వెల్దుర్తిపాడు(పెనుగంచిప్రోలు) : హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నందిగామలోని 16వ జిల్లా అదనపు కోర్టు జడ్జి జి.రామకృష్ణ బుధవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని వెల్దుర్తిపాడుకు చెందిన ముచ్చు నర్సయ్యను భార్య ధనలక్ష్మి, ముచ్చు కృష్ణ ప్రసాద్ కలిసి హత్య చేసి ఖమ్మం జిల్లా మధిర ఏటిలో పూడ్చారు. వీరికి గ్రామానికే చెందిన పుల్లారావు సహకరించారు.
దీనిపై అప్పటి గ్రామ వీఆర్వో రామారావు పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేయగా, సీఐ బీ సాంబశివరావు దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించి జడ్జి మొత్తం 24 మందిని విచారించారన్నారు. నేరం రుజువు కావటంతో 235(2)సీఆర్‌పీసీ సెక్షన్ ప్రకారం నిందితులు కృష్ణప్రసాద్‌కు రూ.2వేలు, ధనలక్ష్మికి రూ.1500, పుల్లారావులకు రూ.1000లతో పాటు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ పేర్కొన్నారు.
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష
Published Thu, Sep 4 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement