
సాక్షి, తుమకూరు: పిల్లనిచ్చిన పాపానికి అత్తను హత్య చేసిన కేసులో ఘరానా అల్లునికి కోర్టు జీవితఖైదుని విధించింది. వివరాలు.. శిర తాలూకాలోని హులికుంటె వద్దనున్న యలపేనహళ్లివాసి ఎస్.ప్రదీప్ కుమార్ ఈ కేసులో దోషి. కుటుంబ కలహాల వల్ల అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను వెంట పంపాలని ప్రదీప్ 2019 సెప్టెంబర్ 20వ తేదీన మధుగిరి తాలూకాలోని బడవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రి వెనుక అద్దె ఇంట్లో ఉండే అత్త ప్రేమలత (55) ఇంటికి వెళ్లాడు.
ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అతడు చాకు తీసుకుని ప్రేమలతను, ఆమె తండ్రి దొడ్డన్న, కుమారుడు వెంకటేష్‌పైన దాడి చేయడంతో తీవ్ర గాయాలతో ప్రేమలత మరణించింది. బడవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో తుమకూరు సెషన్స్ కోర్టు జడ్జి యాదవ కరికెరె జీవితఖైదుతో పాటు రూ.11 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెలువరించారు.
(చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..)