరకు మధిరలోనే చదివాను. వరంగల్‌లోని రీజనింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో (ఆర్ఈసీ)లో 1981లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఢిల్లీలోని ఐఐటీలో ఎంటెక్ చదివాను. రెండేళ్లు ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేశాను. 1983 డిసెంబర్లో యూపీపీఎస్సీ ద్వారా డీఆర్డీఏలో ఉద్యోగం పొందాను. ఇంటిగ్రేటెడ్ గ్రైనెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐజీఎండీపీ)ను మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం శిష్యరికంలో ప్రారంభించాను. ఆయన నన్ను ఆకాశ్ ప్రాజెక్టులో డాక్టర్ ప్రహ్లాద దగ్గర నియమించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడే నేను, ప్రహ్లాదగారు, మరొక ఆఫీసర్‌తో కలిసి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాం. అది ఇన్నాళ్లకు నా చేతులమీదుగా ఆవిష్కృతమై విజయవంతం కావడం ఆనందంగా ఉంది. స్ఫూర్తినిచ్చిన వారిలో... నాకు డాక్టర్ అబ్దుల్‌కలాం. టెన్నికల్ గెడైన్స్, ప్లానింగ్‌కు డాక్టర్ ప్రహ్లాద, పారజెక్టు మేనేజ్మెంట్ స్వర్గీయ డాక్టర్ పాణ్యం, ప్లానింగ్ స్కిల్స్‌లో డాక్టర్ జాగీర్దర్రావు, తోటి శాస్త్రవేత్తలు జీఎన్ రావు వంటివారు నాకు స్ఫూర్తినిచ్చారు. ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను హైద్రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబోరేటరీ (డీఆర్డీఎల్) కేంద్రంగా రూపొందించాం. ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేక. ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు. ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యమున్న వ్యవస్థ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది. మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది. మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు. మన ‘ఆకాశ్’ ఫీచర్స్.. మన క్షిపణి వ్యవస్థకున్న ప్రత్యేకతలేంటంటే ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే ‘లో కాస్ట్పర్ కిల్’ అంటారు. ఒకేసారి నాలుగు విమానాలను ఛేదించడం. సుముఖంగా ఉండే విమానాలను ఛేదించడం. ఆటోమోడ్ ఆపరేషన్, సూపర్సోనిక్ సామర్థ్యంగల క్షిపణి, తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరడం, లక్ష్యాలను ఎక్కువ సామర్థ్యంతో ఛేదించడం దీని ప్రత్యేకతలు. ‘ఆకాశ్’ వేగంగా కదిలి... విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం మన ఆకాశ్ ఛేదిస్తుంది. కదిలే లక్ష్యాలను ఛేదించాలంటే అవి ఏ దిశగా కదులుతాయి, ఎంత వేగంగా కదులుతాయి, లక్ష్యానుగుణంగా క్షిపణులను ఎలా గైడ్ చేయాలి అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాలంటే కొన్ని సంవత్సరాల కృషి అవసరం. అభివృద్ధి చెందిన దేశాలెన్నో ఇటువంటి ప్రయోగాలను మొదలు పెట్టి అవి సఫలం కాక మధ్యలోనే వదిలివేసిన సందర్భాలున్నాయి. మన శాస్త్రవేత్తలు ఇవన్నీ కూలంకషంగా పరిశీలించారు. ఓటమి నుంచే గెలుపును ఎలా కనుగొనాలో మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఒకటికి రెండుసార్లు ప్రయోగాలు చేశారు. అన్ని పాయింట్స్‌ను ఎంతో కఠోరశ్రమతో ఛేదించడంవల్ల వరల్డ్‌క్లాస్ క్షిపణి వ్యవస్థను తయారు చేయగలిగారు. దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎల్ఆర్డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. రాడార్ గురించి.. క్షిపణులను ప్రయోగించేముందు లక్ష్యాలను గుర్తించేందుకు రాడార్‌ను వాడుతారు. క్షిపణులను లక్ష్యాలవైపు మళ్లించేందుకు మరొక రాడార్‌ను ఉపయోగిస్తారు. ఆకాశ్ వ్యవస్థ నుంచే ఈ రెండుపనులను ఏకకాలంలో రాడార్ చేస్తుంది. ఈ సిస్టం పూర్తిగా డిజిటల్-3 డైమన్షినల్ బీంస్కానింగ్. సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు. డీఆర్డీఏలోని 13 లేబోరేటరీలు, ఐదు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఐదు డి ఫెన్స్ పబ్లిక్‌సెక్టార్ అండర్ టేకింగ్ తరతర 250 సంస్థల యాజమాన్యాల ఈ ప్రాజెక్టు విజయవంతం కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేశాయి. ‘ఆకాశ్’తో దేశానికి ప్రయోజనాలు.. మనదేశంపై ఆకాశమార్గంలో దండెత్తే శత్రుసైన్యాలను ఈ ప్రోగ్రాం ద్వారా ఎదుర్కోవచ్చు. ఈ క్షిపణులు, రాడార్లు, లాంచర్లు, కంట్రోల్ సెంటర్లను నిర్విరామంగా తయారు చేస్తూ ఉపరితలంపై ఎయిర్ మిసైల్ సిస్టంను ఉత్పత్తి చేయడానికి మంచి ప్లాట్‌ఫాం ఏర్పరుచుకున్నాం. మన సాంకేతిక నిపుణులకు మిలట్రీ గైడ్ విధానం డిజైన్‌పై అవగాహన వచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల బెల్, బీడీఎల్‌తో పాటు మధ్యతరహా పరిశ్రమల టర్నోవర్‌ను వృద్ధి చేసుకుంటున్నాయి. వాటిలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. సుమారు రూ.3,500 కోట్ల విలువైన క్షిపణి వ్యవస్థను మనదేశానికి ఇచ్చాం. -
మోత్కుపల్లి నర్సింహులు కూరలో కరివేపాకేనా?
కూరలో కరివేపాకు... టీడీపీలో ఆ మాట మోత్కుపల్లి నరసింహులుకు బాగా అతుకుతుంది. కేసీఆర్ ను తిట్టాలంటే చంద్రబాబుకు మోత్కుపల్లి గుర్తుకు వస్తారు. ఎన్నికలప్పుడు టికెట్ ఇవ్వాలంటే మోత్కుపల్లి గుర్తకురారు. ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య. ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య. పాపం మోత్కుపల్లితో చంద్రబాబు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన ఆలేరు ఓటర్లు 2004లో మోత్కుపల్లిని తిరస్కరించారు. ఆ తరువాత 2009 లో ఆలేరులో పోటీ చేద్దామంటే అది జనరల్ నియోజకవర్గం అయింది. దీంతో మోత్కుపల్లి వేరే నియోజక వర్గం వెతుక్కుని, తుంగతుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ మధ్య ఆయన రాజ్యసభ రూటులో ఢిల్లీకి వెళ్దామనుకున్నారు. చివరి దాకా ఊరించిన చంద్రబాబు చివరికి తుస్సుమనిపించారు. మోత్కుపల్లి అప్పట్నుంచీ అలకపూనారు. ఇంతలోనే ఎన్నికలు ముంచుకురావడంతో మోత్కుపల్లి అసెంబ్లీ సీటు కోసం పోటీ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే తుంగతుర్తిలో వోటర్లు ఆయనపై కోపంగా ఉన్నారు. అక్కడ పోటీ చేస్తే గెలవడం కష్టం అనిపించింది. దీంతో ఆయన ఖమ్మం జిల్లా మధిరకు మారిపోయారు . నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మధిర ఎస్సీ రిజర్వుడ్‌గా మారిపోయింది. మధిరలో సీపీఎంకు గట్టి పట్టుంది. గతంలో కొద్ది తేడాతో ఓడిపోయినసీపీఎం అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ఈ సారి మళ్లీ పోటీ పడుతున్నారు. పైగా ఇక్కడి నుంచే డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా పోటీ పడుతున్నారు. మధిరలో మన మోత్కుపల్లికి లక్ కలిసొస్తుందా? ఆయన గెలుపు సాధించగలరా? మధిరలో ఇప్పటివరకూ 13 సార్లు ఎన్నికలు జరిగితే, కార్గిల్ వేవ్ పుణ్యమా అని ఒక్క 1999 లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ సారి మోత్కుపల్లి నరసింహులు చరిత్రను తిరగరాయగలరా? బిజెపికి ఏ హవా లేని మధిరలో, బిజెపి పొత్తుతో గట్టెక్కగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ! -
'చెప్పు'గుర్తు అభ్యర్థిపై టీఆర్ఎస్ రాళ్ల దాడి
ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్-జై సమైక్యాంధ్ర కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ బుధవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. జై సమైక్యాంధ్ర అంటూ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థి చెరుకూరి నాగార్జునపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో చెరుకూరి నాగార్జున సహా కార్యకర్తలు గాయపడ్డారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగర పంచాయతీలో ఖరారు కాని కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులు
మధిర, న్యూస్‌లైన్: నగర పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేయడం కాంగ్రెస్, టీడీపీలకు తలకుమించిన భారంగా పరిణమించింది. పలానా వ్యక్తి తమపార్టీ అభ్యర్థి అని తేల్చితే మిగిలినవారు ఎక్కడ అలకబూనుతారో...అది ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో తెలియక తలబట్టుకుంటున్నారు. నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. వార్డు కౌన్సిలర్లలో ఎవరు తమ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థో తేల్చడంలోనూ ఈరెండు పార్టీల్లో సందిగ్ధతే ఉంది. ఈ రెండు పార్టీల్లో ముఖ్య నాయకులుగా చెలామణి అవుతున్న వారు పోటీచేసే అవకాశం వచ్చినా వెనుకడుగు వేయడంతో అభ్యర్థులను తేల్చడం ఒకింత ఇబ్బందికరంగా మారిందని ఇరు పార్టీల నేతలు కొందరు చెబుతున్నారు. తొలిసారి నగర పంచాయతీగా ఆవిర్భవించిన మధిర తొలి చైర్పర్సన్ పదవి దక్కించుకోవాలని ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నా...వైఎస్ఆర్సీపీ, సీపీఎం కూటమియే తమ ఆధిపత్యాన్ని చాటుతూ స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తుండటం కాంగ్రెస్, టీడీపీలకు కంటగింపుగా మారింది. చైర్పర్స న్ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్, సీపీఐలు జట్టుకట్టి నా.. అభ్యర్థి ఎంపిక లో మాత్రం ఇవి సత్ఫలితాల దిశగా సాగటంలేదని విశ్లేషకులు అంటున్నారు. స్పష్టతతో ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ, సీపీఎం వైఎస్ఆర్సీపీ, సీపీఎం స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నాయి. నగరపంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 11, సీపీఎం తొమ్మిది వార్డుల్లో పోటీచేస్తున్నాయి. కాంగ్రెస్ మూడు వార్డులను సీపీఐ కేటాయించి, మిగిలిన 17 వార్డుల్లో పోటీ చేస్తోంది. నగర పంచాయతీలో 5, 6, 7, 11, 18 వార్డులను ఎస్సీ(జనరల్)కు రిజర్వ్ చేశారు. దీనిలో 6, 7 వార్డులు ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. ఆరు, ఏడు వార్డుల్లో గెలిచిన అభ్యర్థులే చైర్పర్సన్ అయ్యే అవకాశాలుండటంతో ఈ వార్డుల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ముఖ్యంగా 18వ వార్డులో అత్యధికంగా 13 మంది అభ్యర్థినులు పోటీలో ఉన్నారు. ఒకరికి బీఫాం వస్తే మరొకరు అలకపూనే అవకాశం ఉండటంతో ప్రధాన పోటీదారులు తలలు పట్టుకుంటున్నారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో ఆయా పార్టీల ముఖ్య నేతలు ఉన్నారు. ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క నివాసం ఉండే రెండోవార్డులోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టతలేదు. 14వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీకి చెందిన శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు. అత్యధికంగా నామినేషన్లు దాఖలైన 18వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరిని అభ్యర్థినిగా ప్రకటిస్తారోనని ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. భట్టి విక్రమార్క స్థానికంగా లేకపోవడం వల్లే ఆ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గందరగోళంలో టీడీపీ నేటితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగుస్తున్నా తెలుగుదేశం పార్టీలో స్పష్టత కొరవడింది. 9, 11 వార్డుల్లో ఆపార్టీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు వేయకపోవడం గమనార్హం. 19, 20 వార్డుల్లో అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి రాత్రికిరాత్రే జెండాలు మార్చిన వారికి టీడీపీ టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీలో వర్గపోరుతో చైర్పర్సన్ అభ్యర్థినిగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఎంపీపీ యర్రగుంట లక్ష్మి వార్డు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 14వ వార్డును జనరల్‌కు కేటాయించడంతో ఆ వార్డు నుంచి ప్రాతినిధ్యం కోసం ఆమె ప్రయత్నించారు. అయితే పార్టీలోని మరో వర్గం దీన్ని వ్యతిరేకించింది. ఐదు, ఆరు వార్డుల్లో పోటీచేద్దామని ప్రయత్నించినా ఇక్కడా వర్గపోరే వెంటాడింది. చివరికి టీడీపీకి అంతగా బలంలేని 18వ వార్డు నుంచి లక్ష్మి పోటీ చేస్తున్నారు. మొత్తంమీద మధిర నగరపంచాయతీ ఎన్నికలు టీడీపీ వర్గపోరును, కాంగ్రెస్‌లో ఉన్న అస్పష్టతను బయటపెట్టాయని విశ్లేషకులు అంటున్నారు. మధిర నగర పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో కాంగ్రెస్, టీడీపీలు కొట్టుమిట్టాడుతున్నాయి. తమ పార్టీ అభ్యర్థి ఎవరనేది తేల్చితే.. తననే అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఆశాభావంతో నామినేషన్ దాఖలు చేసిన వారు ఎక్కడ అసమ్మతి జట్టుకడతారోననే భయం ఈ రెండు పార్టీలనూ వెంటాడుతోంది. మంగళవారం నాటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనున్నా ఇంకా వార్డుల్లో తమ అభ్యర్థులను ఖరారు చేయడంలో ఈ రెండు పార్టీలు సందిగ్ధంలోనే ఉన్నాయి. నగర పంచా యతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పలానా వార్డు కౌన్సిలర్ తమ చైర్పర్సన్ అభ్యర్థి అని తేల్చడంలోనూ ఈ రెండు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ, సీపీఎం జట్టుకట్టి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి...ప్రచారంలో అగ్రపథంలో ఉన్నాయి. -
మూడోరోజు జోరు
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నామినేషన్లు ప్రారంభమైన తొలి రెండురోజులు ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. మూడోరోజు బుధవారం అభ్యర్థులు ఉత్సాహంతో నామినేషన్లు వేశారు. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపలి నగర పంచాయతీలకు మొత్తం 118 నామినేషన్లు దాఖలయ్యాయి. కానీ మధిరలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు ఒకటే నామినేషన్ దాఖలవడం గమనార్హం. ఈనెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనా రెండు రోజులు మాత్రం నామినేషన్లు అంతగా దాఖలు కాలేదు. బుధవారం మంచిరోజు కావడంతో అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులకు 40 నామినేషన్లు, ఇల్లెందులో 53, సత్తుపల్లిలో 24 నామిషన్లు దాఖలు కాగా మధిరలో మాత్రం ఒకే ఒక నామినేషన్ వేశారు. మధిర నగరపంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పదో వార్డుకు స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మినేని రామారావు నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పార్టీల పరంగా ఒక్క అభ్యర్థి కూడా మధిర నగర పంచాయతీలోని వార్డులకు నామినేషన్ వేయలేదు. స్థానికంగా పొత్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో బరిలో నిలవాలనుకుంటున్న అభ్యర్థులు హైరానాపడుతున్నారు. వార్డు సభ్యుడిగా తమకు అవకాశం కల్పించాలని ఆశావాహులు తమ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగూడెం, సత్తుపల్లిలో ఎస్సీ, ఎస్జీ జనరల్, మహిళలకు రిజర్వు అయిన వార్డుల్లో అసలు అభ్యర్థులు దొరకక పార్టీల నేతలు వెదుకులాట ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు కూడా లేకపోవడంతో ఏమి చేయాలో నేతలకు పాలుపోవడం లేదు. రిజర్వు అయ్యి పార్టీ పరంగా కార్యకర్తలు లేనిచోట...అసలు పార్టీల్లో తిరగని విద్యావంతులపై నేతలు కన్నేశారు. తుది గడువు నాటికి వారిని ఒప్పించి నామినేషన్ వేయించడానికి కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ తుది గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల విషయంలో పలు పార్టీలది ఇదే పరిస్థితి. ఇప్పటికే ఖరారైన వారు చివరిరోజు 14న సందడితో నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
మొండి ‘సహకారం’
మధిర, న్యూస్‌లైన్: ఏకగ్రీవమైన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాన్ని ఏడాదైనా విడుదల చేయకపోవడంపై ఆయా సంఘాల పాలకవర్గాలు మండిపడుతున్నాయి. రూ.లక్ష ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచడంతో సంతోషించిన పాలకవర్గాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నాయి. జిల్లాలో 105 సహకారసంఘాలు ఉండగా 33 జిల్లా కేంద్ర సహకారబ్యాంకు శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండువిడతలుగా ఈ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడత 2013 జనవరి 31న, జిల్లాలో ఫిబ్రవరి 4, 2013న ఎన్నికలు జరిగాయి. బ్రాహ్మణపల్లి, నారాయణపురం, పెద్దబీరవల్లి సహకార సంఘాలకు సం బంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఈ సంఘాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 102 సంఘాలకు ఎన్నికలు జరగ్గా 14 సంఘా లు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా కేంద్ర సహకారబ్యాంకు వెయ్యికోట్ల వ్యాపారం చేస్తోంది. రుణాల వసూళ్లు, చెల్లింపుల్లో అగ్రభాగాన ఉంది. ఖమ్మం డివిజన్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగ్గా గెలుపొందిన అధ్యక్షులు 5న ప్రమాణస్వీకారం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక్కో సంఘానికి ప్రోత్సాహక నగదు కింద రూ.2 లక్షల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఏకగ్రీవ సంఘాల పాలకవర్గాలు మండిపడుతున్నాయి. సహకారసంఘాలు పరపతేతర వ్యాపారాలైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, రేషన్‌షాపులు, వాటర్ప్లాంట్లు, ధాన్యం సేకరణ కేంద్రాలు వంటి పనులను చేపడుతున్నాయి. మధిర మండలంలో సిద్దినేనిగూడెం, ఖమ్మంపాడు, ఎర్రుపాలెం మండలంలో రాజుపాలెం సహకారసంఘాలు ఏకగ్రీవమయ్యాయి. సత్తుపల్లి డివిజన్లోని ఐదు మండలాల్లో 24 సంఘాలు ఉండగా 8 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో సత్తుపల్లి, గంగారం, తుంబూరు, పెనుబల్లి, పోచా రం, వేంసూరు తదితర సంఘాలు ఉన్నాయి. తుంబూరు సహకార సంఘ భవనం శిథిలావస్థకు చేరింది. ఖమ్మం డివిజన్లో పలు సంఘాల్లో నీటిశుద్ధి యంత్రాలున్నాయి. సత్తుపల్లి డివిజన్లోని సత్తుపల్లి, గంగారం, పెనుబల్లి, తుంబూరు తదితర సంఘాలకు వాటర్ప్లాంట్లు లేవు. ఈ ఏకగ్రీవమైన సంఘాలకు ప్రోత్సాహక నగదు రూ.2లక్షలు మంజూరు చేస్తే వాటితో వాటర్ప్లాంట్లను నెలకొల్పుకోవచ్చని పాలకవర్గాలు భావిస్తున్నాయి. కొన్ని సంఘాలకు ప్రహరీగోడలు, గోదాంలు లేవు. సిద్దినేనిగూడెం సహకారసంఘ భవనం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎరువులు నిల్వ చేసినప్పుడు తేమవల్ల ఎరువుల బస్తాలు గడ్డకడుతున్నాయని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో వైషమ్యాలను పక్కనబెట్టి ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకం విడుదల చేయకపోవడం సరికాదని పాలకవర్గాలు ధ్వజమెత్తుతున్నాయి. -
ఐకేపీ అధికారుల నిర్బంధం
మధిర, న్యూస్‌లైన్: మండలంలోని మాటూరు ఎస్సీ కానీ లో ఐకేపీ అధికారులను గ్రామస్తులు మంగళవారం రాత్రి నిర్బంధించారు. అవకతవకలకు పాల్పడుతున్న గ్రామదీపిక వెంకట్రావమ్మ ఎందుకు తొలగించడం లేదంటూ గ్రామంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఏపీఎం సురేంద్రబాబు, సీసీ చలమయ్యను నిలదీశారు. శ్రీనిధి, డ్వాక్రా రుణాలు, పలువురు విద్యార్థుల స్కాలర్షిప్లను గ్రామదీపిక వాడుకుందని, ఆమెను తొలగించాలని కొంతకాలంగా ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామదీపిక వెంకట్రావమ్మను తాత్కాలికంగా తొలగిస్తున్నామని ఏపీఎం సురేంద్రబాబు ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. అదేవిధంగా నూతన వీవోను ఎన్నుకున్నట్లు మెజార్టీ సభ్యుల తీర్మానంచేసి పంపితే గ్రామదీపిక గా పరిగణిస్తామని చెప్పారు. ఐకేపీ అధికారులను నిర్బంధించిన విషయాన్ని తెలుసుకున్న మధిర రూరల్ ఏఎస్సై చిట్టిమోదు వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. -
భారీ చోరీతో ఉలిక్కిపడ్డ మధిర
మధిర, న్యూస్‌లైన్ : మధిర పట్టణంలోని శ్రీరాం సిటీయూనియన్ ఫైనాన్స్ కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కలకలం సృష్టించింది. ఈ సంఘటనలో 11.5కేజీల బంగారం, రూ.6ల క్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మొత్తం 3.5కోట్ల సొత్తు చోరీ అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ చోరీయావత్తు మిస్టరీగా మారింది. ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఒక వ్యక్తి కార్యాలయానికి ఎడమవైపున ఉన్న కిటికీ చువ్వలను తొలగించి లోపలికి ప్రవేశించాడు. కార్యాలయంలో ఉన్న టేబుల్ డెస్క్‌లను వెతగ్గా కొన్ని తాళపుచెవులు దొరికాయి. వాటిని తీసుకుని లాకర్‌గదిలోకి ప్రవేశించాడు. అయితే అతను లాకర్ గదిలోకి ప్రవేశించినప్పటినుంచి సీసీ కెమెరాలో నమోదైంది. సీసీ కెమెరాను పరిశీలించకుండా అతనిపని అతను చేసుకున్నాడు. దొరికిన తాళపు చెవులతో చిన్నలాకర్ను తెరచి అందులో ఉన్న బంగారాన్ని, నగదును సంచుల్లోకి సర్దుకున్నాడు. అయితే పెద్ద లాకర్‌కు సంబంధించిన ఒక తాళపుచెవి లేకపోవడంతో ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ లాకర్ తెరుచుకోలేదు. ఇనుపరాడ్డుతో పగులకొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. దీంతో అతను దొరికినవరకు దోచుకుని అక్కడినుంచి ఉడాయించా డు. ఈ తతంగం మొత్తం సుమారు 2గంటలపాటు కొనసాగింది. గురువారం అర్ధరా త్రి 1.10గంటల సమయంలో లాకర్‌గదిలోకి ప్రవేశించిన నిందితుడు చోరీచేసిన బంగా రం, నగదు ఉన్న సంచులను తీసుకుని తిరిగి 2.48గంటలకు తాపీగా వెళ్లిపోయాడు. నింది తుడు లోపలికి ప్రవేశించినప్పటినుంచి ప్రతి కదలిక సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో అనుమానాలు... ఈ చోరీ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ లాకర్లో పెట్టిన బంగారపు వస్తువులు, నగదుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదుచేసి చిట్‌ఫండ్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్, జూనియర్ నగదు అధికారి ఇద్దరూ కార్యాలయానికి తాళాలువేసి చెరో తాళపుచెవి తీసుకుని వెళతారు. అయితే గురువారం అర్ధరాత్రి ఇరువురివద్ద ఉండే తాళపు చెవులను కార్యాలయంలోనే ఉంచి వెళ్లడం గమనార్హం. అదేవిధంగా సెక్యూరిటీగార్డు కూడా గురువారం అర్ధరాత్రి విధులకు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చోరీకి పాల్పడిన వ్యక్తి చేతికి గ్లౌజులు, ముఖం కనబడకుండా రుమాలు చుట్టుకుని రావడాన్నిబట్టి చూస్తే చోరీల సంఘటనలో ఆరితేరిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరి మొదటివారంలో ఇదే కార్యాలయంలో చోరీ జరిగింది. అప్పుడు బంగారం, నగదు అపహరణ జరగకపోయినప్పటికీ తాకట్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. గురువారం అర్ధరాత్రి చోరీకి పాల్పడిన వ్యక్తి ఇంటిదొంగా లేదా బయటి వ్యక్తులా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని వైరా డీఎస్పీ బి. సాయిశ్రీ, సీఐ జె. సదానిరంజన్ పరిశీలించారు. చోరీ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పరిశీలించడంతోపాటు ఖమ్మంనుంచి వచ్చిన క్లూస్‌టీం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
శ్రీరామ్ చిట్స్‌లో 2 కోట్ల విలువైన బంగారం చోరీ
-
ఖమ్మం శ్రీరామ్ చిట్స్‌లో భారీ దొంగతనం
-
శ్రీరామ్ చిట్స్‌లో 2 కోట్ల విలువైన బంగారం చోరీ
ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరామ్ చిట్స్ శాఖ కార్యాలయంలో గత అర్థరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. దాంతో ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం మధిర పోలీసులను ఆశ్రయించారు. రూ.6 లక్షల నగదుతోపాటు కస్టమర్లు తాకట్టుపెట్టిన తొమ్మిది కిలోల బంగారం అపహరించుకు పోయారని శ్రీరామ్ చిట్స్ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని శ్రీరామ్ చిట్స్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోలీసులు దోపిడి జరిగిన శ్రీరామ్ చిట్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరలో ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసుల శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలోని భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ చోరీపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
కొను‘గోల్మాల్’
మధిర, న్యూస్‌లైన్ : తుపానుతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పత్తి కొనే నాథుడు లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.60 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 2.55 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అయితే వర్షానికి ముందు తీసిన పత్తిని కూడా సీసీఐ వారు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం నేటికీ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారుల ‘పంట’ పండుతోంది. కాస్తోకూస్తో చేతికొచ్చిన పత్తిని గత్యంతరం లేక రైతులు దళారులు నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉందని, పత్తి నల్లగా ఉందనే సాకు చూపి చాలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉండగా 10 యార్డుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరిగేవి. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క యార్డులోకూడా సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదు. నష్టాల ఊబిలో రైతులు... ఈ ఏడాది పత్తి ఎర్రబారిపోవడంతో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాకు రూ. 3000 నుంచి 3200 వరకు విక్రయించాల్సి వస్తోందని, ఇది తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే రూ.4 వేల వరకు ధర లభించేందని అంటున్నారు. దీనికి తోడు ఈ ఏడాది విత్తనాలు, ఎరువుల ధరలు రెట్టింపయ్యాయని, తమ పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటివరకూ ఏ పంటా చేతికి రాకపోవడం, వచ్చిన పత్తిని సీసీఐ వారు కొనుగోలు చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్నామని చెపుతున్నారు. ప్రభుత్వానికీ తగ్గుతున్న ఆదాయం... సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడంతో గత ఏడాది మార్కెటింగ్ శాఖకు రూ.35 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తప్పని స్థితిలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలోనూ గండి పడుతోంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వారు ఇంకా సీసీఐ కొనుగోళ్లు ఎందుకు ప్రారంభించలేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తమ చేతుల్లోంచి పంటలు వ్యాపారుల వద్దకు వెళ్లాక ధర పెంచుతారా అని అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాలను ప్రారంభించడంతోపాటు మద్దతు ధర కల్పించాలని, తడిసిన పత్తిని సైతం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. త్వరలో ప్రారంభం కావచ్చు జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బహుశా వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం కావచ్చు. జిల్లాలో 13 మార్కెట్ యార్డులు ఉండగా 10 యార్డుల్లో పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంటుంది. కొనుగోళ్లపై మాకు స్పష్టమైన సమాచారం లేదు. - పంతంగి లక్ష్మణ్, ఏడీఎం -
శిశువు మృతితో బంధువులు ఆందోళన
మధిర, న్యూస్‌లైన్: సరైన వైద్యం అందక శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. మధిర పట్టణంలో సోమవారం చోటు చేసుక ున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన మెరుగు సంపత్, సౌజన్యలకు మూడు నెలల శిశువు ఉన్నాడు. అతనికి అనారోగ్యంగా ఉండడంతో ఆదివారం మధిరలోని ఓ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స చేయించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో శిశువు శ్వాస అందకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చారు. కానీ అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కాంపౌండర్లే వైద్య సేవలు అందించారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాల సమయంలో డాక్టర్ వచ్చే సరికి శిశువు పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్ వైద్యం ప్రారంభించేలోగానే మృతి చెందాడు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వచ్చీరాని వైద్యం చేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని ఆరోపించారు. ఈ విషయంపై వైద్యుడిని వివరణ కోరగా తాము సక్రమంగానే వైద్యం అందించామని, వైద్యం చేస్తున్న సమయంలో శిశువుకు తల్లి పాలు ఇచ్చిందని, దీంతో అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాస అందక మృతి చెందాడని పేర్కొన్నారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఇద్దరి మృతి
మధిర, న్యూస్‌లైన్: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మధిర మండలంలోని మునగాల(కృష్ణాపురం) సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. బోనకల్ మండలం నారాయణపురం గ్రామానికి చెంది న సాధినేని ఉమ(38), మన్నేపల్లి సం దీప్‌లు ద్విచక్ర వాహనంపై మధిర నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం దుంది రాలపాడు గ్రామానికి చెందిన కంచెపొగు కొండయ్య(32), గంపలగూడేనికి చెందిన అతని బావ(సోదరి భర్త) కోట ప్రకాష్‌లు ద్విచక్ర వాహనంపై బోనకల్ మండలం తూటికుంట్ల నుంచి మధిర వైపు వస్తున్నారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలు మునగాల సమీపంలోని రాగానే వేగంగా ఎదురెదురు గా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఉమ అక్కడికక్కడే మృతిచెందగా, కంచెపోగు కొండయ్య 108లో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. ఉమ ద్వి చక్ర వాహనంపై ఉన్న సం దీప్ క్షేమం గా బయటపడగా కొండ య్య ద్విచక్ర వాహనంపై ఉన్న ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఖమ్మం రిఫర్‌చేశారు. వాహనాలు వేగం గా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిన ట్లు స్థానికులు అంటున్నారు. సంఘటన స్థలంలో మృతిచెందిన ఉమకు భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడు బోనకల్ మండలం జానకీపురంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. మరో మృతు డు కొండయ్య దుందిరాలపాడులో వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. అతని బావ గంపలగూడెంలోని ఒక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న మధిర రూరల్ ఎస్సై బండారుకుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం: క్షతగాత్రులను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన అరగంట వరకు వైద్యులు రాలేదు. వైద్యులు వచ్చే వరకు విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఎం, 108 సిబ్బందే క్షతగాత్రులకు వైద్యం చేశారు. అరగంట తర్వాత ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు భాస్కర్‌రావు తాపీగా వచ్చి వైద్యం చేశారు. అప్పటికే క్షతగాత్రుడు ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.