sentenced to life
-
ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?..మాటలు కూడా రాని ఆ చిన్నారిని..
కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అన్నంత బాధగా ఉంటుంది. అలాంటి వాళ్లను చూస్తే..అస్సలు తల్లి అన్న పదానికి ఉన్న గొప్ప అర్థం కూడా విలువలేనిదిగా అయిపోతుంది. తల్లి మనసు బహు సున్నితంగా ఉంటుంది. తన బిడ్డకు ఏమైనా అయితే అంత ఎత్తున కోపంతో లేగిసిపోతుంది. అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది. అస్సలు ఈమె తల్లేనా..ఇలాంటి ఆమెకు దేవుడు పిల్లల్ని ఎందుకిచ్చాడు అన్నంత బాధకలుగుతుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ల్యాండ్ ప్రాంతానికి చెందిన క్రిస్టల్ కాంటే లారియో (32).. సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. డబ్బు బాగా ఉండటంతో క్రిస్టల్ విలాసావంత జీవితానికి అలవాటు పడింది. అయితే ఆమెకు భర్త ఉన్నాడో లేక ఆమె విలాసాలను చూసి తట్టుకోలేక వదిలేశాడో తెలియదు గాని..క్రిస్టల్ మాత్రం తన కూతురితో క్లీవ్ ల్యాండ్ ప్రాంతంలో ఉంటుంది. గత ఏడాది జూన్ నెలలలో తన 16 నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. ఈ తర్వాత మరో నగరానికి చక్కర్లు కొట్టింది. అయ్యే ఇంట్లో పాపం ఏమవుతుందన్న బాధ ఇసుమంత కూడా లేకుండా నిసిగ్గుగా ఎంజాయ్ చేసింది. ఇలా దాదాపు పదిరోజులు ఇంటి పట్టున లేకుండా పోయింది. ఆ తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చి చూడగా.. పాప ఉయ్యాలలో నిర్జీవంగా కనిపించింది. వెంటనే క్రిస్టల్ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని,విచారణ నిమిత్త కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో క్రిస్టల్ చేసిన ఘనకార్యాన్ని విని నిర్ఘాంతపోయారు. ఈ కేసును సుమారు 9 నెలలపాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం కనివిని ఎరుగని స్థాయిలో తీర్పు ఇచ్చారు. "ఇది మానవజాతి తలదించుకునే సంఘటన. ఒక తల్లి తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్లడం బహుశా చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. ఇలాంటి తప్పు భవిష్యత్తులో మరే ఏ తల్లి చేయకుండా ఉండేలా కఠిన తీర్పు ఇస్తున్నాను. ఈమెకు బెయిల్ అనేది లేకుండా యావ జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నానని" జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆమె తరపు న్యాయవాదులు.. సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. క్రిస్టల్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ వైద్యులు ఆమెను పరీక్షించి అలాంటి మానసిక వ్యాధులు ఆమెకు లేవని తేల్చారు. దీంతో జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇక క్రిస్టల్ వ్యవహారం విని అమెరికా మాత్రమే కాదు యావత్ ప్రపంచం దిగ్బాంతికి గురయ్యింది. ఇలాంటి పాషణ హృదయంతో ఉండే తల్లులు కూడా ఉన్నారా..? అని విస్తుపోయింది . (చదవండి: డైట్లో ఈ వంటకాన్ని చేరిస్తే..మెరిసే గ్లాస్ స్కిన్ మీ సొంతం!) -
అత్త హత్య కేసులో అల్లునికి జీవితఖైదు
సాక్షి, తుమకూరు: పిల్లనిచ్చిన పాపానికి అత్తను హత్య చేసిన కేసులో ఘరానా అల్లునికి కోర్టు జీవితఖైదుని విధించింది. వివరాలు.. శిర తాలూకాలోని హులికుంటె వద్దనున్న యలపేనహళ్లివాసి ఎస్.ప్రదీప్ కుమార్ ఈ కేసులో దోషి. కుటుంబ కలహాల వల్ల అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను వెంట పంపాలని ప్రదీప్ 2019 సెప్టెంబర్ 20వ తేదీన మధుగిరి తాలూకాలోని బడవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రి వెనుక అద్దె ఇంట్లో ఉండే అత్త ప్రేమలత (55) ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అతడు చాకు తీసుకుని ప్రేమలతను, ఆమె తండ్రి దొడ్డన్న, కుమారుడు వెంకటేష్‌పైన దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ప్రేమలత మరణించింది. బడవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో తుమకూరు సెషన్స్ కోర్టు జడ్జి యాదవ కరికెరె జీవితఖైదుతో పాటు రూ.11 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..) -
బాలిక కిడ్నాప్ కేసులో ముద్దాయిలకు యావజ్జీవం
జయపురం: ఒక బాలికను కిడ్నాప్ చేసిన కేసులో 16 ఏళ్ల తరువాత కొరాపుట్ జయపురం జిల్లా జడ్జి ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చారు. శిక్ష పడిన ముద్దాయిలు జయపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సి. భుజంగఆచారి, కె. స్వామికృష్ణ, టి. రాకేష్ కుమార్,సి. కిరణ్ కుమార్, సుమేష్ శెట్టిలు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్ టెలికాం డివిజన్ మేనేజర్ కె. రాజశేఖర్ 4 యేళ్ల కుమార్తె 2002 డిసెంబర్ 18వ తేదిన ఉదయం 11.15గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కిడ్నాప్ చేసి తండ్రి రాజశేఖర్‌కు ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపర్లు సూచించిన ప్రకారం రాజశేఖర్ డబ్బుతో ఘాట్‌గుమార్ సమీపంలోగల కారభైరవ మందిరం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో రాజశేఖర్ తిరిగి వెళ్లిపోయారు. ఈ మేరకు రాజశేఖర్ కొరాపుట్ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆ మరునాడు 19వ తేదీన కొరాపుట్ కాఫీబోర్డు ప్రాంతంలో ఒక విద్యార్థినిని చూసి ఆమెను రాజశేఖర్ ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. తరువాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదల కేసును సుదీర్ఘంగా విచారించిన జిల్లా జడ్జి విద్యుత్ కుమార్ మిశ్రా 24 మంది సాక్షులను విచారించి ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించలేకపోతే మరో రెండేళ్ల జైలు జీవితం గడపాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఎస్. కామేశ్వర రావు, కైలాశ ఖొరలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. మరో నిందితుడు ఉమానాయక్ మరణించాడు. ఈ కేసును ప్రభుత్వ న్యాయవాది కైలాస్‌పట్నాయక్ వాదించారు. -
రాజకీయ ఖైదీలకు అండగా నిలవాలి
రాజకీయ ఖైదీలకు సమాజం అండగా నిలవాలి. నిర్ణీత కాలం శిక్ష పూర్తి చేసుకున్న వారిని కూడా ప్రభుత్వాలు విడుదల చేయడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శిక్ష కాలం సగం పూర్తి చేసుకున్న విచారణ ఖైదీలను విడుదల చేయూలి. హన్మకొండ సిటీ : రాజకీయ ఖైదీలకు బయటి సమాజం అండగా నిలవాల్సిన అవసరముంద ని విప్లవ రచయితల సం ఘం నేత వరహరావు అన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌తో పాటు వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీల దీక్షకు మద్దతుగా సోమవారం ధర్నా జరిగింది. హన్మకొండలోని ఏకశిలా పార్కులో కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్(సీఆర్పీపీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా లో వరవరరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జైళ్లలో దీక్షలు బ్రిటీష్ వలస పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి విప్లవకారుల్లో స్ఫూ ర్తి నింపిన జతిన్‌దాస్ లాహోర్ జైలులో 1929 సెప్టెంబర్ 19న అమరుడయ్యాడని.. అప్పటి నుంచి సెప్టెంబర్ 13న రాజ కీయ ఖైదీల హక్కుల దినంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో రాజకీయ ఖైదీలు నిరాహార దీక్షలు చేస్తున్నారని వరవరరావు తెలిపారు. 1999లో కూడా పటే ల్ సుధాకర్, అప్పారావు ఖైదీల హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు 43 డిమాండ్లు ప్రతిపాదించగా పాలకులు వా టిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా నిర్బంధంలో ఉన్న ఖైదీల పట్ల పాలకులు, అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. జీవిత శిక్ష అనుభవించిన వారి పట్ల కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారు నిర్ణీత కాలపు శిక్ష పూర్తి చేసుకున్న విడుదల చేయకుండా జాప్యం చేస్తూ హింసిస్తున్నారని వరవరరావు పేర్కొన్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ వెంటనే నిలిపివేయాలని, రాజకీయ ఖైదీ లను విడుదల చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సగం శిక్షకాలం పూర్తయిన విచారణ ఖైదీలను విడుదల చేయడంతో పాటు జైళ్లలో జరుగుతున్న అసహజ మరణాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూఢిల్లీకి చెందిన రోనా విల్సన్ మాట్లాడుతూ తూర్పు, మధ్య భారతంలో ఆదివాసీలపై పాలకులు గ్రీన్‌హంట్ పేరుతో దాడి చేస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఆర్పీపీ ప్రధాన కార్యదర్శి బల్ల రవీంద్రనాథ్ మాట్లాడుతూ దేశమే పెద్ద జైలుగా మారగా, దోపిడీ, దాడులు, అణచివేతలు, అత్యాచారాలు, నిరుద్యోగం వంటి సామాజిక సమస్యలు పట్టి పీడిస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని జైలు లో పెడుతున్నారని, ఇది సమంజసం కాదని పేర్కొన్నారు. ధర్నాలో ప్రజాసంఘాల నాయకులు పద్మ కుమారి, ఎర్ర నర్సింహారెడ్డి, సావిత్రి, బాసిత్, శాంత, లింగారెడ్డి, సురేష్, బాలకుమార్, సుదర్శన్, బాదావత్ రాజు, నల్లెల రాజయ్య పాల్గొన్నారు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష
వెల్దుర్తిపాడు(పెనుగంచిప్రోలు) : హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నందిగామలోని 16వ జిల్లా అదనపు కోర్టు జడ్జి జి.రామకృష్ణ బుధవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని వెల్దుర్తిపాడుకు చెందిన ముచ్చు నర్సయ్యను భార్య ధనలక్ష్మి, ముచ్చు కృష్ణ ప్రసాద్ కలిసి హత్య చేసి ఖమ్మం జిల్లా మధిర ఏటిలో పూడ్చారు. వీరికి గ్రామానికే చెందిన పుల్లారావు సహకరించారు. దీనిపై అప్పటి గ్రామ వీఆర్వో రామారావు పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేయగా, సీఐ బీ సాంబశివరావు దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించి జడ్జి మొత్తం 24 మందిని విచారించారన్నారు. నేరం రుజువు కావటంతో 235(2)సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం నిందితులు కృష్ణప్రసాద్‌కు రూ.2వేలు, ధనలక్ష్మికి రూ.1500, పుల్లారావులకు రూ.1000లతో పాటు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్.ఐ. నాగప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రేమికురాలిపై యాసిడ్ దాడి: నిందితుడికి జీవిత ఖైదు
ప్రేమికురాలిపై యాసిడ్ దాడి చేసి ఆమె మృతికి కారణమైన నిందితుడికి న్యూఢిల్లీ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి రాజేష్ కుమార్ గోయెల్ నిందితుడు అజయ్ భారతికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా రూ. 2వేల నగదు జరిమానాగా విధించింది. నగరంలోని రోహిణి సమీపంలోని జపనీస్ పార్క్ ప్రాంతంలో నివసించే ఓ వివాహిత మహిళతో నిందితుడు అజయ్ భరత్ అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. అయితే ఆ మహిళ మరో పురుషుడితో సన్నిహితంగా ఉండటాన్ని అజయ్ భరించలేకపోయాడు. దాంతో ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారైయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన ఢిల్లీలో 2006లో చోటు చేసుకుంది. సమాజంలో మహిళలపై వేధింపులు అధికమవడమే కాకుండా యాసిడ్ దాడులు జరుగుతుండటంపై జడ్జి ఆందోళన వ్యక్తం చేశారు.