అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు  | Man Assassination For Debt Settlement Court Punish Life Imprisonment | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు 

Published Mon, Aug 22 2022 9:35 AM | Last Updated on Mon, Aug 22 2022 9:39 AM

Man Assassination For Debt Settlement Court Punish Life Imprisonment  - Sakshi

మైసూరు: అప్పు చెల్లించాలని అడగడంతో హత్య చేసిన హంతకులకు జిల్లా 7వ అదనపు కోర్టు జీవితఖైదు విధించింది. మైసూరు నగరంలోని కేటి. స్ట్రీట్‌కు చెందిన అనిల్‌ కుమార్, మేగళ కొప్పళగ్రామవాసి మహే‹Ùలు దోషులు. వివరాలు.. మైసూరు తాలూకాలోని బెళవాడికి చెందిన జయరామ్‌ (34) వద్ద అనిల్‌కుమార్‌ 20 వేల రూపాయలను అప్పు తీసుకున్నాడు. ఎంతకూ తిరిగి ఇవ్వకపోవడంతో జయరామ్‌ గట్టిగా నిలదీశాడు.

దీంతో పగ పెంచుకున్న అనిల్‌కుమార్‌ మహేష్‌తో కలిసి 2017 మే నెల 27న సాయంత్రం జయరామ్‌ను బైకుపై తీసుకెళ్లి విజయనగర 4వ స్టేజ్‌లో చాకుతో పొడిచి చంపాడు. ఈ కేసులో పై ఇద్దరితో పాటు సతీష్‌ అనే మరో యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అనిల్, మహేష్‌ల నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కే.దొడ్డెగౌడ ఈ మేరకు తీర్పు చెప్పారు. సతీష్‌కు సంబంధం లేదని తేలడంతో వదిలిపెట్టారు. 

(చదవండి: లాడ్జిలో రిమాండ్‌ ఖైదీ సరసాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement